వీక్షకులు
- 1,212,774 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
ఈ నాటి అనుబంధ మేనాటిదో ?
ఈ నాటి అనుబంధ మేనాటిదో ? దువ్వూరి వారు విశాఖయూనివర్సిటీ లో తెలుగు లెక్చరర్ గా 1941 లో చేరాక ,రెండవ ప్రపంచ యుద్ధకాల౦ లో బాంబుల భయం వలన యూని వర్సిటీని గుంటూరుకు మార్చారు .అంత పెద్ద కాంపస్ దొరక్క అక్కడా అక్కడా సర్దుకొన్నారు .లెక్చరర్లు ఇక్కడ పెంచిన అద్దె ఇళ్ళల్లో ఉండలేక సతమతమయ్యారు … Continue reading
బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి
బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి విజయనగరం అంటే శ్రీ మదజ్జాడఆదిభట్ల నారాయణ దాసు గారే ముందు గుర్తుకొస్తారు .తాతా రాయుడు శాస్త్రిగారు విజయనగరం రాజావారిసంస్కృత కాలేజిలో వ్యాకరణ అధ్యాపకులు .ఈ ఇద్దరికీ ఆబాల్య మైత్రి ఉంది .శాస్త్రిగారు రోజూ కాలేజీకి కానుకుర్తి వారి వీధిలో ఉన్న దాసు గారింటి మీదనుంచే వెళ్ళేవారు .మేడపై … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
డజనున్నర కథల్లో మణుగున్నర హాస్యం’’ పన్’’డించిన మాడుగుల
డజనున్నర కథల్లో మణుగున్నర హాస్యం’’ పన్’’డించిన మాడుగుల చక్కని వాచికం ,స్వరం లో అన్ని భేదాలు ,రసాలు పండించే చాతుర్యం ,సుమనస్కత ,మూర్తీభవించిన సౌజన్యం ,సంస్కారం ,సకలకళా రహస్య వేతృత్వం ,నిష్పక్షపాత నిర్ణయ సాహసత్వం ,నిజాయితీ ,భేషజం లేని నడవడి,చిరునవ్వుకు చిరునామా అయిన ముఖం ,కలుపుకోలు తనం ,సోషియాలజీ ,జర్నలిజ౦ లో స్నాతకోత్తర పాండిత్యం ,విజయవాడ ఆకాశ … Continue reading
గౌతమీ మహాత్మ్యం—74(చివరి భాగం ) 106-తీర్దానాం చతుర్విధాది నిరూపణం
గౌతమీ మహాత్మ్యం—74(చివరి భాగం ) 106-తీర్దానాం చతుర్విధాది నిరూపణం నారద మహర్షి బ్రహ్మ దేవుని పావన గౌతమీ నది గురించి సంక్షిప్తంగా మళ్ళీ చెప్పమని కోరాడు .పూర్వం కమండలం లో ఉన్న గంగ ,తర్వాత విష్ణుమూర్తి పాదాలనుంచి ఉద్భవించి ,మహేశ్వరుని జటాజూటం చేరి ,గౌతమమహర్షి తపో ఫలం చేత బ్రహ్మగిరి చేరి,అక్కడి నుంచి పూర్వ సముద్రం … Continue reading
షార్లెట్ సాహితీ మైత్రీ బంధం
నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన ”షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ”పుస్తకం దేశం లో ప్రముఖమైన మూడు లైబ్రరీలు 1-కన్నెమెరా లైబ్రరి -చెన్నై 2-సెంట్రల్ లైబ్రరి -ముంబాయ్ 3-ఢిల్లీ పబ్లిక్ లైబ్రరి -ఢిల్లీ లకు అందాయని కొలకత్తా లోని ప్రభుత్వ సంస్థ నేషనల్ లైబరీ వారి నుంచి ఈ రోజు లెటర్ వచ్చిందని తెలియ జేయటానికి … Continue reading
గౌతమీ మహాత్మ్యం—73-104-భీమేశ్వరతీర్ధం
ఋషి సత్రం అని ప్రసిద్ధి చెందిన భీమేశ్వర తీర్ధం గురించి నారదుని బ్రహ్మ వివరించాడు .గంగను సప్తరుషులు ఏడుపాయలుగా విభజించారు.దక్షిణ దిక్కులో వాషిస్టీ,ఉత్తరాన వైశ్వా మిత్రీ , దీనికి ఉత్తరాన కామ దేవీ ,మధ్యలో శుభప్రద గౌతమీ ఏర్పడ్డాయి .తర్వాత భరద్వాజీ ,ఇంకోటి ఆత్రేయి ఏర్పడ్డాయి .చివరది జామదగ్ని ..త్రికాల దర్శులైన ఆ సప్తర్షులు మహా … Continue reading
నిరతాన్న దాత అపరఅన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మకు కు పంచప్రక్రియ కవితామృత నైవేద్యం
నిరతాన్న దాత అపరఅన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మకు కు పంచప్రక్రియ కవితామృత నైవేద్యం గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు చి శిస్టుసత్యరాజేష్ పని రాక్షసుడు .ఆలోచనాపరుడు .భిన్నత్వం నవీనత్వం కోరేవాడు .అందుకే డొక్కా సీతమ్మ గారిపై గజల్ ,మణిపూసలు ,ఇస్ట పదులు , కైతికాలు ,వచనకవిత్వం అనే పంచ ప్రక్రియలతో 80మంది వివిధ ప్రాంతకవులతో రాయించి ముద్రించి విజయవాడ … Continue reading
గౌతమీ మహాత్మ్యం—72-102- ఊర్వశీ తీర్ధం
గౌతమీ మహాత్మ్యం—72-102- ఊర్వశీ తీర్ధం శార్గ్జ్న ధారుడైన హరి కొలువై ఉన్నదే ఊర్వశీ తీర్ధం .ప్రమతి సార్వభౌముడు శత్రుజయం చేసిసురలతో ఇంద్రలోకం చేరి,పాశుహస్తుడైన ఇంద్రుని చూసి నవ్వగా సురలోకం లో మరుద్గణాలతో క్రీడిస్తే చాలు .నాతొ అనుభవించు’’అన్నాడు .ప్రమతి ‘’దేన్నీ పణంగా పెడతావు ‘’ని అడిగితె ‘’సకల యాగ ఫలం, ఊర్వశిని ‘’అన్నాడు .గర్వంతో ఉన్న … Continue reading
దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం
దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం ప్రౌఢ వ్యాకరణ కర్త శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు తెలుగు లెక్చరర్ గా ఆంద్ర విశ్వవిద్యాలయం లో 1941 లో రిటైరయ్యారు .ఈ పోస్ట్ ను నింపటానికి యూనివర్సిటి ఒక పండితుడుకావాలని ఆయన ఛందో వ్యాకరణాది … Continue reading
గౌతమీ మహాత్మ్యం—71 101- చక్షుస్తీర్ధం
గౌతమీ మహాత్మ్యం—71 101- చక్షుస్తీర్ధం గౌతమికి దక్షిణాన చక్షుస్తీర్ధం ఉంది. అక్కడ దేవదేవుడైన యోగీశ్వరుడు కొలువై ఉంటాడు .పర్వత శిఖరం పై ‘’భౌవనం ‘’అనే పురం ఉంది. దాని రాజు భౌవనుడు క్షాత్ర ధర్మ పరాయణుడు .ఆపురం లో కౌశికుడనే బ్రాహ్మణుడు ,అతని కొడుకు వేదపండితుడైన గౌతముడు ఉన్నారు .తల్లి మనో దోషం చేత యితడు … Continue reading
గౌతమీ మహాత్మ్యం—70 100-భిల్ల తీర్ధం
గౌతమీ మహాత్మ్యం—70 100-భిల్ల తీర్ధం సింధు ద్వీపముని,సోదరుడు వేదుడు పరమ ధార్మికులు . వేదుడు ఒక రోజు భిక్షాటనకు వెళ్ళగా ,వ్యాధుడు అనే ధార్మికుడైన వేటగాడు వేటకు వచ్ఛి వేటాడి ,శివునికి అభిషేకం చేయటానికి నోటితో నీళ్ళు తెచ్చి , వేట మాంసాన్ని ధనుస్సు చివర ఉంచి పూజించాడు .అప్పటికే వేదుడు పూజించిన దాన్ని కాలితో … Continue reading
గౌతమీ మహాత్మ్యం-69 99-భాను తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-69 99-భాను తీర్ధం భాను తీర్ధం త్వాస్ట్రం ,మాహేశ్వరం ,ఐంద్రం ,యామ్యం ,ఆగ్నేయం గా ప్రసిద్ధం .అభిస్టుడుఅనే రాజు మంచి సుందరాకారుడు. దేవప్రీతికోసం అశ్వమేధయాగం సంకల్పించాడు .వసిష్ట అత్రి మున్నగు రుషి శ్రేస్టులు ఋత్విక్కులు .అక్కడ ‘’క్షత్రియుడే యజమానిగా ఉంటె యజ్ఞభూమి ఎలాఉంటుంది ?బ్రాహ్మణుడే దీక్షితుడైతే రాజు యజ్ఞ సంబంధ భూమిని ఇవ్వగలడు.మరి రాజే … Continue reading
గౌతమీ మహాత్మ్యం-68 97-పతత్రి తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-68 97-పతత్రి తీర్ధం కశ్యప ప్రజాపతి అరుణుడు ,గరుత్మంతుడు కుమారులు .ఈవంశం లోని వారే జటాయువు సంపాతి .ఈ ఇద్దరు బలగర్వం తో స్పర్ధతో ఆకాశానికి యెగిరి సూర్య దర్శనం చేయాలనుకొన్నారు .సూర్యతాపానికి తట్టుకోలేక ఇద్దరూ అలసిపోయి ఒక పర్వత శిఖరం పై పడిపోయారు .వీరిద్దరిని అరుణుడు చూసి విచారించి సూర్యునితో ఆ ఇద్దరినీ … Continue reading
దువ్వూరి వారి ‘’రమణీయం‘’పై రమణీయ భావనలు
దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు అంటే చిన్నయ సూరి బాలవ్యాకరణం ,ఆతర్వాత ‘’రమణీయం ‘’గుర్తుకొస్తాయి .దువ్వూరివారు సంస్కృత వ్యాకరణాన్ని మూడేళ్ళపాటు ఆసాంతం చదివి హస్త, మేధోగతం చేసుకొన్నారు .1914విజయనగరం మహారాజాకాలేజిలో విద్వాన్ కోర్సు చదవటానికి చేరారు .అప్పుడు చిన్నయ సూరి బాలవ్యాకరణ౦ లో సంజ్ఞాపరిచ్చేదం,చదివి’’ సంధి ‘’ప్రారంభించే సరికి ‘’ఇదేదో బింకంగా ఉందే.తెలుగు వ్యాకరణాలు చప్పచప్పగా … Continue reading
గౌతమీ మహాత్మ్యం-67 96-భద్ర తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-67 96-భద్ర తీర్ధం త్వష్ట ప్రజాపతి కూతురు ఉష సూర్యుని భార్య .ఛాయ రెండవ భార్య.ఈమె కొడుకే శని .ఇతని సోదరి విస్టి భయంకరాకార కురూపి . ఈమెను ఎవరికిచ్ఛి పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్నాడు తండ్రి .అప్పుడు విస్టి తండ్రితో ‘’కన్యను తగిన వాడికిచ్చి పెళ్లి చేస్తే తండ్రి కృతార్దుడౌతాడు .కన్యకు పదేళ్ళు … Continue reading
గౌతమీ మహాత్మ్యం-6695-చిచ్చిక తీర్ధం
సర్వ శాంతి కలిగించే ‘’చిచ్చిక తీర్ధం ‘’గోదావరి ఉత్తర తీరాన ఉన్నది .చిచ్చుక అనే పక్షిరాజును గండ భేరుండం గా,శ్వేత పర్వతం పై ఉంటూ ప్రసిద్ధి చెందింది .అక్కడ మహర్షులు ప్రశాంతంగా తపస్సు చేసుకొంటారు .సర్వవిధ వృక్షాలు అక్కడ ఉంటాయి .రోగాలు రొస్టులు ఉండవు .ధర్మ నిరతుడైనతూర్పు దేశ క్షత్రియరాజు పవమానుడు మంత్రి సామంత పురోహిత … Continue reading
కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం
కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం డా .కామేశ్వరికి ట్రాన్స్ ఫర్ అయి విశాఖనుంచి హైదరాబాద్ వెళ్ళింది .తర్వాత ఆమెను మిలిటరీ సర్వీస్ లోకి తీసుకొన్నారు మద్రాస్ ,కలకత్తా ,జలంధర్ ,ఆర్మీలో పనిచేస్తూ 1970-74లో రూర్కీ లో మేజర్ అయింది .ఎక్కడ ఉద్యోగం లో ఉన్నా ఏడాదికో మాటు విశాఖ, గోదావరి లకు రావటం ‘’దువ్వూరి’నాన్న’’ ఉన్న … Continue reading
గౌతమీ మహాత్మ్యం-65 94-సరస్వతీ తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-65 94-సరస్వతీ తీర్ధం పుష్పోత్మటం తూర్పున ,గౌతమికి దక్షిణాన ‘’శుభ్రం ‘’అనే పర్వతం బాగా ప్రసిద్ధి చెందింది .దానిపై శాకల్యుడు అనే ముని తపస్సు చేస్తు౦డగా,సమస్త ప్రాణికోటి అతనిన్ని స్తుతిస్తూ ,నమస్కరి౦చేది . అక్కడే ‘’పరశువు ‘’అనే రాక్షసుడు కామ రూపియై బ్రాహ్మణ ,పులి ,స్త్రీ ,బాలరూపాలు ధరించి రోజూ శాకల్యముని తపో భంగం … Continue reading
కూతురుకాని కూతురే తల్లికాని తల్లి
కూతురుకాని కూతురే తల్లికాని తల్లికొన్ని బంధాలు తమాషాగా యేర్పడి శాశ్వత బంధాలౌతాయి .చిరస్మరణీయాలౌతాయి .మధుర భావ బంధురాలౌతాయి ..ఎన్నో జన్మల అనుబంధాలేమో అనిపిస్తాయి .ఆ బంధానికి రెండు వైపులవారి స్పందనలు మరింత బలీయమైతే ఇక వాటిని గురించి చెప్పటానికి మాటలే ఉండవు . .ఆనందాను నుభవమే అయి మనసునమల్లెలై విరబూసి దిగంత వ్యాప్త పరిమళీ భూతాలౌతాయి … Continue reading
‘నూక వప్పెచిమాః-క్రమాత్ ”
‘నూక వప్పెచిమాః-క్రమాత్ ” ఇదేమిటి తలా తోకా లేని శ్లోకం తెచ్చి హడల గొడుతున్నావని అనుకోకండి .”స్టేషన్సు బెబ0 శాఖాయా0 -నూ క్రా శ్యాది నిర్ణయహ ” అని -పూర్తిశ్లోకం శ్లోకం మొదటి పాదానికే కంపరమొస్తే శేషం యేమిటి స్వామీ అనకండి . దీనికో కధ ఉంది .చెబుతా వినండి సారీ చదవండి . దువ్వూరి … Continue reading
గౌతమీ మహాత్మ్యం-6392-కుశ తర్పణతీర్ధం
గౌతమీ మహాత్మ్యం-6392-కుశ తర్పణతీర్ధం ప్రణీతా సంగమ తీర్ధం అనే కుశ తర్పణ తీర్ధం భుక్తి ముక్తి దాయకం .వింధ్యపర్వత దక్షిణ భాగాన సహ్యపర్వతం ఉంది .దీనిపాదాలనుండి గోదా, భీమరథీ నదులుద్భవించినాయి. దగ్గరలో ఏకవీరా, విరజా నదులు కూడా ఉన్నాయి అని మొదలుపెట్టి బ్రహ్మ కొన్ని రహస్య విషయాలు చెప్పాడు నారదునికి .’’పరమపురుషుడు పరుడు .అవ్యక్తుడు … Continue reading
గౌతమీ మహాత్మ్యం-62–90—వంజారా సంగమ తీర్ధం
కద్రూ కొడుకులైన నాగులకు దాసుడుగా,తల్లి వినత చేసిన పందెం వలన ఉండాల్సి వచ్చి,భరించలేక ఏకాంతం లో దుఖిస్తూ ‘’ఇతరులకు సేవ చేయనివారు ధన్యులు ,పుణ్యాత్ములు .వారు తమ శరీరాలకు ప్రభువులై సుఖ,ఆనందాలు పొందుతారు .పరతంత్రులజీవితం దుర్భరం నీచం నింద్యం ‘’అని తల్లిని చేరి ‘’ఎవరి అపరాధం వలన నువ్వు దాసీ అయ్యావు ?కారణం చెప్పు ‘’అని ప్రార్ధించాడు .అరుణుని … Continue reading
గౌతమీ మహాత్మ్యం-61 88-కిష్కింధా తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-61 88-కిష్కింధా తీర్ధం శ్రీరాముడు కిష్కింధలోని సుగ్రీవ వానరసైన్య సాయంతో లంక ప్రవేశించి ,రావణాది సర్వ రాక్షస సంహారం చేసి ,సీతాదేవి తో సహా అందరితోకలిసి అయోధ్యకు పుష్పక విమానం లో బయల్దేరాడు ..దారిలో పరమపావని ,సంతాప నివారిణి గంగానదిని చూసి పులకించి హనుమంతాదులనలను పిలిచి – ‘’అస్యాః ప్రభావాద్ధరయో యాసౌ మామపితా ప్రభుః-సర్వ … Continue reading
ఇద్దరూ ఇద్దరే మహానుభావులు
ఇద్దరూ ఇద్దరే మహానుభావులు శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి స్వగ్రామం మసకపల్లి లో కాకర్లపూడి నరసరాజుగారు క్షత్రియ కుటుంబాలలో మర్యాద మన్నన మంచితమున్నవారు .దువ్వూరివారు పుట్టటానికి ఇరవై ఏళ్ళకు ముందే ఆ వూరు వదిలి వెళ్ళిపోయారు .శాస్త్రిగారు విజయనగరం కాలేజి లో పని చేస్తుండగా ,ఒకరోజు ఆయన స్నేహితుడు సొంఠి లక్ష్మీ నరసింహ శాస్త్రి … Continue reading
గౌతమీ మహాత్మ్యం-60 86-కలపిలాతీర్ధం
గౌతమీ మహాత్మ్యం-60 86-కలపిలాతీర్ధం అంగీరస తీర్ధం ,కపిలాతీర్ధం అనే ఈ తీర్ధం గౌతమికి దక్షిణాన ఉన్నది. దీనికే ఆదిత్య ,సైమ్హికేయ తీర్ధలని కూడా పేర్లున్నాయి .అన్గిరసులు ఇక్కడ యజ్ఞం చేసి ,ఆదిత్యులకకు భూమిని దక్షిణగా ఇచ్చారు .ఈ భూమి సై౦హిక అంటే సింహపుపిల్లలాగా జనుల్ని భక్షిస్తోంది .తర్వాత అన్గిరసులు తపస్సుకై వెళ్ళారు .జనం భయపడి అన్గిరసులవద్దకు … Continue reading
గౌతమీ మహాత్మ్యం-59 84-భావ తీర్థం
గౌతమీ మహాత్మ్యం-59 84-భావ తీర్థం భవుడు వెలసినదే భావతీర్దం..సర్వ ధర్మ పారంగతుడు ప్రాచీన బర్హి మూడున్నర కోట్ల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన సూర్య వంశ క్షత్రియ రాజు .వార్ధక్యం లో భార్యా ,పిల్లలు సమస్తం వదిలేస్తాననుకొన్నాడు .ప్రజలు ఆది వ్యాధులు లేకుండా సుభిక్షంగా ఉన్నారు .ఒక సారి పుత్రులకోసం గౌతమీ తీరం లో యజ్ఞం చేస్తే … Continue reading
అదో పాండిత్య రాజసం
అదో పాండిత్య రాజసం శ్రీ దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారు తెలుగువారే కాని ఎక్కడివారో తెలీదు .అత్తవారిది గోదావరి జిల్లా నేదు నూరు ప్రాంతం .బాగా చిన్నతనం లోనే కాశీకి భార్యతో సహా వెళ్లి స్థిరపడ్డారు .పిల్లా పీచూ జంజాటం లేని కుటుంబం .ఆ రోజుల్లో కాశీలో ఒక అలవాటు ఉండేది … Continue reading
గౌతమీ మహాత్మ్యం-5882-నిమ్న భేదతీర్ధం
పరమధార్మికుడు ఐలుడనే పురూరవరాజు ఊర్వశి ని చేబట్టి,కొద్దిగా నెయ్యిమాత్రమే తాగుతూ తపస్సు చేస్తుండగా ఊర్వశి వచ్చి అతడిని ఉద్రేకపరచి వివస్త్రుడుగా అయ్యాక ,ఆమె పాన్పు పై పడుకోగా అతడు పాన్పు చేరగా ,అతడు నియమోల్ల౦ఘన చేశాడని వెళ్ళిపోయింది ,అతడు నగ్నంగా కనిపించనంతవరకే అతని వద్ద ఉంటానని ఇదివరకే వారిద్దరిమధ్య ఒప్పందం ఉంది .తాను నగ్నంగా ఎందుకయ్యాడో … Continue reading
సర్వ స్వతంత్రులైన ఇద్దరు విశ్వనాథ శాస్త్రులు
శ్రీ పేరి కాశీనాథ శాస్త్రులుగారు అమాయకులు ,అత్మగౌరవ౦ అతి స్వతంత్రం ఉన్న మహా పండితులు .ప్రత్యేకించి ఆనాటి ప్రముఖ సంస్కృత పండితులుశ్రీ తాతా రాయుడు శాస్త్రి గారికి అల్లుడు కూడా .ఆంధ్రప్రదేశ్ పండిత రాజ్యానికి రాయుడు శాస్త్రిగారే ఆనాడు సార్వభౌములు .పండితులకు ఆయన యెంత చెబితే అంత .కాని అల్లుడికి మామగారంటే కంపరం .ఒకరకంగా ఇద్దరికీ … Continue reading
గౌతమీ మహాత్మ్యం-57 80-నారసింహ తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-57 గంగ ఉత్తర ఒడ్డునున్న నారసింహ తీర్ధం సర్వ రక్షాకం .హిరణ్య కశిపుడు బలపరాక్రమాలతో దేవతలను జయించి ,హరిభక్తుడైన తనకొడుకు ప్రహ్లాదునిపై ద్వేషం తో స్తంభం లో ఉంటె చూపించమంటే ,ఉన్నాడంటే, గదతో స్తంభాన్ని కొట్ట గా అందులోనుంచి శ్రీహరి నారసింహ రూపం లో ఉద్భవించి ,తన విశ్వాత్మను ఆవిష్కారం చేసి హిరణ్యకశిపుని గోళ్ళతో … Continue reading
చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన –
చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన – చిట్టి గూడూరు అంటే కృష్ణాజిల్లా బందరు దగ్గరున్న గ్రామం .ఆపేరు చెబితే శ్రీ మత్తిరుమల గుదిమెట్ల వరదా చార్యులు అంటే ఎస్ టి జి వరదా చార్యుల వారి పేరే ముందు జ్ఞాపకమొస్తుంది .కారణం అక్కడ సంస్కృత కళాశాల స్థాపించి కృష్ణా గుంటూరు జిల్లాల … Continue reading
గౌతమీ మహాత్మ్యం-56 78-అప్సరోయుగ సంగమ తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-56 78-అప్సరోయుగ సంగమ తీర్ధం గౌతమమీనదికి దాక్షిణాన ఉన్న ఈ తీర్ధం ముక్తిదాయకం .వంద్య స్త్రీ భర్తతో మూడు నెలలు ఇక్కడ స్నానం చేస్తే పుత్ర సంతానం ఖాయం .దీని విశేషాలను నారదునికి బ్రహ్మ చెప్పాడు .విశ్వామిత్ర వసిస్ట మహర్షి లమధ్య వైరం మొదటి నుంచి ఉంది .బ్రహ్మర్షి అవాలనే కోరికతో విశ్వామిత్రుడు గంగా … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -55 76-మార్కండేయ తీర్థం
గౌతమీ మాహాత్మ్యం -55 76-మార్కండేయ తీర్థం బ్రహ్మ దేవుడు నారదమహర్షికి మార్కండేయ తీర్ధ విశేషాలు తెలియ జేస్తున్నాడు .సర్వక్రతువులకు ఫలం ,సర్వ పాప పరిహారం చేసేది ఈ తీర్ధం .మార్కండేయ ,భరద్వాజ ,వసిష్ట ,అత్రి ,గౌతమ ,యాజ్ఞవల్క్య,జాబాలి మొదలైనమునులు మహా శాస్త్రవేత్తలు ,పురాణ న్యాయమీమాంస విషయాలలో పరిణత బుద్ధులు .ముక్తి విషయంలో ఎవరి అభిప్రాయం వారు … Continue reading
గాంధీజీ –ఆధునికత -6(చివరిభాగం ) కాపిటలిజం పై విమర్శ
గాంధీ కోరాడు .మొదటిది దోపిడీకి సంబంది౦చి౦ది..అధిక వస్తూత్పత్తి పై నాలుగు వాదాలున్నాయి .1-అధిక వస్తూత్పత్తి శ్రామికులను నిర్లక్ష్యం చేస్తుంది 2-మార్కెట్ మీద ఆధారపడుతు౦ది కనుక .మార్కెట్ లేనిదే అస్తిత్వం ఉండదు .అవసరమైనవారికి సరఫరా జరగదు 3-అధికోత్పత్తి అంటేమెషిన్ పై,అధికోత్పత్తిపై గుత్తాధిపత్యం .ఉత్పత్తి పరిశ్రమల యాజమాన్యం చేతిలోనే బందీ అవటం 4-అధికోత్పత్తి వినియోగదారులను ,ఉత్పత్తి ధోరణి లకు అలవాటు పడేట్లు … Continue reading
గాంధీజీ –ఆధునికత -5
గాంధీజీ –ఆధునికత -5 రీజన్ ,సైన్స్ లలో దాగి ఉన్న అవకాశాలను ,యూరప్ దేశాలలో యదార్ధంగా ఈ రెండిటి అమలు ల మధ్య విలక్షణత నుగాంధీజీ గమనించాడు .ఆధునికులు అని చెప్పుకోనేవాళ్ళు గాంధీని సంప్రదాయ౦ లోకి తోసేస్తే ,,నయా ఆధునికత వ్యతిరేకులు ఆయనను ఆధునికతను మొత్తం అపహాస్యం చేస్తున్నాడని ముద్ర వేయటానికి ఉవ్విళ్ళూ రారు . ఇటీవలి … Continue reading
గాంధీజీ –ఆధునికత -4
గాంధీజీ –ఆధునికత -4 గాంధీ హేతువు ,సైన్స్ లపై ఆధారమైన వాటిని నమ్మలేదు .అవి కొంతవరకే దారి చూపిస్తాయికాని పూర్తిగా కాదు అన్నాడు .ఈ రెండిటి వలన నైతికత ,మానవీయ గుణాలు దెబ్బతింటాయనిభావించాడు .ఆయుధాలన్నీ హేతువు, సైన్స్ జన్యాలే ,ఫలితాలే .సామూహిక హననం చేసే ఆయుధాలు అనైతికం .ఆయన దృష్టిలో నైతికత ఆధి భౌతికం(మెటాఫిజికల్ )కాదు.అది … Continue reading
గాంధీజీ –ఆధునికత -3
గాంధీజీ –ఆధునికత -3 వీటికి మించి ఆధునికత అంతమవటం లేక దాన్ని అధిగమించటం పై గాంధీజీ ఎలా చూశాడు ?ఇప్పుడున్న ఆధునికతను వెనక్కి మరల్చగలమా ?యా౦త్రికతపై ఆయన భావాలు సువిదితమే కాని ఒకసారి పునశ్చరణ చేసుకోవటం అవసరం .యంత్రానికి వ్యతిరేకత ,పరిశ్రమలకు వ్యతిరేకత ,యాంత్రికత పై విముఖత ,ఆధునికతపై వ్యతిరేకత మధ్య ఆయనభావాలున్నాయి .వీటిలో ఆయన … Continue reading
గాంధీజీ –ఆధునికత -2
గాంధీజీ –ఆధునికత -2 సంప్రదాయేతరుడికి ,లేక ఆధునిక వ్యతిరేకికి ఒకదానితో ఒకటి సమంధమున్న రెండు వ్యూహాలు సంప్రదాయ౦పాటించటానికి లేక ఆధునికతలో ఉండటానికి కనిపిస్తాయి .1-మేధోస్థాయిలో ఆధునిక భావజాలం ,విధానాల సంప్రదాయాదిక్యాన్ని గొప్పగా చెప్పుకోవటానికి పనికొస్తుంది .ఆధునికత చట్టబద్ధమైనదని ,సంప్రదాయం అలాకాదని కనుక అందులోని లోపాలను లక్ష్యపెట్టక గుడ్డిగా అనుకరించటం ,సంప్రదాయం అనుస్యూతంగా వచ్చిందని ,దీనికి సాక్ష్యాలు … Continue reading
గాంధీజీ –ఆధునికత
గాంధీజీ –ఆధునికత పాశ్చాత్య నాగరకతపై తరచుగా గాంధీజీ తీవ్రమైన విమర్శ చేసేవాడని అవి బాగా ప్రాచుర్యం చెందాయని మనకు తెలుసు .ఒకసారి వాటిని గుర్తు చేసుకొందాం .వాటిలోంచి సారభూతమైన విషయాన్ని తెలుసుకోవాలి .కాలనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన జీవిత కాలం చేసిన పోరాటం లో పాశ్చాత్య తపై, వారిపెత్తనం పై ఆయన చేసిన విమర్శలన్నీ ఒక … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -14(చివరిభాగం ) 14-నండూరు గుండమంత్రి
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -14(చివరిభాగం ) 14-నండూరు గుండమంత్రి 13వ శతాబ్ది వెలనాటి బ్రాహ్మణుడు నండూరు గుండమంత్రి వెలనాటి రాజేంద్ర చోడుడి మంత్రి .బాపట్లతాలూకా నండూరు వాసి .ఇతనికి శివలెంక మంచన కవి తన కేయూరబాహు చరిత్ర కావ్యం అంకితమిచ్చాడు .ఇతని తాత కు దాత గోవిందన వెలనాటి గొంక భూపతి మంత్రి … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -13 13-గోపాలుని నన్ని(న్న)య భట్టు
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -13 13-గోపాలుని నన్ని(న్న)య భట్టు 11వశతాబ్దికి చెందిన గోపాలుని నన్ని(న్న)య భట్టు రాజరాజేంద్ర నరేంద్రుని ముఖ్యామాత్యుడు ,ఆస్థానకవి .రాజేంద్ర చోళుడు కన్యాకుమారి వరకు దక్షిణ దేశం జయించి ,గొప్ప నౌకాబలంతో సింహళాన్ని వశపరచుకొని ,పశ్చిమ సముద్రం లోని 12వేల దీవులను ఆక్రమించి ,తూర్పునున్న’’ పెగు ‘’రాజ్యాన్ని ,నికోబార్ ,అండమాన్ దీవులతో సహా’’ శ్రీ … Continue reading
మలి సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’
మలి సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’ ‘’పంచనవతి వర్ష’’(95) యౌవనులు డా రాచకొండ నరసింహ శర్మగారు తమకున్న ఆంగ్లకవితాభిరుచికి దర్పణంగా తాను చదువుతున్నకాలంలో తనకు అత్యంత ప్రీతికరమైనఅ ఆంగ్ల కవితలను ఎంచుకొని , మరో ఆంగ్లకవితానువాద సంపుటిని సప్తతి(70) కవితల అనువాదంతో ఈ సెప్టెంబర్ లో ‘’మైదానం లో సూర్యోదయం ‘’గా … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -12 12-పింగళి మాదన్న మంత్రి
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -12 12-పింగళి మాదన్న మంత్రి నియోగిబ్రాహ్మణుడు భారద్వాజ గోత్రీకుడు పింగళి మాదన్న మంత్రి 17వ శతాబ్ది వాడు .తండ్రి భానోజి ,తల్లి భాగ్యమ్మ .చిన్నప్పుడే చదువు బాగా నేర్చి గోల్కొండకు వెళ్లి మీర్ జుమ్లా అనే ఉద్యోగి వద్ద నెలకు 10’’గిల్డరు’’ల జీతం తో గుమాస్తాగా చేరాడు.అన్న అక్కన్న కొంచెం తొందరపాటువాడు,కాని పండితుడు … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -11
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -11 11-రాయూరు యల్లన మంత్రి 12వ శతాబ్ది రాయూరి యల్లన మంత్రి కమ్మనాడు రాయూరు వాస్తవ్యుడు .ఆ పురం అపర అమరావతిగా వైభాగంలో ఉండేదని 1158అమరావతి శాసనం లో ఉన్నది –‘’శ్రీకాంతా నిలయంబు శిష్టజనతాసేవ్యంబు ,శాలీవనానీక ప్రాంత జలాశాయోద్గత లసన్నీరేజ శోభాన్వితం ‘’యల్లన మంత్రి ధిషణ బహుదొడ్డది అవటం వలన 13వ ఏటనే … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -10 10-నండూరు కొమ్మనమంత్రి
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -10 10-నండూరు కొమ్మనమంత్రి తూర్పు చాళుక్యులతర్వాట వేంగి దేశాన్ని వెలనాటి చోడులు 1016నుంచి 1161వరకుపాలించారు .వీరిశాసనాలలో పిఠాపుర శాసనం ముఖ్యమైనది .వీళ్ళను ధర్మరాజు సేవకుడైన ఇంద్ర సేనుడు దగ్గరనుంచి అందర్నీ శూద్రరాజులుగా భావించారు .వీరిది మధ్య ప్రదేశ్ లోని కీర్తిపురం .మల్లవర్మ తెగలో 5వ వాడు మొదటిమల్లవర్మ ‘’షట్సహస్ర దేశాన్ని … Continue reading






