Category Archives: పుస్తకాలు

బక దాల్భ్యుడు -13

బక దాల్భ్యుడు -13 స్కంద పురాణం ప్రకారం ప్రజాపతి బ్రహ్మ ఇంద్రద్యుమ్న రాజును స్వర్గం లో కలిశాడు .ఆయనను చేసిన పుణ్యాలు ,పొందిన కీర్తి ని బట్టి ఒక వంద  కల్పాల కాలం భౌతికశరీరం తో స్వర్గం లో ఉండే ట్లు  అనుగ్రహించాడు .తరవాత అంతా భారత౦ లో ఉన్నదే .ఇక్కడ తాబేలు పేరు ‘’మంధరక’’ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -4

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -4 ఆనాటి కవులలో ముఖ్యుడు జాన్ మిల్టన్ .అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులతో ఆయనరాసిన ‘’పారడైజ్ లాస్ట్ ‘’కావ్యం పద్య కావ్య శిరో రత్నం .ఆయనే రాసిన’’లలేగ్రో ,ఇల్ పెన్స రోసో పద్యకావ్యాలు ,కోమస్ నాటకం ‘’లిసిడాస్’’అనే విషాద గీతం ఆయన ప్రతిబా సర్వస్వాలు .జీవిత చరమాంకం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -12

బక దాల్భ్యుడు -12 ధ్యాన కపటి –నిదానం ,తలవంచుకొని ఉండటం ,అకస్మాత్తుగా దాడి చేయటం కొంగ నైజాలు .ఇలాగే ఉండే వాడిని’’ బకవ్రతికుడు’’అంటారు ఇద్దరూ కపటులే.మౌని బకం అంటే ఆలోచనకోల్పోయి ధ్యానం చేసేవాడనీ అర్ధం .వంచన ,ధ్యానం కొంగ సహజాలు .ఆలోచనలో ఉన్నట్లు ధ్యానంలో ఉన్నట్లూ అనిపించినా అది తనను  నమ్మిన చేపలను  హాయిగా గుటకాయస్వాహా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-48

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-48 గోరోచనవర్ణ నేత్రాలు ,మహాతేజస్వి ,వానర శ్రేష్టుడు అయిన హనుమను రావణుడు చూసి సందేహం కలిగి మనసులో ‘’ఇతడు సాక్షాత్తు నందీశ్వరుడు ‘’లాగా ఉన్నాడేమిటి ?’’అనుకొన్నాడు – ‘’’’శంకాహృతాత్మా దధ్యౌ స కపీన్ద్ర౦ తేజసావృతం –కిమేశ భాగావాన్న౦దీ భవే సాక్షా దిహాగతః’’ పూర్వం నేను కైలాసాన్ని పెకలిచినపుడు నాకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -3    అప్పుడే నాటకసాహిత్యానికి గొప్ప ఊపు వచ్చి ,ప్రేక్షకాదరణ పెరిగి  నాటకాలు వచ్చాయి కాని ఇవన్నీ గ్రీకు ప్రేరణతో వచ్చి విజయం పొందలేదు .అప్పుడే స్వతంత్ర ఆలోచన వచ్చి జాన్ లిలీ ,టామాస్ కిడ్ ,జార్జి పీల్ ,ధామస్ లాడ్జ్ ,రాబర్ట్ గ్రీన్ ,ధామస్ నాష్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -11

బక దాల్భ్యుడు -11 శ్రీ కృష్ణుని భార్యల దుర దృష్టాలకు దాల్భ్యుడు ముఖ్యకారణం చెప్పాడు .వారు అసలు అప్సరసలు .అగ్నిహోత్రుని కుమార్తెలు .వారంతా ఒకసారినారదమహర్షి ని తామంతా నారాయణుడిని భర్తగా పొందాలంటే ఏమి చేయాలని అడిగారు .అంటే వీరికి మొదట్లో కృష్ణునిపై ప్రేమ ఉన్నది .తర్వాత వాళ్ళు నారద శాపానికి గురయ్యారు .దీనికికారణం వాళ్ళు ఆయన్ను … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-47

