’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1
డా.తిరుమల రామ’’ చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1
‘’మనలిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’త్వవ్వి తలకెత్తిన అసమాన ప్రజ్ఞానిధి ,బహుభాషా పండితకవి డా.తిరుమల రామచంద్ర .ఆయనరాసిన యాత్రా సాహిత్యమే ‘’హంపీ నుంచి –హరప్పా దాకా ‘’.అందులో స్పృశించని విషయం లేదు .ఆయన పాండిత్యం వ్యక్తిత్వం ,అభిమానధానం అన్నీ ఇందులో దర్శనమిస్తాయి .అందులోని ముఖ్యవిషయాలు అందరికీ ఆకర్షణీయంగా నూతనంగా కనిపించేవి కొన్ని మీకు అందించాలనే తలపుతో ఈదారావాహికకు ‘’ ’డా.తిరుమల రామ’’ చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా ‘’అని పేరుపెట్టాను .ముందుగా ఆయనగురించి ఆయనే మూడవ ముద్రణలో చెప్పుకొన్నవిషయాలు మీకోసం .



