మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-73

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-73

73-ఏరువాకా సాగాలోయ్ ‘’,నందామయా గురుడ,సరదా సరదా సిగరెట్టూ ఫేం-జానపద కవి సార్వ భౌముడు ,అష్టావధాని నేత్రావధాని  , –కొసరాజు

కొసరాజుగా, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజు రాఘవయ్య చౌదరి (సెప్టెంబరు 31905 – అక్టోబరు 271986) సుప్రసిద్ధ కవిరచయిత.

జీవిత సంగ్రహ

1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలుజముకుల కథలుబుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించారు.

తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యంహాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలిఅది రాఘవయ్య చౌదరిగారు రాయాలి – అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ఏరువాక సాగాలోరన్నో అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు.

బాల్యం[

“మా సొంత వూరు అప్పికట్ల. అక్కడ ఒకే వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగోతరగతి తర్వాత ఇంక పై క్లాసులేదు. అంచేత, నేను నాలుగు చదివేసినా, ఊరికే కూచోక, మళ్ళీ నాలుగు చదివాను అని చెప్పాడు కొసరాజు ఒక ఇంటర్వ్యూలో . నాలుగోతరగతి తప్పితే మళ్లీ చదవడం వేరుపాసై మళ్లీ చదవడం వేరు. అలా, ‘డబల్‌ ఎమ్‌.ఏ.లాగాఆయన చిన్నతనంలోనే డబల్‌ నాలుగు’ డిగ్రీ పొందారు. ఐతేఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. వంశంలో వున్న ఆ సాహితీరక్తం – రాఘవయ్య లోనూ ప్రవహించిఉత్తేజపరిచింది. ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణంఆంధ్రనామసంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారముతర్కవితర్కాలుతెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు.

కొడముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది. నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య రాముడి పాత్రధారి. అప్పటికే ఆయన కంఠం లౌడ్‌ స్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు. అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెండో ఏటికే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించాడు! బాలకవి అని బిరుదు పొందాడు. సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాప్యులరో, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాప్యులర్‌. పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం – ఏ మాత్రం అడ్డురాలేదు.

తొలి రోజులు[

నరసింహం పంతులు వ్రాసిన రామాయణము నాటకములో పాత్రలు ధరించి నాటక రంగానికి పరిచయమయ్యాడు. పిదప కొంత కాలము ‘రైతు పత్రిక’ కు జర్నలిష్టుగా ఉన్నాడు. ఆ సమయములోనే ప్రముఖ సంగీత దర్శకుడు సముద్రాల రాఘవాచార్యులు, నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం గార్లతో పరిచయం ఏర్పడింది.

సినిమా జీవితం

“చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్ళపిళ్ళవేటూరి వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన నన్నూ కూచోబెట్టారు. వధూవరుల మీద నేను రాసిన పద్యాలు చదివితే, ‘ఈ పిట్ట కొంచెమే అయిన కూత ఘనంగా వుందే!’ అని చెళ్లపిళ్ల వారు నన్ను ప్రశంసించారు, ఆశీర్వదించారు’” అని కొసరాజు చెప్పేవాడు. ఆయన ఇంకో విశేషం చెప్పేవాడు. జమీన్‌రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవాడు. అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట.

ఆ పుస్తకం చదివి, అందరూ ‘మనకెందుకులే’ అని వెనుకంజ వేశారుట – భయపడి. ఐతే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు మాత్రం ‘నేను రాస్తాను’ అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది. రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే ‘ఆహా’ అనే వారందరు. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదుకూడా ఇచ్చారు. సాహితీపోషకులైన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి ద్వారా రాఘవయ్య చౌదరికి గూడవల్లి రామబ్రహ్మంసముద్రాల రాఘవాచార్య లతో ఏర్పడిన పరిచయం ఆయన సినిమాల్లో ప్రవేశించడానికి కారణమైంది.

అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి, ఒక ఊపు ఊపుతున్న కొసరాజుచేత, రామబ్రహ్మం సినిమాలకు రాయించడం మొదలుపెట్టాడు. తాపీ ధర్మారావుత్రిపురనేని గోపీచంద్‌ మాటలు రాస్తే విశ్వనాథ కవిరాజు హాస్య సన్నివేశాలు రాశారు. సముద్రాల, తాపీ, కొసరాజు పాటలు రాశారు. ‘రైతుబిడ్డ’ తర్వాత నేను స్వస్థలం వెళ్లిపోయి వ్యసాయంతోపాటు సాహితీ వ్యవసాయం కూడా చేస్తూ కూచున్నాను. మళ్లీ పదమూడేళ్ల తర్వాత డి.వి. నరసరాజుగారి సూచనతో కె.వి. రెడ్డిగారు ‘పెద్దమనుషులు’ సినిమాకి పిలిచారు. అప్పటుంచి ‘సినిమాకవి’నే అయిపోయాను’ అని గట్టిగా నవ్వుతూ చెప్పేవారాయన.