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-47   భయంకర మహా పరాక్రమ శాలి హనుమ మనసులో ‘’రావణుడు వచ్చి నాతో యుద్ధం చేస్తాడనుకొని అన్ని ప్రయత్నాలూ చేశాను .కాని ఉన్నచోటు కదలకుండా ఆసనం వీడకుండా కొడుకు ఇంద్రజిత్తు ను పంపి నన్ను బంధించి తెప్పించుకొన్న రాజనీతిజ్ఞుడు ‘’అనుకొని ఆశ్చర్యపడి,రోషం తో కన్ను లెర్రబడి రాక్షసరాజును … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -2 చాసర్ మహాకవి ఇంగ్లీష్ భాషను మహా కావ్య రచనకు అనుకూలంగా సంస్కరించి ,పునరుజ్జీవన ఉద్యమానికి ఊపిరులూది ,ఇతర యూరోపియన్ భాషలలోని మంచి సంప్రదాయాలను స్వీకరించి ,కొత్త అలంకారాలతో భాషకు నగలు సమకూర్చాడు .రసాలంకార కృతులకు మార్గ దర్శిగా నిలిచాడు .డి బుక్ ఆఫ్ ది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -10

  బక దాల్భ్యుడు -10 ద్వైతవన౦ లో  బకదాల్భ్యుడు స్వచ్చమైన వేదమంత్రవేత్తగానే కాక అతడు బ్రాహ్మణుల ప్రాముఖ్యం పై ఒక ఉపన్యాసం కూడా చేశాడు .ఇలా బ్రాహ్మణ విధానంగా ఉండే బకుని వామన పురాణం లో ధృత రాష్ట్ర విషయం లో బ్రాహ్మణ నీతులు కూడా చెప్పినవాడిగా చూపబడింది .జైమినేయ అశ్వమేధ౦  లో అతడు ఉత్తర … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-46

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-46 తనకు మండోదరికి జన్మించిన  అక్ష కుమార మరణం తో కుంగినా , నెమ్మదిగా మనసు దిటవు చేసుకొని రావణుడు మేఘనాధుడు అనే తనకొడుకు ఇంద్రజిత్ తో ‘’అస్త్ర శస్త్ర కోవిదుడవు .నీపరాక్రమ౦ సురాసురులకు బాగా తెలుసు .బ్రహ్మను ఆరాధించి బ్రహ్మాస్త్రం పొందావు .దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనిపించుకొన్నావు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -8 ,9

బక దాల్భ్యుడు -8 చైకితాన్య లేక బ్రహ్మదత్త చైకితాన్య పేరు వైదిక సాహిత్యంలోఉపనిషత్తులు ,లేక బ్రాహ్మణాలలో  వినిపిస్తుంది.వారు ఒకరుకాదు ఇద్దరు అనిపిస్తుంది .ఛాందోగ్య ఉపనిషత్ -1.8-9లోమాత్రమే చైకితాన్య దాల్భ్య పేరు మిగిలినవాటిలో బ్రహ్మదత్త లేక దాల్భ్య  పేరు వస్తుంది .కనుక బ్రహ్మదత్తుడు చైకితాన్య దాల్భ్యుడి కొడుకు అయి ఉంటాడు .ఉద్గాత విషయ చర్చలొ  ఈపేరు వచ్చింది.ఈచర్చ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం ఆంగ్లభాష –యాంగిల్స్ ,సాక్సన్స్ అనే జర్మానిక్ జాతిప్రజలు క్రీ,శ 5వ శతాబ్దిలో ఉత్తర ఐరోపా నుంచి వచ్చి ,బ్రిటిష్ దీవుల్ని ఆక్రమించి స్థిరపడ్డారు .వీళ్ళ భాషనే ‘’ఆంగ్లో –శాక్సన్’’భాష అంటారు .దీనికే’’ ఓల్డ్ ఇంగ్లిష్’’ అనే పేరు పెట్టుకొన్నారు .11వ శతాబ్దిలో నార్మన్, ఫ్రెంచ్ దేశస్తులు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-45

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-45 పంచ సేనానులు,వారి మహా సైన్యాలు హనుమ చేతిలో పంచత్వం పొందిన స౦గతి  విని ఆగ్రహావేశాలతో తన దృష్టిని  యుద్దోన్మత్తుడు, తనకుమారుడు అక్షకుమారునిపై నిలుపగా అర్ధం చేసుకొన్న అతడు బ్రాహ్మణుల ఆహూతులతో వృద్ధి చెందినదీప్తానలం  లాగా వేగంగా కదలివెళ్ళాడు హనుమపై యుద్ధానికి . ఆహూతులిస్తేనే అగ్ని ప్రజ్వరిల్లుతుంది .లేకపోతె … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-44

