Category Archives: పుస్తకాలు

కిరాతార్జునీయం-.19      పదకొండవ సర్గ -2

  కిరాతార్జునీయం-.19 పదకొండవ సర్గ -2  ఇంద్రుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ప్రాణుల్ని చంపి చంచలమైన సంపదలు పొందేవాడు నదులకు సముద్రం ఆశ్రయం అన్నట్లుగా ఆపదలకుఆశ్రయమౌతాడు .-‘’ఉదన్వానివ సి౦దూనామాపదామేతిపాత్రతాం .’’సాధన సంపత్తు ఉంటేనే సంపదలు లభిస్తాయి .దాన్ని రక్షించుకోవటానికి చాలా శ్రమపడాలి .భయాలు పెరుగుతాయి. సంపదను మించిన విపత్తు, దుఖం మరొకటి లేదు .ఆపదల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.18      పదకొండవ సర్గ -1    

కిరాతార్జునీయం-.18 పదకొండవ సర్గ -1  ఇంద్రకీలం నుంచి జండా ఎత్తి స్వర్గం వెళ్లి ఇంద్రునితో అర్జునముని   జితేన్ద్రియత్వాన్ని చెప్పగా, ఆయన చాలా  సంతోషంపొంది ,ఆశ్రమానికి వృద్ధముని రూపం లో చేరాడు ..’’అజగామాశ్రమంజిష్ణో  ప్రతీతః పాక శాసనః ‘’ .ఇంద్రుని అర్జునుడు చూశాడు .తెల్ల వెంట్రుకలు జడలు కట్టి,అస్తమయం లో సంధ్యలాఉన్నాడు.-‘’పృక్త  ఏందు కరైరహ్నః పర్యంత ఇవ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.17      దశమ సర్గ -3(చివరి భాగం )   

కిరాతార్జునీయం-.17 దశమ సర్గ -3(చివరి భాగం ) అర్జునునిపై అప్సరసలు నిల్పిన చూపులో రసభావాలు లేనేలేవు .చేతులు అభినయించలేదు .చూపు అర్జునునిపైనే నిలిచిపోయింది తప్ప మరో పక్క కి తిరగలేదు –‘’ప్రకృత మను ససార నాభి నేయం –ప్రవిక సదంగులి పాణిపల్లవం వా –ప్రథమ ముప హితం విలాసి చక్షుః-సితతురగే  న చచాల నర్తకీనాం ‘’.పాదాల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.16      దశమ సర్గ -2            

కిరాతార్జునీయం-.16 దశమ సర్గ -2 అన్ని దిశలా అర్జున పుష్పాలు వికసి౦చటం తో దాని పరిమళం వ్యాపించి ,అంతా కామ వికారం పొంది ,ధైర్యం సడలి కొత్త అనుభవం పొందింది .దుఖితులను కూడా సంతోష పడేట్లు పండిన నేరేడు పళ్ళను తిని ఆడకోయిల కొత్తరాగాలతో గళమెత్తిగానం చేస్తోంది –పరి భ్రుత యువతిః స్వనం వితేనే –నవనయోజిత … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మహా భక్తులు -3 2-నిరతాన్నదాత ,మహా భక్త శిఖామణి-బందా పరదేశి

మనమెరుగని మహా భక్తులు -3 2-నిరతాన్నదాత ,మహా భక్త శిఖామణి-బందా పరదేశి 17వ శతాబ్దం లో నియోగి కుటుంబం లో  గుంటూరు జిల్లా వేటపాలెం లో పుట్టిన బందా పరదేశి కరణీకం చేసేవాడు .ఎవ్వరినీ చెయ్యి చాచిన వాడు కాదు .భార్యకమలాంబ  కూడా చక్కగా సహకరించేది .నిత్య అన్నదానం తో దంపతులు తరించేవారు .ఈ వంశం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాతార్జునీయం-.15      దశమ సర్గ -1            