రాఘవయ్య తొలుత కథానాయకునిగా రైతుబిడ్డ (1939) అనే చిత్రములో నటించాడు. కవిగా రాఘవయ్య ప్రతిభ గుర్తించిన బి. ఎ. సుబ్బారావు, కె. వి. రెడ్డి వారి చిత్రాలకు పాటలు వ్రాయించారు. 1954లో విడుదలైన ‘పెద్ద మనుషులు’ చిత్రానికి రాఘవయ్య వ్రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రెక్షకులను ఉర్రూతలూగించాయి. సుబ్బారావు గారి ‘రాజు పేద’ చిత్రములోని ‘జేబులో బొమ్మ జే జేలబొమ్మ’ బహుళ ప్రాచుర్యం చెందింది. రోజులు మారాయి (వహీదా రెహ్మాన్ నాట్యముతో)లో ‘ఏరువాక సాగారో’, ‘ఇల్లరికములో ఉన్న మజా’ (), ‘అయయో జేబులో డబ్బులు పోయెనే’ (), ‘ముద్దబంతి పూలు బెట్టి’ () మొదలగు పాటలు కోట్లాది తెలుగు ప్రేక్షకుల మనసులలో చిరస్మరణీయముగా మిగిలిపోయాయి. అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టున ఉండే వారి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారతాయి. జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా, వినరావినరానరుడా…, సరిగంచు చీరగట్టి… శివగోవింద గోవింద, డబ్బులోనే ఉందిరా, నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగుచెంగునా గంతులు వేయండి, సరదా సరదా సిగిరెట్టు, ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు… ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మొత్తము 200 చిత్రాలకు 1000 పాటలు వ్రాశాడు.

పాటల జాబితా[

శైలి

కొసరాజుగారు ఫెళ్లుమని నవ్వితే, ఆ నవ్వు ఆయన కంఠాన్ని మించిపోయి వుండేది. నిత్యం రైతువేషమే. తెల్లటి ఖద్దరు, నల్లటి గొడుగుతో సౌమ్యభాషణతో కనిపించేవారు కొసరాజుగారు. ఆయనకు జానపద వరసలు తెలుసుగనక, అలాంటి వరసల్లోనే పాటలు రాసి, తన వరసలోనే పాడితే, కొందరు సంగీతదర్శకులు ఆ వరసల్నే తీసుకుని, మెరుగులు దిద్దడం కూడా వుండేది.

ఈయన సిగరెట్టు మీద రాసిన సరదా సరదా సిగరెట్టు అనే పాట ఇలాటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది. దాన్లో పొగతాగితే “ఊపిరితిత్తుల కేన్సర్‌ కిదియే కారణమన్నారు డాక్టర్లు” అని ఒక పాత్ర అంటే రెండో పాత్ర వెంటనే, “కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్దపెద్ద యాక్టర్లు సిగరెట్ల వ్యాపార ప్రకటనలు ఇవ్వటం, సినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని గ్లామరైజ్ చెయ్యటం, మీద విసిరిన మంచి చెణుకు. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర “థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర “కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన జోక్ వెయ్యటం ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది.

అలాగే పేకాట గురించిన పాట అయయో చేతులొ డబ్బులు పోయెనేఅయయో జేబులు ఖాళీ ఆయెనే అనేది కరుణ, హాస్యం కలగలిసి మెరిసిన పాట. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెల్వవచ్చు, ఇంకా పెట్టుబడెవడిచ్చు, ఇల్లు కుదువబెట్టవచ్చు, ఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది. అంతటితో ఆక్కుండా, “పోతే?” అనే సందేహం, దానికి “అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చినయ్‌.

ఇలాటిదే మరో ఇల్లరికం అల్లుడి మీద పాట భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే అనేది. దీన్లో అత్తమామల ఆస్తికోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ “జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడి, దూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే” అనటం కూడా చక్కటి ప్రయోగం.

ఈ కోవలోదే మరో పాట చవటాయను నేను వట్ఠి చవటాయను నేను అనేది. దీన్లో జనానికి, దేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించటం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర “బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించాను, వరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడాను, చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది.

మొత్తం మీద ఇలాటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగింది.

కవి[

రాఘవయ్య ‘గండికోట యుద్ధము’ అను ద్విపద కావ్యము, ‘కడగండ్లు’ అను పద్యసంకలనం వ్రాశాడు. ‘కొసరాజు విసుర్లు’,’కొండవీటి చూపు’, ‘నవభారతం’, ‘భానుగీత’ ఇతని ఇతర రచనలు.

విశేషాలు

·         ‘పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు అని స్వయంగా ప్రకటించుకున్నాడు.

·         జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు తొలిసారిగా కొసరాజు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.

·         1938లో గూడవల్లి రామబ్రహ్మం రైతుబిడ్డ సినిమా లో కొసరాజు కొన్ని పాటలు రాయడమేకాక నటించారు

·         యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు.

·         తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి సంస్కృతము కొరకు చలపట్టునొక్కండుహిందియనుచు గంతులిడు నొకండుతెలుగు కొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె…‘ అన్నారు

బిరుదులు, పురస్కారాలు

·         ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము రాఘవయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డు (1984) ఇచ్చింది.

·         తెలుగు ప్రజానీకం ‘కవి రత్న’ ‘జానపద కవి సార్వభౌమ’ మున్నగు బిరుదులు ఇచ్చింది.

కొసరాజు రాఘవయ్య 1986 అక్టోబరు 27 రాత్రి పది గంటలకు మరణించాడు.

కొసరాజు పాట నిత్య ఏరువాక

అచ్చ తెలుగులోని అందాలుజానపదుల భాషలోని సొగసులుపల్లెటూరి భాషలోని చమత్కారాలువిరుపులు రాఘవయ్య పాటలలో జాలువారుతాయి. మూడున్నర దశాబ్దాల కాలం ఆయన రాసిన పాటలు తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచాయి.

