Monthly Archives: April 2020

ప్రపంచ దేశాల సారస్వతం 37-ఉరుగ్వేనియన్ సాహిత్యం

ఉరుగ్వే దేశం లో భాష మాట్లాడటం ఆరంభం నుంచి  ఆదేశ సుప్రసిద్ధ కవి బార్టో లోమ్ హిడాల్గో-1788-1822 కవిత్వాన్ని చదివిఆస్వాదిస్తున్నారు .ఆ దేశపు రొమాంటిక్ యుగం లో  అడాల్ఫో బెర్నో ,జువాన్ జోరిల్లా డి శాన్ మార్టిన్ లు ముఖ్యకవులుగా గుర్తింపు పొందారు .ఆధునిక యుగ లాటిన్ అమెరికన్ కవులలో జూలియో హీర్రేరా రీస్సిగ్ అత్యంత … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అమ్మా, అదీ ……. కరోనా

అమ్మా, అదీ అమ్మా మాకు పెంచుకోటానికి జుట్టిచ్చావ్ కాని’’ అది మాత్రం’’ మమ్మల్ని దువ్వుకోనివ్వటం లేదు అమ్మా మాకు ఆలోచించటానికి బుర్ర ఇచ్చావ్ కానీ ‘’అదిమాత్రం ‘’ఆలోచి౦చ నివ్వటం లేదు అమ్మా మాకు తినటానికి నోరిచ్చావ్ కాని’’ అదిమాత్రం ‘’ఇష్టమొచ్చినట్లు తినకుండా నోరు కట్టేస్తోంది అమ్మా మాకు పని చేసే రెండు చేతులిచ్చావ్ వాటిని మాత్రం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 36-పరాగ్వేనియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 36-పరాగ్వేనియన్ సాహిత్యం పరాగ్వే దేశం లో ప్రాచీనకాలం నుంచి గాలి ,వెదురు ఫ్లూట్ లు , గంటలు ,ఈలలు మాత్రమె సంగీత సాధనాలుగా ఉపయోగించారు .మొదటి స్పానిష్  సెటిలర్స్ కాలం లో గిటార్ ,హార్ప్ వంటి సంగీతపరికరాలు వాడారు .వీరి ప్రాచీన సంగీతం పోల్కా .సంగీతరూపకాలు ,జానపద పాటలు.వీటిలోనే వీరిపూర్వ సంస్కృతీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 35-గయనీస్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 35-గయనీస్ సాహిత్యం గయాన దేశపు సాహిత్యమంతా దాదాపు ఇంగ్లిష్ భాషలో వ్రాయబడిందే .ఇక్కడి రచయితలంతా ఇతర దేశాలకు వలసపోయారు .సర్ వాల్టర్ రాలీ 16 వశతాబ్దిలో రాసిన ‘’ది డిస్కవరీ ఆఫ్ దిలార్జ్ రిచ్ అండ్ బ్యూటిఫుల్ ఎంపైర్ ఆఫ్ గయానా ‘’అనేది ఆదేశ సాహిత్యం లో మొట్టమొదటిదిగా భావిస్తారు .ఈ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