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-44  మంత్రి కుమారుల మరణ వార్తవిన్న రావణుడు కొంచెం కలవరపడినా బయట పడకుండా ,అంతకంటే వీరులు దీశాలురు నీతిమంతులు ఐన విరూపాక్ష యూపాక్ష ,దుర్ధర,ప్రఘస,భాసకర్ణుడు అనే అయిదుగురు సేనానాయులను పిలిచి ‘’మీకు తోడుగా అమేయ బలపరాక్రమ సైన్యం వెంటపెట్టుకొని ఆ కోతిపై యుద్ధం చేసి ,వాడిని ఎలాగైనా అదుపులోకి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-43

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-43 రావణ ఆజ్ఞతో అగ్ని తేజులైన ఏడుగురు మంత్రి పుత్రులు హనుమపైకి వచ్చారు .రంగులతోరణాలు అనేక విధాలైన రథాలు తమతమ అసాధారణ చిహ్నాలతో ఉన్న పతాకాలు తో మేఘధ్వనికలిగిస్తూ వచ్చారు .మేలిమి బంగారు విల్లులతో టంకార ధ్వని చేస్తూ ,మెరుపులతో కూడిన మేఘాల్లా దూసుకొచ్చారు .వారి తల్లులకు కి౦కరులు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 107-చైనీస్ సాహిత్యం -4(చివరిభాగం )

ప్రపంచ దేశాలసారస్వతం1 07-చైనీస్ సాహిత్యం -4(చివరిభాగం ) ఆధునికులైన అయిదుగురు  చైనీస్ రచయితలూ వారి రచనలగురించి తెలుసుకొందాం. 1-చిక్సిన్ లియు -2015లో హ్యూగోఅవార్డ్అనే ప్రతిష్టాత్మక అవార్డ్ ను ‘’త్రీ బాడీ ప్రాబ్లెం ‘’ నవలకు  పొందాడు ఇతనిప్రభావం చాలా మంది యువ రచయితలపై ఉంది .ఇందులో ఎర్త్స్ పాస్ట్ ట్రయాలజి ,దిడార్క్ ఫారెస్ట్ ,డెత్స్ ఎండ్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -7

బక దాల్భ్యుడు -7 ఋగ్వేదం 10.136.1లో కేశిని అగ్ని వాహకుడిగా ,విషవాహకుడుగా ,రెండులోకాల వాహకుడుగా చెప్పింది-‘’కేశిన్ ఆగ్నిం కేశి విషం ,కేశి భిభర్తి రోదశి’’.వ్రాత్యులను  విష బక్షకులుగా పేర్కొన్నారు చాలాచోట్ల .పిబి 17.1.9’’గరగిరో వా –‘’.ఇదేమంత్రం లో కేశి విషాన్ని రుద్రునితోపాటు అదే పాత్రతో తాగాడు -10.136.7.’’కేశి విషస్య పాత్రేన యద్ రుద్రేనా పిబత్ సహా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-42

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-42 తనబలపరాక్రమాలు చూపి చైత్య ప్రాసాదాన్ని నేలమట్టం చేసి తనవానర సేనా బల వివరాలు తెలియజేస్తూ ,అసలు కపి సైన్యం ఎంతుందో ఖచ్చితంగా రావణుడికి తెలియజేశాడు .అందులో కొందరు ఓఘం సంఖ్యకల ఏనుగుల బలం ఉన్నవారు అన్నాడు .ఓఘం అంటే సముద్రం అనే అర్ధం కూడా ఉంది .సముద్రం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -3 6-ప్రామాణిక గ్రంథ యుగం -1368-1890-విదేశీ మంగోలులపై తిరుగు బాటు చేసి చైనీయులు 1368లో వాళ్ళను సాగనంపిన మింగ్ వంశనాయకుడు చక్రవర్తి అయ్యాడు .వీరి పాలన 1644వరకు సాగింది .పాలన సుస్థిరమై శాంతిభద్రతలతో దేశం ఉన్నందున మళ్ళీ లలితకళలకు వికాస కలిగింది .కాని సాహిత్యం లో చెప్పుకోదగిన వికాసం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -6

