అలుపెరుగని హాలికుడా
నిరుపమానలేఖకుడా
తరతరాల బాంధవుడా
ఆంజనేయ సేవకుడా
సరసభారతీప్రియుడా
నవరసకవి శేఖరుడా
గబ్బిటదుర్గాప్రసాదసమ్యగ్వరుడా
అభినందనలివిగ్రహింపుమోయిగురుండా!!
నమస్కారం .
sastry S.R.S. రాజమండ్రి నుండి మీ అడ్రస్ పంపారు. అయన నా సీనియర్ .
మీరు రచియించిన ఆధునిక ఆంధ్ర శాస్త్ర మణి రత్నాలు పుస్తకం చూసాను.
ఈ దౌర్భాగ్యము ఇంత గొప్ప వారి గురించి ఆ సబ్జక్ట్ లో Ph.D పొందిన వారికీ కూడా తెలియక పోవటం . మిగతా రాష్ట్రాల వారికీ తెలియక పోవటం క్షమార్హం కాదు . తెలుగు రాష్ట్రాల వారికీ తెలియక పోవటం దుర్మార్గము .
ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి అంత ప్రచారము జరిగినా తెలియదు, ఇక కొలచల వారి గురించి ఎలా తెలుస్తుంది!
ఈ పుస్తకాన్ని గవర్మెంట్ వారు నాన్ -డిటైల్డ్ text లాగా పెట్ట టానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి? నాకు తెలిసిన పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నం చేస్తాను.
నాకు కాపీలు కావాలి. కొన్ని స్కూళ్లలో ప్రెసెంట్ చేస్తాను . ఎంత, ఎలా payment చెయ్యాలి వివరాలు తెలుప గలరు.
Dr.M.Bapuji