డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -6
నాగుల్ని భయపెట్టిన గరుడ రేఖ, పామును నిలబెట్టిన పిల్లి
రామచంద్రగారి తాతగారు శిదిలమౌతున్న పాత ఇంటిని కూల్చి కొత్తది కట్టించటానికి కలపకొని ఒకగదిలో పెట్టారు .అదంతా అరణ్య ప్రదేశం కనుక పాములెక్కువ .ఒకరోజు నాగుపాము పిల్ల వీరంతా అన్నాలు తింటుండగా వంటింట్లోకి వచ్చింది .అన్నం ముందు నుంచి లేవకూదదని కట్టడి ఉండేది .ఈయన బాబాయి ‘ఎప్పుడూ ’నా చేతిలో గరుడ రేఖ ఉంది .నేను చేయెత్తి అరచెయ్యి చూపితే యెంత పెద్దపామైనా ఆగిపోతుంది ‘’అని చెప్పేవాడు .వచ్చింది నాగుబాము కనుక చంపరాదనే నియమం ఉండేది అప్పుడు .చంపితే దాని నోట్లో బంగారు నాణెం పెట్టిదహనం చేయాలి .బంగారు ఖరీదుకనుక ప్రత్యామ్నాయంగా రాగిలో బంగారం ఉంటు౦ది కనుక రాగి నాణెం పెట్టి కాల్చేవారు .బాబాయిని గరుడ రేఖతో ఆ పాముపిల్లనుఆపలేవా అని అడిగాడు .వెంటనే అరచేయి చాచి పడగలాగా విప్పి ఆపామువైపు చూశాడు .అది తోకముడిచి వెనక్కి వెళ్లి కలపలో దాక్కుంది .
ఒక రోజు రామచంద్ర అమ్మగారు చెరువు నీటికి వెళ్ళింది .ఈయనకు ఆరేళ్ళు చెల్లెలుకి మూడు తమ్ముడికి ఏడాది వయసు .అమ్మవచ్చేదాక వీళ్ళిద్దర్నీ ఆడించే బాధ్యత ఈయనదే .ఒకరోజు చెల్లెలు పెద్దపిల్లీ చిన్నపిల్లీ ఆడుకొంటున్నాయని చెబితే లోపలి వెళ్లి చూడగా ఇంట్లోని వంటతూము మూయకపోవటం వలన అందులోంచి పెద్ద నాగపాము లోపలికొచ్చి పడగా విప్పి నిటారుగా ఉన్నది .దానికి నాలుగడుగుల దూరం లో ఇంట్లోనిపెద్ద పిల్లి పంజా విసిరి దాన్ని కొట్టటానికి సిద్ధంగా ఉంది .తమ్ముడు ఈరెంటినీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈయనకు కేక వేసే ధైర్యం లేకపోయింది .వాడిని లాగేద్దామంటే పాము వెటపడుతుందనే భయం .పిల్లి పంజాకు పాము భయపడుతుందట .పడగకు దెబ్బతగిలితే పాము సగం చచ్చినట్లే నట.భయం ,ఏడుపూ ముంచుకొచ్చాయి ఈయనకు .ఏం చేయటానికీ తోచక తల్లి నేర్పిన ‘’పంచ్చాయుధ స్తోత్రం ‘’రెండు శ్లోకాలు ,ఫలశ్రుతి చదవటం మొదలెట్టారు .ఆ కంగారులో మిగిలినవి గుర్తుకు రాలేదు .వంటింట్లో కనుక బయటివారిని పిలువకూడదు .
ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చింది .ఆమె నీటి బిందెలు దింపి వచ్చి చూసి స్థాణువై నిలబడిపోయింది .ఈయన్ను పక్కకు తోసేసి ,పిల్లాడికాలు పట్టుకొని లాగేసింది .మనుష్యులు ఎక్కువయ్యారనో పిల్లిపంజా కు భయపడో పాము మెల్లగా జారుకుంది .పాము వెళ్లి పోయేసరికి , పిల్లి మ్యావ్ మ్యావ్ మంటూ వచ్చి తల్లి కాళ్ళను పెనవేసుకొంది.బిడ్డను కాపాడిందని దాని ఒళ్ళంతా ఆప్యాయంగా నిమిరారు తల్లిగారు .
మరో సారి రామచంద్ర ఆయన స్నేహితులు బాబాయి తోకలిసి ఊరి బయటితోటకు వెడుతుంటే,మధ్యలో ఒక పెద్ద గోధుమరంగు త్రాచుపాము అడ్డంగా వచ్చింది. యధాలాపం గా ఎవరూచూడలేదు. దానికి రెండు అడుగుల దూరం ఉండగా చూడగా అలికిడికి అది పడగా విప్పి బుసకొడుతూ నిలబడింది.ఒక్క అడుగు వెనక్కి వేశారంతా .బాబాయి నదురూ బెదురూ లేక అరచేతిని పడగలా చేసి దాని ఎదురుగా నిలిచాడు .అంతే.అది పడగా దింపి జారుకొని పారి పోయింది .హమ్మయ్య అనుకొన్నారందరూ .ఆయన్ను అడిగి గరుడ రేఖ విశేషాలు తెలుసుకకొన్నారు .
ఇప్పుడు పంచాయుధ స్తోత్ర శ్లోకాలు తెలుసుకొందాం –
1-స్పురస్సహస్రార శిఖాది తీవ్రం –సుదర్శనం భాస్కర కోటితుల్యం –సురద్విషాంప్రాణ వినాశి విష్ణోః-చక్రం సదాహం శరణం ప్రపద్యే ‘’
భావం –వెయ్యి ఆకులు కొనలతో ,వాడిగా ఉంటూ ,కోటి సూర్య కాంతి తో వెలిగే ,రాక్షస ప్రాణాలు తీసే విష్ణు చక్రాన్ని నేను నిరంతరం శరణు పొందుతున్నాను .
2-విష్ణో ముఖోత్థానిల పూరితస్య –యస్య ధ్వనిః దానవ దర్ప హంతా-తమ్ పాంచజన్యం శశికోటిశుభ్రం –శంఖం సదాహం శరణం ప్రపద్యే ‘’
భావం –విష్ణు ముఖం నుంచి వెలువడే గాలితో నిండి, తన ధ్వనితో దానవ దర్పాన్ని అణచే,కోటి చంద్ర శ్వేతమైనవిష్ణువు పాంచజన్య శంఖాన్ని నిర౦తర౦ శరణు వేడుతున్నాను .
3’’ఫలశ్రుతి –‘’వనే రణే,శత్రు జలాగ్ని మధ్యే –యదృచ్చయాపత్సుమహాభయేషు ఇద౦ పఠన్ స్తోత్ర మనాకులాత్మా –సుఖీ భవేత్ తత్కృత సర్వ రక్షః ‘’
భావం –అడవిలో యుద్ధం లో శత్రువులమధ్య ,మంటల్లో ,హఠాత్తు ఆపదలలో మహాభయం కలిగితే కలత చెందకుండా ఈస్తోత్రం చదివే మానవుడిని విష్ణువు పంచాయుధాలు అన్ని విధాలుగా రక్షిస్తాయి అతడు సుఖపడుతాడు.
మిగిలిన మూడు శ్లోకాలు –
3-హిరణ్మయీంమేరుసమానసారాం-కౌమోదకీం దైత్య కులైక హంత్రీం-వైకుంఠ వామాగ్ర మృస్టాం-గదాం సదాహం శరణం ప్రపద్యే’’
4-యజ్జ్యా నినాదశ్రవణాత్సురాణాం-చేతాంసి నిర్ముక్త భయాని సద్యః –భవంతి దైత్యాశని బాణ వర్షైః-శార్ఞంసదాహం శరణం ప్రపద్యే ‘’
5-రక్షో సురాణా౦కఠినోగ్ర కంఠ- చ్ఛేద రక్షత్ క్షోణితదిగ్ధ సారం –తమ్ నందకం నామ హరేః ప్రదీప్తం –ఖడ్గం సదా హం శరణం ప్రపద్యే ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-20-ఉయ్యూరు