బక దాల్భ్యుడు -6 కేశి అంటే పొడవైన జుట్టు ఉన్నవాడు అనీ , ఆశ్వబలం ఉన్నవాడనిఅర్ధాలున్నాయి .దీర్ఘ కేశాలు పట్టరాని శక్తికి,బ్రహ్మచారికి  సంకేతం .యాగ బృందాలలో వీరికి గౌరవం ఎక్కువ .దాల్భ్య లేక దార్భ్య అంటే దాల్బునికుమారుడు లేక పవిత్ర దర్భకు చిహ్నం .దర్భశతాకిని యాగం చేయలేదు .జైమినేయ బ్రాహ్మణం లో కేశి కి మరోపేరుగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-41

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-41    రావణ కింకరులను హతమార్చిన హనుమ ఇకపై ‘’కిం కర్తవ్యమ్ ‘’అని ఆలోచించి ‘’అశోకాన్ని విరచి శోక వనం చేశాను .ఇక చైత్య ప్రాసాదాల పనిపట్టి నేలమట్టం చేయాలి ‘’అనిమేరుపర్వత శిఖరాయమాన చైత్య ప్రాసాదం ఎక్కి మారుతి మరోమార్తా౦డుడిలాగా ,పారియాత్రం అనే కులపర్వత౦ లాగా భాసి౦చాడు .లంక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -2 2-కన్ఫ్యూషియస్ యుగం –క్రీ.పూ.202-క్రీ.శ .220-మిహ్ వాంగ్ టీ కాలం లో తొక్కి పడేసిన కన్ఫ్యూషియస్  రచనలను హాన్ వంశీకులు బాగా పునరుద్ధరించి నందుకు దీనికి కన్ఫ్యూషియస్ యుగం అని పేరు వచ్చింది .కొత్త రచనలుకూడా ఎక్కువగా వచ్చాయి .ఐతిహాసిక రచనలు ఎక్కువ .స్యూమా చిన్ రాసిన ‘’పీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -5

బక దాల్భ్యుడు -5 జైమినేయ ఉపనిషత్ బ్రాహ్మణం 3.29-31ప్రకారం కేశి దాల్భ్యునికి తనమేనమామ ‘’ఉచ్చ్శ్రైస్వవస కౌపాయేయ ‘’మరణం తర్వాత కస్టాలు మొదలయ్యాయి.దుఖోప శమనం కోసం వేటకు అరణ్యాలకు వెళ్లి,అక్కడ మేనమామ ప్రేతాత్మను చూశాడు .ఆయన మేనల్లుడి విచారం పోగొట్టి అదృశ్య మంత్ర శక్తిని బోధించి  దేవలోకానికి పంపటానికి వచ్చాడు.అందుకోసం సోమయాగం చేసి మంచి ఉద్గాతను ఎంచుకోమన్నాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-40

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-40 ‘’అల్పకార్య మిదం శేషం ‘’అని గురువుగారు హనుమ అన్నమాట లోకంలో ఒక నానుడిగా కూడా ఉన్నది –ఐనను పోయిరావలయు అస్తినకు ‘’అన్నట్లుగా .అల్పకార్యం అని చెప్పినా బృహత్ కార్యంతో అశోక వనధ్వంశం చేసి మొదటి సారి రాక్షసరాజుపై చావు దెబ్బకొట్టాడు .అక్కడి నుంచి ఇక ఏది చేసినా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 107-చైనీస్సాహిత్యం -1

చైనా భాష –దాదాపు 3వేల ఏళ్ళపై నుండి  వాడుకలో ఉన్నది .లిపి పూర్తిగా ధ్వన్యాత్మకం కాక ,భావాత్మకంగా నూ ఉంటుంది .ఇప్పుడు చైనాలో చాలా మాండలికాలు వ్యాప్తిలో ఉన్నాయి .అవి ఇతర ప్రాంతాలవారికి అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది .భాష కాలక్రమంలో వివిధ వికృతులు పొందింది .అలాంటి మా౦డనలీకాలలో వూ ,  ,యోహ్ ,మీన్ ,క్వాన్హ్వా ముఖ్యమైంవి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం పశ్చిమాసియాలో యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ ను సింపుల్ గా ఎమిరేట్స్ అంటారు .అబుదాబి ,దుబాయ్ ,షార్జా ,అజమాన్ ,ఉమాల్ కొమాన్ ,ఫుజారిహా అనే 7 ఎమిరేట్స్ కలిసి ఉన్నది .రాజధాని –అబూ ధాబి –కరెన్సీ-యుఎయి దిర్హాం .జనాభా 97లక్షలు .ఇస్లాం మతం .భాష-అరబిక్  .సేఫెస్ట్ దేశం .సంపన్న … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -4

