ప్రపంచ దేశాల సారస్వతం
137- మారిషస్ దేశ సాహిత్యం
హిదూ మహాసముద్రం లో ఒక ద్వీపం రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ దేశం.ఆఫ్రికా ఆగ్నేయ తీర ప్రాంతం లో ఉంది .రాజధాని –పోర్ట్ లూయి దేశం లో పెద్దనగరం . అధికారభాషలు-ఇంగ్లీష్ , తెలుగు .మారిషస ,క్రియోల్, భోజ్ పూరి ,ఫ్రెంచ్ ఇతరభాషలు అభి వృద్ధి లో రెండవ దేశం .హిందూ మతం ఉన్న అతిపెద్ద ఏకైక ఆఫ్రికా దేశం .కరెన్సీ –మరీషియన్ రూపాయి .జనాభా -12.7లక్షలు .
ప్రైవేటు వ్యవసాయదారుల క్రింద కూలీలుగా పనిచేయటానికి 1835 లో కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య అనే ముగ్గురు తెలుగు వారు కాందిశీకులుగా తొలిసారిగా మారిషస్‌లో అడుగుపెట్టారు.ఆ మరుసటి సంవత్సరం గౌంజన్ అనే ఓడలో దాదాపు 30 మంది తెలుగువారు ఆ ద్వీపంలో కాలుపెట్టారు. కాకినాడ సమీపాన వున్న ‘కోరంగి’ రేవు నుండి బయలు దేరి వచ్చినందుకు వాళ్లని కోరంగివాళ్ళు అని, వారు మాట్లాడే తెలుగు భాషకు ‘కోరంగి భాష’ అని పిలిచేవారు. 1843 సంవత్సరంలో కోరంగి పికేట్ అనబడే 231 టన్నుల బరువు నాలుగైదు తెరచాపలు గల బార్క్ అనే మాదిరి ఓడ రెండు సార్లు ప్రయాణం చేసి దాదాపు రెండు వందల మందిని మారిషస్ దీవికి చేర్చింది.[4] తెలుగు వారు భాషా సంస్కృతి కాపాడుకొంటున్నారు. సర్ వీరాస్వామి రింగడు తండ్రి తెలుగువాడు, తల్లి తమిళవనిత. తెలుగు భాషా సంస్కృతులపై ఆయన అపారమైన అభిమానం చూపుతారు. ఆంధ్ర విశ్వ విధ్యాలయం డాక్టరేటుతో తెలుగు బిడ్డడైన సర్‌వీరాస్వామి రింగడును సత్కరించింది. అంచెలంచెలుగా వివిధ హోదాలు చేపట్టి, 1986 జనవరి 17 న గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.
శ్రీరాముడు వేసిన బాణానికి మారీచుడు ఇక్కడికి వచ్చి పడ్డాడని మారీచుని దేశమే తర్వాత మారిషస్ గా మారిందని అక్కడి హిందువులనమ్మకం .91.33శాతం అక్షరాస్యత ఉంది .ప్రీప్రైమరీ,ప్రైమరీ , సెకండరి టేరిటరి సెకండరీ స్థాయి విద్య .పోర్ట్ లూయీ ,గ్రాండ్ బాజే ,ఫ్లిక్ ఎన్ ఫ్లాక్ బీచ్ ,బ్లాక్ రివర్ ,నేషనల్ పార్క్ యాత్రాస్తలాలు .సురక్షిత దేశం .వ్యవసాయం ఎగుమతులు టూరిజం ఆదాయవనరులు .భారతీయ పండుగలకు ఇక్కడ జాతీయ సెలవు దినాలివ్వటం ప్రత్యేకత .
మారిషన్ సాహిత్యం –మారిషస్ భాషలో ,ఫ్రెంచ్ లో ఎక్కువగా సాహిత్యం ఉంటుంది దేవ్ వీరాస్వామి మారిషియన్ లో విస్త్రుతంగా రాశాడు .మాల్కం డీ చాజల్ ,ఆనంద దేవి ,రేమాండ్ చాజల్ ,ఎదోవార్డ్ మాణిక్ లు ప్రసిద్ధ రచయితలు యువ రచయితలలో షెనాజ్ పటేల్ ,నటాచ అప్పన్న ,సాబా కరీం అలైన్ గార్డాన్ జెంటిల్, కార్ల్ డీ సౌజా .కవి ,విమర్శకుడు ఖాల్ టోరా బుల్లి ‘’కూలిట్యుడ్’’అనే ఇండో-మారిషణన్ సంస్కృతి వ్యాపింపజేశాడు .హస్సాం వాచిల్ ,సాడ్లీ అస్సన్ ,యూసఫ్ ఖడేల్,ఉమర్ టిమోల్ లూ గుర్తింపు పొందిన రచయితేలే .
జే ఏం జి లె స్లేజియో 2008లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ పొందాడు .