రాతార్జునీయం-.15 దశమ సర్గ -1 తెల్లవారగానే అర్జునుని ప్రలోభ పెట్టటానికి అప్సరసలు అందరూ బయల్దేరారు .రాత్రి సంభోగం తో వచ్చిన కొత్త అందం తో ,మాంచి అలంకరణతో మన్మథ విలాసాలు వెదజల్లుతూ వెళ్ళారు .స్తన ,పిరుదుల భారం తో నెమ్మదిగా నడవాల్సి వచ్చింది .లత్తుక పాదాలలతో స్త్రీలు ముందు నడువగా ,నేలపై గడ్డి దర్భ వంటి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.14 నవమ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.14 నవమ సర్గ -3(చివరి భాగం ) ప్రియునితో కొత్త కలయికతో ఒక నాయిక ఒళ్ళు గగుర్పొడిచి,చెమట పొటమరించి ,అలాగే గుండెపై పడుకొన్నది .అలంకారం చెదిరినా అదేఅల౦కార మయింది .మద్యం మత్తు సిగ్గు పోగొట్టి ,ఆపని మన్మధుడు చేశాడా లేక మదమా అనే అనుమానం కలిగింది .రెండూ వారిని ఆపలేక పోయాయి అంటే సరి పోతుంది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.13 నవమ సర్గ -2

కిరాతార్జునీయం-.13 నవమ సర్గ -2 చంద్రుడు దగ్గరకు రావటంతో కిరణ సముదాయం వక్రత్వం పోగొట్టుకొని నిటారుగా దిగంతాలకు పాకింది .అది లోకమంతా శ్వాస పీల్చుకొన్నట్లున్నది .అంటే చంద్ర కాంతి తో లోకం ఆనంది౦చి౦దని భావం –‘’నిహ్ సృతస్తిమిరభార నిరోధా –దుచ్చ్వసన్నివ రరాజ దిగంతః ‘’.స్వచ్ఛ పగడ కాంతి కళలతో నాలుగువైపులా అంధకారాన్ని దూరం గా పైకి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.12 నవమ సర్గ -1

  కిరాతార్జునీయం-.12 నవమ సర్గ -1 జలక్రీడల తర్వాత ప్రియుల పొందుకోసం అప్సరసలు ఆరాట పడగా ,మనం అడ్డం ఎందుకని సూర్యుడు పడమట వాలాడు .ఒక వైపు వంగిన సూరీడు ఆకాశం ముత్యాలహారం ధరించిందా అని పించింది .అంటే సూర్య నాయక్ తనవైపు వంగగా ,ఆకాశ నాయిక మరో వైపు పొరలగ ముత్యాలహారం కదలికగా కాంతి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.11 అష్టమ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.11 అష్టమ సర్గ -2(చివరి భాగం ) చిగురాకులు కోయటం తో అచ్చరల చేతులు ఎర్రబడ్డాయి .పుప్పొడి అంటి పాలిండ్లు పసుపు రంగు పొందాయి. పూల వాసనతో శరీరాలు పరిమళం పొందాయి .తమ సౌందర్యం పెంపు కోసం సామగ్రి అంతా చెట్ల నుండే పొందారు .ఇంద్రకీలం లో ప్రతి అడుగులోనూ త్రుళ్ళి పడుతున్నారు. ఏనుగు తొండం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.10 అష్టమ సర్గ -1

కిరాతార్జునీయం-.10 అష్టమ సర్గ -1 తమకోసం నిర్మించుకొన్న గ౦ధర్వ నగరం లో అప్సరసలు వనవిహారం చేయాలని బయల్దేరారు .ఆనగరం నానా వర్ణాలతో ఇంద్ర ధనుస్సును తలపిస్తోంది .-‘’సురా౦గనా గోపతి చాప గోపురం –పురం వనానాం విజి గీర్షయా జహుహ్ ‘’తమ ప్రియులైన గంధర్వులతో వనవిహారం చేస్తుంటే వాళ్ళ కాంతి పర్వత శిఖరాలపైఉన్న వృక్షాలు,తీగలపై  ప్రసరించి విద్యుత్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.9 సప్తమ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.9 సప్తమ సర్గ -2(చివరి భాగం ) ఇంద్రకీలం పై సమతల నదీ తీర ప్రదేశం మీదఇసుకలో  గుర్రాలు దిగాయి .ఆకాశ గమనం లో ఆరితేరినవి కనుక వాటికి సమతలం చేరటం సులభమే .ఇసుకలో వాటి గిట్టల గుర్తులు స్పష్టంగా కనిపించాయి .ధ్వనిస్తూ పారే నదుల తో పర్వతం పైభాగాన ప్రతిధ్వని విన్న నెమళ్ళు మేఘ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-. సప్తమ సర్గ -1

కిరాతార్జునీయం-. సప్తమ సర్గ -1 దేవేంద్రుడికి నమస్కరించి అప్సరసలు తమ నివాసాలకు బయల్దేరారు .ప్రభు సన్మానం తో వారి సహజ సౌందర్యం  మరింత పెరిగింది .ఆ అందం చూడటానికి సహస్రాక్షుని కళ్ళు చాలటం లేదు.  ఇంద్రుని సహచర గంధర్వులు ,అప్సరసలకు రక్షకులుగా అలంకరించిన రధాలు ,ఏనుగులతో  బయల్దేరారు .ఆ ధ్వని విమానాల్లోంచి ప్రతిధ్వనించి మృదంగ ధ్వనిగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- ఆరవ సర్గ -2.

  కిరాతార్జునీయం- ఆరవ సర్గ -2. పూల కోసం చిగురాకుల దోసిళ్ళతో చెట్లను వంచుతూ ,పడుకోవటానికి కొత్త మెత్తని లేబచ్చిక తో భూమిని కప్పుతూ అనుకూల వాతావరణం ఏర్పాటు జరిగింది .మేఘాలు లేని ఆకాశం నుంచి జారే నీటి బిందువులు నేలపై దుమ్మును అణచి వేశాయి .తపో నిమగ్నుడైన క్రీడికి అన్నీ ప్రశాంత వాతావరణం కలిపిస్తున్నాయి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- ఆరవ సర్గ -1.

కిరాతార్జునీయం- ఆరవ సర్గ -1. ఇంద్ర కీల పర్వతం చేరిన ఇంద్ర తనయుడు అర్జునుడు బంగారు రంగు చరియలతో ఉన్న శిఖరాన్ని చూసి ,గంగానదికి ఎదురుగా వెడుతూ విష్ణుమూర్తి గరడుని పై అధిరోహించినట్లు   అధిరోహించాడు.తుమ్మెదల ఝ౦కారమే  జయజయ ద్వానాలుగా, గాలికి వంగి ఊగుతున్న  పూల చెట్లే వంది మాగధుల్లా పూలతో అభిషేకించాయి .-‘’పవనేరి తాకుల విజిహ్మ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-3(చివరి భాగం)

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-3(చివరి భాగం) . శంకరుడు పార్వతి పాణి గ్రహణం చేసేటప్పుడు శివుడి చేతి కంకణం వంటి సర్పం జారి పడితే , భయపడిన  శుభావహమైన ఓషధులున్నపార్వతి చేతిని గ్రహించాడు .ఆమె చూపులూ భయం పొందాయి –‘’విన్యస్త మంగళ మహౌషధరీ శ్వరాయ –స్రస్తోరగ ప్రతి సరేణ కరేణ పాణిహ్’’.పర్వత మణి కాంతులు ఆకాశం లోకి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-2.