సినీ రంగంలో ‘కొసరాజు’గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా పాటల రచయిత స్వర్గీయ కొసరాజు రాఘవయ్య చౌదరి గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా (ప్రస్తుతం కర్లపాలెం మండలం) చింతాయపాలెం గ్రామంలో సుబ్బయ్య, లక్ష్మమ్మ పుణ్య దంపతులకు 1905, జూనలో మాతామహుల ఇంట జన్మించారు. వీరి స్వగ్రామం అప్పికట్ల. ఆ గ్రామంలో నాలుగో తరగతి వరకు మాత్రమే చిన్న వీధి బడి ఉండేది. ఆ వీధి బడిలో నాల్గవ తరగతిలో ఉత్తీర్ణుడై, చేసేదేమీ లేక తిరిగి నాల్గవ తరగతిలోనే చేరాడు. రాఘవయ్య చిన్న వయస్సులోనే సాహిత్యాన్ని వంటపట్టించుకున్నాడు. తన తల్లి మేనమామగారైన వెంకటప్పయ్య గొప్ప పండితులు. ఆ వంశంలో ఉన్న సాహితీ రక్తం రాఘవయ్యగారిలోను ప్రవహించి ఆయన రచనా వ్యాసంగానికి గట్టి పునాది వేసింది. వీధి బడిలో ఉండగానే ఆయన ‘బాల రామాయణం’, ‘ఆంధ్రనామ సంగ్రహం’ వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివి ఆ సారాంశాన్ని అర్థం చేసుకున్నాడు. అదే గ్రామంలో నివసిస్తున్న పండితుడు, విమర్శకుడు అయిన కొండముది నరసింహం ప్రోత్సాహంతో ఆయన భజన పద్ధతిలో రాసిన రామాయణం ప్రదర్శనలో కొసరాజు రాముడి పాత్ర ధరించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. కొసరాజు కంఠం చాలా శ్రావ్యంగా ఉన్నందున, నరసింహం ఆయనకు మాటా, పాటా నేర్పాడు. పొలాలగట్ల మీద కొసరాజును కూర్చోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పడమే కాకుండా, సాహిత్య సభలకూ తిప్పాడు. ఈ సాహిత్య సాంగత్యం మూలంగా తన 12వ ఏటనే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించి, బాలకవిగా బిరుదు పొంది, ఆనాటి ‘రైతు’ పత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు. ఆయనకు స్కూలు, కళాశాల చదువులు లేక పోయినా, అవి ఉద్యోగానికి ఏమాత్రం అడ్డం రాలేదు. తెలుగు సాహిత్యం, పురాణాలు, కావ్యాలపై పట్టు సాధించి, తనకు వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి వద్ద అచ్చ తెలుగు నుడికారం, తర్కవితర్కాలు, తెలుగు భాష సౌందర్యం తెలుసుకున్నాడు. నరసింహం పంతులు, రామస్వామి చౌదరిల సాంగత్యంతో తన భాషా పటిమకు మెరుగులు పెట్టాడు. అదే సమయంలో రైతు బిడ్డగా తమ పొలం పనులలో నిమగ్నమై జానపదుల తెలుగులోని సొగసులు, చమత్కారాలు తెలుసుకున్నాడు.

                  1950లో జమీన్‌ రైతు ఉద్యమం మొదలైన తరువాత కొసరాజు రైతును సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలు రాసి సభల్లో పాడి రైతుల మన్ననలు పొందాడు. అదే సమయంలో ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకాన్ని రాసి ఆ పుస్తకానికి పీఠిక రాయమని ఎందరో సాహితీ వేత్తలను, రాజకీయ వేత్తలను అర్థించినా, బహుశా జమీందార్లకు భయపడి ఎవరూ ముందుకు రాలేదట. చివరకు ప్రముఖ పత్రికాధిపతులైన కాశీనాథుని నాగేశ్వరరావు ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశారు. అచ్చయిన తరువాత ఆ పుస్తకం అందరి ప్రశంసలు పొందటమే కాకుండా ఆయనకు ‘కవిరత్న’ అనే బిరుదును సాధించిపెట్టింది.

                  సాహితీ పోషకులు, కళా ప్రియులు ఆనాటి గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకుని, వారు అందించిన ఆర్థిక సహాయంతో కమ్మవారి చరిత్ర రాయటానికి తమిళనాట అనేక వూళ్ళు తిరిగి ఎంతో సమాచారాన్ని సేకరించారు. కొసరాజు గారు యక్షగానాలు, వీధి బాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు భజన గీతాలు, పగటి వేషగాళ్ళ పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు మొదలైన రచనలెన్నో చేశారు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి ద్వారా కొసరాజుకి సినిమా రంగానికి చెందిన గూడవల్లి రామబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్యుల గార్లతో ఏర్పడిన పరిచయం ఆయన చిత్రసీమలో అడుగుబెట్టటానికి కారణమైంది. అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి, ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని ఒక ఊపు ఊపుతున్న కొసరాజు చేత రామబ్రహ్మం సినిమాలకు పాటలు రాయించసాగారు. తాపీ ధర్మారావు, త్రిపురనేని గోపీచంద్‌ మాటలు రాయగా కొసరాజు పాటలు రాశారు. కొసరాజు తొలుత 1939లో కథానాయకునిగా రైతుబిడ్డ అనే చిత్రంలో నటించాడు. రైతు బిడ్డ చిత్రం విజయవంతం కాక నిర్మాతకు నష్టాన్నే మిగిల్చింది. రైతుబిడ్డ చిత్రం తరువాత కొసరాజు తన స్వస్థలం వెళ్ళిపోయి వ్యవసాయంతో పాటు సాహితీ వ్యవసాయం చేయటం మొదలు పెట్టాడు. మళ్ళీ పదమూడేళ్ళ తరువాత డి.వి.నరసరాజు సూచనతో, ప్రముఖ నిర్మాత కె.వి.రెడ్డి వీరిని తాను నిర్మించబోయే పెద్ద మనుషులు చిత్రానికి పాటలు రాయటానికి మద్రాసు పిలిపించారు. 1954లో విడుదలైన పెద్దమనుషులు చిత్రానికి కొసరాజు రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