ఫ్రెంచ్ రచయితలలో ముఖ్యులు –మేరీ టేరాసి హంబర్ట్ ,ఆక్విల్ గోపి ,అమల్ సీవో హాల్.క్రియోల్ భాషలో –దేవ్ వీరాస్వామి ,అజిజి ఆసగ రాల్లీ ,ఉన్నారు
శ్రీ సంజీవ అప్పడు నేడు మారిషస్లో తెలుగు కీర్తికి సాహిత్య సంస్కృతులకు నిలువెత్తు పతాకలాగా ఉన్నారు .అక్కడ నిత్యం భజన ,సంగీత సాహిత్యకార్యక్రమాలు నిర్వహిస్తారు స్వయ౦గా గొప్ప రచయిత ఎన్నో రేడియో ప్రసంగాలు చేసిన మూర్తీభవించిన ఆంధ్రత్వం భాష వేషం భావాలలో .ప్రతి ఏడూ ఇండియావచ్చి విమానం దిగగానే నేలకు మొక్కిపుణ్య క్షేత్రాలన్నీ తిరిగి నదుల్లో స్నానించి అక్కడి పవిత్ర మట్టిసేకరించి భద్రంగా మారిషస్ తీసుకు వెళ్లి అందరికీ పంచి పెడతారు.నాలుగవ ప్రపంచ తెలుగు రచయితలసభలో ఆయనే స్పెషల్ అట్రాక్షన్.
138-మొరాకో దేశ సాహిత్యం
ఉత్తర ఆఫికా అట్లాంటిక్ సముద్రతీరాన మొరాకో దేశం ఉంది అరేబియన్ యూరోపియన్ సంస్కృతుల సమ్మేళనం .రాజధాని –రాబట్.కరెన్సీ –మొరాకియన్ దిర్హాం .అధికారభాష అరబిక్ .అమా ఝిగ్ .జనాభా -3.6కోట్లు .సున్ని ముస్లిం దేశం .73.5అక్షరాస్యత శాతం .సంప్రదాయ ఇస్లాం విద్యావిధానం .వ్యవసాయం ఫాస్ఫేట్ ఖనిజం ,సముద్ర ఉత్పత్తులు ,టూరిజం ఆదాయ వనరులు .జేమాల్ ఎల్ ఫినా ,జార్డిన్ మజేరోలి ,బాహియా పాలెస్ యాత్రా స్థలాలు .సురక్షిత దేశం .
మొరాకో సాహిత్యం –ఇంగ్లీష్ ఫ్రెంచ్ అరబిక్ వగైరా భాషలలో సాహిత్యం వర్ధిల్లింది .ఫోనీషియన్ మైథాలజి లెక్సస్ లో దొరికింది .గ్రీకో రోమన్ మైథాలజికి నిలయం .ప్రపంచ చాంపియన్ హెర్క్యులస్ పుట్టిన దేశం.రెండవ జూబా రాజు విద్యావంతుడు గ్రీక్ లాటిన్ పండితుడు .ప్లిని రాసిన చరిత్రలో ఆయనగురించి ఉన్నది .ఒబీరియను జయించినప్పుడు తారిక్ బిన్ జియాద్ ఇచ్చిన స్పూర్తిదాయక ప్రసంగం ఫ్రై డే సెర్మన్ లో ముఖ్యం .ఇద్రిస్సిడ్ కాలంలో సేబ్టా,సినిగర్ ,బస్రా లు కల్చరల్ సెంటర్లు .అల్ బక్రి తన బుక్ ఆఫ్ రోడ్స్ అండ్ కింగ్డమ్స్ లో సాలిహా ఐబన్ టారిఫ్ ఒక ప్రాఫెట్ అనీ ‘’కొత్త ఖురాన్’’ ఆయనకు ‘’బహిర్గతం ‘’అయిందని దీనినే ఖురాన్ ఆఫ్ సాలిహా అంటారని రాశాడు .తర్వాతసూఫీకవులు సాహిత్యాన్ని బాగా ప్రభావితం చేశారు .అయ్యాద్ బౌన్ మౌసా ,ఐబాన్ బాజియా ,చరిత్ర కర్తలు Kitāb al-Shifāʾ bīTaʾrif Ḥuqūq al-Muṣṭafá.[ బాజియ రచన Ibn Quzman, Ibn Zuhr, లు పెర్కొనదగినవారే .ఆల్మండ్ ఉద్యమం లో ఇమాం ఐబర్ట్ టుమార్ట్-ఇయాజ్ మా యుతియాబ్అంటే దిమోస్ట్ నోబుల్ కాలింగ్ రాశాడు .మారినిద్ వంశ పాలనలో సుల్తాన్ అబూ ఇనాన్ ఫారిస్ సాహిత్యాన్ని పోషించాడు ఫేజ్ యాత్రాసాహిత్యం ఐబాన్ అబ్బాద్ ఆల్రున్ది,సాలిహ్ బెన్ షరీఫ్ ముఖ్యకవులు Al-Kafif az-Zarhuni‘s al-Mala’b ,అల్ మారాబా రాశాడు .
20వ శతాబ్దం లో మొహమ్మద్ బెన్ బ్రహిం,అన్డిక్రిం ఘల్లాబ్ ,అల్లాల్ ఆల్ ఫాసిలు రెండవతరం కవులు .మూడోతరం లోమహమ్మద్ చౌక్రి డ్రిస్ చిరైబీ ,,మహమ్మద్ జఫ్ జాఫ్ డ్రిస్ ఎల్ ఖౌరి ముఖ్యులు ‘’సౌఫ్లీస్ ‘’అనే మేగజైన్ కూడా నడిపారు .తహార్ బెన్ జల్లోం ,లైలాలలామీ అంతర్జాతీయఖ్యాతిపొందారు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-20-ఉయ్యూరు ,