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-2. యక్షుడు అర్జునునితో ‘’తెల్లని మంచు తో ఉన్న హిమవన్న గ శిఖరాలు ఆకాశాన్ని అనేక భాగాలుగా చేస్తున్నాయి .అంటే ఈ పర్వతాన్ని చూసిన వారి పాపాలు తొలగిస్తోంది .పర్వతం మధ్యభాగం లోని వృక్షా లెక్కిచూసి  దాన్ని కొంచెం గా నే వర్ణించ గలం.వేదాలు కూడా పరమాత్మను కొంచెమే పరిచయం చేయగలవు .బ్రహ్మ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-1

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-1 . హిమాలయం చేరిన అర్జునుడు అది మేరు పర్వతాన్ని జయి౦చా లనే కోరికతో అంటే దిగంతాలకు వ్యపించాలనే ఉత్కంఠ తో అంతటి ఎత్తుకు ఎదిగిందా అని పించింది .దానికి మూడు కారణాలు కనిపించాయి అతనికి .ఒక వైపు సూర్య కిరణాలతో ప్రకాశిస్తూ,మరో వైపు దట్టమైన చీకటి ఆవరించి ఉంది .ముందువైపు అట్టహాసంతో ప్రకాశిస్తూ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-12

వేద వ్యాసమహర్షి ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’నీ శత్రువులు అపకారం చేసినాఏమీ మాట్లాడకుండా శాంతంగా ఉండటం వలన  నీ ప్రజ్ఞా సౌశీల్యాలు లోకానికి తెలిశాయి .వాళ్ళు అట్లా అపకారం చేసి ఉండకపోతే లోకానికి నీ గొప్పతనం  తెలిసేది కాదు .కనుక వాళ్ళ అపకారం నీకు ఉపకారం అయింది అంటే శత్రువులుకూడా ఒక్కోసారి ఉపకారులౌతారన్నమాట .శత్రువులకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- నాల్గవ సర్గ- 2.

కిరాతార్జునీయం- నాల్గవ సర్గ- 2. యక్షుడు శరదృతు వైభవాన్ని అర్జునుడికి అడగకపోయినా వివరించాడు ‘’శుభం భాగ్యం ఇచ్చే ఈ శుభ సమయం లో పనుల ఫలితం కలిగి కృతర్ధత లభిస్తుంది .నిర్మలమైన నీరు ,నీరు లేని మేఘాలున్న ఈ శరత్తు మీకు జయం చేకూరుస్తుంది అర్జునా !ఇప్పటిదాకా వర్షర్తు గొప్ప ప్రేమతో లోకాన్ని ముంచింది .ఇప్పుడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం నాల్గవ సర్గ .

కిరాతార్జునీయం నాల్గవ సర్గ . పాశుపాతాస్ర సాధనకోసం అర్జునుడు యక్షుని తోడుగా తీసుకొని ఇంద్ర కీలాద్రి చేరాడు .అక్కడ కనిపించిన ప్రకృతి  సౌందర్య వర్ణననమే చతుర్ధ సర్గలో మహాకవి భారవి వివరించాడు.ఆ  అందాలు అనుభవిద్దాం చెలికత్తెల సముదాయం లో యవ్వనం లో ఉన్న ప్రియురాలిని నాయకుడు చేరుకున్నట్లు ,లోకులకు ఇష్టుడైన అర్జునుడు పచ్చగా పండి వరి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మహా భక్తులు  -2 1-కోటం రాజు నాగేశ్వర దాసు -2(చివరి భాగం )

మనమెరుగని మహా భక్తులు  -2 1-కోటం రాజు నాగేశ్వర దాసు -2(చివరి భాగం ) తగిన వధువుతో దాసుకు వివాహం చేసి కొత్త ఇల్లు కట్టించి అందులో గృహప్రవేశం చేయించారు శాస్త్రి దంపతులు .గృహ కృత్యాలమీద ఆసక్తి లేని దాసు భార్యను ఒంటరిగా వదిలి ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి చేరేవాడు .కొంతకాలానికి శాస్త్రి చనిపోయాడు .కుటుంబ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మహాభక్తులు -1 1-కోటం రాజునాగేశ్వర దాసు -1