                  తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేక శైలిగా వుండేది. ఆ రోజుల్లో చాలా చిత్రాలు కొసరాజు ముద్రను బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యం మేళవించిన పాట ఒకటైనా తమ సినిమాలో వుండాలని ఎందరో దర్శకులు కోరుకునేవారట. అది రాఘవయ్య చౌదరిగారే రాయాలి అని ఆనాటి సినిమా వారికి ఒక సూత్రం వుండేదట. ఆ సూత్రానికి తగినట్లుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళ భరితం చేశారు. జానపద గీతాలలోని లాలిత్యాన్ని, ఆ పొగరూ, వగరూ ఏ మాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది. రోజులు మారాయి చిత్రంలో ఆయన రాసిన ఏరువాకా సాగాలో రన్నో చిన్నన్నా నీ కష్టమంతా తీరునులే అన్నా, చిన్నన్నా అంటూ వ్యవసాయ దారులకు ఉత్సాహం నింపుతూ, వారికి ధైర్యం నూరిపోసిన పాట ప్రతివూరిలోను మార్మోగి రాఘవయ్య పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసింది.

                  అచ్చ తెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెటూరి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారుతాయి. మూడున్నర దశాబ్దాల కాలం ఆయన రాసిన పాటలు తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచాయి. తెల్లటి ఖద్దరు బట్టలతో నిజమైన రైతు బిడ్డ సౌమ్య భాషణతో అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. ఆయనకు జానపద వరసలు తెలుసుగనుక అలాంటి వరసల్లోనే పాటలురాసి తన వరసలోనే పాడితే, కొందరు సంగీత దర్శకులు ఆ వరసల్నే తీసుకుని, మెరుగులు దిద్దేవారట, మొత్తం మీద తన పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తి చూపించాడు. కొసరాజు సినీ గీతాలేకాక ‘గండికోట యుద్ధము’ అనే ద్విపద కావ్యం, ‘కడగండ్లు’ అనుపద్య సంకలనం రాశాడు. ‘గండికోట యుద్ధము’ అనే ద్విపదకావ్యంలో ఆ కోటను 300 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యపు సామంతులుగా పరిపాలించిన పెమ్మసాని వారి వంశాన్ని, వారి ఔదార్యాన్ని, వీరత్వాన్ని, పెమ్మసాని వారికి సాయపడిన ఇతర 65 కమ్మవంశాలను ప్రస్తావించారు. కొసరాజు రాఘవయ్య చౌదరి అనేక అవార్డులు, రివార్డులు బహుమతులు అందుకున్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం అత్యంత గౌరవ పురస్కారమైన రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారాన్ని వీరు తెలుగు సినిమాకు చేసిన సేవలకు 1984లో ప్రదానం చేసింది. ఈయనను తెలుగు ప్రజానీకం ‘జానపద కవి సార్వభౌమ’ ‘కవిరత్న’ అనే బిరుదులతో సత్కరించింది.

                  సుమారు మూడున్నర దశాబ్దాలు తమ మధురమైన, వీనులకింపైన పాటలతో తెలుగు సినీ ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించి దేదీప్య మానంగా వెలిగిన దీపం 1987 సంవత్సరం అక్టోబర్‌ నెల 27వ తేదీ రాత్రి ఆరిపోయి యావత తెలుగు ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. వారు చిరస్మరణీయులు.

జానపద కవిసార్వభౌముడు…కొసరాజు!

June 23, 2021

జూన్ 23న కొసరాజు రాఘవయ్య జయంతి)
తెలుగు చిత్రసీమలో అంతకు ముందు ఎందరు జానపద బాణీ పలికిస్తూ పాటలు అల్లారో కానీ, కొసరాజు రాఘవయ్య చౌదరి కలం ఝళిపించిన తరువాత జానపద బాణీ అంటే ఇదే అన్నారు సాహితీప్రియులు. మన భాషలోని కనుమరుగైన పదాలు, కరిగిపోయిన మాటలు పట్టుకు వచ్చి మరీ జానపదాన్ని జనానికి పరిచయం చేశారు కొసరాజు. అందుకే జనం ఆయనను ‘జానపద కవిసార్వభౌమ’ అని కీర్తించారు. కొందరు ‘కవిరత్న’ అనీ శ్లాఘించారు. కొసరాజు అనగానే జానపద పాటలే రాశారని అనుకుంటారు కానీ, ఆయన కలం నుండి జాలువారిన పాటలెన్నో తెలుగువారిని పరవశింప చేశాయి.

