ఈమధ్య దూబే ఎంకౌంటర్ చదివాక ,ఎవరో ఒక ప్రసిద్ధ వ్యక్తి దూబే ఉండాలి అని గుర్తుకొచ్చి తిరగేశా .అవును ఉన్నాడు ముచికుంద దూబే ఆయనపేరు పూర్వపుబంగ్లా దేశ్ కు భారత రాయబారి ,ఫారిన్ సెక్రెటరీ గా పని చేసినవాడు ,.భారత ప్రభుత్వం లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ హెడ్ .కౌన్సిల్ ఆఫ్ సోషల్ డెవలప్ మెంట్ ప్రెసిడెంట్ కూడా .పాట్నా లోని ఏషియన్ డెవలప్ మెంట్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ చైర్మన్ ,ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూయూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ .ఫారిన్ సర్వీసెస్ ఇన్ ష్టి ట్యూట్ ప్రొఫెసర్ ఎమిరిటస్ .ప్రపంచ ఆర్ధిక విధానాలు ,,ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ట్రేడింగ్ సిస్టమ్స్ సెక్యూరిటీలను డిజార్నమెంట్ ,సౌత్ ఏషియన్ కో ఆపరేషన్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పై పరిశోధన అధ్యయనం చేసిన మేధావి .ఢిల్లీ అంబెడ్కర్ యోని వర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డెవలప్ మెంట్ స్టడీస్ లో మాస్టర్స్ ఇన్ డెవలప్ మెంట్ స్టడీస్ బోధించాడు .ఇది టీచింగ్ అండ్ రీసెర్చ్ కు ఉపయోగపడే కేంద్రం
— ముచికుంద దూబే రాసిన ప్రసిద్ధ గ్రంథాలు
- Communal revivalism in India: a study of external implications. .
- Dubey, Muchkund (1995). Indian society today: challenges of equality, integration, and empowerment.
- Dubey, Muchkund (1998). Subhas Chandra Bose: the man and his vision.
- Dubey, Muchkund; Balakrishnan, Rajiv (2008). Social development in independent India: paths tread and the roads
- Dubey, Muchkund; Jabbi, M. K. (2009). A Social charter for India: citizens’ perspective of basic rights. .
- Dubey, Muchkund (2013). India’s foreign policy: coping with the changing world
- Dubey, Muchkund; Hussain, Akmal (2014). Democracy, sustainable development, and peace: new perspectives on South Asia. .

