| ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్ | |
ప్రేమకథల పాఠకులకు అలవాటైన ‘అందమైన’ పేర్లు కూడా లేని ఆ ఇద్దరు ఆ ‘అలగా’ పరిసరాలలో చూపులూమాటలూ కలుపుకోవడమే కథ అయితే, ఇంత విశేషం లేకపోయేది. చరిత్ర నడిపించిన మనుషులు వాళ్లు, చరిత్రను నడిపించాలని ప్రయత్నించిన మనుషులు కూడా. ఆధునిక భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన పరిణామాలలో భాగమైనవాళ్లు, తెలంగాణ నేల స్రవించిన నెత్తుటి ఆనవాళ్లు వాళ్లు. వాళ్లలో ఒకరు కమ్యూనిస్టు యోధుని సహచరి. మరొకరు మతమార్పిడి చేసుకుని రజాకార్లలో తిరిగినవాడు.
తెలుగుసమాజం అనుభవించిన అత్యంత హింసాత్మక పరిణామాలకు అద్దం పట్టిన ఈ ప్రేమ కథ, తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమకథానికల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దళితపాత్రలను తీసుకుని రచయిత కథనం చేసిన తీరు, సున్నితమైన సీ్త్రపురుష ఆకర్షణను వాస్తవికంగాను, గంభీరంగాను వర్ణించిన పద్ధతి, అంతర్లీనంగా కథలో ఆయన చిత్రించిన బీభత్సం- అసాధారణమైనవి. పెంటమ్మ గుడిసె బయట తూర్పుముఖంగా నిలుచుండి ఎర్రని రూపు దాలుస్తున్న ఆకాశాన్ని అదే పనిగా చూస్తున్నది. దస్తగీర్ రెండు చేతుల్లో రెండు గ్లాసులు పట్టుకొని గుడిసె బయటకి వచ్చి, పెంటమ్మ వైపు మళ్లే వరకు సూర్యుని కాంతితో ఆమె ముఖం ఇంద్రధనుస్సు రంగులతో మిళితమైనట్టు కనిపించింది. ముగ్ధుడై చూస్తూ టీ గ్లాసును ‘‘ఇగో చాయ్, చాయ్’’ అని అందించాడు… పెంటమ్మ తెప్పరిల్లినట్టు దస్తగీర్ వైపు మళ్లింది. బిడియంతో నేలకు వంగి గ్లాసును అందుకుంది. తలను వంచే టీ గుటక వేసింది. ఆమెను తీక్షణంగా చూస్తూ దస్తగీర్ కూడా ఆమె గుటకలకు తన గుటకలు మేళవించి టీ తాగాడు.
….
ఒక ప్రేమకథను మలుపుతిప్పిన సన్నివేశం అది. వీళ్లిద్దరిని కథకుడు హైదరాబాద్‌లో ఎందుకు కలిపాడు? ఇద్దరి మధ్య ఏ సారూప్యం ఉన్నది? ఇద్దరూ రాజకీయ బాధితులు కావడమే కారణమా? అసలు వీరిని రాజకీయ బాధి తులు అనడం సరిఅయినదేనా?- ఈ ప్రశ్నలకు పూర్తి సమా ధానాలు కథలో దొరకవు. రెండు దళిత పాత్రలనుంచే ఎందుకు తీసుకున్నాడు? – ముస్లిమును ముస్లిముగానే తీసుకుని ఉండ వచ్చును గదా? గోపీచంద్ ‘గతించని గతం’లో బతుకమ్మ ఆడుతున్న సీ్త్ర మీద అత్యాచారంచేసిన ముస్లిం, పోలీసు యాక్షన్ వేళ పాకిస్థాన్‌కు పారిపోయి, ఏడేళ్ల తరువాత తిరిగివచ్చి పశ్చాత్తాప పడడం కథ. అది కేవలం రజాకార్ అత్యాచారాన్ని, బాధితురాలు బేలగా తనమీద దాడిచేసినవాడి కోసం ఎదురు చూడడాన్ని, ఆమె దయనీయస్థితి చూసి దుండగుడే పశ్చాత్తాప పడడాన్ని కథకుడు మూసవిలువల నేపథ్యంలోనే చిత్రించాడు. ఇక్కడ ఆళ్వారుస్వామి, రజాకార్‌గా మారిన దళితుడిని పాత్రగా తీసుకున్నాడు. దస్తగీర్ అయినా, పెంటమ్మ భర్త కోటయ్య అయినా – భూస్వామ్యపీడన నుంచి విముక్తి కావడానికే ఆయా రాజకీయ పాత్రలను స్వీకరించారు. తెలంగాణ గ్రామాల్లో మత మార్పిడి కోసం ముస్లిమ్ మతతత్వ సంస్థ ఉద్యమం చేపట్టి నప్పుడు- వారు దళితులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. భూస్వా ముల నుంచి పడుతున్న కష్టాలను మతమార్పిడి తొలగి స్తుందన్న భ్రమ కల్పించారు. దస్తగీర్ ఏ మార్గాన్ని ఎంచు కున్నప్పటికీ, అతని ఉద్దేశ్యం మాత్రం దోపిడి నుంచి బయట పడడమే. మతమార్పిడి చెందిన దస్తగీర్ యథాలాపంగా ఉండి పోలేదు.
