వీక్షకులు
- 1,212,778 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు
10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు గద్వాల సంస్థానం లోని రాజవోలు ను ఇప్పుడు రాజోళి అంటున్నారు ,ఇక్కడ తుంగభద్రానది తుంగ ,భద్ర అనే రెండు పాయలుగా ప్రవహిస్తుంది .రెండుపాయలమధ్య ఏర్పడిన లంకలో రాజవోలు కోటలు ,ప్రాసాదాలు శిధిలమై కన్పిస్తాయి .దుర్గమధ్యమం లో శ్రీ రామనారాయణ ఆలయం ,ఊరికి రెండుమైళ్ళ దూరం లో నది ఒడ్డున రామేశ్వరాలయం … Continue reading
9-లయగ్రాహి గరుడాచలకవి
9-లయగ్రాహి గరుడాచలకవి ‘’కౌసలేయ మహా ప్రబంధం ‘’అనే అయిదు ఆశ్వాసాల కావ్యరచన చేసిన లయగ్రాహి గరుడాచలకవి చరిత్రకెక్కని చరితార్ధుడు .పాకనాటి రెడ్ల బోరవెల్లి సంస్థానకవి .మిడమిళ్ళ గోత్రీకుడు .ఇంటిపేరు ముష్టిపల్లి ..ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం గాఉన్న బోరవల్లి తర్వాత గద్వాల సంస్థానం లో కలిసిపోయింది .బోరవల్లి రాజుల కులదైవం శ్రీకేశవస్వామికి కవి తన రచన అంకితం … Continue reading
8-పూడూరి కృష్ణయామాత్యుడు
8-పూడూరి కృష్ణయామాత్యుడు భగవద్గీతకు అనువాదం తెలుగులో చేసిన పూడూరి కృష్ణయామాత్యుడు 18వ శతాబ్దివాడు .యోగానంద గురువరుని శిష్యుడను అని చెప్పుకున్నాడు .తన అనువాదానికి ‘’శ్రీ భగవద్గీతార్ధ దర్పణం ‘’అని పేరుపెట్టాడు అయితే యోగానంద అవధూత ‘’గురు శిష్య సంవాదము ‘’,ఆత్మైక్య గీత’’ద్విపద గ్రంథాలురాశాడు .పూడూరు గద్వాలకు దగ్గరున్న చారిత్రిక ప్రదేశం. జైన శైవ వైష్ణవాలకు నెలవు … Continue reading
7-ఇనుగండ్ల కృష్ణ ప్రధాని
7-ఇనుగండ్ల కృష్ణ ప్రధాని ‘’ధర్మరాజాశ్వమేధం ‘’అనే అయిదు ఆశ్వాసాల ద్విపదకావ్యం రాసిన ఇనుగండ్ల కృష్ణ ప్రధాని ఏ కాలం వాడో తెలియదు. అతని కావ్యం వ్రాతప్రతికూడా శిధిలావస్థలో దొరికింది .దీన్ని శ్రీరంగపతికి అర్పితం చేశాడు కవి .ఆశ్వాసాంత గద్యం లో తండ్రి ఇనుగండ్ల సోమమంత్రి అని ,తిరుమల వేంకటేశ దేశికుని చరణ సేవకుడైన తాను రాశానని … Continue reading
6-తురుమిళ్ళ రామన
6-తురుమిళ్ళ రామన ‘’ప్రబంధ యుగానికి చెందినవాడైనా ,మరుగునపడ్డ మాణిక్యం –శేష ధర్మాలను ప్రబంధంగా రాసిన తురుమిళ్ళ రామన ‘’ అని వ్యధ చెందారు బిరుదరాజువారు .ప్రాచీనులలో తామరవల్లి తిమ్మయ్యావధాని ,వెణుతురుపల్లి విశ్వనాధకవి ,కొడిచర్ల శ్రీనివాసకవి ,కానాల నరసింహకవి,ఆధునికులలో చెదలువాడ సుందర రామ శాస్త్రి ,అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి ,నోరి గురు లింగ శాస్త్రి ,ఎస్ శఠకోపాచారి … Continue reading
5-బోయినపల్లి కుమార వేంకటరాయలు
5-బోయినపల్లి కుమార వేంకటరాయలు ‘’కవిరాజుల చరిత్రయేకాదు,రాజకవుల చరిత్ర కూడా కాలగర్భం లో కలసిపోయింది ‘’అని ఆచార్య బిరుదరాజు రామరాజుగారు బాధ పడ్డారు .బోయినపల్లి కుమార వెంకట రాయలు పానగల్లు దుర్గాధిపతి ఐన పద్మనాయక ప్రభువు .కవి పండితులను పోషించటమేకాకుండా సప్త సంతానాలను ప్రతిస్టించినవాడు .కాలం 17వ శతాబ్ది మధ్యభాగం .’’ద్రౌపదీ పరిణయం ‘’అనే అయిదు ఆశ్వాసాల … Continue reading
4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు
4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు ‘’నవీనం ద్రోణ పర్వం ‘’రాసిన కొటికలపూడివీర రాఘవాచార్యులు గద్వాల సోమనాధ భూపాలుని ఆస్థానకవి .17వ శతాబ్దం వాడు .కొటికలపూడి వీరరాఘవకవి సంస్కృతం లోశ్లోక తాత్పర్యాలతో సహా రాసిన భారత౦ లోని ఉద్యోగ పర్వాన్ని 1821లో గద్వాలప్రభువులు ముద్రింపి౦చారు .దీన్ని పూడూరి చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు కవి .ప్రతి ఆశ్వాసం లోనూ స్వామిని … Continue reading
3-శేషభట్టరు శి౦గరాచార్యులు
3-శేషభట్టరు శి౦గరాచార్యులు జటప్రోలు సంస్థానాదీశులైన సురభివారు మంచి కళాపోషకులు .కాకతీయ, విజయనగర ,గోల్కొండ రాజులకు సామంతులు గా ఉన్నారు .శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రి గారు ‘’జటప్రోలు సంస్థానాధీశ్వరుల చరిత్ర ‘’రాశారు .ఈ సంస్థాన రాజులలో 21వ తరానికి చెందిన చిన్నమాధవరావు భూపాలుని ఆస్థానకవి యే శేషభట్టరు శి౦గ రాచార్యులు ‘’శూద్ర ధర్మోత్పల ద్యోతినీ స్మృతి … Continue reading
2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు
2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు ఆరు ఆశ్వాసాల ‘’నృసింహ పురాణం ‘’రాసిన బారి గడ్పుల ధర్మయా మాత్యుడుకూడా విస్మృత కవి అయ్యాడు .దీని శిధిల తాళపత్ర గ్రంథం గద్వాల సంస్థానం నుంచి ఆచార్య బిరుదరాజు రామరాజు గారు సంపాదించి ఆ కవి, కృతి చరిత్రను లోకానికి అందించి పుణ్యం కట్టుకొన్నారు .ఇందులోని చివరి పత్రం వలన … Continue reading
రాజా బహరీ పామనాయక భూపాలుడు
రాజా బహరీ పామనాయక భూపాలుడు 18 వ శతాబ్దం మధ్యలో సురవరం సంస్థానాన్ని వైభవంగా పాలించినవాడు రాజా బహారీ పామనాయక భూపాలుడు .అసలుపేరు రాఘవ భూపాలుడు .పీతాంబర నాయకుని పౌత్రుడు .తండ్రి రమణ భూపాలుడు, తల్లి లక్ష్మమాంబ .సురపురమే షోరాపురమైంది .దీన్ని బేడరు లేక’’ నిర్భయులు’’ అనే తెలుగు నాయకులు పాలించారు .వీరు అనాగరికులని ,మైసూరులోని … Continue reading
సోమేపల్లి వారి నాలుగవ నానీల సంపుటి –చేను చెక్కిన శిల్పాలు
సోమేపల్లి వారి నాలుగవ నానీల సంపుటి –చేను చెక్కిన శిల్పాలు అందమైన శీర్షిక భావాన్ని ప్రతిబింబించే పచ్చని చేలు, అందులో పండిన బంగారు మొలకలు , ధాన్యం తో అబ్బు ఆర్ట్స్ అలరించిన అలరించిన ముఖ చిత్రం తో ,లోపలి కవితా శీర్షికలకు అంతే ప్రతిభతో గీసిన ‘’పాణి ‘’చిత్రాలతో ,చూడంగానే ‘’చేను చెక్కిన శిల్పాలు … Continue reading
గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 412-ఆకాశవాణి సంస్కృత ప్రసంగాలు చేసిన వే.పండిత పెద్దమఠం రాచ వీర దేవర తీర్ధ
గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 412-ఆకాశవాణి సంస్కృత ప్రసంగాలు చేసిన వే.పండిత పెద్దమఠం రాచ వీర దేవర తీర్ధ కావ్య తీర్ధ ,ధర్మనిరత ,వీర శైవ సాహిత్య సార్వభౌమ ,సాహిత్య భూషణ ,సాహిత్య విశారద ,వీర శైవ ఆగమ సాహిత్య చతుర,పుంభావ సరస్వతి వే.పండిత రాచ దేవర తీర్ధ తనజీవితాన్ని వీరశైవ మత వ్యాప్తికి అంకితం చేసిన … Continue reading
గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 411-శ్రీ పైడితల్లి సుప్రభాత కర్త –ఆచార్య మానాప్రగడ శేషసాయి (1927-2019)
గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 411-శ్రీ పైడితల్లి సుప్రభాత కర్త –ఆచార్య మానాప్రగడ శేషసాయి (1927-2019) ప్రముఖ సాహితీవేత్త, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల పూర్వాచార్యులు మానాప్రగడ శేషసాయి (93) మంగళవారం ఉదయం 5.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. పట్టణంలోని పూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న ఆయన గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.1927 ఆగస్టు 14న పశ్చిమగోదావరి జిల్లా గునుపర్రులో మానాప్రగడ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూరమ్మ, బాపిరాజు. … Continue reading
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము గ్రంథ కర్త పరిచయం
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము గ్రంథ కర్త పరిచయం పేరు-గబ్బిట దుర్గా ప్రసాద్ జననం -27-06-1940-ఉయ్యూరు తల్లి దండ్రులు –గబ్బిట భవానమ్మ,,మృత్యుంజయ శాస్త్రి విద్య –ఎం .ఏ .(తెలుగు ),బి.ఎస్.సి .,బి .ఇ.డి. వివాహం –ప్రభావతి తో(21-02-1964) ఉద్యోగం –ఉపాధ్యాయ వృత్తి (ఫిజికల్ సైన్స్),ప్రధానోపాధ్యాయుడు కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు(1963-1998) సంతానం … Continue reading
మానవ భద్రతపై మహాత్ముని దృక్కోణం
’నాగరకత కు అసలు అర్ధం గుణకారం కాదు .స్వచ్చందంగా ఐచ్చికంగా కోరికలు తగ్గించుకొని అసలైన సంతృప్తి ,సంతోషం పొంది ,సేవాభావంతో ధన్యత చెందటమే ‘’ మానవ భద్రత నూతన మైన భావం అన్నది ఒక నిజం . అదివ్యక్తి అనుభవించే సంక్లిష్ట ,ఒకదానితో ఒకటి సంబంధమున్న విషయాలను వివరించేది .దీన్ని ప్రతిపాదించేవారు సంప్రదాయ మామూలు … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -34(చివరిభాగం )
జనకుడు ‘’ఆతుర సన్యాసం ‘’విశేషాలు చెప్పండి మహాత్మా !’’అని అడిగాడు .’’మనసు వాక్కు చేత సన్య సి౦చాలి .ఇది వేదమార్గం దీనిననుసరిస్తే బ్రహ్మవేత్త ఔతాడు.సంవర్తకాదులు ,పరమ హంసలు రహస్యమైన ఆచారాలు పాటిస్తూ ఇతరులకు ఉన్మత్తులుగా అనిపిస్తారు .పరమహంసలు త్రిదండం కమండలం ,శిక్యం , ,పవిత్ర జలపాత్ర,శిఖా ,యజ్ఞోపవీతాలను ‘’భూ స్వాహా ‘’అనే మంత్రం చేత … Continue reading
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -33
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -33 తురీయాశ్రమం ఒకసారి మిధిలానగర వనం లో శిష్యులతో జనకమహారాజుతో ఉన్న యాజ్ఞవల్క్యునితో బృహస్పతి ‘’మహర్షీ !దేవుల అంటే ఇంద్రియాల ,దేవయజనాల అంటే ఇంద్రియ అధిష్టాన దేవతల,బ్రహ్మ సదనానికి కురుక్షేత్రం ఏది ?’’అని అడిగాడు .’’అవిముక్తమే కురుక్షేత్ర౦ .ఎక్కడికి పోయినా అదే కురుక్షేత్రం అనే భావన తో ఉండాలి .అందులోనే … Continue reading
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -32
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -32 ఉపాధుల గురించి చెబుతూ యాజ్ఞవల్యుడు ‘’జనన మరణ ప్రవాహరూపమైన సంసారం కల జీవుడు సంపూర్ణ పరబ్రహ్మమే .ఈ పరబ్రహ్మం దేహం లో బుద్ధితోకూడి విజ్ఞానమయమవుతుంది .మనసుతోకలిసి మనోమయమౌతుంది .ప్రాణం తోకలిసి ప్రాణమయమౌతుంది .నేత్రాలతో నేత్రస్వరూపం శ్రోత్రం తో శ్రోత్ర స్వరూపం అలాగే పృధ్వీ జల వాయు ఆకాశ తేజోమయ అజోమయ … Continue reading
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -31
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -31 జనకుడు మహా మేధావి అని గ్రహించి యాజ్ఞవల్క్యుడు ‘’పరమానంద స్వరూపమైన ఆత్మ స్వప్నం లో రమి౦చి చరించి ,పుణ్య పాపాలు చూసి ,తిరిగి బుద్ధాంతం చేత ప్రతి స్థానం పొందుతుంది .స్వప్నాంతం అంటే స్వప్న స్థానం బుద్ధాంతం అంటే జాగ్రత స్థానం .శరీరం ఊర్ధ్వ శ్వాసం వలన శరీరమైన ఆత్మ … Continue reading
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -30
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -30 ‘’స్వయం జ్యోతిస్వరూపుడైన ఆత్మ స్వప్నం నుంచి సుషుప్తి పొందగోరి స్వప్నం లోనే మిత్ర బంధులాదిగా దర్శనం చేత అనురాగం పొంది ,అనేక విధాలుగా సంచరిస్తూ , పుణ్యపాపఫలాలను చూస్తూ’’ సంప్రసాదం ‘’అంటే జాగ్రతలో దేహెంద్రియాది వ్యాపార సమూహం వలన పుట్టిన కాలుష్యాన్ని వదిలేసి వాటి వాసనలైన స్వప్న వ్యాపారాలను విడిచేసి … Continue reading
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29 ‘’ప్రాణాలలో ఉన్న విజ్ఞానమయ ఆత్మ గురించి వివరించండి?’’అని జనకర్షి అడుగగా మహర్షి ‘’హృదయం లో, కంఠంలో ఉన్న తేజో రూప పురుషుడి నే ఆత్మ అంటారు .ఈ ఆత్మను బుద్ధి ధ్యాని౦చేప్పుడు ధ్యానించే దాని లాగా ,బుద్ధి ఇంద్రియాలు చలిస్తున్నప్పుడు చలించే దానిలాగా ఉండి,బుద్ధితో సమానమైన ఇహ ,పర లోకాలను … Continue reading
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -28 బ్రహ్మోప దేశం
ఒక రోజు విదేహరాజు జనకుడు ఆసనం దిగి యాజ్ఞవల్క్య మహర్షి చెంతకు వచ్చి’’భగవాన్ !నమస్కార శతం. నాకు ఈ రోజు బ్రహ్మోపదేశం చేయమని మనవి చేసుకొంటున్నాను ‘’అన్నాడు అత్య౦త వినయ విధేయతలతో.దానికి మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’మహారాజా !నువ్వు ఉపనిషత్తులు సాకల్యంగా విని సమాహితాత్ముడవయ్యావు .నువ్వు పూజ్యుడవు సార్వ భౌముడవు వేదాధ్యయనం చేసి జ్ఞాన విజ్ఞాన సముపార్జన … Continue reading
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -27
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -27 శిష్యుడిని కృతార్దుడిని చేశాకే ఏదైనా గ్రహించాలి అని చెప్పి వేరే గురువేదైనా చెప్పాడా అని అడిగాడు .వృష్ణుని కొడుకు బర్కుడు నేత్రాలే బ్రహ్మ అన్నాడని చెప్పగా .మహర్షి నేత్రానికి నేత్రమే శరీరం. ఆకాశమే ఆశ్రయం .నేత్ర స్వరూప బ్రహ్మాన్ని సత్యంగా ఉపాసన చేయాలి కన్ను చూసిందే సత్యం కనుక అదే … Continue reading
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -26 ప్రబోధం
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -26 ప్రబోధం ఒకరోజు యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళగా అత్యంత భక్తీ శ్రద్ధలతో పూజించి ‘’గోవులు కావాలనా లేక నా చేత ఏదైనా అర్ధవంతమైన ప్రశ్న అడిగి౦చు కోవాలనా తమరు దయ చేశారు ?’’అని అడిగాడు గౌరవంగా .’’రెండిటికోసం వచ్చాను బ్రహ్మం గురించి ఇదివరకుఎవరైనా నీకు చెప్పినదంతా నాకిప్పుడు … Continue reading
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -25 యోగ బోధ
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -25 యోగ బోధ ఒక రోజు బ్రహ్మవేత్తలతో ఉన్న యాజ్ఞవల్క్యుని గార్గి ‘’యోగతత్వాన్ని సంపూర్ణంగా తెలియ జేయండి ‘’అని అడిగింది .యాజ్ఞవల్క్యుడు ‘’నేను పూర్వం బ్రహ్మ వలన విన్నదే మీకు చెబుతాను .జ్ఞానానికి ప్రవర్తకం, నివర్తకం అని రెండుమార్గాలను వేదం చెప్పింది .కామ సంకల్పక పూర్వమైన వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవర్తకం … Continue reading
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -24 వివాహం సంతానం
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -24 వివాహం సంతానం గార్గి తన అన్న మిత్రుని తో కూతురు మైత్రేయి వివాహ విషయం కదిలించింది .యుక్తవయసు వచ్చి౦ది కనుక వివాహం చేయాలని ఆమె మనసులో మాట కనుక్కోమని సోదరికి చెప్పాడు .ఆమె అడిగింది .దానికి మైత్రేయి ‘’బిడ్డల అభిప్రాయం తలి దండ్రులకు తెలిసే ఉంటుంది ‘’అన్నది .గార్గి … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -23
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -23 శాకల్యుడు ‘’శరీరం హృదయం దేనిలో ప్రతిస్టింప బడ్డాయి ?’’ యాజ్ఞవల్క్యుడు ‘’ప్రాణవాయువు లో .అది అపానవాయువులో .అది వ్యానవాయువులో .అది ఉదాన వాయువులో అది సమానవాయువులో ప్రతిష్టింప బడినాయి ‘’అనగానే ఇక మాట్లాడక ఊరుకున్న మేనమామను ‘’ఔపనిషద పురుషుని గురించి నువ్వు వివరించిచెప్పు ..చెప్పకపోతే తలపగిలి చనిపొతావు ‘’అన్నాడు … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -21
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -21 గార్గి రంగ ప్రవేశం చేసి తాను రెండు ప్రశ్నలు యాజ్నవల్కుని అడుగుతానని ,ఆయన సరైన సమాధానాలు చెబితే అతడిని ఇక ఎవరూ జయించలేరని సభలోని వారికి చెప్పగా వారంతా అంగీకరించగా ‘’దేనిలో ద్యులోకానికి పైన ,భూమికి కింద ,అండకపాలానికి మధ్య ఉంటూ భూమి అంతరిక్షాలను ప్రవర్తి౦ప చేసేది చేయగలిగేది … Continue reading
త్యాగ ధనుల కు కీ శే . విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారి నివాళి
మా తండ్రిగారు కీ .శే .విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రిగారు అనంతపురం జిల్లా హిందూపురం ఎడ్వర్డ్ కారోనేషనల్ హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండిట్ గా 1950లో పని చేస్తున్నప్పుడు ”త్యాగ ధనులు ”అనే పుస్తకం రచించారు .దీనికి ఉయ్యూరు లోని ఉమాప్రిస్ నిర్వాహకులు ,మా నాన్న గారి ముఖ్య స్నేహితులు శ్రీ ఆదిరాజు చంద్ర మౌళీశ్వరరావు … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -20
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -20 వచక్నుని కుమార్తె గార్గి ,తన సహోదరి కూతురు మైత్రేయిని కూడా వెంటబెట్టుకొని వచ్చి ‘’యాజ్ఞవల్క్యా !అంతా ఉదకాలలో ఓత,ప్రోతాలుఅయ్యాయని అంటారు .ఉదకాలు దేనిలో ఓతప్రోతాలయ్యాయి ?’’అని ప్రశ్నించింది .ఇక్కడఓత పోతాలు అవటం అంటే వస్త్రం లో ఉండే పడుగు పేక లాగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం .యాజ్ఞవల్యుడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -54 74-సిద్ధ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -54 74-సిద్ధ తీర్ధం పులస్త్య వంశ సంజాతుడు రావణుడు అన్ని దిక్కులూ జయించి ,సోమలోకం పైకి దండెత్తాడు .అప్పుడు బ్రహ్మ తానొక మంత్రం ఇస్తాను యుద్ధం విర మించమని చెప్పాడు .శివుని అష్టోత్తర శతనామాలతో ఉన్న మంత్రం ఉపదేశించాడు .మంత్రం గ్రహించి చంద్రలోకాన్ని జయించి అన్ని చోట్లా విజయం సాధించి కైలాసం వెళ్ళాడు … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -19
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -19 లహ్యుని పుత్రుడు భుజ్యుడు ‘’మేము అధ్యయనం కోసం వ్రతం చేస్తూ ,మద్ర దేశం లో కసి గోత్రజుడు పతంజలి ఇంటికి వెళ్లాం .అతని కూతురు అమానుష గాంధర్వ గ్రహా ష్టయైఉంటుడగా అతడిని ఎవరు అని అడిగితె తాను ఆంగీరస గోత్రజు డైన సుధన్వుడను అని చెప్పాడు .అతడి గురించి … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -18
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -18 జరత్కార గోత్రుడు ,రుతభాగుని కొడుకు ఆర్తభాగుడు యాజ్ఞవల్క్యుని ‘’గ్రహాలెన్ని ?అతి గ్రహాలెన్ని ‘’?అని అడిగాడు .గ్రహాలూ అతిగ్రహాలు ఎనిమిదేసి అన్నాడు మహర్షి .వివరించమని కోరగా యాజ్ఞవల్క్యుడు ‘’’ఘ్రాణ ఇంద్రియమే గ్రహం .దానికి సంబంధించిన గంధమే అతి గ్రహం .లోకం నిశ్వాస వాయువు చేత తీసుకోబడి వాసన అనుభవిస్తుంది .వాగింద్రియమే … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -53 72-కపిలా సంగమ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -53 72-కపిలా సంగమ తీర్ధం ముల్లోకాలలో ఉత్తమోత్తమమైనది కపిలా సంగమతీర్ధం .కపిలముని క్రూరుడే అయినా ప్రసన్నుడు .గౌతమీ తీరం లో తపస్సు చేసుకొంటున్న ఆయనదగ్గరకు వేనుని సంహరించి ,రాజ్యం అరాజకంగా ఉండటం చేత వామదేవాది మునులు వచ్చి వేదాలు యజ్ఞయాగాదులు ఆదరణకు నోచుకోవటం లేదని చెబితే ,వేనుని తొడ చిలికితే పరి ష్కారంలభిస్తుందని … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -17
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -17 మేనల్లుడిపై మాటల విషం కక్కుతూ శాకల్యుడు అక్కడి రుషిగణంతో ‘’తానొక్కడే విద్వాంసుడను అనే గర్వతో యాజ్ఞవల్క్యుడు ప్రవర్తిస్తూ మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు .ఇప్పుడు జనకమహా రాజుఆహ్వాన పై కురు పాంచ దేశాలను౦ డి ఎందరెందరో వేదవిదులు వచ్చారు. వారి ముందు అతడిని ప్రశ్నించి ఎండగడదాం ‘’అన్నాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -52 70-ఖడ్గ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -52 70-ఖడ్గ తీర్ధం గౌతమీ నది ఉత్తరతీరం లో ఖడ్గతీర్ధం స్నాన దానాలచేత మోక్షాన్నిస్తుంది .కవషుని పుత్రుడు కైలూషుడు యాచనతో కుటుంబపోషణ చేస్తున్నాడు .కాని తగినంత ఆదాయం రాక వైరాగ్యం పొంది ,తండ్రిని జ్ఞానఖడ్గం తో క్రోధ మోహాలను ఖండించే ఉపాయం చెప్పమని అడిగాడు .ఈశ్వరుని నుండి జ్ఞానం పొందాలని తండ్రి చెప్పాడు … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -16
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -16 మహారాజు కోరికకు మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’సార్వభౌమా !లోకం లో ఒకరిని మించినవారొకరుంటారు అన్ని విధాలా అధికుడైనవాడినే గురువుగా చేసుకొని బ్రహ్మ విద్య నేర్వాలి. కురు ,పాంచాల దేశాలలో ఎందరో అలాంటి మహానుభావులున్నారు .వారిని పిలిపించి ఎంచుకొంటే గొప్ప గురువు లభించకపోడు ‘’అనగా ‘’లోకమంతా ఆరాధించే మీరు తప్ప అన్యగురువులెవరు … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -15
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -15 చనిపోయినవాడు పొందే స్థానాల గూర్చి వివరించమని యాజ్ఞవల్క్యమహర్షినిజనకమహారాజు అడిగాడు .ఆయన ‘’ఆత్మ-పాదాలనుంచి నిష్క్రమిస్తే విష్ణువు యొక్కయు ,పిక్కలనుండి పొతే వసువుల యొక్క,మొకాలినుంచి అయితే మహా సాధ్యులయొక్క,గుదం నుండి అయితే మిత్రునియొక్క,జఘనం నుంచి అయితే భూమి యొక్క ,పార్శ్వాలనుండి అయితే మరుత్తులయొక్క,నాశిక నుండి అయితే చంద్రుని యొక్క,వక్షం నుంచి అయితే … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -51 69-భాను వాది సహస్ర తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -51 69-భాను వాది సహస్ర తీర్ధం శర్యాతి అనే రాజు ధార్మికుడు .భార్య స్థవిష్ట.విశ్వామిత్ర గోత్రజుడు ,’’మధుచ్చందుడు ‘’అనే పేరున్న బ్రహ్మర్షి పురోహితుడు .ఇద్దరూ కలిసి ఒకసారి దిగ్విజయ యాత్ర చేశారు .ఒక చోట విడిది చేసి పురోహితుడు అన్యమనస్కంగా ఉండటం గ్రహించి రాజు కారణమేమిటి అని అడిగాడు .భార్య తనకై ఎదురు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -50 67-విష్ణు తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -50 67-విష్ణు తీర్ధం ముద్గాలమహర్షి కుమారుడు మౌద్గల్య మహర్షి ఒకభార్య జాబాలి. మరొక ఆమె భాగీరధి .ప్రతిరోజూ గౌతమీతీరం లో శమీ పుష్పాలు ,కుశలు తో విష్ణుపూజ చేసేవాడు .ఆయన ఆహ్వానం అందుకొని గరుత్మంతుని ఎక్కి అక్కడికి వచ్చి దర్శనమిచ్చేవాడు .విష్ణువు మౌద్గల్యునికి అనేక చిత్రకథలు చెప్పేవాడు .మధ్యాహ్నం కాగానే ముని అలసిపోయినట్లు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -49 65-చక్రతీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -49 65-చక్రతీర్ధం స్మరణం చేతనే పుణ్యం ముక్తికలిగించేది చక్రతీర్ధం .వసిస్టాది మునులు ఒకప్పుడు గౌతేమీ తీరం లో ఆశ్రమం నిర్మించుకొని సత్ర యజ్ఞం చేశారు .దానవులు దారుణంగా విఘ్న ధ్వంసం చేస్తుంటే బ్రహ్మ దగ్గర మొరపెట్టుకోగా దానవ వినాశనం కోసం ఒక స్త్రీని సృష్టింఛి మునులకు అందజేశాడు .జన్మరాహిత్యం కలిగి కృష్ణవర్ణం రక్తవర్ణం … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -14
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -14 యాజ్ఞవల్క్యుడు ‘’జనకరాజా !ముండ్ల దుబ్బు ,ముండ్ల గడ్డి వేరు వేరు అయినట్లే ,పురుషుడు ,ప్రకృతి వేరు వేరు .వీరి పరస్పర సంయోగం వలన వేరు అనిపిస్తారు .మేడిపండుపై ఉన్న దోమ ఆపండు లో భాగం కాదు .నీటిలోని చేప నీటికంటే వేరు .కుంపటి అందులోని అగ్ని వేరువేరు అని … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -13
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -13 అవ్యక్తం లో ఉన్న పరమ పురుషుని స్వభావం వర్ణించి చెప్పమని జనకుడు అడిగాడు .యాజ్ఞవల్క్యుడు ‘’పరముడు ప్రకృతిలో ఉన్నా ,దాని స్వభావం పొందకుండా తన స్వభావం తోనే ఉంటాడు .సాధారణంగా అచేతనంగా ఉండే ప్రకృతి అతడు అధిస్టించినపుడు అది సృస్టించటానికి సంహరించటానికి శక్తి కలిగిఉంటుంది ‘’అన్నాడు .జనకుడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -48 64- శుక్ల తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -48 64- శుక్ల తీర్ధం భరద్వాజముని భార్య’’ పైఠీనసి’’ఒకరోజు యజ్ఞానికి పురోడాశం తయారు చేస్తుండగా ,ఆపోగానుంచి మూడులోకాలను భయపెట్టే రాక్షసుడు ఏర్పడి పురోడాశం తినేశాడు .కోపించినముని అతడిని ప్రశ్నిస్తే తను సంధ్యా ,ప్రాచీన బర్హి లకుమారుడనని ,స్వేచ్చగా యజ్ఞాన్ని భుజి౦చమని బ్రహ్మవరమిచ్చాడని చెప్పగా తన యజ్ఞాన్ని రక్షించమని ముని కోరగా ‘’పూర్వం బ్రహ్మనన్నునల్లగా … Continue reading






