ప్రపంచ దేశాల సారస్వతం
117-కామోరస్ దేశ సాహిత్యం
ఆఫ్రికా తూర్పు తీరం లో అగ్నిపర్వత ఆర్చిపేలగో లో ,హిందూ సముద్ర జలాలలో మొజాంబిక్ చానల్ లో కామోరస్ దేశం ఉన్నది.అనేక బీచుల సముదాయం .రాజధాని –మొరోని .కరెన్సీ –కామోరియన్ ఫ్రాంక్ .జనాభా -8లక్షల 30వేలు .ఆఫ్రో ఆరబ్ లు ఎక్కువ శాతం ,మలగాస్సి వారు తక్కువ శాతం జనం ఉన్నారు .అతి బీద దేశం .యాత్రిక సురక్షిత ప్రదేశం .సున్నిముస్లిం మతం .ఫ్రెంచ్ అధికార భాష .కామోరియన్ ,అరబిక్ భాషలు మాట్లాడుతారు .ఆరేళ్ళ ప్రాధమిక విద్య అమలులో ఉన్నది .అక్షరాస్యత 59 శాతం .వ్యవసాయ సబ్సిడీలద్వారా నే దేశం గడుపుతోంది .
కామోరియన్ సాహిత్యం –మహిళా రచయితలు- కోరేలీ ఫ్రీ – నర్స్ ,మొదటి నవలా రచయిత్రి,కవయిత్రి .జీవితాంతం కవిత్వం ఫిక్షన్ రాస్తూనే ఉన్నది ఫ్రెంచ్ ,జర్మన్ భాషలు రెండిట్లోనూ రాసేది ఆరుపుస్తాకాలు రెండు సిడిలు తెచ్చింది ఆమెకవిత్వానికి సంగీతం కూడా కూర్చబడినది .లా పెరీ డెస్కొమేరెస్,లాట్రేకోటేలోషియన్,డి జర్నల్ డి మాయా కాన్ఫిడెన్స్ డి అన్ చట్ లు ఆమె రచనలు .
తౌఫట్ మౌహ్టారే-ఫారిన్ లాంగ్వేజెస్ లో డిప్లోమాహోల్డర్ .కామోరియన్ వచనం లో రచనలు చేసింది. కవిత్వం కూడా రాసింది .నవలలు రాసి ఆ నవలా సంపుటికి ‘’ఆమెస్ సస్పెండియస్’’అని పేరుపెట్టింది .చాలా విషయాలపై రచనలు చేసింది .
ఫైజా సోలె యూసఫ్ –జర్నలిస్ట్ ,నావలిస్ట్ .2015లో గిజ్జా నవలరాసి ప్రచురించింది .ఆల్ వతన్ పత్రిక సంపాదకురాలు .రచనలకు అవార్డ్ లు అందుకొన్నది .
కొన్ని ముఖ్యమైన పుస్తకాలు –లే కాఫిర్ డుకర్తాలా –మహమ్మద్ తోహిరి ,ఎఫిష్ కాట్ ఇన్ టైం-సమంతా వీన్ బెర్గ్ ,అంగుళి సోల్స్ రోచే –అలీ జమీర్ ,దిబోన్ మాన్ ఆఫ్ బెనారస్ –టేర్రి టారోఫీ,టేల్స్ ఫ్రం ది టారిడ్ జోన్ –అలెక్షన్దర్ ఫ్రేటర్,దికాస్మోపాలిటీస్-అట్రోసా అరెక్సియ వగైరా .118-కాంగో దేశ సాహిత్యం
మధ్య ఆఫ్రికాలో ఒంటరి దేశం డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని పిలువబడే కాంగో దేశం .ప్రపంచ పెద్దనదులలో కాంగో లేక జిరో రివర్ ఒకటి.ఈ నదిని బట్టేదేశం పేరు వచ్చింది .పూర్వపుపేరు జైర్.సబ్ సహారా ప్రాంతం లో పెద్ద దేశం .ఆఫ్రికాలో రెండవపెద్ద దేశం .ప్రపంచంలోనే 11వ పెద్ద దేశం కూడా .రాజధాని –కిన్షాసా .కరెన్సీ –కాన్గోలీస్ ఫ్రాంక్ .జనాభా .8న్నర కోట్లు .అధికార భాష ఫ్రెంచ్ .సగం మంది కేధలిక్కులు మిగిలినవారు ప్రోటేస్ట౦ట్లు పెంతేకోస్తులు .కికొంగా ,లింగాలా ,స్వాహిల్లి ,సులూబా భాషలు మాట్లాడుతారు .అక్షరాస్యత శాతం 83.అందరికి 13ఏళ్ళ విద్య తప్పని సరి .వ్యవసాయం ముఖ్య ఆదాయం పశుపోషణ ఫిషింగ్ ,అడవులు కూడా ఆదాయవనరులే .అగ్నిపర్వతాలు వైల్డ్ లైఫ్ మొదలైన 10టూరిస్ట్ స్పాట్ లున్నాయి .
కాంగో సాహిత్యం -1950నుంచే ఆధునిక సాహిత్యం వచ్చింది .1937లొటికాయాడీ బోఎమ్పైర్,దాదత్ డోమాన్గోముఖ్య రచయితలు ,.జీన్ మలోనా , 1954లో ‘’కోఎర్ డీఆర్యేన్ని’’రాసి 1954లో ప్రచురించాడు .ముగ్గురు ముఖ్య రచయితలగురించి తెలు సుకొందాం .ఎ.మోబనాకో –చాలానవలలు రాశాడు .ఇతని ‘పెట్టి పిమేంట్ ‘’నవలకు 2015లో మాన్ బుకర్ ప్రైజ్ వచ్చింది.కోలి జీన్ బొఫేన్ –కాంగో ఇన్క్ ది టెస్ట మెంట్ ఆఫ్ బిస్మార్క్ నవలతో బాగా పేరుపొందాడు.స్థానిక భాషా భావాలతో తీర్చి దిద్దిన నవల .కాంగో అంటే దేశం కాదుఒక కంపెని అని అభిప్రాయపడ్డాడు .యూరప్ ఎలా తనకున్న వనరులతో వృద్ధిపొందిందో కాంగో కూడా అలాటి అభి వృద్ధిసాధించి౦దనిదని తెలిపాడు .ఫిస్టన్ మువాన్జా ముజిల –‘’ట్రామ్-83’’నవల రాసిన ఈతరం రచయిత.కాకిగోలలాంటి వచనం కట్ డైలాగులు ,తీవ్రస్వరం తో రాసిన నవల ఇది .ఎన్నోపాత్రలు విభిన్న మనస్తత్వాలు అన్నిటా సెక్సువాలిటిలతో ఓ కానర్, స్కాట్ ఫిట్జ రాల్డ్ ను గుర్తుకు తెస్తాడు .మరి కొందరు రచయితలలో- లియిని ఆబో ,లోకోల్ బోలంబే ,అమిని కిశుగి ,కామాస్వయూర్ కమండ ,పాట్రిక్ ముకాబల ,లి ఏం యొకా ,సంగా విరింగియానా మొదలైనవారున్నారు ‘.
కాంగో గైనకాలజిస్ట్ ,’’డాక్టర్ మిరకిల్ ‘’అని ప్రసిద్ధి చెందిన డెనిస్ ముక్ వేజ్ కు 2018లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-20-ఉయ్యూరు