తెలుగునేలపై విశేషంగా వినిపించే బ్రహ్మంగారి తత్త్వాలలోని “నందామయా గురుడ నందామయా…”, ” మకుటం గ్రహించి, పాటను కట్టి ‘పెద్దమనుషులు’లో పరమానందం పంచారు. “జేబులో బొమ్మా జేజేల బొమ్మా…” అంటూ ‘రాజు-పేద’ కోసం కొసరాజు పదాలు చిలికించారు. ఇక కొసరాజు పేరు తలవగానే అందరి తలపుల్లో మొదటగా మెదిలే పాట ఏదంటే ‘రోజులు మారాయి’లోని “ఏరువాకా సాగారో…రన్నో చిన్నన్నా…” పాటనే. ఈ పాట ఈ నాటికీ తెలుగువారిని పులకింప చేస్తూనే ఉండడం విశేషం. “ఆడుతు పాడుతు పనిచేస్తుంటే…” అని అలుపును మరపించినా, “టౌను పక్కకెళ్ళొద్దురో డింగరీ…” అంటూ వినోదం పంచినా కవిరత్నకే చెల్లింది. “అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటీ… బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా…” అంటూ చిందేయించినా, “నిలువవే వాలు కనులదానా…” అంటూ వయారి హంసనడకల చిన్నదాని వెంట పడి పాటందుకున్నా కొసరాజు కలం బలం ఏ పాటిదో తెలిసిపోతుంది. “అయ్యయ్యో జేబులో డబ్బులు పోయేనే…” అంటూ పేకాట పాటలోనూ పలు సెటైర్స్ వేసిన తీరు చూస్తే కొసరాజు బాణీ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇక “మామ మామా మామా… ఏమే భామా భామా…” అంటూ ‘మంచిమనసులు’ను విజయతీరం చేర్చడంలోనూ కొసరాజు రచన భలేగా పనిచేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జానపద బాణీల్లో భలేగా పసందు చేసిన పాటలెన్నో ఉన్నాయి.

ఎప్పుడూ జానపద గీతాలే కాదు, “ఏ నిమిషానికి ఏమి జరుగునో…” అంటూ కన్నీరు పెట్టించినా, “కలవారి స్వార్థమూ నిరుపేద దుఃఖము…”అంటూ ఆవేదన కలిగించినా, “జయమ్ము నిశ్చయమ్మురా…భయమ్ము లేదురా…”అంటూ ప్రబోధం పలికించినా వాటిలోనూ కొసరాజు బాణీ కనిపిస్తుంది . ఏది ఏమైనా కడదాకా జనానికి జానపదంలోని రుచిని చూపిస్తూ సాగిన ఘనత కొసరాజు సొంతమయింది. ఆయన నిర్మాతగానూ మారి యన్టీఆర్ హీరోగా దాసరి దర్శకత్వంలో కవిరత్నా మూవీస్ పతాకంపై ‘విశ్వరూపం’ తెరకెక్కించారు. 1984లో కొసరాజుకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. ఇక జానపదం పేరు వినిపించినంత కాలం కొసరాజు పేరు కూడా మన చెవులకు సోకుతూనే ఉంటుంది. అందుకే ఆయన ‘జానపద కవిసార్వభౌముడు’గా జనం మదిలో నిలిచారు.

👉అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి ముందు చూపులేనివాడు ఎందునకూ కొరగాడు.

పేరు కొసరాజుతెలుగంటే పెద్దమోజు అని స్వయంగా ప్రకటించుకున్నాడు.

జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు తొలిసారిగా కొసరాజు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.

1938లో గూడవల్లి రామబ్రహ్మం రైతుబిడ్డ సినిమా లో కొసరాజు కొన్ని పాటలు రాయడమేకాక నటించారు

యక్షగానాలువీధిభాగవతాలుహరికథలుజముకుల కథలుబుర్రకథలుభజనగీతాలుపగటివేషగాళ్ళ పాటలురజకుల పాటలుపాములోళ్ళపాటలుగంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు.

తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి సంస్కృతము కొరకు చలపట్టునొక్కండుహిందియనుచు గంతులిడు నొకండుతెలుగు కొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె…‘ అన్నారు

తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం.

ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యంహాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలిఅది రాఘవయ్య చౌదరిగారు రాయాలి – అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు.

జానపదగీతాల్లోని లాలిత్యాన్నిఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ఏరువాక సాగాలోరన్నో… అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ… అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు.

కొసరాజుగారు ఫెళ్లుమని నవ్వితేఆ నవ్వు ఆయన కంఠాన్ని మించిపోయి వుండేది. నిత్యం రైతువేషమే. తెల్లటి ఖద్దరునల్లటి గొడుగుతో సౌమ్యభాషణతో కనిపించేవారు కొసరాజుగారు. ఆయనకు జానపద వరసలు తెలుసుగనకఅలాంటి వరసల్లోనే పాటలు రాసితన వరసలోనే పాడితేకొందరు సంగీతదర్శకులు ఆ వరసల్నే తీసుకునిమెరుగులు దిద్దడం కూడా వుండేది.

ఈయన సిగరెట్టు మీద రాసిన సరదా సరదా సిగరెట్టు” అనే పాట ఇలాటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది. దాన్లో పొగతాగితే ఊపిరితిత్తుల కేన్సర్‌ కిదియే కారణమన్నారు డాక్టర్లు” అని ఒకపాత్ర అంటే రెండో పాత్ర వెంటనే, “కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్దపెద్ద యాక్టర్లు సిగరెట్ల వ్యాపార ప్రకటనలు ఇవ్వటంసినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని గ్లామరైజ్ చెయ్యటంమీద విసిరిన మంచి చెణుకు. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన జోక్ వెయ్యటం ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది.

