Category Archives: పుస్తకాలు

కేనోపనిషత్ విశేషాలు -6(చివరి భాగం )

కేనోపనిషత్ విశేషాలు -6(చివరి భాగం )    చతుర్ధ ఖండం మొదటి మంత్రం –‘’సా బ్రహ్మేతి హో వాచ బ్రాహ్మణో వా ఏతద్విజయతే మహీ యధ్వమితి తతో హైవ విదా౦చకార బ్రహ్మేతి ‘’ భావం –ఉమా దేవి ఇంద్రునితో ‘’ఆ యక్షుడు పరమేశ్వరుడు .పరమేశ్వరుడే మీ విజయానికి కారణం ‘’అని చెప్పగా ఇంద్రుడు ఆ వచ్చింది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-8

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-8 మహాత్ముడు పరవశించే అన్ని రంగాలలో అగ్రగామిగా ఉన్న సీతానగరం ఆశ్రమాన్ని విచ్చిన్నం చేయాలనే కుట్రతో ,దాన్ని చట్ట విరుద్ధంగా ప్రభుత్వం ప్రకటించగా , ,1932జనవరి 18న పోలీస్ సూపరింటే౦డెంట్ 400మంది రిజర్వు పోలీసులతో ఆశ్రమాన్ని ముట్టడించగా ,డిప్యూటీ ముస్తఫా ఆలీ సత్యాగ్రులపై క్రూరంగా వ్యవరించాడని ప్రతీతి .వచ్చీ రాగానే  అలీ ఆశ్రమ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -5 తృతీయ ఖండం

కేనోపనిషత్ విశేషాలు -5 తృతీయ ఖండం   మొదటి మంత్రం-‘’ఓం బ్రహ్మ హ దేవేభ్యో విజిగ్యే-తస్య హ బ్రాహ్మణోవిజయే దేవా ఆమహీయంత,త ఐక్ష్యం తాస్మాక మే వాయం విజయోస్మాక మే వాయం మహి మేతి’’ భావం –సర్వ జగాలకు శాసకు డైనపరమేశ్వరుని అనుగ్రహం వలన దేవాసుర యుద్ధం లో దేవతలు జయించారు .కాని తమ విజయానికి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -4

కేనోపనిషత్ విశేషాలు -4   ద్వితీయ ఖండం – మొదటిమంత్రం-‘’యది మన్యసే నువే దేతి దభ్ర-నూనం త్వం వేత్ద  బ్రహ్మణో రూపం య దస్య త్వం య దస్యత చ దేవే ష్వధను –మీమా౦స్య మేవతే మన్యే విది-తం ‘’ భావం-పరమేశ్వరతత్వాన్ని బాగా తెలుసుకొన్నాను అనుకుంటే ,నీకు తెలిసింది చాలా తక్కువ .నీ రూపాన్నీ ,దేవతల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -3

మూడవ మంత్రం-‘’నతత్ర చక్షుర్గచ్ఛతి-నో మనో న విద్మో న విజానీమో –యథైదనుశిష్యాత్ –అన్యదేవత ద్విదితాదధో అవిదితా దధి –ఇతి శుశ్రుమ పూర్వేషాం యేన స్తద్వాచ చక్షురే ‘’ భావం –అక్కడికి దృష్టి ప్రసరించదు.వాక్కు చేరలేదు ,మనస్సు అందలేదు .దాన్ని ఎలా అర్ధ మయేట్లు  చెప్పాలో మాకు తెలియదు .అసలు ఆలోచించలేము కూడా .కారణం ,అది తెలిసిన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -1

ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -1 కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో కల్చరల్ చానల్ సహకారం తో అక్టోబర్ 17,18తేదీలలో సాయంత్రం 5-30గం.లకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వినూత్న ప్రయోగంగా ‘’ ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం ‘’అనే … Continue reading →

Posted in సమీక్ష | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -2

కేనోపనిషత్ విశేషాలు -2 శాంతి పాఠం-ఓం ఆప్యాయంతు మమా౦గాని వాక్ప్రాణశ్చక్షుః,శ్రోత్ర మథో బాల మింద్రియాణి చ సర్వాణిసర్వం  బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరో దానిరాకరణ మస్త్వనిరాకరణం మేస్తు తదాత్మాని నిరతే య ఉపనిషత్సుధర్మాస్తే మయి సంతుతే మయి సంతు-ఓం శాంతిః శాంతిః శాంతిః భావం –నా శరీర అంగాలు దృఢంగా ,వాక్కు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -1

‘’ఇహ కేన వేదీ దధ  సత్యమస్తి-న చేదిదహా వేదిన్మహతీ వినష్టిః’’ అంటుంది కేన ఉపనిషత్ .అంటే ఈ జన్మలో బ్రహ్మం గూర్చి తెలుసుకొంటే అదే నిజమైన జన్మ  .లేకపోతే పెద్ద నష్టమే .  వేదం లో కర్మకాండ విషయాలు చెప్పాక ,బ్రహ్మ విద్యను  చెప్పేజ్ఞానకాండ ను ఉపనిషత్తులు అంటారు .అంటే వేద విద్య నేర్చి, విధివిధానంగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ముఖలింగేశ్వరశతకం -2(చివరి భాగం )

శ్రీ ముఖలింగేశ్వరశతకం -2(చివరి భాగం ) మొదటిపద్యం –‘’శ్రీ కంఠ రజిత గిరినివాస విశ్వేశ –లోక రక్షక దేవశోకనాశ-మందరాచలదీర మహిత దివ్యప్రభా –ఫాలలోచన కోటి భాను తేజ –సోమ సూర్యాగ్ని సుశోభిత నేత్ర ని-గమగోచర శశా౦క ఖండ మకుట –హిమశైల జాదిప హేమాద్రి ధన్విత్రి-పురనాశన త్రిశూలి భుజగ హార-భక్త జన రక్షనిఖిలసంపత్సమేత-పూత చారిత్ర మమ్మిల బ్రోవుమయ్య … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ముఖలింగేశ్వరశతకం -1

శ్రీ ముఖలింగేశ్వరశతకం -1   శ్రీ ముఖలింగేశ్వరం అనే ‘’శివ మహిమ’’ పుస్తకాన్ని నరసన్నపేట తెలుగు ఉపన్యాసకులు శ్రీ మొసలికంటి వెంకట రమణయ్య తిరుమల తిరుపతి దేవస్థానం ద్రవ్యసాయం తో నరసన్నపేట సిద్ధాశ్రమం ద్వారా ప్రచురింఛి తిరుమలేశునికి అంకితమిచ్చి శివ కేశవాద్వైతాన్ని చాటారు . .వెల అమూల్యం . ముఖ లింగేశ్వర దేవాలయం ముఖలింగ క్షేత్రం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-7

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-7 ఆంద్ర దేశం లో అతివాద ప్రథమ నాయకుడు బులుసు సాంబమూర్తిగారు .ఈయనే తనగురువు అన్నారు పూర్ణయ్యగారు .1921తూగోజి రాజకీయ మహా సభలో పూర్ణ స్వరాజ్యం సాధించాలని  బులుసు  ప్రతిపాదించారు .ప్రకాశం తొందర పడవద్దని హితవు చెప్పారు .తీర్మానం నెగ్గించుకొన్నారు సాంబమూర్తి .ఆయన తీర్పే ఆనాడు అందరికీ శిరోధార్యం .కాంగ్రెస్ సభలలో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కొమరి పురీశ్వర శతకం

కొమరి పురీశ్వర శతకం తూర్పు గోదావరి జిల్లా రామ చంద్ర పురం తాలూకా కొమరిపాలెం గ్రామ కాపురస్తులు సహజకవి,ఈశ్వర భక్తుడు  శ్రీ తగరం పూడి అప్పస్వామి ‘’అందరు కవులలాగా సీస ,కంద చంపక ఉత్పలమాల తేటగీతాదులతో కాకుండా కేవలం ’ పంచ చామర వృత్తం తోరాస్తున్నాన’’ని చెప్పి,  సవాలుగా శ్రీ కొమర్పురీశ్వర శతకం ‘’బాహ్యాభ్యంతర అర్ధాలతో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మిసిమి ‘’విజ్ఞాన సర్వస్వ కలిమి ‘’

  మిసిమి ‘’విజ్ఞాన సర్వస్వ కలిమి ‘’ అక్టోబర్ మిసిమి మహాత్ముని స్మృతి నీరాజనంగా ముఖ చిత్రాలతో ,ఆయనకు వచ్చిన ఆధ్యాత్మిక సందేహాలూ , శతావధాని రాజచంద్ర వివరణాత్మక సమాధానాలతో మోక్ష గామిని చేయటం మనకు దాదాపుతెలియనివే ,తెలిసిన  బాపూ పురుడుపోసిన కావూరు వినయాశ్రమ విశేషాలు కమ్మగా ఉంటే ,నాట్య సంస్కృతికి కూచి పూడి ఆభరణమైన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-6

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-6 ‘’చిచ్చులపిడుగు ‘’ ఏకాంకిక రాసిన  రామచంద్రుని వెంకటప్ప స్వగ్రామం ఒంగోలుదగ్గర టంగుటూరు .అచ్యుతుని వెంకటరావు అనే మారు పేరుతొ కాంగ్రెస్ ప్రచారం చేసి ఆరునెలలు జైలు కెళ్ళాడు  .రాజమండ్రి జైలులో బులుసు సంబమూర్తిగారితో పరిచయమేర్పడి కుడిభుజంగా ఉంటూ ,విడుదల తర్వాత ఆయనతో కాకినాడ చేరాడు .సీతానగరం ఆశ్రమం ఏర్పడినప్పుడు మూర్తిగారు అతనిని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-5

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-5 ‘’కాంగ్రెస్ ‘’మొదటి పత్రిక ఒక ఫుల్ స్కేప్ కాగితం పై సైక్లో స్టైల్ లో వెలువడింది తర్వాత 14పేజీలలో రాయల్ సైజ్ లో వచ్చేది .’’విదేశీ వస్తువులు బ్రిటిష్ వస్తువులు ,మత్తు పదార్ధాల ప్రకటనలు పత్రిక ముద్రించదు.ఆధిని వేశ ప్రతిపత్తికి అనుకూలం గా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రతిపాదిస్తుంది ‘’అని పత్రిక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు వేటూరి ఆనందమూర్తి

ప్రొఫెసర్ గిడుగు సీతాపతిగారు   వేటూరి వారి ప్రత్యేకతను వివరిస్తూ ‘’మన ప్రాచీన ,మధ్యయుగ రచయితలు తమ వచన రచనలలో కొన్ని వ్యావాహారిక పద్ధతులు అనుసరించారు అసలు రచనలో మరోరకమైన వ్యాకరణ భాష ,శైలి లో రాస్తూనే . తాళపత్రాలలో ఉన్న ఈ విషయాలను అంతకు ముందు ఎవరూ గుర్తించనే లేదు .వాటినన్నిటినీ తేటతెల్లంగా ఉదాహరించారు వేటూరి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పరిశోధన’’ ఆనందమూర్తి’’ శ్రీ వేటూరి -1

పరిశోధన’’ ఆనంద మూర్తి’’ శ్రీ వేటూరి -1 తండ్రి చేసిన పరిశోధన కొనసాగించటం చరిత్రలో అరుదైన విషయం .అలాంటి దాన్ని సాధించిన వారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కుమారుడు ప్రొఫెసర్ శ్రీ ఆనంద మూర్తి .తాళ్ళపాక కవుల సంగీత పదాలపై చాలా కృషి జరగాలని భావించి తాళ్ళపాక కవుల సంగీత విజ్ఞానపు మెరుగులు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన సుకవి ఆత్రేయ -3(చివరి భాగం )

