- ప్రపంచ దేశాల సారస్వతం
- 143-రువాండా దేశ సాహిత్యం
- తూర్పు ఆఫ్రికాలో ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్,గ్రేట్ రివర్ వాలీ ఉన్న దేశం రువాండా .ఆఫ్రికాలో అతి చిన్న దేశం .రాజధాని –కివాలి .జనాభా -1.23కోట్లు .కరెన్సీ –రువా౦డన్ ఫ్రాంక్ .రోమన్ కేధలిక్స్ ఎక్కువ తర్వాత ప్రోటే స్టంట్లు ఉంటారు .జాతీయభాష రువాండా .ఫ్రెంచ్,ఇంగ్లిష్ కూడా వాడుకలో ఉన్నాయి .అక్షరాస్యత -73.2శాతం .ఆరేళ్ళ ప్రైమరీ ,మూడేళ్ళ లోయర్ సెకండరి రాష్ట్రాల స్థాయిలో విద్య .వల్కనోస్ నేషనల్ పార్క్ ,ఫారెస్ట్ నేషనల్ పార్క్ ,మౌంట్ కరి సిమ్బి దర్శనీయాలు .అత్యంత భద్రత ఉన్న దేశం .వ్యవసాయమే ముఖ్య ఆదాయం .అరటి కస్సావా,స్వీట్ పొటాటో,మైజ్ బీన్స్ పండిస్తారు .
- రువాండా సాహిత్యం –దాదాపు మౌఖికమే .సావేరియో నైగీజికి తన స్వ్వీయ చరిత్ర –రువా౦డన్ అడ్వెంచర్ తోపాటు’’దిఆప్టి మిస్ట్ ‘’నవల రాశాడు .పూర్వం నుంచి కథలు బాగా వ్యాప్తిలో ఉన్నాయి ఇప్పటికీ కథలు చెప్పేవారంటే అక్కడ గౌరవం ఎక్కువ .కిన్యాన్ వండాభాషలో ఉన్న సాహిత్యం చాలాతక్కువే .అలెక్సిస్ కగామే -1912-81అనేక వాల్యూం ల కవిత్వం ఆదేశ మైథాలాజి సేకరించి ప్రచురించాడు .1994నరమేధం తర్వాత బెంజమిన్ సహేనే -1959-‘’ది ఎత్నిక్ ట్రాప్ ‘’1999లో రాశాడు .ఇందులో జీనోసైడ్ జరగటానికి కారణాలు అన్వేషించాడు .ఫైర్ అండర్ ది కస్సోక్ హిస్టారికల్ నవల హూటూ కేధలిక్ ప్రీస్ట్ పై 2005లో రాశాడు .అవర్ లేడీ ఆఫ్ ది నైల్ రాసింది ముకసొంగా అనే మహిళ.యోలాండాముకగాసానా కూడా జీనో సైడ్ పై ‘’రైటింగ్ ఆజ్ మోర్నింగ్’’రాసింది .స్కోలాస్టికాముకసొంగా ‘’కాక్రోచేస్ ‘’నవలరాసి రెనడౌట్ ప్రైజ్ పొందింది .ఈమె ‘’ఐ డోంట్ వాంట్ ఎ టుట్సి వర్జిన్ నవల రాసింది .గయేల్ ఫైయే అనే యువరచయితజీనో సైడ్ పై స్పందించి ‘’స్మాల్ కంట్రీ’’రాశాడు .రాఫెల్ నికాకా ‘’టేక్ అప్ యువర్ పెన్స్ చిల్ద్రెన్ ఆఫ్ రువాండా ‘’రాశాడు
- రువాండా నరమేధం అంటే -1994లో రువాండా దేశం లోని 8లక్షల టుట్సిజాతి మోడరేట్ ప్రజలను ప్రభుత్వ ప్రోత్సాహంతో హుట్సు తీవ్రవాద సైనికులు,పోలీసులు నిర్దాక్షిణ్యంగా సంహరించటమే .దీనిపై యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఫర్ రువాండా ఏర్పడి విచారణ జరిపింది .
- 144-సెనెగల్ దేశ సాహిత్యం
- ఉత్తర ఆఫ్రికాలో రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్ దేశం ఉంది .రాజధాని –దాకర్ .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 1.60కోట్లు .అధికారభాష ఫ్రెంచ్ .36స్థానికభాషలున్నాయి .ముస్లిం దేశం .నాలుగు స్థాయిల విద్యావిధానం .అక్షరాస్యత 52శాతం .చేపలు ఫాస్ఫేట్ ,వేరుసెనగ ,తోరిజం ఆదాయ వనరులు .లేక్ రెట్బా,గోరీ ,నేషనల్ బర్డ్ సాన్ చ్యురి దర్శనీయాలు .సురక్షిత దేశం .
- సెనెగల్ సాహిత్యం –అన్నిరకాల ప్రక్రియలు వర్ధిల్లాయి .అహ్మద్ యాన్ సిహి ధు అల్ నన్ లు కవులుగా ప్రసిద్ధులు .కలోనియల్ పాలన తర్వాత జాతీయ సాహిత్యం వచ్చింది .చీక్ హమేదౌకానే ,బౌబాకర్ బోరిస్ డియోప్,ఔస్మోన్ సేమ్బెనే నవలలురాశారు .మహిళలలో మేరియామాబా, ఫటౌ డిమో,నేడేయాఫటౌ కామే,అమినాటా సౌ ఫాల్ ,ఫటావో సౌ ముఖ్యులు
- కాలనీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కూడా చాలా మంది రాశారు .లేయోపోల్డ్ సేడార్ సింఘాల్ ప్రామినెంట్ కవి రచయిత .చాన్త్స్ డీ ఓంబే మొదటి కవితా సంపుటి .నోక్త్యూన్స్ ,ది కలేక్టేడ్ పోయెట్రితో ఫిలాసఫీ లింగ్విస్టిక్స్ పైనా రచనలు చేశాడు .బోకారి డయాలో ,డేవిడ్ బాయ్ లాట్ లు ఆదేశ సాహిత్యానికి ఫౌండి౦గ్ ఫాదర్స్.మిష్టిజం రియలిజం వగైరాలు కూడావచ్చి వాటిలోనూ రాశారు .
- మహిళలలో –మరియామాబా ఫెమినిస్ట్ ఆధర్ .’’సో లాంగ్ ఎ లెటర్ ,స్కార్లెట్ సాంగ్ ,నవలలురాసింది .అమినాటా సౌ ఫాల్ –ఎపిస్టోలరి గ్రాండ్ డేమ్.పాలన, అవినీతి,ఆదేశ సమాజ స్థితిగతులు ,పురుషలక్షణం గురించి విస్తృతంగా రాసింది .ఫటా సౌ- సోషియాలజిస్ట్ .ఫటాటా డియోంవగైరా లున్నారు
- సెనెగల్ సినిమా మంచి ప్రాచుర్యం పొందింది .ఒస్మానే సేమ్బనీ ఇందులో ఘటికుడు.
- సశేషం
- మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-20-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,673 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