అలాగే పేకాట గురించిన పాట అయయో చేతులొ డబ్బులు పోయెనేఅయయో జేబులు ఖాళీ ఆయెనే” అనేది కరుణహాస్యం కలగలిసి మెరిసిన పాట. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చుమళ్ళీ ఆడి గెల్వవచ్చుఇంకా పెట్టుబడెవడిచ్చుఇల్లు కుదువబెట్టవచ్చుఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది. అంతటితో ఆక్కుండా, “పోతే?” అనే సందేహందానికి అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చినయ్‌.

ఇలాటిదే మరో ఇల్లరికం అల్లుడి మీద పాట భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే” అనేది. దీన్లో అత్తమామల ఆస్తికోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడిదూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే” అనటం కూడా చక్కటి ప్రయోగం.

ఈ కోవలోదే మరో పాట చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అనేది. దీన్లో జనానికిదేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించటం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించానువరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడానుచవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది.

మొత్తం మీద ఇలాటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్నిదురలవాట్లని చమత్కారంఅవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగి

కనకాద్రి శిఖరాన శునకమ్ము సింహమై,

ఏడుదీవుల రాజ్యమేలేనయా!

గుళ్ళు మ్రింగేవాళ్ళు, నోళ్ళు గొట్టే వాళ్ళు..

ఊళ్ళో చలామణీ అవుతారయా!

ఆ ఆ లు రానట్టు అన్నయ్యలందరికి…

అధికార యోగమ్ము పడుతుందయా!

కుక్కతోక పట్టి గోదావరీదితే..

కోటిపల్లి కాడ తేలేరయా!

స్వారాజ్య యుధ్ధాన జయభేరి మ్రోగించిన,

శాంతమూర్తులు అంతరించారయా,

స్వాతంత్ర్య గౌరవం సంతలో తెగనమ్ము…

స్వార్థమూర్తులు అవతరించారయా!

గొర్రెల్ని తినువాడు గోవింద గొట్తాడు,

బర్రెల్ని తినువాడు వస్తాడయా!

పగలె చుక్కలు మింట మొలిపింతునంటాడు!

నగుబాట్లు పడి తోక ముడిచేనయా.

అప్పు చేసిన వాడు పప్పుకూడు తిని…

ఆనందమయుడౌతు తిరిగేనయా!

అర్దమిచ్చిన వాడు ఆకులలములు మేసి

అన్నానికాపన్నుడౌతాడయా!

నందామయ గురుడ నందామయ,

ఆనందదేవికి నందామయ!

1954 లో రాష్ట్రపతి ఉత్తమ చిత్రం గా ఎన్నికైన కె.వి.రెడ్డి గారి…పెద్ద మనుషులు….మూవీ లోని ఈ పాట….

ఆ రోజుల్లో…తెలుగు నాట….ప్రతినోట…నాట్యమాడిందంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు విన్నా ఆ పాట నిత్య నూతనంగా అలరిస్తుంది!

అప్పుడెప్పుడో….1939 లో రిలీజ్ అయిన గూడవల్లి రామబ్రహ్మం గారి రైతు బిడ్డ….మూవీలో….అద్భుతమైన రైతు పోరాటం…..గీతాలు వ్రాసి…

అందులో ఓ మంచి పాత్ర కూడా వేసిన ఆయన…..సినిమా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని….అద్భుత విజయాన్ని అందుకున్నా….

ఎందుకో మళ్ళీ సొంత ఊరెళ్ళిపోయి…వ్యవసాయం చేసుకుంటూ….పత్రికలలో…సాహిత్య వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉండిపోయాడు….

మళ్ళీ 13 ఏళ్ళ తరువాత….కె.వి.రెడ్డి గారే పిలిపించి…పెద్ద మనుషులుతో….సినీ గీత రచయితగా మార్చేశారు.

ఆ తరువాత….ఆయన తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసేసుకున్నాడు.

హాస్య, వ్యంగ్య, రాజకీయ , జానపద గీతాలను…..ఆయన వ్రాస్తే….అప్పట్లో….ఆ కిక్కే వేరబ్బా….ఆన్నట్లుండేది!

ఆయనే… కొసరాజు రాఘవయ్య చౌదరి గారు.

*************

సినిమాలో అన్ని పాటలూ రికార్డ్ చేసేసినా సరే….ఇంకా ఏదో వెలితి కనిపిస్తుంటది. అప్పుడు…కొసరాజు గారే గుర్తొస్తారు…ఏ దర్శకుడికైనా!

ఓ హాస్య గీతమో…వ్యంగ్య గీతమో…జానపదమో పెట్టేస్తారు. ఆశ్చర్యంగా అదే పెద్ద హిట్టౌతుంది సినిమాకు!

1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు.

సొంత వూరు అప్పికట్ల. అక్కడ ఒకే వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగోతరగతి తర్వాత ఇంక పై క్లాసులేదు.

అంచేత నాలుగు చదివేసినా, ఊరికే కూచోక, మళ్ళీ నాలుగు చదివారు కొసరాజు గారు!

నాలుగోతరగతి తప్పితే మళ్లీ చదవడం వేరు, పాసై మళ్లీ చదవడం వేరు. అలా, ‘డబల్‌ ఎమ్‌.ఏ.’లాగా, ఆయన చిన్నతనంలోనే ‘డబల్‌ నాలుగు’ డిగ్రీ పొందారు!

ఐతే, ఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. వంశంలో వున్న ఆ సాహితీరక్తం – రాఘవయ్య లోనూ ప్రవహించి, ఉత్తేజపరిచింది.

ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణం, ఆంధ్రనామసంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు.

కొండముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది.

నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య రాముడి పాత్రధారి.

అప్పటికే ఆయన కంఠం లౌడ్‌ స్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు.

అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెండో ఏటికే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించాడు! బాలకవి అని బిరుదు పొందాడు.

సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాపులరో, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాపులర్!

పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం – ఏ మాత్రం అడ్డురాలేదు!

ఏ డిగ్ర్రీలూ లేవు…ఏ జర్నలిజం కోర్సులూ లేవు!

**************

“చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్ళపిళ్ళ, వేటూరి వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన కూచోబెట్టారు కోసరాజు గారిని.

వధూవరుల మీద రాజు గారు రాసిన పద్యాలు చదివితే, ‘ఈ పిట్ట కొంచెమే అయిన కూత ఘనంగా వుందే!’ అని చెళ్లపిళ్ల వారు ప్రశంసించారు, ఆశీర్వదించారు!

జమీన్‌రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవాడు.

అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు గారు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట.

ఆ పుస్తకం చదివి, అందరూ ‘మనకెందుకులే’ అని వెనుకంజ వేశారుట – భయపడి.

ఐతే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు మాత్రం ‘నేను రాస్తాను’ అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది.

రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే ‘ఆహా’ అనే వారందరు. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదుకూడా ఇచ్చారు.

**************

కొసరి వ్రాయి చుకునే వారు దర్శకులు…నిర్మాతలు…..కొసరాజు గారిదగ్గర గీతాలు. మరి వారి కొసరాజు బ్రాండ్ అలాంటిది!

హాస్యం తొణికిసలాడాలన్నా…

వ్యగ్యం తొంగిచూడాలన్నా…

జానపద రీతులు…అలరించాలన్నా….

ఒక్క కొసరాజు వారి మాటే….పాటగా మారాలి!

అదీ అప్పుడాయన పరిస్థితి.

కొస రాజు కాదు….కొసరు రాజు….అని కూడా అనేవారాయనను! ఆయన రచన ఒక్కటైనా లేకపోతే….సంపూర్ణత్వం రాదు!

రైతుపైన అభిమానము చూపని రాజులుండనేల?

నిద్ర మేల్కొనర తమ్ముడా..గాఢ నిద్ర మేల్కొనరా తమ్ముడా,…

ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా…

ఇల్లరికంలో ఉన్న మజా….

జేబులో బొమ్మ జేజేల బొమ్మ,

అయ్యయ్యో చేతిలొ డబ్బులు పోయెనే,

ముద్దబంతి పూలు పెట్టి..మొగిలిరేకులు..

సరిగంచు చీర జట్టి, కొమ్మంచు రైక తొడిగి….

సరదా సరదా సిగిరెట్టు..ఉది దొరల్ తాగు భల్ సిగిరెట్టు…

టౌను పక్కకెళ్ళొద్దురో డింగరీ…

ఆడుతు పాడుతు..పని చేస్తుంటే…

మూక్కు చూడు ముక్కందం చూడు…

శివశివ మూర్తివి గణనాథ..నువ్వు శివుని కుమారుడవు గణనాథ….

శ్రీరామ…ఓరామ.. నీ నామమెంతో రుచిరా

ఆ శైలి ఒక్క కొసరాజు కే సొంతం.

ఎందుకంటే….ఆయన చిన్నప్పటి నుండే…ఓ సంస్కృతి చూస్తూ పెరిగారు.

హరికథలు, బుర్రకథలు,

జముకుల కథలు, రజకుల పాటలు,

పాములోళ్ళ పాటలు,భజన గీతాలు,

పగటివేషగాళ్ళ పాటలు,

గంగిరెద్దు వారి గీతాలు….

ఇవన్నీ గమనించడమే కాదు….జీర్ణించుకున్నారు…తన పాటలో అవసరానికి ఆవిష్కరించారు….తనదైన ప్రత్యేక శైలిలో.

అజరామరం గా నిలిచాయి ఆ పాటలు.

మూడున్నర దశాబ్ధాల పాటు….షుమారు 200 చిత్రాలలో 1000 కి పైగా గీతాలు వ్రాశారాయన.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము కొసరాజు రాఘవయ్య గారికి

రఘుపతి వెంకయ్య అవార్డు (1984) ఇచ్చింది.

తెలుగు ప్రజానీకం… ‘కవి రత్న’ ‘జానపద కవి సార్వభౌమ’.. బిరుదులు ఇచ్చింది.

సినిమాకు మాటలు వ్రాసే వారందరూ పాటలు రాయలేకపోవచ్చు.

కానీ పాటలు వ్రాసేవారు…మాటలు వ్రాయగలరు.

కానీ కొసరాజు గారు ఆ ప్రయత్నం చేయలేదు. ఎవ్వరూ అడగలేదేమో మరి!

సంస్కృతాంధ్రాలు చదివినా…

అవధానాలు చేసినా…

జానపద వాజ్మయాన్ని జీర్ణం చేసుకున్నా….

కించిత్తు కూడా గర్వం అనేది ఎరుగరు కొసరాజు గారు.

సదా చిరునవ్వు ముఖమే! కడు సౌమ్యుడాయన. విరగబడి నవ్వుతారు, నవ్విస్తారు….నవ్వు ఇస్తారు.

81 ఏళ్ళ వయస్సులో…27 అక్టోబర్ 1986 న….కొసరాజు గారు కీర్తిశేషులయ్యారు.

