కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -3
కలిపూర్వం 89సాధారణ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమికి ముచికు౦దవరదునికి 37సంవత్సరాల వయసు పూర్తయి జాంబవతి కృష్ణులకు వివాహం ,శ్యమంతకోపాఖ్యానం సత్యా కృష్ణుల పెళ్లి జరిగినాయి .ఏకచక్రపురం లో పాండవులఅజ్ఞాత౦ 7ఏళ్ళు పూర్తయ్యాయి .88విరోదిక్ కృత్ లో మాధవుడికి 38నిండి ,రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు పుట్టాడు .పాండవుల క్షేమం తెలుసుకోవటానికి పార్ధసారధి హస్తినకు పోగా ,ద్వారకలో శతధ్వనుడు సత్రాజిత్తును అర్ధరాత్రి నిద్రలో చంపి ,శ్యమంతకమణి దొంగిలి౦చు కుపోయాడు .పాండవులకు 8ఏళ్ళు అజ్ఞాతం పూర్తి .87 పరీదావిలో గోవి౦దు డికి 39నిండి ,సత్యభామ పంపిన కబురు తో ద్వారక చేరగా శతధ్వనుడు శ్యమంతకమణి అక్రూరుని దగ్గర దాచి మిధిలకు పారిపోగా తరిమి వాడిని చంపి వాడివద్ద మణి లేకపోవటం తో ద్వారకకు తిరిగి రాగా ,స్వామి వలన భయంతో అక్రూరుడు కాశీకి పారిపోయాడు .అతడిని రప్పించి మణిని అందరికి చూపించి అతనికే ఇచ్చేశాడు .మణిప్రభావంతో అక్రూరుడు అనేక పుణ్యకార్యాలు యజ్ఞయాగాదులు చేశాడు .పాండవులు ప్రమాదీచ సంవత్సర ఆశ్వయుజ బహుళ అష్టమి వరకు 9ఏళ్ళు ఏకచక్రపుర అజ్ఞాత వాసం లో ఉన్నారు .
86ప్రమాదీచలో నల్లని స్వామికి 40ని౦డాయి .పా౦చాలపురం లో ద్రౌపది స్వయం వరం ప్రకటింప బడగా,ప్రచ్చన్న బ్రాహ్మణ వేషం లో తల్లితోసహాపాండవులు వెళ్లి ,బలరామ కృష్ణులు అనేక రాజ యువరాజులు హాజరవగా కృష్ణుడు పాండవులను గుర్తించి మత్ష్య యంత్రం కొట్టే పనిలో ఉన్న సాత్యకిని వారించగా అర్జునుడు దాన్నికొట్టి ద్రౌపదిని దక్కించుకొన్నాడు .ద్రౌపది వివాహం నాటికి ధర్మరాజుకు 42,భీముడికి 41,అర్జునుడికి 40,నకుల సహదేవులకు 30 ఏళ్ళవయసు .85 ఆనందలో 41నిండాయి ఆనందమోహనుడికి .ద్రౌపది వివాహం జరిగిన ఒక సంవత్సరం 2 రోజులకు విదురుని పంపి గుడ్డిరాజు పాండవులను హస్తినకు రప్పించుకొని ,ధర్మరాజును యువరాజుగా గౌరవించి అతనిచే రాజ్యపాలన చేయించాడు .కన్నయ్య హస్తినకు వచ్చి బావమరదుల క్షేమం తెలుసుకొని ,అర్జునుడితో యమునాతీరానికి వేటకు వెళ్లి ,అక్కడ సూర్యపుత్రి కాళింది ని ప్రేమించి , హస్తినకు తెచ్చి ద్రౌపది సంరక్షణలో ఉంచి ,తర్వాత ద్వారకకు తీసుకువెళ్ళి పెళ్ళాడి,అవ౦తి రాజు సోదరి మిత్రవి౦దను వరించి వివాహమాడి భార్యల సంఖ్య 5కు చేర్చాడు మోహన వంశీ లోలుడు .
84రాక్షస లో ముకు౦దుడికి 42పూర్తయి కోసల రాజకుమారి నాగ్నజితీదేవిని పెళ్ళాడి 83నల లో కేకయ రాకుమారి భద్రా దేవిని 7వ భార్యగా చేసుకొన్నాడు .82పింగళకు 43నిండి నామాలసామి మద్ర రాకుమారి .లక్ష్మణ ను మత్ష్య యంత్రం కొట్టి ,చేపట్టి అష్టమ భార్యను చేశాడు .రాధనుకూడా కలిపితే 9మందిభార్యలు రాదామనోహరుడికి .81కాళయుక్తి కి 44పూర్తి.అక్కడ కౌరవ పాండవ యాదవులలో అంతః కలహాలు లేకుండా ప్రశాంతంగా స్నేహంగా ఉన్నారు .80సిద్ధార్ధి మాఘబహళపాడ్యమికి46 నిండాయి గోపాల చక్రవర్తికి .ముసలిరాజు పాండవులకు అర్ధరాజ్యమిచ్చిఇంద్ర ప్రస్థానికి పంపాడు , 79రౌద్రికి 47,78 దుర్మతికి 48 దామోదరుడికి నిండాయి .77దుందుభి ఫాల్గుణం లో 49నిండాయి నళినాక్షునికి .ధర్మరాజు అనుజ్ఞతో అర్జునుడు తీర్ధయాత్ర ప్రారంభం చేసి ఒక ఏడాది యాత్రలలో గడిపాడు .76 రుధిరోద్గారికి 50,75రక్తాక్షికి 51,74క్రోధనకు 52పూర్తయ్యాయి పూతన సంహారికి .కౌరవ ,పాండవ యాదవుల వంశాలు వృద్ధి చెందాయి .అందరు సౌజన్యంతో జీవించారు ఈకాలం లో .73అక్షయకు 53,72ప్రభవకు 54,71విభవకు 55,70శుక్లకు 56,69ప్రమోదూతకు 57,68ప్రజోత్పత్తికి 58,67ఆంగీరసకు 59,66,శ్రీముఖకు 60అంటే షష్టిపూర్తి శ్రీవల్లభుడికి అయ్యాయి .65భావనామ సంవత్సరం లో 61నిండాయి భావజ గురుడికి . అర్జునుడు తీర్ధయాత్రలో ,చిత్రాంగద ను పెళ్ళాడి,యాత్ర ప్రారంభమైన 12ఏళ్ళకు ద్వారక చేరాడు సుభాద్రానుజుని ప్రోత్సాహంతో యతివేషంలో సుభద్రను వరించి ,ఇంద్ర ప్రస్థానికి తీసుకువచ్చి వివాహమాడాడు .
తీర్ధయాత్రలో మనమూ అలసిపోయాం కనుక కాసేపు విశ్రాంతి –
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-8-19-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
http://sarasab