నిష్ఠ కలిగిన ముస్లిమ్‌గా మారాడు. ఇత్తెహాదుల్ ముసల్మీన్ చేసిన రాజకీయ ప్రబోధాలను విశ్వసించి రజాకార్‌గా మారాడు. తెలంగాణలో రజాకార్లు చేసిన పనులన్నిటిలోను భాగస్వామి అయ్యాడు. ఫలితంగా, పోలీసుచర్య సందర్భంగా జరిగిన పౌరదాడుల్లో తన భార్యాపిల్లలను పోగొట్టుకున్నాడు. కమ్యూనిస్టుల ప్రాబల్యం కానీ, ఉదార లౌకికవాదులైన కాంగ్రెస్ ప్రాబల్యం కానీ ఉన్నచోట్ల ముస్లిములపై ప్రతీకార దాడులు జరగకుండా నిరోధించగలిగారు కానీ, ఇతర ప్రాంతాల్లో హింసా త్మకమైన చర్యలు జరిగాయి. అందుకు దస్తగీర్ కుటుంబంలోని అమాయకులైన సీ్త్రలు, పిల్లలు మరణించడమే రచయిత చూపిన నిదర్శనం. తనకు కలిగిన నష్టం నుంచి, తాను చేసిన పనులను దస్తగీర్ బేరీజువేసుకుని దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని కలగలిపి బాధపడ్డాడు. గ్రామంలో ఏమి జరిగిందో వినడమే తప్ప, అతను గ్రామానికి వెళ్లలేదని, హైదరాబాద్‌లో బతుకు ఈడుస్తున్నాడని కథాక్రమంలో మనకు అర్థమవుతుంది. ఈ ఏడేళ్ల కాలం అతను కష్టజీవిగానే గడిపాడు. పెంటమ్మతో అతను వ్యవహరించిన తీరులో ఎంతో సంస్కారం, పరిణతి కనిపిస్తాయి. అతనికి సంక్రమించిన జీవితం- అతన్ని ఒక మౌన పశ్చాత్తప్తునిగా మార్చివేశాయి. పెంటమ్మ కలిసిన రోజు శుక్రవారం. ఆరోజు అతను కొంత సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అట్లా అనుకోవడంలో ఒక వెలితి, దైన్యం కనిపిస్తాయి.
పెంటమ్మ కోటయ్య వంటి సాయుధయోధుడికి, ప్రజా నాయకుడి భార్యగా ఉండడంలోనే అనేక కొత్త సంస్కారాలు అలవరచుకుంటుంది. ఒకరికి తోడుగా ఉండగలిగిన గుణమూ, ఒంటరిగా నిభాయించుకోగలిగిన నిబ్బరమూ రెండూ ఆమెకు ఉంటాయి. హైదరాబాద్‌కు వచ్చిన తరువాత ఒంటరి మహిళగా తనకు ఎదురైన అనుభవాలనన్నిటినీ ఒక విద్యార్థిగా ఆమె విశ్లేషించుకుంటుంది. తనకు దగ్గర కావడానికి ప్రయత్నించే పురుషులలోని స్వార్థాన్ని ఆమె గుర్తించగలదు. దస్తగీర్ విషయంలో కూడా ఆమె ఆ స్వార్థాన్ని పసిగట్టింది కానీ, అతని ప్రయత్నంలోని హుందాతనాన్ని గౌరవించింది. భర్త ఉన్నాడో లేదో తెలియనితనం నుంచి, పోయాడులే అని నిర్ధారణకు వస్తున్న క్రమంలో ఉన్నదామె. (జైలులో లేకుండా, బయట లేకుండా అదాలతులో మొఖద్దుమా లేక ఏమై ఉంటాడు? హృదయంలో ఒక ప్రశ్న బయలుదేరింది. ఆ విధంగా నామ రూపాలు లేకుండా మాయమైన వారు ఎందరు లేరు? వారిలో కోటయ్య కూడా ఎందుకు చేరగూడదు? ప్రజల బలం గాని, పార్టీ సానుభూతి గాని లేని కోటయ్యను ఎవరు ఏమి చేసినా అడిగేవారెవరు? ఎవరూ లేరు. కాబట్టి తప్పకుండా చచ్చి ఉండాలి..) అప్పుడు దస్తగీర్ పరిచయం ఆమెలో కదలిక కలిగించింది.. వాళ్లిద్దరూ ఒకరికొకరు తమ గత జీవితాలను చెప్పుకున్నారా? రచయిత అట్లా ఎక్కడా చెప్పలేదు. కానీ, దస్తగీర్ రూపురేఖలను తలచుకుంటూ పెంటమ్మ అనుకున్న మాటలు ఆమె గ్రహింపు శక్తిని సూచిస్తున్నాయి. ‘‘.. అతడు అందగానిలో లెక్క కాదు. పిల్లి గడ్డం, స్ఫోటకపు మచ్చలతో చెదలు పట్టినట్లున్న ముఖం, పట్టుదలతో నమాజు చేస్తున్నందుకు గుర్తుగా నుదుటి మీది రూపాయి కంటె పెద్ద నల్లని మచ్చా, పోలీస్‌యాక్షన్ రోజుల్లో మిలటరీ తుపాకీ దెబ్బకు ఎగిరిపోగా మిగిలిన చెవ్వు, మిలటరీ క్యాంపులో తిన్న దెబ్బలకు వంకరలు తిరిగిన వేళ్లు…’’ అదీ దస్తగీర్ రూపం. బహుశా, తెలంగాణలో అణగారిన ప్రజలు ప్రతి ఒక్కరి ఒంటి మీదా, జీవితం మీదా నాటి కాలం కొన్ని గుర్తులు వేసింది. బాధితుల మధ్య కలిగే సహజమైన మమత్వం ఏదోవారిద్దరినీ దగ్గర చేసి ఉండాలి. యుద్ధరంగం ఎన్ని మరణాలను వెదజల్లినా, ఎప్పుడో ఒకప్పుడు జీవితం తిరిగి మొలకెత్తవలసిందే. |
వీక్షకులు
- 1,107,442 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