మనమెరుగని మహా భక్తులు  -1 1-కోటం రాజు నాగేశ్వర దాసు -1 భాస్కర మంత్రి శాయమాంబ లకు పుత్రుడు కోటం రాజు నాగేశ్వర దాసు చిన్నప్పుడే తల్లీ తండ్రీ చనిపోయారు .పోషించే వారు ఎవరూ లేకపోవటం తో సదా చార సంపన్నుడు రామభక్తుడు ఎల్లేపెద్ది పాపన్న శాస్త్రి తీసుకొని వెళ్లి పెంచాడు .పరమ సాధ్వి అయిన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మల్లినాథ సూరి వ్యక్తిత్వం  

మల్లినాథ సూరి వ్యక్తిత్వం మల్లినాథుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ,మహా విద్యా వేత్త .సంస్కృత భాషలోని ప్రతి శాఖ లోనూ అపార పాండిత్యజ్ఞాన సంపన్నుడు .ఆయన రాసిన వ్యాఖ్యానాలలో ఉటంకించిన అనేక రచనలు రచయితలను పరిశీలిస్తే ఎన్ని రచనలు చదివాడో ఎంతమంది కవులను అధ్యయనం చేశాడో తెలిసి ఆశ్చర్యపడతాం .ఆ రచనలు ఆకవులు మనమెప్పుడూ కనీ వినని వారే .సూరి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కౌముదీ శరదాగమన కర్త –శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి 

కౌముదీ శరదాగమన కర్త –శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి వ్యాకరణాచార్య,వ్యాకరణాలంకార విద్యా ప్రవీణ ,శ్రీ విజయనగర మహారాజ సంస్కృత కళాశాల వ్యాకరణాలంకార శాస్త్రో పాద్యాయులు శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు  1942లో జయాపుర సంస్థానానాధీశ్వరులు ,కళా ప్రపూర్ణ ,సాహిత్య సామ్రాట్ ,డి.లిట్ శ్రీ మహారాజా విక్రమ దేవ వర్మగారి సమాదరణం తో’’ కౌముదీ శరదాగమనం ‘’రచించి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంద్ర మహా భక్తవిజయ కర్త- .శ్రీ పంగులూరి వీర రాఘవుడు

సుమారు 1957లోనే   ‘’ఆంద్ర మహా భక్త విజయం ‘’అనే అమూల్య రచన చేసినవారు శ్రీ పంగులూరి వీర రాఘవుడు గారు .ఈ పు స్తక౦ పై రెడ్డిపాలెం ఆనందాశ్రమానికి చెందిన యోగి పుంగవులు  శ్రీ లక్ష్మీ కాంత యోగి  ఇలా వివరిచారు-‘’ఇండియాలో ఇతర దేశాలలో మహా బుద్ధిమంతులు అక్కడి మహా భక్తుల జీవిత విశేషాలను విశాల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వన్యాలోక ఆంధ్రీకరణ కర్త -శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి

ధ్వన్యాలోక ఆంధ్రీకరణ కర్త -శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి కొందరు కవులు, పండితులు ఎన్ని గొప్ప రచనలు చేసినా ,వారిని గుర్తించే వారు ఆకాలం లో ఉండేవారే కానీ తర్వాత కాలం లో వారి గురించి ఆలోచించే వారు కరువైపోతున్నారు .అలాంటి మహా కవి పండితులలో శ్రీ పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఒకరు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హాం రేడియో విజ్ఞాన సర్వస్వం

  హాం రేడియో విజ్ఞాన  సర్వస్వం ఉయ్యూరు హైస్కూల్ లో నా జూనియర్ ,నా ప్రాణ స్నేహితుడు సూరి నరసింహం తమ్ముడు సూరి శ్రీరామ మూర్తి ,ఢిల్లీ లో టెక్నీషియన్ గా పని చేస్తూ ,వారానికో సారి నాకు చాలా వివరంగా ఇన్లాండ్ లెటర్స్ రాస్తూ ఉండేవాడు .ఆతర్వాత  ఎమెచ్యూర్ రేడియో అనే హాం రేడియో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -14 11-మనోహరమైన ట్రిప్

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -14 11-మనోహరమైన ట్రిప్ హోవర్ క్రాఫ్ట్ లో నేనూ అమ్మమ్మ,లెక్స్ ము౦దుసీట్లలో ,వెనక ఏమీ పట్టనట్లు నాన్సీ,ప్రక్కన కూతురు  ప్రక్కన చిన్నపిల్ల వెండీ కూర్చున్నాం .టిక్ నాకు,అమ్మమ్మకు మధ్య కూర్చుంది .టెలోస్ ను దాటి హార్బర్ కు చేరేలోపు ఎల్లీ ఆవలిస్తోంది .హార్బర్ లోపడవలు మహా బాగా అనేకరంగుల్లో ఆకర్షణగా,అనేకరూపాలలో  ఉన్నాయి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -13 10-మళ్ళీకలయికమాదుర్యం కొత్తపరిచయాలు

 అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -13 10-మళ్ళీకలయికమాదుర్యం కొత్తపరిచయాలు పగలైనా రాత్రైనా నాన్సీ నాన్ స్టాప్ గా ఆవలిస్తూనే ఉంది .మాన్యుల్ ఒడిలో ఎల్లీ హాయిగా నిద్రపోయింది .ఇంటికి తిరిగొచ్చాక నేను మాన్యుల్, అమ్మమ్మ కలిసి ఎక్కడైనా తిరిగి వద్దామని అనుకొన్నాం .మాన్యుల్ ఎక్కడ ఉంటాడో నాకు తెలీదు .అయితే మనం ఎప్పుడు ఏది అనుకొన్నా సిద్ధంగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -12

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -12                9-టెలోస్ ,పరిసరాల టూరు -2 ‘’ఫాక్టరీలు ఉండి ఉంటాయి .అక్కడ పని విసుగ్గా ఉంటుంది ‘’అంది నాన్సి .ఇంతలో ఎల్లి ‘’నేను  ఇసుక, నీళ్ళతో తో పేపర్ చేయగలను  ‘’అంది .’’మేము హెంప్ వాడుతాం దానితో మంచి పేపర్ తయారౌతుంది ‘’అన్నాను నేను .’’సూర్యకాంతి నామొహం పై పడి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మద్దూరి  అన్నపూర్ణయ్య-12(చివరి భాగం )

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-12(చివరి భాగం ) 1948లో సోషలిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు అన్న పూర్ణయ్య గారు ప్రధానకార్య దర్శిగా పార్టీ విస్తరణకు నిర్విరామ కృషి చేశారు .1952లో సోషలిస్ట్ లంతా కలిసి ప్రజా సోషలిస్ట్ పార్టీ పెట్టినప్పుడు బొంబాయిలో జరిగిన జనరల్ కౌన్సిల్ కు మద్దూరి హాజరైనా ,ఆ  విలీనం ఆనయనకు నచ్చలేదు .ఆంధ్ర పార్టీలో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-11

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-11 1945జూన్ లో జైలు నుండి విడుదలయ్యాక  మద్దూరి అన్న పూర్ణయ్యగారు ఏకాకి అయ్యారు .రెండేళ్లక్రితమే భార్య చనిపోవటం కూతురు అత్తారింట్లో ఉండటం కొడుకు విద్యాబుద్ధులను మేనమామలే చూస్తూండటం వలన ఆయన దగ్గర ఎవరూ లేరు .రాజమండ్రిలో బావమరది ఇంట భోజనం చేస్తూ మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు .అప్పటికే ఫార్వార్డ్ బ్లాక్ తో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-10