బక దాల్భ్యుడు -4 పై పేర్లలో కేశి సత్యకామి పేరు కేశి దాల్భ్య విషయంలో చాలా సార్లు వస్తుంది .కథక సంహిత -30.2ప్రకారం ద్వాదశాహం ,గురించి అందులోని ప్రతి ని గురించిన చర్చల్లో ఉన్నాడు .అందులో చివర ‘’వంశ వ్రశ్చన’’అంటే వేణువుకు గాట్లు పెట్టటం ఉన్నది .దీన్ని కేశి దాల్భ్యుడు చేశాడు .లుసాకపి ఖార్గలి ఏవిధంగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-39

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-39 తనను విపరీతంగా అభినందించిన సీతాదేవిని విడిచి ప్రయాణానికి బయల్దేరుతూ మనసులో ‘’రావణుడి నివాసానికి సంబంధించిన పని ఇంకా కొంచెం మిగిలే ఉన్నది .’’అనుకొన్నాడు ఇంతకు  ముందు సర్గలోనే ఆఅభిప్రాయం ‘’అల్పావశేషం ప్రసమీక్ష కార్యం ‘’అని మనకు అక్కడ సస్పెన్స్ కలిగించి ఇక్కడ దానికి తెర దించాడు .మనసులో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 105-సౌదీ అరేబియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 105-సౌదీ అరేబియా దేశ సాహిత్యం సౌదీ అరేబియా రాజ్యం పడమట ఆసియాలో ఉన్నది .అరేబియన్ అఖండ ద్వీపకల్పం .రాజధాని-రియాద్ –కరెన్సీ-సౌదీ రియల్ .జనాభా 3కోట్ల 40లక్షలు .ఇస్లాం మతం .భాషలు .అధికారభాష అరెబిక్ .అధిక ఆదాయం పెట్రోలియం నిధులు .టూరిస్ట్ లకు భద్రతఉంది .    సౌదీ అరేబియన్ సాహిత్యం కవిత్వం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -3

బక దాల్భ్యుడు -3 కేశి దాల్భ్యుని  విషయం లో ఇద్దరు యజ మానుల మధ్య వైరం ,లేక అధ్వర్యుల మధ్య స్పర్ధ  సామాన్యంగా కనిపిస్తుంది .ఈ కథలలో కేశి  ప్రతినాయకుడుగా లేక ,వేరొకరు ఆయనకు ప్రత్యర్ధిగా కనిపిస్తారు .వారిపేర్లు కూడా మనకు తెలుస్తాయి .కొన్ని చోట్ల కేశి దాల్భ్యుని వృత్తాంతాలు ముఖ్యంగా కర్మకాండ ముఖ్యులతో అంటే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-38

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-38 వెళ్లి పోతున్న మహాత్మ హనుమాన్ తో సీతాదేవి ‘’సగం వయసు వరకు పెరిగి ,ఆతర్వాత నీళ్ళు లేక శోషించి ,దైవికంగా కురిసిన వానతో కోలుకున్న పైరులాగా ,చాలా ప్రియ  వచనాలు పలికిన  నిన్ను చూసి చాలా సంతోషం కలిగింది . ‘’త్వాం దృష్ట్వా ప్రియవక్తారం సంప్రహృష్యామి వానర … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 104-పాకిస్తాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 104-పాకిస్తాన్ దేశ సాహిత్యం పాకిస్తాన్ దక్షిణ ఆసియాలో ఇస్లామిక్ రిపబ్లిక్ .213మిలియన్ లతో ప్రపంచంలో అయిదవ అధిక జనాభా ఉన్న దేశం .33వ పెద్ద దేశం .రాజధాని –ఇస్లామాబాద్ –కరెన్సీ –పాకిస్తాన్ రూపాయి .బీద దేశం .న్యూక్లియర్ పవర్ సాధించింది  అత్యధిక ముస్లిం జనాభాలో రెండవ స్థానం  జాతీయ భాష ఉర్దు.పస్తూ, … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -2

బక దాల్భ్యుడు -2 బక దాల్భ్యుని ఇలాంటి అహంకార ధోరణి ఇతరగ్రంథాలలో కూడా కనిపిస్తుంది .పంచ వింశ బ్రాహ్మణం-25-15-,3,షడ్వింశ బ్రాహ్మణం –1-4-6,గోపథ బ్రాహ్మణం -1-1-31లలో అతడి ఆహ౦కార౦ కనిపిస్తుంది .పంచ వింశ లో సర్పయాగం లో గ్లావుడు(గాలవుడు ?) ఉద్గాతకు సహాయకుడు .ఈ సర్ప సత్తా వలన సర్పాలకు ప్రపంచంలో గట్టి పునాది ఏర్పడింది -25-15-2-‘ఏషు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-37

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-37 చూడామణి ప్రదానం చేశాక హనుమతో సీత ‘’ఈ అభిజ్ఞానంరాముడికి బాగా తెలుసు ,దీన్ని చూసి ఆయన మా తల్లిని ,నన్ను మామమగారిని స్మరిస్తాడు .నువ్వు వెళ్లి రాముడిని తొందరపెట్టి ఇక్కడికి వచ్చే ఏర్పాటు చెయ్యి .నీ ప్రయత్నం సఫలమై నా దుఖం తీరాలి. దీనికి నువ్వే సమర్దుడివి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 103- బంగ్లా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 103- బంగ్లా దేశ  సాహిత్యం భారత దేశానికి తూర్పున బంగాళా ఖాతం అంచున బంగ్లాదేశ ఉన్నది .పచ్చదనానికి పరవళ్ళు తొక్కే జలప్రవాహాలకు నిలయం .పద్మ (గంగ )యమునా మేఘన నదులు సస్యశ్యామలం చేస్తాయి .బోటుప్రయాణానికి అనుకూలం కూడా .దక్షిణాన సుందర వనాలు ,రాయల్ బెంగాల్ టైగర్ లకు ప్రసిద్ధి .రాజధాని –ఢాకా.కరెన్సీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు బక దాల్భ్యుడు -1

బక దాల్భ్యుడు బక దాల్భ్యుడు -1 వేదం లో దాల్భ్యునికి చాలాపేర్లున్నాయి  కాని బక దాల్భ్యుడు మాత్రం అయిదు చోట్లమాత్రమే కనిపిస్తాడు .మొదటి సారిగా ‘’వక దాల్భ్య’’ ,ధృత రాష్ట్ర మహారాజు విచిత్ర వీర్యుడు కథక సంహిత -10.6 లో వస్తాడు .ఇక్కడి యాగ సంవాదం చాలా ముఖ్యమైనది కారణం ఇదే మొదటి ఎపిక్ గ్రంథం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-36

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-36 హనుమ మనసు సంతృప్తి చెంది సీతతో ‘’అమ్మా నిన్ను చూస్తేనే శుభాలు కలుగుతాయి. స్త్రీ స్వభావ భయాలకు ,పతివ్రతా లక్షణాలకు తగినట్లు గా మాట్లాడావు .వీపుమీదఎక్కి నూరు యోజనాల సముద్ర౦ దాటటం స్త్రీలకు  శక్తికి మించిన పనే .రాముడిని తప్ప పర పురుషుని తాకను అని నువ్వు చెప్పిన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-35

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-35 హనుమ మాటలకు సీత ‘’రాముడు నా వియోగానికి దుఖిస్తున్నాడని నువ్వు చెప్పిన మాటలు విషం కలిపిన అమృతం లాగా ఉంది .బాగా- ఐశ్వర్యం కలిగినా ,భరించరాని కష్టం వచ్చినా మనిషి స్వతంత్రుడు కాలేడు,దైవం వాడిని తాళ్ళతో కట్టినట్లు ఈడ్చుకు పోతుంది.దైవం నివారింప శక్యం కానిది .కనుకనే నేనూ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 101-వియత్నాం దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 101-వియత్నాం దేశ సాహిత్యం వియత్నాం ఆగ్నేయ ఆసియాలో సౌత్ చైనా సముద్రం దగ్గర ఉన్న దేశం బౌద్ధ కట్టడాలకు బీచ్ లకు ఆకర్షణ .రాజధాని –హోచిన్ .ఆ దేశ మడమ తిప్పని మహా నాయకుడు హొచిమిన్ స్మారక మార్బుల్ మ్యూజియం  హోచి మిన్ సిటి లో ఉన్నది .కరెన్సీ –వియత్నమీస్ డాంగ్.జనాభా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం 100-సింగపూర్దేశ సాహిత్యం