 సాధారణంగా ఆత్రేయ రాత్రిళ్ళు మెరీనా బీచ్ కు వెళ్లి రాస్తూ ఉండేవాడు .వెలుగు నీడలు సినిమాకు ఆత్రేయతో అర్ధవంతమైన డైలాగ్స్ రాయించాలని నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ఆత్రేయకు ఒకకారు అసిస్టెంట్ డైరెక్టర్ కేవిరావు, బాయ్ నీ అప్పగించి కేరళలోని పీచీ డాం గెస్ట్ హౌస్ కు పంపాడు. నెలరోజుల్లో స్క్రిప్ట్ రెడీ చేసేశాడు ఆత్రేయ మధురస్వప్నం సినిమాకు మాటలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -3-చివరిభాగం

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -3-చివరిభాగం యాదవగిరికి నాలుగు వైపులా అష్టాక్షరీ మహా మంత్రాలతో అష్ట తీర్దాలు ఏర్పడి భక్తులను ఆదుకొంటున్నాయి .ఒక యదువంశరాజు పర్వతం చుట్టూ నాలుగు వైపులా కోటకట్టించి ‘’మేలు కోట ‘’అని పేరుపెట్టాడు .అప్పటినుంచి యతి నారాయణపురం ను మేల్కోట అంటున్నారు .ఫాల్గుణ శుద్ధ రోహిణీ నక్షత్రం రోజున స్వామికి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

, శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -2

, శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -2  ఒకసారి బలరాముడు ఇక్కడకు వచ్చి పుష్కరిణీ స్నానం చేసి తిరునాయణ దర్శనం చేసి ,తమింట్లో ఉన్న రామప్రియ మూర్తికీ ఇక్కడి స్వామికీ తేడా ఏమీ లేదని గ్రహించి ,బృందావనం వెళ్లి కృష్ణుడికి చెప్పాడు .ఆయనక్కూడా స్వామిని దర్శించాలనే కోరికకలిగి పరివారంతోనూ తామ అర్చామూర్తి రామప్రియ తోనూ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -1  

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -1 శ్రీ తిరునారాయణ పురక్షేత్రాన్నే ‘’మేల్కోటయాదగిరి  క్షేత్రం’’ అంటారు .ఈ క్షేత్ర  మహాత్మ్యం నారదీయ పురాణం లో ఉన్నది .నారదునికి బ్రహ్మ సవిస్తరంగా ఈక్షేత్ర మాహాత్మ్యాన్ని వివరిస్తాడు .సహ్యపర్వతాలకు తూర్పున ఉన్న కావేరీ ప్రక్కన ఉన్న క్షేత్రమే ఇది .కర్ణాటకలో మాండ్యా జిల్లాలో ఉన్నది . కృతయుగం లో సనత్కుమారుడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నువ్వు కొండ మహాత్మ్యం

నువ్వు కొండ మహాత్మ్యం నువ్వు కొండకు వ్యవహారిక నామం బెండి కొండ .విశాఖ జిల్లా టెక్కలి తాలూకా పాత టెక్కలి జమీన్ లో ఉన్నది .ఒకప్పుడు ఈ కొండ ఇద్దరు వర్తకుల నువ్వుల రాశి .వారు తిలాధిపతి శనీశ్వరుని తృప్తి కలిగించకపోవటం వలన ఆగ్రహం కలిగి వాళ్ళ నువ్వుల రాశిని పెద్ద కొండగా మార్చాడట .పశ్చాత్తాపం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మర్రి గుంట శ్రీ పాండురంగ స్వామి దేవాలయం