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-10 అన్నపూర్ణయ్యగారు నాలుగు అంకాల అసంపూర్ణ నాటకం రాసి పేరు పెట్టలేదు .అనాధ విద్యా  వంతుడికి బ్రాహ్మణ కన్యకు  పెళ్లి జరిగి ,ఇద్దరూ స్వతంత్ర సమరంలో జైలుకు వెళ్ళటం ఇందులో కధ.స్వాతంత్ర్య పోరాటగాధను ‘’అక్క ‘’నవలగా రాశారు కాని అలభ్యం .భార్యమరణం పై ‘’వీరపత్ని ‘’గేయం రాశారు .అది గొప్ప ఎలిజీగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్ -3(చివరి భాగం )

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్ -3(చివరి భాగం ) నాలుగేళ్ళు అజ్ఞాత వాసం లో గడిపి ఆగస్ట్ ఉద్యమవీరుడు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకుడు అచ్యుత్ పట్వర్ధన్  బొంబాయి రాగా అఖండ ప్రజావాహిని వీరోచిత స్వాగతం పలికింది .కాంగ్రెస్ నాయకులుమాత్రం రాలేదు మొహం చెల్లక  .తర్వాత పూనాలో కూడా అఖండ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత పట్వర్ధన్ -2

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్ -2 వ్యష్టి సత్యాగ్రహం రోజుల్లో పట్వర్ధన్ ,అశోక్ మెహతా జైలు జీవితం గడుపుతూకలిసి ‘’కమ్యూనల్ ట్రయాంగిల్ ఇన్ ఇండియా ‘’అనే ఉద్గ్రంధం రాశారు .మహాదేవ దేశాయ్ దీన్ని మెచ్చారు  క్రిప్స్ రాయబారం విఫలమయ్యాక గాంధీ ‘’క్విట్ ఇండియా ‘’ఉద్యమం మొదలు పెట్టాడు .1942ఆగస్ట్ 7 … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత పట్వర్ధన్

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్ 5-2-1905 న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో అచ్యుత పట్వర్ధన్ జన్మించాడు .తల్లి తండ్రీ వైపు వారంతా సాంప్రదాయ కుటుంబీకులే.తండ్రి గొప్ప ప్లీడర్ మహాదాత .తల్లి వీరమాత .వీరి సంతానమంతా స్వాతంత్రోద్యంలో పాల్గొన్న వాళ్ళే ,తల్లి కూడా తన 60వ ఏట ఉద్యమం లో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -4(చివరి భాగం ) 

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -4(చివరి భాగం ) ఆజాద్ హింద్ ఫౌజ్ విచారణ భూలాభాయ్ జీవితం లో మహత్తర ఘట్టం ఆజాద్ హింద్ ఫౌజ్ విచారణ .భారత్ నుండి రహస్యంగా జపాను వెళ్ళిన నేతాజీ సుభాశ్ చంద్ర  బోస్ నాయకత్వం లో శత్రువులకు భారత ప్రభుత్వ సైన్యం స్వతంత్ర జాతీయ సైన్యం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -3      

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -3 1-స్వతంత్ర రాజ్యాలతో అఖండ భారత్ ఉండాలి .2-కేంద్ర ప్రభుత్వమే దేశ రక్షణ విదేశీ వ్యవహారాలూ ,నాణాలముద్రణ వగైరాది అధికారాలు కలిగి ఉండాలి 3-హిందువులు అధికసంఖ్యాకులుగా ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం లకు సంపూర్ణ మత స్వేచ్చ ,అందరితో సమానావకాశాలు ,గౌరవ రాజకీయ ప్రతి పత్తితో రాజ్యపద్దతి ఉండాలని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -2

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -2    కేంద్ర అసెంబ్లీ లో భూలాభాయ్ మాట్లాడిన విషయాలు ఒక తీవ్రవాది మాట్లాడినంత పరుషంగా ఉండేవి .ఇండో బ్రిటిష్ వ్యాపార వొడంబడిక ,జాయంట్ పార్లమెంటరి కమిటీ నివేదిక క్రిమినల్ లా సవరణ బిల్లు ,ఆర్మీ రిక్రూట్ మెంట్ బిల్లు ,ఆర్దికబిల్లు మొదలైన విషయాలలో భాయ్ చేసిన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -1

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -1 భూలా భాయి జీవంజీభాయి దేశాయ్ 13-10-1877 న గుజరాత్ లోని సూరత్ జిల్లా చారిత్రాత్మక బార్డోలికి దగ్గరున్న బల్సూరులో   అనవిల్ బ్రాహ్మణ న్యాయవాద  కుటుంబ లో పుట్టాడు .తండ్రి ప్రభుత్వ ప్లీడర్ .స్వగ్రామ౦ లో చదువు ముగించి బొంబాయి ఎలిఫిన్ స్టన్ కాలేజిలో చేరి ప్రధమ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-9

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-9 ఆంద్ర జయప్రకాష్ –జయప్రకాష్ నారాయణ జీవితానికి అన్నపూర్ణయ్య గారి జీవితానికీ చాలా సామ్యం ఉన్నది .ఇద్దరూ యువజనాకర్షణలో సిద్ధ హస్తులు .జాతీయ ఉద్యమం లో వామపంధా అనుసరించిన త్యాగమూర్తులు .మొదట్లో కాంగ్రెస్ తర్వాత మార్క్సిజం అధ్యయన శీలురు  .’’వెలుగు ‘’పత్రికలో మద్దూరి ‘’ 1953 వేసవి శిక్షణలో జెపి పూనాలో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యలమంద కోటీశ్వర శతకం

యలమంద కోటీశ్వర శతకం నరసరావుపేట  తాలూకా శ్రీ కోటీశ్వర క్షేత్ర నివాసి ,అచల గురుసంప్రదాయకుడు శ్రీ బెల్లం కొండ కోటి నాగయ్యకవి  ‘’శ్రీ యలమంద కోటీశ్వర శతకం ‘’రాశాడు .వృషభ గోత్రజుడు .తల్లి సొమా౦బ,తండ్రి పిచ్చయ్య .కవి పాశుపతం మొదలైన అనేక ఉపాసనా సిద్ధుడు ,పరమహంస స్వరూప నిత్యానంద రాజయోగి.కోటి నాగార్యుడుగా సుప్రసిద్ధుడు . రేపల్లె … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పెద వేగి దేవాలయం  -2చివరి భాగం )

పెద వేగి దేవాలయం  -2చివరి భాగం ) 4-ఏకాదశ రుద్రులు –ఛాతి మధ్యలో దండలకూర్పు గా చేసిన ఆభరణం తాబేలు  లేక సాలీడు ను పోలిఉండటం జుగుప్సాకరం .రుద్రునికి ఇష్టమైంది మర్కటం .శివుడిని కచ్ఛ పేశ్వరుడు అనీ అంటారు.జందెం ఉదరబంధంపూర్ణ ఘట ఖచిత మణులతో పొదగబడిఉన్నాయి  .ఆకర్నా౦తాలై   కుడి ఎడమ మకర వ్యాఘ్ర కుండలాలు భుజ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పెద వేగి దేవాలయం

  పెద వేగి దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు 12కిలో మీటర్ల దూరం లో పాడుపడి ఉన్న ఊరే పెదవేగి.ఒకప్పుడు వేంగీ రాజ్యానికి ముఖ్య పట్టణంగా వర్ధిల్లిన వేంగీ నగరమే ఇది .పురాతత్వ సర్వేక్షణ తరఫున డా కార్తికేయ శర్మ చేసిన పరిశోధనలలో అపురూప శైవ విగ్రహాలు కనిపించాయి .ఇవి క్రీ .శ. … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment