దశరూపక పధ్ధతి సంస్కృత అలంకార రచన చేసిన తెలుగుకవి –కురవి రామకవి

దశరూపక పధ్ధతి సంస్కృత అలంకార రచన చేసిన తెలుగుకవి –కురవి రామకవి

కురవి రామకవి మహావిద్వా౦సుడైన తెలుగు కవి .వేంకటాధ్వరి రాసిన ‘విశ్వగుణాదర్శ చంపు ‘’కు వ్యాఖ్య రాస్తూ కురవి రామకవి ‘’యచ్చేతశ్చంద్రచూడే తతపరికలనాత్ భ్రు౦గ  కీటాయమానం –ఏనాకార్యప్పయాధ్వర్యుదితకువలయానంద తిప్పణ్యమోఘా-యశ్చంపూ భారతీయా౦ వ్యతనుత వివృతిం స్వాడ్యగూడార్ధ సారాం –వ్యుత్పిత్సో ర్దాశ రూపీత్య వహదిహ ముదం పధ్ధతి ర్యాయదీయా .-భ్రాతుః సాహిత్య కళా౦ సాంగోపాంగా మధీత్య గోపాలాత్ –విశ్వ గుణాదర్శం సవ్యాఖ్యాతిశ్రీకురవి రామకవిః’’అని చెప్పుకున్నాడు .ఈకవి చాలావరకు నాట్య శాస్త్రం ,దశారూపకాలను అనుసరించాడు .భరతుడు నాట్యశాస్త్రం లో ఎనిమిది రసాలు చెప్పి శాంతరసం వదిలేశాడు .ధ్వనికారులు శా౦తరసాన్ని సమర్ధించారు .ఇందులోకూడా విడవబడింది .రామకవి దశారూపక శ్లోకాలను ,ఉన్నదున్నట్లే తీసుకున్నాడు .దశరూపక౦  లో లేని పటాక్షేపప్రవేశం ,,ధ్రువ మొదలైనవాటిని అదనంగా చేర్చాడు .ఇప్పటి దాకా అజ్ఞాతం లో ఉన్న ఈ గ్రంథాన్నివెలికి తీసిసి ప్రచురించిన వారు కెనడ సంస్కృత ప్రొఫెసర్ వేంకటాచార్య కు సాహితీ లోకం ఎంతో రుణపడి ఉంది .

తెలుగులో సింహాసన ద్వాత్రి౦శిక రాసిన కొరవి గోపరాజు ఉన్నాడు .కురవి రామకవి తన సోదరుడు గోపాలుడు అని చెప్పాడు .కొరవి కురవి లకు పెద్దగా తేడాలేదని గోపరాజు గోపాలుడు ఒక్కరే అని కొందరు అన్నారు .రామకవికి గోపరాజు సోదరుడుకాదు.గోపరాజు కృష్ణదేవరాయలకాలం వాడు .తెలంగాణా వాడు ..రామకవి కువలయానందం వ్యాఖ్యలో పూర్వ వ్యాఖ్యాత వైద్యనాథ పండితుడిని విమర్శించాడు .పండితుడు క్రీ.శ 1683 వాడు .కనుక రామకవి ఈయనకంటే తర్వాత వాడు .కాబట్టి  గోపరాజుకాలానికీ రామకవి కాలానికీ చాలా తేడా ఉంది .ఇంటిపేర్ల లోనూ తేడా ఉంది .కనుక రమకవికి గోపరాజు కు సోదరత్వం కుదరదు .సంస్కృతం లో మహావిద్వాంసుల ఆంధ్రకవులలో కురవి రామకవి స్థానం అత్యున్నతమైనది అన్నారు శ్రీ బులుసు వేంకట రమణయ్యగారు .

ఆధారం –శ్రీ బులుసు వేంకట రమణయ్య గారి వ్యాసం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –27-10-26-ఉయ్యూరు —

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.