56 ఏళ్ళ క్రితం శిష్యురాలు ,,నన్ను మామయ్యా అని ఆత్మీయంగాపిలిచే భ్రమరాంబ ఫోన్

56 ఏళ్ళ క్రితం శిష్యురాలు ,,నన్ను మామయ్యా అని ఆత్మీయంగాపిలిచే భ్రమరాంబ ఫోన్ ఉయ్యూరు హైస్కూల్ లోనూ, ఇంటిదగ్గర ప్రయివేట్ లోనూ నాకు శిష్యు రాలు ,నన్ను ఆత్మీయంగా మామయ్యా అని పిలిచే ,గోసుకోండ రామచంద్రుడు రుక్మిణమ్మల పెద్దకూతురు భ్రమరాంబ ఇవాళ ఉదయం 8-30కి ఫోన్ చేసి ”మామయ్యా నేనెవరో కనుక్కో ”అంది గుర్తుపట్టలేక పోయాను … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 34-వెనిజులియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 34-వెనిజులియన్ సాహిత్యం ఈ దేశ సాహిత్యం ప్రీ హిస్పానిక్ కాలం లోని మిత్స్ కు సంబంధమున్న మౌఖిక సాహిత్యమే .ఇప్పటికీ వాటిని ఇతర లాటిన్ అమెరికన్ దేశాలలో లాగా వేనిజులాకథలు గాథలుగానే చెప్పుకొంటారు .స్పానిష్ దండయాత్ర వారి సంస్కృతీ ,సాహిత్యాలపై పెద్ద ప్రభావం చూపింది .స్పానిష్ కాలనైజర్లు రాసిన మొదటి వ్రాత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 33-పెరూ వియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 33-పెరూ వియన్ సాహిత్యం ఇంకాన్ సామ్రాజ్యకాలం వచ్చిన కళ  ఎవరికీ తెలియదు .మధ్య ఆ౦డీనియన్ కాలం లో ఈనాడు పిలువబడే పేరు నికారుగ్వా ,బొలీవియా ,చిలి దేశాలలో వచ్చిన సాహిత్యం మాత్రం మౌఖిక వ్యాప్తిచెందింది .ఈకాల సాహిత్యం లో క్వేచువా భాషలో వచ్చిన గేయాత్మక  ‘’హరావిక్ కవిత్వం ‘’,రెండవది పురాణ కవిత్వమైన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు

కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు కరోనా ను ‘’కరోనా ‘’చెప్పుతో ముట్టుకోకుండా కొట్టి తరిమేద్దాం ఊహాన్ లో పుట్టిన మహమ్మారిని వ్యూహాత్మకంగా ఊర్లనుంచి గెంటేద్దాం కోవిద్ జబ్బును  జబ్బ చరచి గోవిందా అనేట్లు మట్టిలో పూడుద్దాం సబ్సిడీలతో జీతాలతో బతికే మనకు  అడవి మనుషుల బాధలేం తెలుసు  వైద్య౦ కోసం గర్భిణీలను ‘ ముసలీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం కోస్టా రికన్ సాహిత్యం లో 19వ శాతాబ్దిచివర ప్రచురింపబడిన రచనల వరకు 5 సాహిత్య కాలాలున్నాయని (లిటరరీ పీరియడ్స్ )పరిశోధన చేసిన ఆల్వరో కొసేడా సోటోఅనే ప్రొఫెసర్ చెప్పాడు .వీటిని అక్కడ’’ జనరేషన్స్’’అంటారు .ఇవి నిజంగా సాహిత్య దృష్టి తో ఉన్న జేనరేషన్స్ మాత్రం కావు .అవి- … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రత్యక్ష పరిచయం

సాహితీ బంధువులకు శుభకామనలు ఇవాల్టితోసరసభారతి పుస్తకాలను 6 ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా పరిచయం చేశాను వీక్షకులకు ధన్యవాదాలు     నిన్నరాత్రి అమెరికా షార్లెట్ నుంచి మా అమ్మాయి విజ్జి ఫోన్ చేసి  వాళ్లకు దగ్గరలో ఉంటున్న ఒకావిడ  (పేరేదో చెప్పింది కాని జ్ఞాపకం లేదు ) సరసభారతి బ్లాగు ను అనునిత్యం ఆసక్తిగా ఫాలో అవుతున్నానని ,పుస్తక పరిచయం ప్రాత్యక్ష ప్రసారం కూడా వదలకుండా చూస్తున్నాననిచెప్పిందని ఇంతగా కృషి చేస్తున్నవారెవరూ … Continue reading