మర్రి గుంట శ్రీ పాండురంగ స్వామి దేవాలయం కలియుగం లో భక్త పుండరీకుని ఉద్ధరించాలని పు౦డరీకాక్షుడైన శ్రీ మహా విష్ణువు మహారాష్ట్ర చంద్ర భాగా నదీ తీరం లో పండరీపురం లో పాండురంగ నామం తో వెలిశాడు .జ్ఞాన దేవ నామదేవ ,ఘోరాకుభార్ ,తుకారాం ,తులసీదాస్ ,సక్కూబాయి, మీరాబాయ్, జ్ఞానాబాయ్ గోమాబాయ్ మొదలైన భక్తులను రక్షించాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన సుకవి ఆత్రేయ -2

     మన సుకవి  ఆత్రేయ -2 శ్రీమతి పద్మావతి గారిని ఆత్రేయ 1940 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకొన్నాడు .కాని అంతకు ముందే పీకలలోతు ప్రేమలో పడ్డాడు వీణా పాణిని  ‘’బాణం ‘’గారితో .కాని పెళ్లి చేసుకోలేకపోయాడు .ఇప్పుడు పెళ్లి అయిందికాని ప్రియురాల్ని మర్చి పోలేక పోతున్నాడు .ఈప్రేమ గాయమే ఆయన ప్రేమ పాటలకు, … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన సుకవి ఆత్రేయ -1

మన సుకవి ఆత్రేయ -1 రోడ్డున పడ్డ మనిషికి రోడ్డుపై గాంధీ బొమ్మే ధైర్యం చెప్పి ముందుకు సాగేట్లు చేసింది .అదే ప్రబోధ  గీతం  అయింది .దాన్ని అందరికీ నచ్చేట్లు మొదటి చిత్రం ‘’దీక్ష ‘’లో ‘’పోరా బాబూ పో ‘’అని వెన్ను తట్టాడు ఆత్రేయ .సంగీతం పెండ్యాల అందిస్తే ,ఘంటసాల అమరగానం కొండంత బలం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-4

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-4 22-3-1922న అన్నపూర్ణయ్య గారు ఆంధ్రయువజన స్వరాజ్య సభ తరఫున ‘’కాంగ్రెస్ ‘’అనే సైక్లో స్టైల్ వార పత్రిక ప్రారంభించారు .క్రొవ్విడి లింగరాజుగారు సహాయ సంపాదకులు .అందులోని ఒక వ్యాసం దేశ ద్రోహం నేరం కింద వస్తుందని సంపాదకులైన మద్దూరి వారికి 18నెలలు శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం 1923ఫిబ్రవరి నుంచి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-3

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-3 హోంరూల్ ఉద్యమం ఉవ్వెత్తుగా ఎగసి పడుతున్నకాలం లో అనిబిసెంట్ శిష్యుడు రాం కాకినాడ వచ్చి గంభీర ఉపన్యాసాలతో ప్రేరణ కల్గించాడు .ప్రిన్సిపాల్ నాయుడు గారు విద్యార్షులు ఆ సభలలో పూల్గొన కూడదని నిషేధం విధించారు .ఏం జరిగితే అది జరుగుతుందని మొండి ధైర్యంగా  పూర్ణయ్యగారు మీటింగ్ కు వెళ్లి ,మర్నాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య

  మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-2 ఆంధ్ర భీష్మన్యాపతి సుబ్బారావు ,యుగకర్త కందుకూరి వీరేశలింగం ,ఆంద్ర కేసరి ప్రకాశం ,ఆంద్ర బెర్నార్డ్ షా చిలక మర్తి ,గాంధేయవాది బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం,వందేమాతరం ఉద్యమనాయకుడు గ్రంథాలయోద్యమ సారధి గాడి చర్ల హరి సర్వోత్తమ రావు  గార్ల  కార్యక్షేత్రమైన రాజమండ్రి లో ,’’ఆఖరి శ్వాస వరకు రాజమండ్రిలోనే ఉంటూ దేశసేవ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య -1

