13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత
నా వీక్షణానికి రోజా నవ్వలేకపోతోంది
నా మాటల సంగీతానికి పుష్పాలు
వికసి౦చ లేకపోతున్నాయ్ .
తాజాదనమున్న హారపు నవ్వులేని
ప్రదర్శనకు వెళ్లి ఏం ప్రయోజనం ?
చీకటి రాత్రి ఆమె దువ్వుకోని తలతో
ఒక్క క్షణమైనా చందమామను చూడకపోతే?
దక్షిణానిలం వసంతాలు తెచ్చినా
తోటలోని కోయిల కలకూజితం చేయటం లేదు
అడవి పూలు జాబిలిని చూసి నాట్యమాడటం లేదు
ఏదో కోల్పోయాను, ఏదో తప్పిపోయింది
నా హృదయం శూన్యమై ముసలిదైంది
ఓహో ఆ క్రూర స్పర్శ తో నా గుండె
అన౦ద సంతోషాలు లేక చల్లబడి పోయిందా?
ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు –కబీర్ చౌదరి ఆంగ్లానువాదం .
14-ఒంటరిగా –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత
నా కళ్ళు క్షమాపణకు వెళ్ళలేదు
అలాగే నా మనసుకూడా .
వద్దని కాని, ఏడవటం కాని చేయలేదు .
శతాబ్దాలుగా నేను రోడ్డు ప్రక్క నిలబడి
నీ కోసం ఎదురు చూస్తున్నాను .
కన్నీటి జలాశయం నుంచి
నీరు ధారాపాతంగా కారుతున్నా
కళ్ళు తుడుచుకొనే శ్రద్ధకూడా లేదు.
అందరి మధ్య ఒంటరి వాడి నైపోయాను
అందుకే నిన్నుచూడాలన్న తహతహ
మృత్యువుకూడా నిన్ను ఆపి
గణన లోకి తీసుకోలేదు .
ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవిత ‘’నోయోన్ జే మోర్’’కు ‘’మొహమ్మద్ నూరుల్ హుదా ఆంగ్లాను వాదం .
సశేషం
దక్షిణాయన పుణ్యకాల శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-20-ఉయ్యూరు

