ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5
సరస్వతీ గ్రంధమాల సంపాదకులు –కాకరాపర్తి సత్యనారాయణ మూర్తి -19-20శతాబ్ది 1892లో కాకరపర్రు లో సరస్వతీ గ్రంధమాల స్థాపించగా మూర్తిగారు సంపాదకులు .’’పీష్వా నారాయణ రావు వధ’’13భాగాలురాసి ముద్రించారు .35ఏళ్ళు సంస్థను పోషించి 50పుస్తకాలు ముద్రించారు .
పురాణపండ గౌరీపతి శాస్త్రి -19-20శతాబ్ది –బ్రహ్మ సూత్రభాష్య ప్రవచనం లో దిట్ట .మంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలు తెలుసు .ఒక సారి వీధి అరుగు మీద కూర్చున్నప్పుడు జిల్లా కలెక్టర్ వీరిని చూడటానికి వచ్చి ఇంగ్లీష్ లో ప్రశ్నలడిగితే అర్ధం చేసుకొని ,అన్నిటికీ తెలుగులో చెప్పటం కలెక్టర్ అర్ధం చేసుకోవటం ఇప్పటికీ జనం చెప్పుకొంటారు .ప్రతి ఆదివారం కలెక్టర్ పెరవలి బంగ్లాలో శాస్త్రిగారు కలెక్టర్కు బ్రహ్మ సూత్రా భాష్యం బోధించారు .ఆయన ప్రజ్ఞ ను నవద్వీపం లో చదువు వుకున్నారని అందరూ పొరబాటు గా అభిప్రాయ పడేవారట .
సత్కవిరాట్-వేదుల రామ శాస్త్రి -19-20వ శతాబ్ది – అప్పకవీయ వివరణ,కా౦చీపతి ,చిత్ర శతకం రాశారు .శ్రీ ఏలూరి పాటి అనంతరామయ్య ,అమరం రాజేశ్వర శర్మ ,వడ్లమూడి గోపాల కృష్ణమూర్తి వారణాసి గంగాధర శాస్త్రి , ,శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రులు, అవధాన శిరోమణి రావూరి వెంకటేశ్వర్లు వంటి మహా మహులకు గురువు.
వేదుల వేంకట శాస్త్రి -19-20-శతాబ్ది సుబ్బారాయుడు ,లక్ష్మమ్మలకుమారుడు కాశీలో తర్కవ్యాకరణాలు నేర్చారు .నిత్యాగ్ని హోత్రమే కాక వ్యవసాయం కూడా చేసేవారు .ఎందరికో ఉచిత భోజన వసతి కల్పించి విద్యా నేర్పారు .అగ్నిహోత్రం చేయనిదే అన్నపానాలు ముట్టేవారుకాడు. కుమారుల వివాహ సమయాలలోనూ అంతే.
వేదుల రామ చంద్ర శాస్త్రి -19-20శతాబ్ది –వేంకటాధ్వరి రచన ‘’లక్ష్మీ సహస్ర కావ్యం ‘’కు వ్యాఖ్యరాసిన మహా పండితుడు దీన్ని వేదుల సూర్యనారాయణ శర్మ ఆంధ్రీకరించారు
దానకర్ణ –సుందర రామయ శాస్త్రి -19-20శతాబ్ది –వల్లూరిపల్లిలో మందేశ్వరాలయనిర్మాత సత్రం కూడా కట్టారు ఆయన దాతృత్వ విషయాలు ఇప్పటికీ అక్కడ చెవుల్లోగింగురులు పెడుతూనే ఉంటుందట .
మహా మనీషి –చర్ల నారాయణ శాస్త్రి -1881-1939-చర్ల బ్రహ్మయ్యగారి వంశీకులు జనార్దన శాస్త్రి ,వెంకమ్మగార్ల తనయుడు .తాత కామశాస్త్రి సంస్కృతాంధ్ర నిధి .ఈయన సంస్కృత ఆంద్ర వేద,వేదంగ తర్క వ్యాకరణ అలంకార శాస్త్రాలో లోతు ముట్టినవారు .శిష్యకోటి విపరీతం పితాపుర విద్వత్కవులు వెంకట రామ కృష్ణ జంట కవులకు సాహిత్య గురువులు.అందులో వేదుల రామకృష్ణశాస్త్రి ముఖ్య శిష్యుడు .స్వతంత్ర జీవులు.ఆగ్రామం వదిలి ఎక్కడికీ కొలువుకు వెళ్ళలేదు .పిఠాపురం రాజావారి ‘’సూర్యరాయాంధ్ర నిఘంటువు కు పండితాదికారి .వీరి మహాభారత మీమాంస 5భాగాలు లు ఆధ్రులకు గొప్ప వరం.ఎన్నెన్నో విషయాలు మనకు తెలియనివి అందులో లభిస్తాయి .దీనికి మూలం మరాఠీ లోని రావుబహదూర్ చింతామణి వైద్య రాసిన ‘’ఉపసంహార్ ‘’కు హిందీలో మాధవరావు సప్రే అనువాదం శాస్త్రిగారు తెలుగు చేశారు . నా అదృష్టవశాత్తు సుమారు 30ఏళ్ళ క్రితం హైదరాబాద్ అసెంబ్లీహాల్ ముందు చర్ల సిస్టర్స్ రోడ్డు మీద పెట్టి సగం రేటు కే అమ్ముతుంటే సరస్వతీ ప్రసాదంగా కొని చదివిన అదృష్ట వంతుడిని . సంస్కృత మహిష శతకాన్ని తెలుగులోకి అదేపేరుతో అనువదించారు .5 అంకాల భర్తృహరి నిర్వేదం నాటకం ను సంస్కృతం లో హరిహర కవి రాసినదానికి అనువాదం చేశారు నన్నయ సంస్కృతాంధ్ర ‘’ఆంద్ర శబ్ద చింతామణి ,అధర్వణుడి ‘’అధర్వణ కారిక లకు ఇది తెలుగు పద్యానువాదం. వృషభ శతకం ,కావ్యాదర్శం ,నీలకంఠ విజయ చంపు ఇతర రచనలు .ఒక బ్రాహ్మణేతరుడు సంస్కృతం నేర్వటానికి వీరిదగ్గరకొస్తే ,వ ఊరివారు అభ్యంతం చెబితే ,శిష్యుడు వేదుల రామ శాస్త్రి తో చెప్పించిన సంస్కారి .తణుకు నారాయణభట్టు అస్పృశ్యతా నివారణ సంఘం అధ్యక్షులుగా చేశారు .1920లోనే పంచములు కూడా మనుషులే అని అయిదు రోజులపాటు సభ నిర్వహించారు .స్వాతంత్ర్యం పై లెక్కలేనన్ని ఉపన్యాసాలిచ్చి ఉద్యమ స్పూర్తి కల్గించారు .గాంధేయవాదిగా చిరకీర్తి పొందారు నారాయణ శాస్త్రిగారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-20-ఉయ్యూరు