ఈ రోజు 23 జూన్ 1905….వారి జయంతి అంటున్నారు. కానీ సెప్టెంబర్ 3 వారి జయంతిగా కూడా బిన్నాభిప్రాయాలున్నా….చిరస్మరణీయులైన కొసరాజు గారిని ఎప్పుడైనా తలుచుకోవచ్చు తెలుగు వారు.

స్వంతవూరు అప్పైకట్లలో జమ్మలమడక సీనయ్య పంతులు అక్షరాభ్యాసం చేయగా వీధి బడిలో చదివ ,గ్రామకరణం

కొండముది నరసింహం పంతులు గారివడ్డ ఆంద్ర సంస్కృత గ్రంధాలు చదివి పాండిత్యం కొంత సాధించి ,పినతండ్రి త్రిపురనేని రామస్వాం చౌదరి గారి దగ్గర కవిత్వం రాయటం నేర్చారు .పద్య విద్యలో ఆరితేరి అష్టావధానా నేత్రావధాన ,ఆశుకవిత్వాలలో దిట్ట అనిపించారు

బాలకవి గా గుర్తింపు పొందారు 1922లో త్రిపురనేని వారి’’రైతు ‘’పత్రికలో పని చేసి ప్రభావితులయ్యారు .త్రిపురనేని ‘’కొండవీడు ‘’నవల రాస్తే కొసరాజు కొండవీటి వైభవం ‘’కావ్యం రాశారు ఆయన శంబుక వధ నాటకం రాస్తే ,ఈయన ‘’శంబుకర్షి ‘’శతకం రాశారు .1927,28లలో గుంటూరు జిల్లా బోర్డు ఎన్నికలలో ప్రచారాలకు బుర్రకధలు రాసి ,ప్రచారానికి బుర్రకదను మొదటి సారిగా ఉపయోగించే ప్రక్రియకు నాంది పలికారు .1982-83తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారానికీ బుర్రకధలు రాశారు .1930లో గూడవల్లి ,సముద్రాలతో కలిసి ‘’కమ్మవారి చరిత్ర ‘’పరిశోధనకోసం మద్రాస్ వెళ్ళారు దీనిఖర్చు జాగర్లమూడి కుప్పు స్వామి భరించారు ప్రోత్సాహం ఉన్నావా వారిది ,పర్యవేక్షణ త్రిపురనేని .ఈ పరిశోధనలో గండికోట ప్రభువులు పెమ్మసాని వారిచారిత్రతో బాగా ప్రభావితులయ్యారు .గూడవల్లి ‘’గండికోట పతనం’’నాటకం రాస్తే ,సముద్రాల ‘’గండికోట ‘’పద్యకావ్యం రాస్తే ,కొసరాజు ‘’గండికోట యుద్ధం ‘’మంజరీ ద్వ్పదకావ్యం రాశారు .తర్వాతీముగ్గురు సినిమా రంగం లో చేరారు .

  1932 లో మద్రాస్ ప్రధాని బోల్లిని మునుస్వామి నాయుడు ప్రోత్సాహంతో కొసరాజు తిరుత్తని జమీన్ రైతు సంఘ ప్రచారం లో పాల్గొన్నారు ‘’కడగండ్లు ‘’గేయాలు రాసి తానె పాడారు .1938 లో గూడవల్లి గారి రైతుబిడ్డ సినిమా కు పాటలు రాసి ,పాడి రైతు పాత్ర పోషించారు .1940లో

అపవాదు సినిమా పాటలు రాసి ,ఆంధ్రోద్యమాన్ని వ్యతిరేకించిన వారిని తూర్పార బట్టారు .ప్రజామిత్ర ,సమదర్శిని ,ఢంకాపత్రికలలో

ఈయన రచనలు పడేవి

 సుమారు మూడు వేల సినీ పాటలు రాశారు కొసరాజు .హాస్య గీత రచనల రారాజు కొసరాజు అనిపించారు .సినీ పాటలతో పాటు

మిత్రనీతి,భాను గెట వీరశేఖర శతకం ,సినిమా డైరెక్టర్ ,రాష్ట్ర గీతికలు ,రాఘవయ్య శతకం కూడా రాశారు .ఈ శతకం లో ‘’రైతు జన విదేయ

రాఘవయ్య ‘’మకుటం తో 1500 ఆటపడులు రాశారు .తెలుగు పలుకుబడులు నుడికారాలకు సామెతలకు ఇది నిధి .

 చాలా సంస్థలు కొసరాజును బిరుడులిచ్చి సత్కరించాయి చల్లపల్లి రాజా సన్మానించారు ప్రొద్దుటూరు లో నందమూరి తారకరామారావు గారి చేతులమీదుగా ‘’కనకాభి షేకం’’జరిగింది .ఆంద్ర విశ్వవిద్యాలయం’’కళాప్రపూర్ణ తో ,రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య స్మారక

పురస్కారం తో సత్కరించాయి .కవిరత్న ,జానపద బ్రహ్మ ,ప్రజాకవి జానపద కవి సార్వభౌమ బిరుదులూ పొందారు .తనను

‘’సహజ కవిత్వ ప్రసార దుర్వహుడను ‘’అని కొసరాజు చెప్పుకొన్నారు .

  1986లో అక్టోబర్ 27న ‘’గురు బ్రహ్మ ‘’సినిమాకు ఉర్రూతలూపే బుర్రకధ రాసి ,,ఇంటికి వచ్చిప్రశాంతంగా తుది సహవా విడిచారు కొసరాజు రాఘవయ్య చౌదరి  .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-2-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.