 సింగపూర్ సావరిన్ రిపబ్లిక్ దేశం  ఆగ్నేయ ఆసియాలో ఉన్న సిటి స్టేట్ .జనాభా 56లక్షలు .కరెన్సీ –సింగపూర్ డాలర్ .చాలా ఖర్చు అయ్యే దేశం .ఆగ్నేయ ఆసియాకు సింహద్వారం సింగపూర్ .ఆధునికతకు,పారిశుధ్యానికి ప్లానింగ్  కట్టడాలు రోడ్లకు  ఆదర్శం.అన్నిరకాల బహిరంగ విసర్జన నిషేధం .బౌద్ధ హిందూ క్రైస్తవమొదలైన 10మతాలున్నాయి .మత స్వేచ్చ ఉన్నది .జాతీయ భాష –మలై.అన్నిరకాల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సూత శౌనకులు

    సూత శౌనకులు ప్రతి పురాణం  ‘’సూతముని  శౌనకాది  మహర్షుల కిట్లనియె ‘’అనే వాక్యం తో ప్రారంభమౌతుంది .ఇందులో మనకు సూతుడు అనే ముని పురాణాలు శౌనకుడు అనే మహర్షితో సహా మిగిలిన వారికి పురాణ ప్రవచనం చేశాడు అని మాత్రమె మనకు తెలుస్తుంది .అసలు వాళ్ళు ఎవరో మనం ఆలోచించం .ఒక వేల … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం 98-కిర్జిస్తాన్సాహిత్యం

కిర్జిస్తాన్ అనే కిర్జి రిపబ్లిక్ దేశం మధ్య ఆసియాలో పర్వతాల నడుమ ఉన్నదేశం .ఉత్తరాన కజకిస్తాన్ పడమర ఉజ్బెకిస్తాన్ ఉంటాయి .రాజధాని –బిష్ కెక్.కరెన్సీ –కిర్జిస్తాన్ సోం.జనాభా 63లక్షలు .అధికారభాషలు –కిర్జిగ్ ,రష్యన్ .సున్ని ముస్లిం దేశం .వ్యవసాయం మినరల్స్ వనరులున్న మధ్యతరగతి దేశం .ఇక్కడి లేక్ ఇస్సికుల్ ను ‘’ది పెరల్ ఆఫ్ సెంట్రల్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాలసారస్వత౦ 96-జార్జియా దేశ సాహిత్యం

ప్రపంచదేశాలసారస్వత౦ 96-జార్జియా దేశ సాహిత్యం ఆసియా ఐరోపా సరిహద్దులో కాకస్ పర్వతాల దగ్గరున్న దేశం జార్జియా .నల్ల సముద్ర బీచెస్ ,వార్డీజియా కేవ్ ,ద్రాక్షతోటలతో ఆకర్షణీయం .టిబిలిసి రాజధాని .కరెన్సీ –జార్జియన్ లరి.టూరిస్ట్ లకు సేఫ్ .పీనట్స్ పీ కాన్స్ ,పీచేస్ ల దేశం .అతి తియ్యని ఉల్లిపంట మరో ప్రత్యేకత .ధనికం కాదు బీదా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-33

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-33 హనుమ చెబుతున్నాడు ‘’రామ లక్ష్మణులు విల్లంబులతో ఋష్యమూక పర్వత సుందర ప్రదేశాలను చూస్తూ ఉండగా   సుగ్రీవుడు భయపడి శిఖరం పైకి పోయి ,నన్ను వారి దగ్గరకు పంపగా నేను వారిని చేరి నమస్కరింఛి సుగ్రీవుని పరిస్థితి తెలియజేయగా ,వారు సంతోషించగా వారిద్దర్నీ బుజాలపై కూర్చో  పెట్టుకొని సుగ్రీవుని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 93-మాల్దీవుల సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 93-మాల్దీవుల సాహిత్యం రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ దక్షణ ఆసియాలో చిన్న ఐలాండ్ .శ్రీలంక ,ఇండియాలకు ఆగ్నేయంలో ఉంటుంది .రాజధాని –మాలె.కరెన్సీ –మాల్దీవియన్ రుఫ్ఫియ .జనాభా సుమారు 5లక్షల 16వేలు .సున్ని ముస్లిం దేశం .భాషలు –ధివేహి జాతీయ భాష .అరెబిక్ ,ఇంగ్లిష్ కూడా మాట్లాడుతారు .ఆదాయ వనరులు –ఫిష్ ప్రాసెసింగ్ ,టూరిజం ,బోట్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment