గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56
61- ప్రతాప రుద్ర రాజ కవి
ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతి రాజులో గణపతి దేవుడు ,ఆయన కుమార్తె రాణి రుద్రమ దేవి తర్వాత ప్రముఖ రాజు రెండవ ప్రతాప రుద్రమహా రాజు .రుద్రమదేవి మనుమడు .కూతురు ముంముడాంబ కొడుకు. రుద్రమ దత్తత తీసుకొన్నది .1296-1323కాలం వాడు .రుద్రమ దేవి తర్వాత రాజైన వాడు .గొప్ప సాహిత్య ప్రియుడు .స్వయానా రచయితా .సాహిత్య పోషకుడు .విద్యానాధుడు ఈయన ఆస్థాన కవి .ప్రతాప రుద్రా యశో భూషణం లేక ప్రతాప రుద్రీయం అనే అలంకార శాస్త్రం రాసి రాజుకు అంకితమిచ్చాడు .
రుద్ర రాజ కవి ప్రతాపం
స్వయం గా కవి అయిన ప్రతాప రుద్రుడు ‘’యయాతి చరిత్ర’’అనే సంసృత నాటకం రాశాడు . రాజు రాజు కావతానీ ముందే ‘’కుమారు రుద్రుడు ‘’అనే పేరుతొ ‘’అమరుక రాజు రాసిన ‘’శృంగార శతకానికి ‘’వ్యాఖ్యానం రాశాడు తెలుగులో భాస్కర రామాయణం కూడా కొంత భాగం రాశాడు అసలుకవి భాస్కరుడికి రుద్రా దేవుడు శిష్యుడు .దీన్ని బట్టి రెండవ ప్రతాప రుద్రా చక్ర వర్తి సంస్కృతం లోను తెలుగులోనూ కవిత్వం రాశాడని అర్ధమవుతోంది .
యయాతి చరిత్ర నాటకం లో ఏడు అమ్కాలున్నాయి .ఇది భారత కదా .యయాతి రాజు తన భార్య దేవా యాని దగ్గర దాసిగా ఉన్న వృష పర్వ రాజు కూతురైన శర్మిష్ట ను ప్రేమించి పెళ్లి చేసుకొనే కధ.ఏరకమైన మార్పులూ లేకుండా ప్రతాప రుద్రరాజు నాటకం రాశాడు .చకని సంవిధానం తో నాటకం రాశాడు నాటకం పై హర్ష దేవా ,కాళిదాసుల ప్రభావం ఉంది .సరళమైన కవిత్వం లో నాటకాన్ని తీర్చి దిద్దాడు .అప్పయ్య దీక్షితులు ఇందులోని శ్లోకాలను ఉదాహరించాడు .పొన్నగంటి తెలగానార్యుడు ఆంధ్రీకరించాడు .
62-సంగీత సాహిత్యాలలో కూడా రాజు –సింగ భూపాలుడు
సింగ భూపాలరాజు రాచకొండ ప్రభువు అనపోతనాయకుని కుమారుడు .రెండవ సింగ భూపాలుడు అంటారు .1386-1412కాలం లో రాజ్య పాలన చేశాడు .’
సింగ రాజీయం
సింగ భూపాలుడు ‘’ రసార్నవ సుధాకరం ‘’అనే అలంకార శాస్త్ర గ్రంధాన్ని రాశాడు .సంగీత రత్నాకరం అనే సంగీత శాస్త్ర గ్రంధానికి ‘’సుధాకరం ‘’అనే వ్యాఖ్యానాన్ని రాశాడు .రాజు గొప్ప సంగీత ,సాహిత్య ప్రియుడు .ఈయన ఆస్థానం లో చమత్కార చంద్రిక రాసిన విశ్వేశ్వర కవి ఉండేవాడు .కవి,పండిత పోశషకుడే కాక స్వయానా కవి సింగ భూపాలుడు .నాటక రచయితా కూడా .కువలయావలి అనే నాలుగు అంకాల నాటకం రాశాడు దీనికే రత్న పాంచాలిక అనే పేరు కూడా ఉంది .శ్రీ కృష్ణుడు కువలయా వలి అనే లలనా మణిని వివాహమాడటం ఇతి వృత్తం .రాచకొండ ప్రసన్న గోపాల స్వామి ఆలయ వసంతోత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .కాలం 1386-1412
బ్రహ్మ దేవుని ఆదేశానుసారం కువలయావాలి అనే అమ్మాయి భూమి మీద పుడుతుంది .ఆమె పెంపుడు తండ్రి నారదుడు .తగిన వరుడికోసం వెతుకుతూ ఉన్నట్లు నటిస్తూ ద్వారక లో రుక్మిణీ దేవి సంరక్షణ లో ఉంచుతాడు .ఆమెకు నారదుడు ఒక ఉంగరాన్నిస్తాడు .దాన్ని ధరిస్తే మగవారికి ‘’రత్న పాంచాలిక ‘’గా కనిపిస్తుంది .ఒక సారి ఆమె ఉద్యాన వనం లో క్రీదిస్తుంటే నారదుడు ఇచ్చిన ఉంగరం జారి ఎక్కడో పడిపోతుంది .శ్రీకృష్ణుడు ఆ సమయం లో వచ్చి ఆమెను చూసి ఉంగరం వెతికి అందజేస్తాడు .ఇద్దరూ ప్రేమించుకొంటారు .విషయం సత్య భామకు తెలిసి పోతుంది .ఆమె రుక్మిణికి చెబితే కువలయావలిని రుక్మిణి దాచేస్తుంది .ఒక రాక్షసుడు ఆమెను ఎత్తుకు పోతాడు .ఆమెను రక్షించమని కృష్ణుని రుక్మిణి కోరుతుంది .ఇంతలో నారదుడు వచ్చి బ్రహం ఆదేశం తెలియ జేస్తాడు .కువలయావలిని శ్రీకృష్ణుడికి ఇచ్చి రుక్మిణి పెళ్లి చేస్తుంది .ఈ నాటకం పై స్వప్న వాసవ దత్త మాలవికాగ్ని మిత్ర నాటకాల ప్రభావం కనిపిస్తుంది .
రసార్నవ సుధాకరం కు ఆంగ్లం లో అమెరికాలోని టొరంటో యూని వర్సిటి సంస్కృత పోఫేసర్ శ్రీ టి వేంకటాచార్య మంచి వ్యాఖ్యానం రాశారు .ఇది తిరువనతపురం సంస్కృత లైబ్రరీలో లభ్యం .
63-సాహితీ సమరాంగణ సార్వ భౌముడు –శ్రీ కృష్ణ దేవ రాయలు
విజయనగర రాజులలో ప్రసిద్ధుడు శ్రీకృష్ణ దేవరాయలు స్వయానకవి కాక కవిపోషకుడు .భువన విజయం లో కవి పండిత గోష్టి నిర్వహించేవాడు 1509-1529కాలం .విక్రమాదిత్య హర్ష వర్ధన భోజ రాజులతో సమానుడై ఆంద్ర భోజ బిరుదు పొందాడు .ఆముక్త మాల్యద అనే గొప్ప ప్రబంధాన్ని ఆంద్ర నాయకుడి దెవాలయమైన శ్రీకాకుళం లో శ్రీకారం చుట్టాడు .
ఆంద్ర భోజ రాజీయం
కృష్ణ దేవరాయలు సంస్కృతం లోను గొప్ప పండితుదేకాక మహా కవి అనిపించుకొన్నాడు .మదాలస చరిత్ర ,సత్య వధూ ప్రీణనం ,సకల కదా సార సంగ్రహం ,పురాణ కదా సంగ్రహం రాశాడు .జాంబవతీ కల్యాణం అనే సంస్కృత నాటకాన్ని రాయలు రాశాడు .దీనికి ప్రేరణ గురువైన వ్యాస తీర్ధుల వారు .ఇది అయిదు అంకాల నాటకం .ఇది శ్యమంతక మని కద.శ్రీ కృష్ణుడు జాంబవతి దగ్గరనుండి శ్యమంతక మణిని ఆమె తండ్రి జాంబవంతుని నుండి జాంబవతిని పొందటమే కద.శాకుంతల నాటక పోలికలు ఎక్కువ .హంపీ లోని విరూపాక్ష దేవాలయం లో వసంతోత్సవాలలో చాలా సార్లు ప్రదర్శింప బడిన నాటకం ఇది .
64- అన్యాప దేశ కవితా నిష్ణాతుడు – భల్లట కవి
కాశ్మీర దేశీయుడైన ఈ కవి 883-902కాలం లోరాజు శంకర వర్మ ఆస్థానం లో ఉన్నాడు .’’భల్లట శతకం ‘’రాశాడు నీటి ధర్మ బోధనా ఇందులో ఉన్నాయి .అనేక వృత్తాలను ప్రయోగించాడు .భల్లాట శతకం బాగా ప్రాచుర్యం పొందింది .దీన్ని ముమ్మటుడు ఆనంద వర్ధనుడు ఉదాహరించారు .750ప్రాంతం వాడి ఉండాలి
. కవిత్వ భల్లటీయం
ధ్వని ప్రధాన కవిత్వం చెప్పాడు .ప్రసాద మాధుర్యం తో వైదర్భీ రీతిలో ఉంటుంది .కాలిదాస ,భారవి మాఘ చొర ,భావ భూతి మురారి మొదలైన గొప్ప కవుల స్థాయి కి చెందినవాడు భాల్లతుడు .
‘’శ్రీ దండీ దిమ్దిమాఖ్యః శృతి ముకుట గురుర్భాల్ల టో భట్ట బాణః-ఖ్యాతాశ్చాన్యే సుబంద్ధ్వాదయ ఇహ కృతి భిర్విశ్వ మాహ్లాదయంతి ‘’
ఏ విషయాన్నైనా సూటిగా మనొ హరం గా చెప్పాడు అందుకే లోక ప్రియ కావ్యం గా గుర్తింపు పొందింది .మచ్చుకి ఒకటి
‘’పరార్దేయః పీడామను భవతి భంగే పి మధురో –యదీయో సర్వేషా మిహ ఖాలు వికారో ప్యాభిమతః
న సంప్రాప్తో వ్రుదిం యదిస భ్రుశమ క్షేత్ర పతితః –కిమిక్షోర్దోషో యం న పునర గుణాయామ మరు భువః ‘’ఇది అప్రస్తుత ప్రశంస .విరహం తో ఉన్న నాయిక బాధ –
‘’వాతా వాంతు కదంబ రేణు వాహలా నృత్యంతుసర్పద్విషః-సోత్సాహ నవ తోయ దాన గురవో ముంచంతు నాదం ఘనాః
మగ్నాం కాంత వియోగ దుఃఖ దహనే మాం వీక్ష్య దీనానాం –విద్యుత్ భో స్పురపి త్వమస్య కరుణే స్త్రీ త్ప్రేపి తుల్యే సతిః’’దీని భావం –వాయువు ,మయూరుడు మేఘాలు ,పుంలింగాలు కా బట్టి నిర్దయ తో నన్ను బాధ పెడుతున్నాయి .ఎంతయినా మగాళ్ళు మగాళ్ళే కదా .ఓ దామినీ నీవు స్త్రీ అయి ఉండికూడా ఎందుకు ఇంత నిర్దయ చూపిస్తున్నావో అర్ధం కావటం లేదు .
అన్యాపదేశ శైలిలో భాల్లటుడు శతకం రాశాడు .ఇందులో నూట ఎనిమిది శ్లోకాలున్నాయి .వ్యంగ్యవైభవం ఇందులో పూర్తిగా ఉంటుంది .రాజు శంకర వర్మ క్రూరుడై నియంతగా మారుతాడు .అధిక పన్నులు వేసి ప్రజల్ని పీడిస్తాడు .దీన్ని చూడలేక బాధ పడుతాడు భల్లటుడు. అతని జీవనాదారమూ పోయింది .బీదరికం ఆవరించింది .లావట్టుడుఅనే కూలివాడి జీతం రెండు వందల దీనార్లు .తన దీన స్థితిని గురించి గాలిని అన్యాపదేశం గా నిందిస్తూ శ్లోకం చెప్పాడు .’’ఒ గాలీ !ఎందుకు ఈ రకమైన ప్రవర్తన ?కాలికింద ధూళిని ఎగరేసి ఆకాశానికి తీసుకొని వెడతావు .ఎన్ని అడ్డంకులున్నా అధిగమిస్తావు .కాని ఆ దుమ్ము తో నీఒళ్ళు దుమ్ముకొట్టుకు పోయిందని తెలుసుకోలేక పోతున్నావు ‘’అంటాడు .
రాజు క్రూరత్వాన్ని అడవి వేటకాడు లతో అన్యోక్తిగా పోల్చి చెప్పాడు ‘’ఈ ధనుస్సు చావు నోరు తెరచి నట్లు ఉంది .బాణాలు విషం తో ఉన్నాయి .అర్జున పరాక్రమం కంటే ఎక్కువగా ఉంది .ఈ పువ్వు లోపల విషం చిమ్ముతూ బయటికి వెకిలి నవ్వు తూపాడుతోంది .అడవిజంతువులన్నీ పారిపోతాయేమో?’’.
మరోకవితో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-14-ఉయ్యూరు
–

