- ప్రపంచ దేశాల సారస్వతం · 177-హొండూరస్ దేశ సాహిత్యం
- కరేబియన్ సముద్ర తీరాన మధ్య అమెరికాలో హోండూరస్ దేశం ఉంది.రాజధాని –తెగూచిపైపా .కరెన్సీ హొండూరన్ లెంపిరా .జనాభా 96లక్షలు .స్పానిష్ భాష .రోమన్ కేధలిక్ మతం .అక్షరాస్యత 87శాతం .ఉచిత విద్య .వ్యవసాయం ముఖ్య ఆదాయం .కాఫీ బనానా ,కార్న్ ,వరి,బీన్స్ పండిస్తారు .మొసళ్ళు పాములు పెద్ద బల్లులు ఉంటాయి .కీయాస్ కోచినోస్ ,లేక్ యోజ్పా ,వెస్ట్ బే బీచ్ చూడతగినవి .జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి .
- హొండూరస్ సాహిత్యం-ఈ దేశ సాహిత్యం ఫ్రే జోస్ ట్రినిడాడ్ రేయిస్ స్థాపించిన యూనివర్సిటీ తో ప్రారంభం .రోమా౦టిజం వచ్చాక సాహిత్య వికసనం జరిగింది. మాన్యుల్ మారినా విజ్జి ,జోస్ ఆంటోనియో దొమింగేజ్,కార్లోస్ ఫ్రేడరికో గూటరేజ్ రచయితలు వచ్చారు . గూటరేజ్ ‘’ఆన్జేలీనా ‘నవల 1889లో రాశాడు .మోడర్నిజం లోనూ జువాన్ రామోన్ మోలిన,ఫ్రయోలన్ టుర్సియోస్ ప్రయోగాలు చేశారు .కొత్తతరం సాహిత్యకారులు ఆంటోనియో జోస్ రివాస్ ,పామ్పియో వాలీ ,రాబర్టో సోసా నెల్సన్ మేర్రెన్ ,ఆస్కార్ అకోస్టామార్కోస్ క్లారియస్,అర్మందో జలాయా వగైరా .హెలెన్ ఉమానియా ,మారియా యూజీన్ మోరోస్ ,మయ్రావుయులా ,సీజర్ర్ ఇందియానోకూడా ప్రముఖులే .స్త్రీలలో –ఐడా సబొంజ్ ,అలేజాన్ద్రా ఫోర్స్బెర్ముడేస్,అమండా కాస్ట్రో మొదలైనవారు న్నారు .
- 178-ఎల్ సాల్వడార్ దేశ సాహిత్యం
- రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్ చిన్న జనసా౦ద్రత ఎక్కువున్న మధ్య అమెరికా దేశం .రాజధాని –సాన్ సాల్వడార్ .కరెన్సీ-అమెరికన్ డాలర్ .జనాభా -64.2లక్షలు .స్పానిష్ భాష .రోమన్ కేధలిక్ మతం.89శాతం అక్షరాస్యత .14వ ఏడుదాకా ఉచిత విద్య .తర్వాత సెకండరి .కాఫీ గోల్డ్ షుగర్ ఇధనాల్ కెమికల్స్ వగైరా ఆదాయవనరులు .లాగో డీ కొటేపెక్,జాయా డీ సెరీన్ ,సాంటా అనా వాల్కనో దర్శనీయాలు .అత్యధిక క్రైం రేటు ఉన్న దేశం
- ఎల్ సాల్వడార్ సాహిత్యం –మొదట్లోఅంతా జువాన్ ఆంటోనియో ఆరియస్ రాసిన మత సాహిత్యమే .జువాన్ డియాజ్ Vida y virtudes del venerable fray Andrés del Valle. అనే జీవిత చరిత్రరాశాడు .సాహితీ విమర్శకుడు Carta de Relación,ను Pedro de Alvarado రాశాడు .స్వతంత్రం పొందాక ఫాదర్ మాన్యుల్ అగులియర్ అణగారిన జాతుల విషయమై రాశాడు .వచనం లో ట్రాజేడిమొరాజన్ 1894లో ఫ్రాన్సిస్కో డియాజ్ రాశాడు .టు దిసిటిజన్ జోస్ ను మాక్వెల్ అల్వరేజ్ కాస్ట్రో రాశాడు. రూబెన్ డారియో-1867-1916,ఫ్రాన్సిస్కో గావీడా ప్రముఖకవులు.గవీడా జాతీయ సాహిత్యకర్త .విసేంటీ అకోస్టాజువాన్ జోస్ బెర్నాల్ కాలిక్స్తో వేలడోఇత్రరచయితలు .20వ శతాబ్దిలో మాన్యుల్ ఎన్రిక్ అరజువో మేధావి వర్గ ప్రశంశలు పొందాడు .ఇంట్రాస్పెక్షన్ యుగం లో ఆల్ఫ్రెడో ఎస్పినో ప్రసిద్ధుడు .యాంటి మోడర్నిజం లో క్లాడియా లార్స్ ,రొక్ డాల్టన్ వగైరా ప్రసిద్ధులు పాప్యులిజం ఆధారి టేరియ నిజం కాలం లో మాన్యుల్ బరేరా అ క్టోనల్ గువేరా ముఖ్యులు.
- సశేషం
- మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-7-20-ఉయ్యూరు