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య  -1 భార్యా పిల్లల్ని పోషించే బాధ్యతకూడా దేవుడిపై భారం వేసి ,దేశం కోసం 55ఏళ్ళు దీక్షగా శ్రమించి ,అందులో 11సంవత్సరాలు జైలులో గడిపిన మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య ఈ తరం వారికి ఎవరికీ తెలియదు .కాంగ్రెస్ ,నవశక్తి , జయభారత్ ,వెలుగు పత్రికలు నడిపి ,స్వతంత్రం ముందూ ఆతర్వాత కూడా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్  అనువాదం-శుభవార్త  

డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్  అనువాదం-శుభవార్త   –సాహితీ బంధువులకు శుభకామనలు  – ప్రముఖ అణుశాస్త్ర వేత్త ,117 వ మూలకం టెన్నిస్సిన్ ను ఆవిష్కరించిన  ఆంద్ర శాస్త్రజ్ఞులు డా ఆకునూరి వెంకటరామయ్య గారి జీవితం పై నేను రాసిన పుస్తకం సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు స్పాన్సర్ చేసి సరసభారతి … Continue reading →

Posted in పుస్తకాలు | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -11 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -2

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -11 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -2 టెలోస్ లో స్నేహవతావరణం ఉన్నా ,సాహసాలు కూడా ఎక్కువే .టౌన్ బయట అడవి అందులో అడవి జంతువులూ ఉంటాయి .ఇక్కడ చాలా జాతులవారున్నారు ,ఎవరి తరహాజీవితం వారిదే .వాళ్ళ ఆచార వ్యవహారాలూ వేరే అర్ధం చేసుకోవటం కష్టం కూడా .ఐతే మిగిలినవాళ్ళు పట్టించుకోరు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం       203-అమెరికాదేశ సాహిత్యం -20

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -20 20వ శతాబ్ది సాహిత్యం -12 ఆఫ్రో అమెరికన్ సాహిత్యం నల్లజాతి రచయితలు  రిచార్డ్ రైట్ సాంఘిక నిరసన కోప మార్గానికి భిన్నమైన దాన్ని అనుసరించారు. జేమ్స్ బాల్డ్విన్ ,రాల్ఫ్ ఎల్లిసన్ లురైట్ ప్రభావితులు .నల్లవారి జీవితాల సంక్లిష్టత పై వివాదాత్మక వ్యాసాలూ రాశారు .బాల్ద్ద్విన్ ‘’గో టెల్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం                         203-అమెరికాదేశ సాహిత్యం -19

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -19 20వ శతాబ్ది సాహిత్యం -11 దక్షిణ దేశ ఫిక్షన్ రెండవ ప్రపంచ యుద్ధానంతరం దక్షిణాది రచయితలు ఫాక్నర్ వారసత్వాన్ని ప్రేరణగా పొందారు .ముగ్గురు మహిళలు ఇడోరావెల్టి , ఫ్లానరి ఓకాన్నోర్ ,కార్సన్ మెకల్లస్ లు అసహజ వికృత అంటే గ్రోటోస్క్ విధానం లో దక్షిణాదిసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   ధర్మవరం

   ధర్మవరం ఒకప్పుడు పసపు లేటి నాయుడు అనే రాజు ,మైసూరు నుండి ఉత్తరంగా పరివారం తో వస్తూ  పెన్నా మాగాణి దగ్గర ఒకగుట్ట మీద బస చేశాడు .కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది .దానిదగ్గరే చిత్రావతి నదిలో ఒక ఉదయం స్నానం చేస్తుంటే ,ప్రవాహం బాగా ఎక్కువై ,వెంటనే గట్టు మీదకు వచ్చి … Continue reading →

Posted in సమీక్ష | Tagged , | Leave a comment

సర్పవర క్షేత్ర

అభినవ వాగనుశాసనుడు ,కవి సార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి ‘’సర్పవర క్షేత్రాన్ని ‘’గురించి లీలాసు౦దరీ పరిణయం ‘’అనే కావ్యం రాశాడు .కవి నియోగి కౌన్డిన్యస గోత్రం  బయ్యనామాత్యుని ముని మనవడు .తిమ్మయ మనవడు .గంగనామాత్యుని కొడుకు .తల్లి లక్ష్మమ .జగ్గన సింగన నరసన పెద తండ్రులు .వీరమ ,పాపమ మేనత్తలు .రాజన,సింగన ,పెద్దన పెత్తండ్రి కొడుకులు . … Continue reading →

Posted in సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహా యోగులు -22(చివరి భాగం )

మనకు తెలియని మహా యోగులు -22(చివరి భాగం ) 66-నెమళ్ళ దిన్నె హుస్సేన్ గురు -1850-1929 కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ తాలూకా  చాగలమర్రి వ్యవసాయ ముస్లిం కుటుంబం లో వనల చిన్న హుంసూర్ ,హుసేన్ బూ దంపతులకు 1850లో  హుసేన్ పుట్టాడు .అయిదవ ఏటనే ఏకాంతంగా ధ్యానం చేసేవాడు .వయసుతో పాటు ధ్యానం గ్రంథ పఠనం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహా యోగులు -21 61-పూదోట లింగావదూత -17వ శతాబ్దం

మనకు తెలియని మహా యోగులు -21 61-పూదోట లింగావదూత -17వ శతాబ్దం కర్నూలు జిల్లా పాలేరు నదీ తీరాన అవుకు గ్రామం లో సోమమ్మ సోమిరెడ్డి దంపతులకు లింగమూర్తి పుట్టాడు .ఐదవ ఏటనే చెట్టు కింద శివనామం జపిస్తూ గడిపేవాడు .తలిదండ్రులు చనిపోగా ఏగంటి శివరామ యోగి మంత్రోపదేశం చేసి,శివ లింగగుహకు తీసుకు వెళ్లి,సమస్త విద్యలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1

  అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1  మౌంట్ శాస్తా నుంచి మేము అక్కడికి చేరగానే ‘’ఇక్కడి పూలు ఎంతబాగా ఉన్నాయో చూడు ‘’అంది నాన్సీ .అన్నిరంగులపూలు కనువిందు చేశాయి .మాన్యుల్ వచ్చి పిల్లలతోకూడా వచ్చినదుకు సంతోషం స్వాగతం అన్నాడు .అమ్మమ్మ కూడా చుట్టూ చూసి పరవశించింది ‘’నాకు కలలో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—20 56-నాగండ్ల ప్రతాప కోటయ్య శాస్త్రి -1854-1896

మనకు తెలియని మహాయోగులు—20 56-నాగండ్ల ప్రతాప కోటయ్య శాస్త్రి -1854-1896 బాపట్లతాలూకా నాగండ్లలో ప్రతాప జోగయ్యశాస్త్రి దంపతులకు కొటయ్యశాస్త్రి 1854లో పుట్టాడు .బాల్యం నుంచే సర్వభూతాలయడ దయ సానుభూతి ఉండేది .దాన ధర్మాలు చేసేవాడు .20ఏట మహాలక్ష్మమ్మతో పెళ్లి జరిగింది .ధనసంపాదనకోసం నిజాం రాష్ట్రం వెళ్ళాడు .ఒక వ్యాధి గ్రస్తుడు నారాయణ కు  స్వస్తత కూర్చటం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—19 46-ఎల్లారెడ్డి పేట హజ్రత్ ఇమామలీ బాబా -1825-1934

మనకు తెలియని మహాయోగులు—19 46-ఎల్లారెడ్డి పేట హజ్రత్ ఇమామలీ బాబా -1825-1934 కరీమ్ నగర్ జిల్లా ఎల్లారెడ్డి పేట కు చెందిన హజ్రత్ ఇమామలీ బాబా గంభీరావు పేట లో 1825 లో జన్మించినట్లు తెలుస్తోంది .110 ఏళ్ళు జీవించి 1934లో మరణించారు .కొంతకాలం బడి పంతులు గా చేశారు .1908లో మూసీ నదికి వరదలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—18 41-త్రికాలజ్ఞాని అవధూత ప్రకాశానంద స్వామి -1871-1963

మనకు తెలియని మహాయోగులు—18 41-త్రికాలజ్ఞాని అవధూత ప్రకాశానంద స్వామి -1871-1963   విజయనగరం దగ్గర ఒక వెలనాటి బ్రాహ్మణ కుటుంబం లో 1871లోవెంకట్రామయ్య ,గౌరమ్మ దంపతులకు అనంతయ్య పుట్టాడు .తండ్రి 8వ ఏట ,15వ ఏట తల్లీ చనిపోయారు .తాత లక్ష్మీ నరసింహం ,నాయనమ్మ మీనాక్షమ్మ ల వద్ద ధర్డ్ ఫారం చదివి ,15వ ఏట … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—17 36-పశి వేదల ప్రజ్ఞానంద స్వామి -1903-1983

మనకు తెలియని మహాయోగులు—17 36-పశి వేదల ప్రజ్ఞానంద స్వామి -1903-1983 పగోజి పాలకొల్లు దగ్గర చింతపల్లిలో వారణాసి రామకృష్ణయ్య మహాలక్ష్మమ్మ దంపతుల రెండవ కుమారుడుగా 7-10-1903శోభకృత్ ఆశ్వయుజ బహుళ పాడ్యమి బుధవారం వెంకటప్పయ్య పుట్టాడు . రామభక్తిఅలవాటై చదువుతో పాటు స్తోత్రాలు కీర్తనలు నేర్చి పాడేవాడు .స్వాతంత్రోద్యమమం లో దేశభక్తి బోధించేవాడు .బ్రహ్మచర్యం అపక్వాహారం గాయత్రీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -9 7-టిం కొత్త సంసారం

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -9 7-టిం కొత్త సంసారం సియాటిల్  వెళ్లాలని నిర్ణయించాను.నామనసులో చలా ప్లాన్లున్నాయి .టెలోస్ గురించి వివరంగా ఒక ఆర్టికల్ రాయాలని ఉంది దాన్ని కేయాస్ ప్రింట్ చేస్తానని హామీ ఇచ్చాడు కూడా .అమ్మమ్మని వదిలి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది . స్వీడన్ స్పిరిట్యు యాలిటితో ఆమెవిసిగిపోయింది .నాతో టెలోస్ వస్తుందేమో అడగాలి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—16 31-అనుభవ యోగి -నిత్యానందస్వామి -1893-1965

  మనకు తెలియని మహాయోగులు—16 31-అనుభవ యోగి -నిత్యానందస్వామి -1893-1965  కడపజిల్లా పొద్దుటూరు తాలూకా పర్లపాడు లో బీరెడ్ది చిన్న చెన్నారెడ్డి అనే పేద కర్షక దంపతులకు ఐదవ సంతానంగా బాల వెంకట సుబ్బారెడ్డి 1893 డిసెంబర్ లో విజయ మార్గశిరమాసం లో పుట్టాడు .బాల్యం లోనే తలి దండ్రులు చనిపోతే పెద్ద జొన్నవరం వెళ్లి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -8

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -8 6-అసాధ్య కార్యం అమ్మమ్మకు  అలౌకిక శక్తులతో ఉన్న పరిచయం కొంత ఉత్సాహం కలిగించి౦దినాకు .ఆమెకు పరిచయమైన  అక్కల్ట్ శక్తులున్న వారందరికీ ఫోన్ చేసి పిలిపించి,శనివారం24మందితో  మీటింగ్ పెట్టింది .హాలోఎర్త్ విశేషాలు వారందరికీ బాగున్నాయనిపించాయి .వాళ్ళ ప్రశ్నలకుసమాధానాలిచ్చాను .వెనకకూర్చున్న ఒకాయన నేను ఇక్కడే ఉంటానా ,టెలోస్ గురించి చెబుతావా అని అడిగాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment