వీక్షకులు
- 1,212,774 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -9 9-ఓరూరు అనంతయ్యమంత్రి
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -9 9-ఓరూరు అనంతయ్యమంత్రి 14వ శతాబ్దికి చెందినా ఓరూరు అనంతయ్యమంత్రిదక్షిణ దేశం లోని దండకారణ్యం దగ్గర దేవరకొండకు సమీపం లో ఓరూరుఅనే పల్లెలో నందవరీక నియోగి బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాడు .తండ్రి ‘’ఢాకరాజు’’.భార్య మేళాంబ.చౌదేశ్వారీ దేవి అనుగ్రహంతో వీరికి చిక్కప్ప పుట్టాడు .పుట్టిన కొద్దికాలానినే తండ్రి మరణం .అయిదేళ్ళ కొడుకును తీసుకొని … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -7(చివరిభాగం )
ఈ పోరాటాలలో గాంధి తన నిజాయితీని,వ్యక్తిత్వాన్ని ,సూటి మార్గాన్ని పారదర్శకంగా ప్రదర్శించి మెప్పు పొందాడు .ఆయన పోరాటం బాధితుల, అణగద్రొక్క బడిన వారి కన్నీరు, బాధలు దూరం చేయటానికే .ఇదే ఆయన ముఖ్య సూత్రం గా మారింది .అణగ ద్రొక్కేవారు అణగ ద్రొక్క బడే వారు సహకరించుకోకపోతే అణగద్రొక్కబడంటం అంత౦ కాదు అని విశ్వసి౦చాడు .ఇందులో … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -6
గాంధీ పై ఇండియాలో ప్రజాభిప్రాయం బాగా అనుకూలం గానే ఉంది. 1911 ఏప్రిల్ లో బోతా ప్రభుత్వ ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ జాన్ స్మట్స్ చివరికి గాంధీ సూత్రాలకు (ఫార్ములా ) ఉత్తరాలద్వారా సూత్రప్రాయంగా అంగీకరింఛగా ఇద్దరిమధ్యా తాత్కాలిక ఒప్పందం కూడా ఉత్తరాలద్వారానే కుదిరింది .28-4-1911న జోహాన్స్ బర్గ్ లో గాంధీ పబ్లిక్ మీటింగ్ లో … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -5
గాంధీజీ మహాత్ముడైన విధం -5 ఫోనిక్స్ పరిష్కారం ఈ సమయం లోనే గాంధీ స్నేహితుడు హెచ్ ఎస్ ఎల్ పొలాక్ వీడ్కోలు చెప్పటానికి వచ్చి జాన్ రస్కిన్ రాసిన ‘’అన్ టు ది లాస్ట్ ‘’పుస్తకం ఇచ్చి డర్బాన్ కు జరపబోయే 24 గంటల రైలు ప్రయాణం లో చదవమన్నాడు .అది చదివి విపరీతంగా ప్రభావితుడైనాడు .అందులోని … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -4
గాంధీజీ మహాత్ముడైన విధం -4 ప్రభుత్వాధికారులు నౌక ప్రయాణీకులను నిర్బంధించటం లో వచ్చే కష్టనష్టాలు ఆలోచించలేదు .పోర్ట్ కు చేరిన వేలాది తెల్లవారు తమ ఆందోళన సక్సెస్ అని సంబర పడ్డారు .ఇలా నౌకా నిర్బంధంలో భారతీయులను 23 రోజులుంచారు . వలస వాదులను భయపెట్టి దక్షణాఫ్రికాలో ప్రవేశించకుండా చేయవచ్చుననే వ్యూహమూ వాళ్ళ మనసులో ఉంది .తెల్లమూక … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -3
గాంధీజీ మహాత్ముడైన విధం -3 అబ్దుల్లాతో సహా అందరు గాంధీని ఇండియా పర్యటన వాయిదావేసుకోనమని కోరటం ఆయన మనసు మార్చి ఉండటానికి, వారికి రాబోయే బిల్లును వ్యతిరేకించే పోరాటం లో నాయకత్వం వహించటానికి అంగీకరించాడు .ఆ రోజు రాత్రే ప్రభుత్వానికి టెలిగ్రాం ఇచ్చి తన పర్యటన వాయిదాకుఏర్పాట్లు చేయమని కోరి ,శాసన సభ్యులకు బహిరంగ లేఖ ద్వారాకూడా … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -2 దక్షిణాఫ్రికా అనుభవాలు
గాంధీజీ మహాత్ముడైన విధం -2 దక్షిణాఫ్రికా అనుభవాలు దక్షిణాఫ్రికా డర్బాన్ లోని నటాల్ పోర్ట్ లో గాంధీ 1893మే లో ఒక వాణిజ్య సంస్థకు జూనియర్ కౌన్సెల్ గా వచ్చాడు .40వేల పౌ౦డ్ల సివిల్ కేసు కు టర్మ్ కాంటాక్ట్ పై వాదించటానికి వచ్చాడు .ఈ కేసు నటాల్ కు చెందిన అబ్దుల్లాకు, మ్త్రాన్స్ వాల్ కు … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం
గాంధీజీ మహాత్ముడైన విధం ’’ప్రజలతో నా ప్రత్యక్ష సంబంధం 1893లో దక్షిణాఫ్రికాలో కల్లోల పరిస్థితులలో ఏర్పడింది . .మానవుడిగా భారతీయునిగా నాకు హక్కులు లేవు అని మొదట గ్రహించాను .నేను భారతీయుడై న౦దు వలన నాకు కనీస మానవ హక్కులు కూడా లేవని బాగా అర్ధమైంది ‘’అన్నాడు గాంధీజీ . మహాత్ముడికి పబ్లిక్ తో సంబంధం … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -8 8-చుండి కాళయా మాత్యుడు
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -8 8-చుండి కాళయా మాత్యుడు 16వ శతాబ్దికి చెందిన చుండి కాళయామాత్యుడుఆర్వేల నియోగి ఆపస్తంభ సూత్రుడు ,కౌశిక గోత్రీకుడు చుండి రాజ్య ప్రధానమంత్రి .శివపూజా రతుడు .తల్లి సోమాంబ .తండ్రి రామమంత్రి . కాళయామాత్యుడు అదీంద్ర ధైర్యుడు ,స్వామి ద్రోహర గండ నవ సమీరబలుడు ,రుద్రాక్ష … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -7 వాణస కందన మంత్రి
-అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -7 7-వాణస కందన మంత్రి ఓరుగల్లు దగ్గర రామగిరి దుర్గాదీశుడు ముప్ప ధరణీపతి మహామాత్యుడు వాణస కందన మంత్రి .ఈయనకు ఆశ్రితుడు మడికి సి౦గన బహు గ్రంథ కర్త .సింగన కందనమంత్రిపేర’’నీతి తారావళి ‘’రాసినట్లు ఉందికాని అలభ్యం .సింగన పద్మపురాణం లో ‘’మంత్రం రక్షణ కళాచాతుర్య ,సాహిత్య గీత రసాస్వాదన లోకమానస సదా … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6 6-పసుదోవ పంపన భట్టు
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6 6-పసుదోవ పంపన భట్టు క్రీ శ 902లో వేంగిగిరాజ్యం లో పరాశర గోత్రుడు ,ఆర్వేల నియోగి ,వేద,వేదంగ ,మీమాంస శాస్త్ర పారంగతుడు పసుదోవ గ్రామంలో పంపనభట్టు జన్మించాడు .వాజ్మయ మహోదధిలో ఈదులాడినవాడు .షట్కర్మ నిరతుడు .తండ్రి కేశవ శర్మ సర్వ శాస్త్ర తత్వ విదుడు.తాత పంపన బ్రహ్మ తుల్యుడు .లక్ష్మీశ్వరం అనే … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5 రాయసము గోవింద దీక్షితులు
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5 5-రాయసము గోవింద దీక్షితులు చెవ్వప్ప నాయకుడు తంజావూరు పాలించేటప్పుడు 1521లో తనకొడుకు అచ్యుతప్ప నాయకునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు .వ్యవహార కుశాలుడవటం వలన పాలన తండ్రిదైనా అచ్యుతప్ప రాజకీయవ్యవహారాలన్నీ చూసి ‘’మహామండలేశ్వర ‘’బిరుదుపొందాడు.ఇతనికాలం ను౦చే,తంజావూరు రాజులు విజయనగర రాజులకు సామంతులుగా ఉండటం ప్రారంభమైంది .ఏడాదికి 40లక్షలకప్పం చెల్లిస్తూ ,యుద్ధం వస్తే తోడ్పడేవారు .ఇతనికాలం … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 తరిగొప్పుల దత్తన మంత్రి
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 4-తరిగొప్పుల దత్తన మంత్రి విజయనగర చక్రవర్తి వీరనరసింహరాయల ప్రధానమంత్రి తరిగొప్పుల దత్తన అని ‘’చంద్రభాను చరిత్ర ‘’లో ఉంది ‘’దత్తనమంత్రి మహా విపక్ష దుర్మద బల మర్మదాభరణ –దురంధర సంగర చాతురీ విశారాదుడగు వెంకట క్షితి పురందరునప్రతిమాన రాజ్య సంపదలు భరి౦పనాకు లిడు భ వ్యగతి శ్రితపారిజాతమై ‘’.వీరనరసింహుడు 1586నుంచి 1614వరకు పాలించాడు … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3 3-గోపరాజు రామయమంత్రి
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3 3-గోపరాజు రామయమంత్రి కాకతీయ గణపతి దేవుని మంత్రి గోపరాజు రామయమంత్రి .1166నుంచి 1290వరకు గణపతి దేవునికాలం కనుక 13వ శతాబ్దివాడు .ధరణికోట రాజధానిగా రాజుపాలించాడు .1193లో అధికారం లోకి వచ్చినట్లు చిలుకూరి వీరభద్రరావు గారన్నారు .త్రిపురాంతక శాసనం బట్టి 62ఏళ్ళు పాలించాడు .రాజధానిని ధరణికోటనుంచి ఓరుగల్లుకు మార్చి ,శివాలయాలు చెరువులు భవనాలు కట్టించాడు … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -2
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -2 2-చెల్లకి గంగాధర మంత్రి వేంగి దేశం లో చెల్లకి పురానికి చెందిన చెల్లకి గంగాధర మంత్రి మహామండలేశ్వరుడు రెండవ ప్రోలరాజు మహామాత్యుడు .12వ శతాబ్దివాడు .ఆరువేల నియోగి బ్రాహ్మణుడు .ప్రోలరాజు ఇతనిని మహామంత్రి ని చేసి ,’’యనుకొండ ‘’లో నివాసం ఏర్పాటు చేశాడు .కరీం నగర శాసనం లో ఇతని గురించి వివరంగా … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -1
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు శీర్షిక చూసి గాబరా పడకండి .రాజరిక వ్యవస్ధలో పేరుపొందిన గొప్ప తెలుగు మంత్రులు అనిభావం .మంత్రి, అమాత్య, ప్రెగ్గడ పర్యాయపదాలు .సరదాకోసం పై హెడ్డింగ్ పెట్టాను .తమ శేముషితో ,రాజుకు, రాజ్యానికి ,ప్రజలకు విశేష సేవలు అందించిన నాటి మంత్రి పుంగవులలో కొందరిని గురించి తెలియ జెప్పే ప్రయత్నమే ఇది . 1-రావుల … Continue reading
తెలుగులో మొదటి ప్రింటింగ్ -4(చివరిభాగం )
తెలుగులో మొదటి ప్రింటింగ్ -4(చివరిభాగం ) తెలుగులో ప్రింటింగ్ -2 తెలుగులో మొదటి కరపత్రాలు (ట్రాక్స్)1809,1810లలో ఇక్కడినుంచే వెలువడినాయి .మద్రాస్ బైబిల్ సొసైటీ కోసం ‘’ఓల్డ్ టెస్ట్ మెంట్ ‘’ను ‘’వైజాగపట్నం’’ అని ఆనాడు పిలువబడిన విశాఖ పట్నం నుంచే ముద్రించారు .అందులో ఒక వెర్షన్ ను విశాఖకు 1810లో వచ్చిన , జాన్ గార్డెన్ ,1812లో వచ్చిన … Continue reading
తెలుగులో మొదటి ప్రింటింగ్ -3
తెలుగులో మొదటి ప్రింటింగ్ -3 తెలుగులో ప్రింటింగ్ తెలుగు వార్తాపత్రికల క్రమాభి వృద్ధి తెలుసుకోవాలంటే తెలుగులో ప్రింటింగ్ ఎలా ప్రారంభమైందో తెలియాలి .ముందే చెప్పినట్లు ఈస్ట్ ఇందియాకంపెనీ మిషనరీలు తమ పాలన సక్రమంగా జరగటానికి ఉద్యోగులకు స్థానిక భాషలు నేర్చుకోనేట్లు చేశారు .భాషాజ్ఞానం క్రమాభి వృద్ధితోపాటు ప్రింటింగ్ విధానమూ అమలు పరచారు .డేనిష్ మిషనరీ బెంజమిన్ షుల్త్జ్ … Continue reading
తెలుగులో మొదటి ప్రింటింగ్ -2 ఇండియాలో ప్రింటింగ్
తెలుగులో మొదటి ప్రింటింగ్ -2 ఇండియాలో ప్రింటింగ్ దైవవాక్య వ్యాప్తికి ఇండియాలో క్రిస్టియన్ మిషనరీ ప్రవేశించింది .దీనికి బైబిల్ మొదలైన వారి మతగ్రంధాలు బాగా అవసరమయ్యాయి .వారు స్థానిక భాషలు నేరుస్తూ నిఘంటువులు ,వ్యాకరణాలు రాశారు .తర్వాత కాలనీ ప్రభుత్వం సామ్రాజ్య విస్తరణకోసం ప్రవేశించింది .సివిల్ ఉద్యోగులు సమర్ధ పరిపాలనకు స్థానిక భాషలు నేర్వాల్సి వచ్చింది .వీరికీ … Continue reading
తెలుగులో మొదటి ప్రింటింగ్
గురించి తెలుసుకోవాలంటే అసలు అచ్చు యంత్రం చరిత్ర ముందు తెలియాలి .ఆధునిక రవాణా సౌకర్యాలు అంటే రైల్వే ,పోస్ట్ ,టెలిగ్రాఫ్ ,టెలీ కమ్యూని కేషన్లు లేనికాలం లో భారత దేశం లో వార్తలు ఎలా ఒకచోటునుండి మరో చోటుకు చేరేవో తెలుసుకొంటే ఆశ్చర్యంగా ఉంటుంది . క్రీ.పూ.మూడవ శతాబ్దం లో పాలించిన మౌర్య సామ్రాధీశుడుడు … Continue reading
కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4
కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4 తాతగారివద్ద సంస్కృతం ప్రారంభించిన నాలుగు నెలలకు కొడుకు ఎలా ఉన్నాడో చూడటానికి దువ్వూరివారి తండ్రి వచ్చారుకాని ,కొడుకును పలక రించనే లేదు . తలిదంద్రులతో తమ్ముడు మరదలుతో మాట్లాడుతుండగా ఈయన వినటమే .వచ్చిన 10గంటలతర్వాత ‘’ఒరేయ్ ‘’అని కేకేసి పెరట్లో ‘’మామ్మా, తాత నిన్ను కోపపడటం … Continue reading
కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3
కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3 దువ్వూరి వారిఊరంతా గోదావరి’’ విరుపు ‘’కి గోదారిలో పడిపోయింది .ఈయనున్నప్పటి ఊరు అంటే 1910లో రెండో ఊరు .ఇదీ మరో పదేళ్ళ తర్వాత నదీ గర్భం లోచేరింది .తర్వాత ఉన్నది మూడవవూరు .నది ఒడ్డు విరుపులలో వీరి భూములన్నీ గౌతమీ గర్భాన చేరాయి .1910కి వీరికి … Continue reading
కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -2
కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -2 బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు 11ఏళ్ళ వయసువరకు తాళ్ళూరు,జగ్గం పేటలలో ,12,13వయసులో స్వగ్రామం మసకపల్లి (మసక తొలగించి వెలుతురు ని౦పటానికేమో ?)14దాక్షారామ ,15,16కొంకుదురు ,పిఠాపురం ,17-23దాకా ‘’ విజీ’’ నగరం ,24-కొవ్వూరు ,25-43వరకు కృష్ణాజిల్లా చిట్టి గూడూరు ,44లో విశాఖ ,45-48 గుంటూరు ,49-70దాకా వాల్తేరు … Continue reading
కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర
కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు తమ జీవిత చరిత్రను అప్పటిదాకా బోధించిన ,రచించిన గ్రాంధిక భాషలో కాక, బాణీ మార్చి,వ్యావహారిక తెలుగులో హృద్యంగా రసవద్యంగా ,కమనీయంగా ,ఆయనే చిన్నయసూరి బాలవ్యాకరణానికి రాసిన ‘’రమణీయం ‘’గా ముగ్ధ మనోహరం గా ఉంది .ఎన్ని సార్లు చదివినా తనివి తీరని తేట తెలుగు గోదావరి … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 503-అంతర్ధ్వని కావ్యకర్త –ప్రభునాథ ద్వివేది (1947)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 503-అంతర్ధ్వని కావ్యకర్త –ప్రభునాథ ద్వివేది (1947) 25-8-1947న యుపి లో మీర్జాపూర్ జిల్లా భైంసా లో జన్మించిన ప్రభునాథ ద్వివేది ఎంఏ,పిహెచ్ డి.కాశీ విద్యాపీఠంలో సంస్కృత ప్రొఫెసర్ .27గ్రంథాలు రాశాడు .అందులో అంతర్ధ్వని కావ్య౦,శ్రీరామానంద చరిత్రం ,స్వేతదూర్వా ,కథా కౌముది ,మహాకవి హర్షవర్ధన ఉన్నాయి .సంస్కృత మహామహోపాధ్యాయ ,బాణభట్టపురస్కారం ,విక్రమ కాళిదాస … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 502-మమ జనని కర్త – రమా కాంత శుక్లా (1940)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 502-మమ జనని కర్త – రమా కాంత శుక్లా (1940) ఉత్తర ప్రదేశ్ ఖున్జా సిటిలో 24-12-1940 అంటే క్రిస్మస్ ఈవ్ నాడు జన్మించిన రమాకాంత శుక్లా ,తల్లి తండ్రిసాహిత్యాచార్య బ్రహ్మానంద శుక్లా ,,ప్రియం వదశుక్లాల వద్ద సంస్కృతం అభ్యసించి ,సాహిత్య ఆచార్య ,సాంఖ్యయోగాచార్య డిగ్రీలు పొందాడు .ఆగ్రా యూనివర్సిటిలో … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 501- వేమన శతకాన్ని సంస్కృతీకరించిన –ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్ (1921)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 501- వేమన శతకాన్ని సంస్కృతీకరించిన –ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్ (1921) ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్21-6-1921తమిళనాడులో జన్మించాడు సంస్కృత తమిళ ఆంగ్లభాషలలో నిష్ణాతుడైన పండితకవి .లెక్చరర్ గా చేరి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాడు .ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ ,దేశికన్ ప్రతిభా పాండిత్యాలు గుర్తించి ,రాష్ట్రప్రభుత్వ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 496-శాంతి స్తోత్రం ఏవం మహా ప్రయాణ కావ్యకర్త –కపిల్ దేవ్ ద్వివేది (1919)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 496-శాంతి స్తోత్రం ఏవం మహా ప్రయాణ కావ్యకర్త –కపిల్ దేవ్ ద్వివేది (1919) 16-12-1919లేక 6-12-1918 జన్మించిన కపిల్ దేవ్ ద్వివేది ఉత్తరప్రదేశ్ గాజీపూర్ వాసి .భాదోహి విశ్వభారతి రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ ,గురుకుల మహావిద్యాలయ వైస్ చాన్సలర్ .చేదిప్రసాద్ డా హరిదత్త శాస్త్రి గురువులు.శాంతిస్తోత్రం ఏవం మహాప్రయాణం … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 488-ప్రాచ్య శిక్షా దర్శన కర్త –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1966)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 488-ప్రాచ్య శిక్షా దర్శన కర్త –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1966) 2-7-1966 న ఉత్తరప్రదేశ్ జాన్పూర్ లో జన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ లక్నోలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ సంస్కృత రీడర్ ఆచార్య ,శిక్షా చార్య కూడా .డా.మండన మిశ్ర ప్రొఫెసర్ ఎస్ .డి .వాసిష్ట లు గురువులు . ప్రాచ్య … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 487-షిరిడి సాయిబాబా సహస్ర నామ స్తోత్ర కర్త –సిద్ధగురు శ్రీ రామణానంద మహర్షి(1964)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 487-షిరిడి సాయిబాబా సహస్ర నామ స్తోత్ర కర్త –సిద్ధగురు శ్రీ రామణానంద మహర్షి(1964) ఆర్య వైశ్య కులం లో పడగ శీల గోత్రం లో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళ లో 1964లో జన్మించిన శ్రీ రమణా౦ద మహర్షి విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో బి టెక్ చదివి ఉత్తీర్ణులయ్యారు … Continue reading
శాంతిపత్రంమీద సంతకం చేసిన చెయ్యి” **కొంపెల్ల శర్మ
“శాంతిపత్రంమీద సంతకం చేసిన చెయ్యి” **కొంపెల్ల శర్మ ఏల్చూరి సుబ్రహ్మణ్యం – శతజయంతి – ప్రారంభం ఆగష్టు 26, 1920 – ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్య అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో నయాగరా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒక్కరు ఏల్చూరి సుబ్రహ్మణ్యం ( జ:ఆగష్టు 26, 1920 – మ:ఫిబ్రవరి … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 14
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 14 విత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-3(చివరిభాగం ) రామకృష్ణయ్య గారు చూపిన దారిలో వెళ్ళిన తర్వాతివారు ఆశ్చర్యకర విషయాలు చాలా గ్రహించి తెలియజేశారు .ఉత్పల,చంపక మాలలను కన్నడం నుంచి ఎలా నన్నయగారు తీసుకొన్నారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది .కన్నడ ఉత్పలమాల –‘’వ్యాసమునీంద్ర రుంద్ర వచనామృత వాగనీసు వె౦కవి … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-2
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-2 కవుల చరిత్రలతో మొదలైన తెలుగు సాహిత్య పునర్నిర్మాణ ఉద్యమం ఈ దశ వరకు తెలుగు సాహిత్య స్వరూపాన్నే ముట్టుకోలేదు .ఇక్కడే శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారి కీలక స్థానం ఆవిష్కృతం అయింది అన్నాడు శేషేంద్ర .అప్పటికి పోగు చేసిన కవుల … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-1
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-1 ఆంద్ర సాహిత్య మహాపురుషులలో అగ్రస్థానం అలంకరించినవారు శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారు .వారి ఆంధ్రభారత కవితా విమర్శన గ్రంథం కవిత్రయ దర్శనానికి కరదీపిక అన్నారు గుంటూరు శేషేంద్ర శర్మ .ఆయన ప్రాముఖ్యం స్పష్టం కావటానికి ఆంద్ర సాహిత్య … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -6(చివరిభాగం )
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -6(చివరిభాగం ) కలిపూర్వం 35క్రోధి సంవత్సర జ్యేష్ట శుద్ధ విదియకు విజయ సారధికి 91నిండాయి పరీక్షిత్తు జన్మించాడు .ఆశ్వత్ధామ అస్త్రాలనుంచి గర్భం లో ఉన్న పరీక్షిత్ ను కృష్ణ పరమాత్మ సంరక్షించాడు .34విశ్వావసు చైత్ర పౌర్ణమికి శరత్ చంద్ర చంద్రునికి 92నిండి ,ధర్మరాజు వ్యాసాజ్ఞాతో అశ్వమేధం … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -5
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -5 కలిపూర్వం 49 వికృతి సంవత్సర చైత్ర శుక్లానికి చైతన్య వరడుడికి 77ఏళ్ళు నిండాయి .ధర్మరాజు రాజసూయ యాగం చేయటం, శిశుపాలుడి నూరు తప్పులు సైచి,101వ తప్పుకు శిక్షగా కృష్ణస్వామి చక్రం తో సంహరించటం ,భీష్మ పితామహుని సలహా పై ధర్మరాజు శిఖిపింఛమౌళికి అగ్రానాధిపత్యం ఇచ్చిపూజించటం … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -4
కలిపూర్వం 64యువ సంవత్సరం లో సత్యాపతికి 62ఏళ్ళు ,63ధాతలో63,62ఈశ్వరలో 64 నిండాయి .కృష్ణార్జునులు యమునా నదీ తీర విహారం చేసి ,అగ్ని దేవుడు ప్రత్యక్షమై ,గాండీవం ,అక్షయ తూణీరాలు ,స్వేతాశ్వ రధం ప్రసాదించి ‘’గాండీవి’’ ని చేసి ,అగ్ని కోరికపై ఖాండవ వన దహనం చేసి ప్రీతి చెందించి, ఈదహనం నుంచి తనను కాపాడిన క్రీడికి … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -3
కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -3 కలిపూర్వం 89సాధారణ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమికి ముచికు౦దవరదునికి 37సంవత్సరాల వయసు పూర్తయి జాంబవతి కృష్ణులకు వివాహం ,శ్యమంతకోపాఖ్యానం సత్యా కృష్ణుల పెళ్లి జరిగినాయి .ఏకచక్రపురం లో పాండవులఅజ్ఞాత౦ 7ఏళ్ళు పూర్తయ్యాయి .88విరోదిక్ కృత్ లో మాధవుడికి 38నిండి ,రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు పుట్టాడు … Continue reading
గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం ) గుంటూరు జిల్లా నల్లపాడ స్వగ్రామమైన శ్రీదెందుకూరి దుర్గాప్రసాద్ శ్రీరామ మూర్తి వరలక్ష్మి దంపతులకు జన్మించారు విద్వద్వంశం .వేదపండితులకు ప్రసిద్ధి .,తండ్రి గొప్ప హరికథకులు,నటులు ,దేశ భక్తి పరాయణులు … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -2
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -2 కలిపూర్వం 109 వికృతి సంవత్సర శ్రావణ బహుళాస్టమికి కృష్ణమూర్తికి 17 ఏళ్ళు నిండాయి .గర్గాచార్యుల చేత బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారం జరిగి ,బ్రహ్మచారులై గురు శుశ్రూష చేసి ,కాశీ లో ఉన్న సా౦దీపమహర్షి వద్ద గురుకులవాసం లో ధనుర్వేద ,ఉపనిషత్ విద్య నేర్చి ,గురు … Continue reading
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ
శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ గడచిన ద్వాపర యుగం చివర 126 సంవత్సరాలు మిగిలి ఉండగా శ్రీముఖ నామ సంవత్సర శ్రావణ బహుల అష్టమి అర్ధరాత్రి వృషభ లగ్నం లో మధురానగరం లో శ్రీ కృష్ణుడు జన్మించాడని భాగవతం లోనూ ,విజయనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి మంగళవారం రోహిణీ … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 12 తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 12 తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో తెలుగులో నన్నయ ఆదికవి .అంటే మహాభారతం వంటి ప్రౌఢరచన చేసినకవి .అలాగే తమిళం లో ఇలంగో ‘’శిలప్పదికారం ‘’అనే కావ్యం రాసి తమిళ సాహిత్య నిర్మాత అయ్యాడు .రాజపుత్రుడే అయినా రాజ్యం చేయకుండా జైన సన్యాసి యై ‘’ఇలంగో అడిగళ్’’అయ్యాడు .అడిగళ్ అంటే … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 11 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -2(చివరిభాగం )
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 11 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -2(చివరిభాగం ) ఆధునికకాలం లో వేదాంత గ్రంథ రచనలతో సంస్కృత భాషా సేవ చేసినవారిలో గుంటూరుజిల్లా పమిడిపాలెం ఆగ్రహారానికి చెందిన శ్రీ బెల్లంకొండ రామారావు గారొకరు .బాల్యం నుంచి హయగ్రీవ ఆరాధకులైన ఈయన భగవద్గీతా శంకర భాష్యం పై ‘’భాష్యార్ధ ప్రకాశం ‘’అనే … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 10 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -1
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 10 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -1 భారతీయ మహర్షుల ఆంతరంగిక తాత్విక విచారణం వలన వేదాలకు శిరో భూతాలైన ఉపనిషత్తులు అందులోని రహస్య విజ్ఞానం బయటకొచ్చింది .కాని ఆత్మజ్ఞానం అందరికి అర్ధంకాదు .ప్రత్యక్షం నే ప్రమాణంగా భావించి చార్వాకులు, సర్వం క్షణికం ,శూన్యం అనే బౌద్ధులు సామాన్యజనాలను … Continue reading
భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం –
భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం – శ్రీ కృష్ణుని జీవితాన్నిబట్టి చూస్తె భారతం కంటే ముందే భాగవతం వ్యాసులవారు రచించినట్లు ,కృష్ణబాల్య, కౌమార క్రీడలన్నీ భాగవతం లోనే ఉన్నాయి .భారతం లో కృష్ణుని ఉత్తర జీవిత వర్ణన ఉంది .అయినా భాగవత పీఠికలోభారతం తర్వాతే … Continue reading