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 31-నికారుగ్వన్ సాహిత్యం

పోస్ట్ కొలంబియన్ నికారుగ్వా లో మొట్టమొదటి రచనగా ‘’ఎల్ గూగునేస్’’ గా భావిస్తారు .ఇదేసంగీత నృత్యనాటక సమాహారమైన లాటిన్ అమెరికా నికారుగ్వా జానపద సాహిత్యం .దీన్ని 16వ శతాబ్ది అజ్ఞాత కవి రాశాడు .అదే పశ్చిమార్ధగోళం లోని రచన .అది మౌఖికంగా తరతరాలుగా వ్యాప్తి చెంది 1942లో మొదటిసారిగా పుస్తక రూపం లో ప్రచురింపబడింది   … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నాని-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్ 

మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నాని–గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్ ఇండోనేషియా దేశ మహిళల ఓటుహక్కు మహిళా వివాహ వయస్సు పెంచటం కోసం మహోద్యమం నడిపిన వనిత సోయెవాండో సోయెరాస్నో నాని సోమెరాంగ్ లో 1918లో జన్మించి ,జకార్తాలో లా చదివి ,డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ లో ఉద్యోగం లో చేరింది .లాయర్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్

విలవిల-కలకల ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్ వ్యాధులతో అలమటిస్తూ ,ప్రభుత్వాలు విధిస్తున్న అంతులేని లాకౌట్లు, లాక్ డౌన్లు విధిగా భరిస్తూ ఇల్లే ‘’క్వార౦టైన్’’గా గృహనిర్బంధం లో ఉంటూ, అన్ని పనులు ఇంట్లోనే కానిస్తూ ,బయటి ప్రపంచం లోకి వీలయితే ఒక గంటో,రెండుగంటలో ముసుగువీరుల్లా తిరిగొస్తూ, వీధులన్నీ నిర్మానుష్యం చేస్తూ ,’’ఇక్కడ అసలు జనాభా ఉండేవారా ?’’అనేట్లు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మానవత్వం పరిమళించిన వేళ – ఉయ్యూరులో

మానవత్వం పరిమళించిన వేళ కరోనా లాకౌట్ లో జనం బయటికి రాలేక ,ముసలీ ముతకా ఇంట్లో అన్నం వండుకోలేక రిక్షావాలాకు కిరాయి లు లేక కాలేకడుపులతో అలమటిస్తున్న వేళ ఉయ్యూరులో వె౦ట్రప్రగడ ఆంజనేయులు, మా అబ్బాయి గబ్బిట రమణ ,శ్రీనివాస్ అనే స్వంతకారున్న ఉదారుడు, మిత్రులు కలిసి ఆలోచించిరోజుకొకరు స్పాన్సర్ గా పైవారికి ఇంటికే పప్పు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కరోనా కల్యాణం

కరోనా కల్యాణం రాముడు –ఏమిటిపూజారీ !నాకు ఆరు గజాల దూరం లో కూర్చుని నాపై పూలు విసురుతూ పూజచేస్తూ ముక్కుకేదో గుడ్డ కట్టుకొని మంత్రాలు చదూతున్నావ్ .అసలు మామూలుగా నువ్వు చదివితేనే మంత్రాలని తెలీదు ఈ ముక్కు గుడ్డతో ముక్కుమూతతో నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో అర్ధం కావట౦ లేదు . అదీకాక ఆ కర్ర ఏమిటి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కరోనా –ఆర్ధిక౦ గా ‘’క్యా కరోనా’’?

కరోనా –ఆర్ధిక౦ గా ‘’క్యా కరోనా’’? చైనా ఊహాన్ సిటి లో కిందటి డిసెంబర్ లో బయల్దేరిన కరోనా వైరస్ నాన్ స్టాప్ గా 110ప్రపంచ దేశాలను చుట్టేసింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది .దీని విస్తృత వ్యాప్తి వలన ప్రపంచఆర్ధిక పరిస్థితి ,మార్కెట్ వాణిజ్యం పై విపరీత మైన ఫలితాలు చూపి ,మనుషులను’’ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment