Category Archives: పుస్తకాలు

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -12

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -12 ‘’ఆధ్యాత్మ ,అధిభూత అది దైవతాల గురించి చెప్పండి ‘’అడిగాడు జనకుడు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’పాదాలు అధ్యాత్మ,గమనం అది భూతం విష్ణువు అది దైవతం .పాయువు ఆధ్యాత్మ మల విసర్జన అధిభూతం సూర్యుడు అది దైవతం .ఉపస్థ అధ్యాత్మం ,దాని ఆనందం అధిభూతం ,ప్రజాపతి అధి దైవం .చేతులు అధ్యాత్మ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -47 62- యమతీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -47 62- యమతీర్ధం పితృదేవతలకు ప్రీతికరమైన యమ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .పూర్వం ‘’సరమ ‘’అనే దేవ శునక స్త్రీ ఉండేది .ఆమెకు శ్రేష్టమైన రెండు మగ శునకాలు పుట్టాయి .వాటికి నాలుగు కళ్ళు ఉండటం చేత వాయు భక్షణకోసం రోజూ దేవతలవెంట వెళ్ళేవి .వీటిపై యముడికి ప్రీతి ఎక్కువ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -11

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -11 సరే అని ‘’బ్రహ్మం ‘’విషయం పై చర్చిద్దామన్నాడు జనకుడు .అప్పుడు జనకుడు బ్రహ్మ అంటే  వసిస్టుడయ్యాడు .మరో సారి జనక యాజ్ఞావల్క్యులు అగ్నిహోత్రం  గురించి చర్చించారు..అగ్ని హోత్ర ద్రవ్యం గురించి తెలుసా అని రాజు అడిగాడు .తెలుసు అనగా చెప్పమంటే పాలు అన్నాడు .అవిలేకపోతే దేనితో హోమం చేస్తావని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -46 61- ఆపస్తంభ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -46 61- ఆపస్తంభ తీర్ధం స్మరణ మాత్రాన పాపక్షయం చేసేది ఆపస్తంభ తీర్ధం . ఆపస్తంభముని భార్య’’అక్షసూత్ర’’పతి భక్తీ పరాయరాలు వీరి కొడుకు ‘’కర్మి’’ గొప్ప తత్వ వేత్త .ముని ఆశ్రమానికి ఒకసారి అగస్త్యమహర్షి రాగా శ్రద్ధగా ఐది సత్కారాలతో పూజించాడు .ఆపస్తంభుడు అగస్త్యుని దేవతలకు కూడా పూజింపదగిన వాడేవ్వరో తెలియజేయమని కోరాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -45 60-ఇంద్ర తీర్ధం  

గౌతమీ మాహాత్మ్యం -45 60-ఇంద్ర తీర్ధం ఇంద్ర తీర్ధంలో వృషా కపము ,ఫేన్యాది సంగమం హనూమత తీర్దాలున్నాయి .నముచి ఇంద్ర శత్రువు. నముచి తలను నురుగును వజ్రాయుధం చేసి  ఛేదించాడు ఇంద్రుడు .ఆతల గంగ దక్షిణ తీరం నేలపై పడి,భూమిని చీల్చుకొని పాతాళం చేరింది .అఫేనం అంటే నురుగే ఫేనానది గా ప్రవహించింది .ఫేనా గంగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -44 59-తపో వనాది తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -44 59-తపో వనాది తీర్ధం గోదావరి  దక్షిణ  తీరం లో నందినీ సంగమస్థానాన్ని తపోవన తీర్ధం ,సిద్దేశ్వర తీర్ధం శార్దూల తీర్ధం అంటారు .పూర్వం దేవతల హవ్యాన్ని ధరించే అగ్ని హోతగా ఉండేవాడు.అతనిభార్య దక్షుని కూతురు స్వాహాదేవి .సంతానం కోసం తీవ్ర తపస్సు చేస్తే భర్త సంతోషించి త్వరలోనే కొడుకులు పుడతారని చెప్పగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -10

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -10       గ౦ధర్వ రాజు విశ్వావసువు యాజ్ఞవల్క్యుడు చెప్పినదానికి సంతృప్తిపడి,ఆయన మనసు ఎప్పుడూ బుద్ధి తో కూడి ఉండాలని చెప్పి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి దేవలోకానికి వెళ్ళాడు .దేవలోకం లోనూ ,భూలోక ,అధోలోక వాసులకూ విశ్వావసువు యాజ్ఞవల్క్య దర్శనాన్ని బోధించినట్లు మహా భారతం లో ఉంది.   మిధిలా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -9

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -9 యాజ్ఞవల్క్యుడు ఆదిత్యుని నుండి పొందిన యజుస్సులను ఇతరులకోసం సంస్థాపించి ,బ్రహ్మం గురించి చింతనలో పడ్డాడు .అప్పుడు విశ్వా వసువు అనే గ౦ధర్వరాజు  ఆయన వద్దకు వచ్చి ‘’వేదాంత శాస్త్రం లో బ్రాహ్మణోక్తమైనది,సత్యమైనది ఉత్తమమైనది ఏదో తెలియజేయండి ‘’అని అడిగాడు .ఇదేకాక వేదాలను గురించి 24ప్రశ్నలు ,అన్వీక్షకి గురించి మరొక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -43 57-తపస్తీర్ధం  

గౌతమీ మాహాత్మ్యం -43 57-తపస్తీర్ధం   తపస్సును వృద్ధి చెందించేది తపస్తీర్ధం .ఒకప్పుడు రుషులమధ్య జలం అగ్ని ల విషయం లో సంవాదం జరిగింది .కొందరు అగ్ని గొప్ప అంటే, మరికొందరు నీరు గప్ప అన్నారు.తగాదా తీరక బ్రహ్మ దగ్గరకు వెళ్లి అడిగారు .బ్రహ్మ ‘’అగ్ని,  జలం ఇద్దరూ పూజనీయులే .వారివల్లనే జగత్తు ,హవ్యకవ్యాలు అమృతం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -8

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -8 ఇందులోని 7వ భాగాన్ని 25-9-18న రాశాను . యాజ్ఞ వల్క్య మహర్షి మేనమామ శాకల్యుడు మేనల్లుడిపై అభాండాలు వేయటం బహిష్కరించటం ఆయన సంతరించిన స్మృతి పనికి రాదనటం ,దానిపై శాకల్యునితో వచ్చిన ఋషులు  తమలో తాము చాలా సేపు వితర్కి౦చు కొని యాజ్ఞ వల్క్యుని పక్షాన నిలవటం ఇప్పటి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -42 56-యమ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -42 56-యమ తీర్ధం పితరులకు ప్రీతి ,దృస్ట,అదృష్ట,ఇష్టఫలితాలనిచ్చేది యమ తీర్ధం .పూర్వం ‘’అనుహ్లాదుడు ‘’అనే మగ పావురం ఉండేది .భార్య ‘’హేతి ‘’.అనుహ్లాడుడు మృతువు కొడుకు కొడుకు .  .హేతి మృత్యువు కూతురి కూతురు .వీరిద్దరికీ కొడుకులు మనుమలు పుట్టారు .ఉలూకుడు అనే పక్షిరాజు అనుహ్లాదుని శత్రువు .గ౦గానది ఉత్తరా తీరాన  కపోతజంట … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -4 55-పుత్ర తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -41 55-పుత్ర తీర్ధం దితి పుత్రులు దనుజులు క్రమ౦గా నశిస్తూ ఉంటె అదితి పుత్రులు దేవతలు వృద్ధి పొందుతున్నారు .పుత్ర శోకం భరించలేక దితి తనభర్త దనువు ను చేరి గోడు వెళ్ళబోసి అదితి అంటే తనకున్న ద్వేషాన్ని ప్రకటించగా దనువు ఆమెను ఓదార్చి ఆమె భర్త కశ్యపునికి నివేది౦చ మన్నాడు .వెళ్లి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -40 54-రామ తీర్ధం -2(చివరిభాగం )

గౌతమీ మాహాత్మ్యం -40 54-రామ తీర్ధం -2(చివరిభాగం ) యమలోకం లో దశరదునితో యమదూత ‘’మీ కుమారుడు శ్రీరాముడు గౌతమీ తీరం లో ఉండటంవలన  ఆ పుణ్య ఫలితంగా నువ్వు  నరకం నుండి ఉద్ధరి౦ప  బడ్డావు .అతను లక్ష్మణ సమేతంగా గంగాస్నానం చేసి  నీకు పిండ ప్రదానం చేస్తే నీ సమస్తపాపాలు హరి౦చి స్వర్గ లోక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -39 54-రామ తీర్ధం -1

గౌతమీ మాహాత్మ్యం -39 54-రామ తీర్ధం -1 భ్రూణ హత్యా పాతక౦  నుండి విముక్తి చేసే రామ తీర్ధం గురించి నలువ నారదునికి తెలియజేశాడు .ఇక్ష్వాకు వంశరాజు దశరధమహారాజు శౌర్య బల వంతుడు వివేకి .అతని రాణులు కౌసల్య సుమిత్ర కైకేయి .వసిస్ట  మహర్షి వంశపారంపర్య పురోహితుడు .ప్రజలను కన్నతండ్రిలాగా ధర్మ రక్షణగా పాలించాడు .కానీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -38 53-పూర్ణాది తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -38 53-పూర్ణాది తీర్ధం గంగకు ఉత్తరాన పూర్ణ తీర్ధముంది .దీనిలో హరి హరులుంటారు .పూర్వం కల్పం మొదట్లో ఆయువు కుమారుడు ధన్వంతరి ఉండేవాడు .ఆశ్వమేధాది అనేక యజ్ఞాలు చేసి ,ఎన్నో దానాలు ఇచ్చి పుష్కలంగా భోగభాగ్యాలతో వర్ధిల్లి ,చివరికి వైరాగ్యం కలిగి ,గంగా తీరం చేరి తీవ్ర తపస్సు చేశాడు .ఒకప్పుడు ధన్వంతరి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -37 51-ధాన్య తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -37 51-ధాన్య  తీర్ధం ఓషధులు సోమరాజు చంద్రుని పతిగా పొంది లోకాలకు,  గంగకు ఇష్టమైన మాటలు పలుకుతూ ఇలా చెప్పాయి –‘’వేదవేత్తలకు  తెలిసిన  పురాగాథ ఒకటి ఉంది .మాతృసమానమైన ,సస్య సంపన్న మైన భూమాతను గంగా తీరం లో దానమిస్తే సకల కోరికలు నెరవేరుతాయి .భూమి, గోవు ,ఓషధులను దానం చేస్తే సకలకార్య … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత -2(చివరిభాగం ) శివ -వేంకట కవులు

                శివ -వేంకట కవులు వీరు జంటకవులు .వీరిలో బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు మొదటివారు .రెండవవారు మధ్వశ్రీ నందగిరి  వేంకటప్పారావు పంతులుగారు .ఇద్దరి పేర్లు కలిసి వచ్చేట్లుగా ‘’శివ వేంకట కవులు ‘’అనే పేరు పెట్టుకొని జంటగా కవిత్వం చెప్పారు .    బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా బొమ్మినంపాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -36 50-సోమ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -36 50-సోమ తీర్ధం పూర్వం ఓషధులు ప్రాణం కంటే విలువైనవానిగా ,తల్లులులాగా పూజి౦పబడ్డాయి .వాటిలో ధర్మం ,స్వాధ్యాయనం,యజ్ఞకర్మ  ప్రతి స్టింప బడ్డాయి .చరాచర జగత్తును ధరించేవి .ప్రాణుల రక్షణకు అతి ముఖ్యమైనవి .ఒకసారి ఓషధులు  బ్రహ్మను సోముని తమకు పతిగా చేయమని కోరగా ‘’ప్రీతి వర్ధనుడైన’’ రాజు ‘’ను పతిగా ఇస్తాననగా ,రాజుకోసం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత కృష్ణా జిల్లాలో పామర్రు గొప్ప వ్యాపార కేంద్రం .విజయవాడ –మచిలీ పట్నం రోడ్డులో ఉయ్యూరు దాటాక పామర్రు వస్తుంది .పామర్రు నుండి ఉత్తరాన గుడివాడ మండలం ,దక్షిణాన దివి సీమ మండలం ఉన్నాయి .పామర్రు దగ్గర పూర్వం నాగులేరు ప్రవహించేది ..దానిమధ్యలో ఒక తామర కొలను ,దానిపై దివ్య ప్రతిష్టితమైన శివ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

గౌతమీ మాహాత్మ్యం -35 48- ఆత్మతీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -35 48- ఆత్మతీర్ధం భుక్తిముక్తిప్రదాయకమైన ఆత్మ తీర్ధ విశేషాలు నారదుడికి బ్రహ్మచెప్పాడు ,అత్రి మహర్షి కొడుకు ,దత్తుడు శివభక్తుడు ,దుర్వాసునికి ప్రియ సోదరుడు .ఒకరోజు తండ్రిని బ్రహ్మ జ్ఞానం పొందటానికి ఎవరివద్దకు వెళ్ళాలో చెప్పమని అడిగాడు .గౌతమీనదికి వెళ్లి పరమేశ్వర ధ్యానం చేయమన్నాడు తండ్రి .గంగానదికి వెళ్లి పవిత్ర స్నానం తో శుచియై … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -34 46-శేష తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -34 46-శేష తీర్ధం శేషుడు రసాతలానికి అధిపతి .సమస్త ఫణి రాజులు అతని అధీనం లో ఉండేవారు .అంతకు పూర్వమే దేవతలు రాక్షలకు అది ఆవాసభూమి .నాగరాజును అడ్డుకొనగా అతడు బ్రహ్మకు ‘’స్వామీ !నువ్వే నన్ను పాతాళాకి పంపావు .కాని దేవదానవులు నన్ను రానివ్వటం లేదు .నువ్వే దిక్కు ‘’అని శరణువేడాడు . … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -33 45-అవిఘ్న త్తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -33 45-అవిఘ్న త్తీర్ధం అవిఘ్న తీర్ధ మహాత్మ్యాన్ని నారదునికి బ్రహ్మ తెలిపాడు .పూర్వం .గౌతమీనది ఉత్తరతీరాన దేవ యజ్ఞం ప్రారంభమై ,విఘ్న దోషం వలన పూర్తి కాలేదు..దేవతలు విచారం తో బ్రహ్మ విష్ణువులకు మొరపెట్టుకొన్నారు .బ్రహ్మ ధ్యానంచేసి విఘ్నానికి కారణం విఘ్నేశ్వరుడు అని,కనుక ముందు ఆయనను ప్రసన్నం చేసుకోమని సలహా ఇచ్చాడు . … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -32 44-బ్రహ్మ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -32 44-బ్రహ్మ తీర్ధం భక్తిని ముక్తినీ ఇచ్చే బ్రహ్మ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .రాక్షసులు రసాతలం లో దాక్కున్నప్పుడు మాతృకలు కూడా వెళ్ళగా దేవతలు మాత్రం అక్కడే ఉండిపోయారు .గాడిద ఆకారం కల బ్రహ్మగారి అయిదవ ముఖం అసురులను పారిపోవద్దనీ,  తాను క్షణం లో దేవతలనందర్నీ చంపుతానని అన్నది .సురలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -31 43-మాతృ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -31 43-మాతృ  తీర్ధం నారదునికి బ్రహ్మ మాతృ తీర్ధ విశేషాలు తెలియజేస్తూ మనోవ్యధలను తీర్చే గొప్ప తీర్ధం అన్నాడు .అనేక దేవదానవ యుద్ధాలలో దేవతలు దాయాదులైన అసురులను జయి౦చ లేకపోయారు .  దేవతలను వెంటబెట్టుకొని బ్రహ్మ కైలాసం వెళ్లి శివ దర్శనం చేసి ‘’విమధ్యవారీ శమన౦గ శత్రో  యదుత్తమం తత్తు దివౌక సేభ్యః … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -30 42- నాగ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -30 42- నాగ తీర్ధం బ్రహ్మ నాగ తీర్ధ మహాత్మ్యాన్ని నారదునికి వివరిస్తున్నాడు .ప్రతిష్టాపన పురం లో శూర సేనరాజు గుణవంతుడు సోమవంశం వాడు .చాలాకాలం వరకు సంతానం లేదు .పుత్రుడు కావాలని ఆశించాడు కాని ఒక సర్పం పుత్రుడుగా పుట్టింది .ఈ విషయం అత్యంత గోప్యంగా ఉంచాడు .రోజూ ఆపామును చూసి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం ) నారాయణ కుమారుడైన చక్రపాణి దత్త 11వ శతాబ్ది సంస్కృతకవి .నరదత్త శిష్యుడు .లోధ్రవలీ కులీన బ్రాహ్మణ కుటుంబీకుడు .పశ్చిమబెంగాల్ భీర్భం నివాసి .ఇతని మాగ్నం ఓపస్ రచన ‘’శిక్షా సార సంగ్రహ ‘’లేక శిక్షా సమగ్రః అనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం ) సంపాదకుడు రచయిత,అనువాదకుడు కే .రామచంద్ర శర్మజనన వివరాలు తెలియదు .ఆయన ముఖ్య రచనలు 1-రామపనివాద వ్యాఖ్యానం తో వరరుచి రాసిన ప్రాకృత ప్రకాశ 2-పౌస్కరాగమ 3-విరాట పర్వ మణిప్రవాళ మంజరి 4-యాజ్ఞికోపనిషద్వివరణం  5-సర్వజ్ఞోత్తమ రామః 6-అలంకార సంగ్రహః … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’

డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’  కృష్ణా జిల్లా జగ్గయ్య పేట లో ఆంధ్రోపన్యాసకులుగా చేసి రిటైరైన  డా.శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి ,జాతీయ ,అంతర్జాతీయ సదస్సులలో 65దాకా విశ్లేషణాత్మక పత్రాలు రాసి సమర్పించిన విద్వన్మణి.’’రమణాయన కావ్య రమణీయం ‘’పై పరిశోధన చేసి పిహెచ్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949) 15-2-1949న రాధా వల్లభ త్రిపాఠీ జన్మించి ,1970 సంస్కృత ఎం.ఏ.లో గోల్డ్ మెడల్ సాధించి ,పి.హె.డి. పొంది,1981లో డి. లిట్ .అయ్యాడు  .మధ్య ప్రదేశ్ సాగర్ లోని డా.హరి సింగ్ యూని వర్సిటి లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 392-స్ఫోట వ్యాకరణ  కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 392-స్ఫోట వ్యాకరణ  కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది ) స్ఫోటాయనేన యోగాత్తు తధా స్ఫోతాయనం కృతం. ఇది ఒక సంస్కృత వ్యాకరణము. దీనిని స్ఫోటాయనుడు రచించాడు. అవజ్ స్ఫోటాయనస్య (6- 1-123) అను పాణిని సూత్రముచే స్ఫోటాయనమత తెలియుచున్నది. తపర స్తత్కాలస్య (1-1-70) అను సూత్రముపై భాష్యమున పతంజలి స్ఫోటాయనశ్లోకము నుద్ధరించి యుండవచ్చును. స్ఫోటమనగా శబ్దార్ధ ప్రకాశక మగు స్వయం ప్రభవశక్తి విశేషము. మహాభాష్యాది తాత్పర్యానుసారముగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము గ్రంథ కర్త పరిచయం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము              గ్రంథ కర్త పరిచయం పేరు-గబ్బిట దుర్గా ప్రసాద్ జననం -27-06-1940-ఉయ్యూరు తల్లి దండ్రులు –గబ్బిట భవానమ్మ,,మృత్యుంజయ శాస్త్రి విద్య –ఎం .ఏ .(తెలుగు ),బి.ఎస్.సి .,బి .ఇ.డి. వివాహం –ప్రభావతి తో(21-02-1964) ఉద్యోగం –ఉపాధ్యాయ వృత్తి (ఫిజికల్ సైన్స్),ప్రధానోపాధ్యాయుడు            కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు(1963-1998) సంతానం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 391-గణకార తరంగిణి కర్త –సుధాకర్ ద్వివేది (1855-1910)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 391-గణకార తరంగిణి కర్త –సుధాకర్ ద్వివేది (1855-1910) సంస్కృత ,గణిత మహా విద్వాంసుడు సుధాకర్ ద్వివేది ఉత్తరప్రదేశ్ వారణాసి దగ్గర ఖజోరి గ్రామం లో 1855లో జన్మించాడు .బాల్యం లో గణితాన్ని పండిట్ దేవ కృష్ణవద్ద నేర్చాడు .1883 లోవారణాసిలోని  ప్రభుత్వ సంస్కృత కళాశాలలో గణిత అధ్యాపకుడుగా చేరి  బాపుదేవ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 390-పాణినీయ ధాతుపద సమీక్ష కర్త –డా. భగవతీ ప్రసాద్ త్రిపాఠీ(1935)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 390-పాణినీయ ధాతుపద సమీక్ష కర్త –డా. భగవతీ ప్రసాద్ త్రిపాఠీ(1935)    బహుముఖీన ప్రతిభ వాగీశ్ శాస్త్రిగా గౌరవింప బడుతున్న డా .భగవతీ ప్రసాద్ త్రిపాఠీ అంతర్జాతీయ సంస్కృత వ్యాకరణ కోవిదుడు ,భాషా శాస్త్రవేత్త ,తాంత్రికుడు ,యోగి.1935లో మధ్యప్రదేశ్ లోని ఖురాలీ సిటీ లో జన్మించాడు .విద్యాభ్యాసం బృందావనం బెనారస్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925) ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గర పందిళ్లపల్లి గ్రామంలో శ్రీ కడెం వేంకట సుబ్బారావు కవి జన్మించారు .తండ్రి శ్రీ లక్ష్మయ్య .తల్లి శ్రీమతి కోటమ్మ .ప్రథమగురువులుబ్రహ్మశ్రీ నాచకోటి నాగయ్యగారు .ఆధ్యాత్మిక గురువులు శ్రీ  అ.ప్ర.శ్రీ ములకల వేంకట … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 388-భాగవత చంపు ,శృంగార శేఖర భాణ కర్త –శ్రీ వెల్లాల ఉమామహేశ్వర కవి (1235)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 388-భాగవత చంపు ,శృంగార శేఖర భాణ కర్త –శ్రీ వెల్లాల ఉమామహేశ్వర కవి (1235) అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత  కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి  విడంబనం ఇతని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 387-పోతన భాగవతం సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897-1982)

 గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 387-పోతన భాగవతం  సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897-1982)   వ్యాసమహర్షి సంస్కృత భాగవతం మహా ప్రశస్తి రచన .దానికి పోతనామాత్యుని అనువాదం మందార మకరందం .అలాంటి పోతనగారి తెలుగు భాగవతాన్ని సంస్కృతం లోకి తర్జుమా చేయటం అంటే ఆషామాషీ కాదు .అసాధ్యం అని కూడా అని పిస్తుంది .కాని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 385- భగవద్గీతా ప్రబంధ మీమాంసా కర్త –లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య(20వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 385- భగవద్గీతా ప్రబంధ మీమాంసా కర్త –లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య(20వ శతాబ్దం ) మైసూర్ ప్రభుత్వ ఓరియెంటల్ లైబ్రరీ లో అసిస్టెంట్ పండితుడుగా ఉన్న లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య ‘’భగవద్గీతా మీమాంస ప్రబందం’’రాశాడు .తనకుటుంబం  గురించి చెప్పుకోలేదు కాని ,తన గురించి రెండు శ్లోకాలలో ఈ గ్రంధం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 383-శివ సంహిత కర్త –మహా మహోపాధ్యాయ కాళీ ప్రసన్న విద్యారత్న –(1849-1924)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 383-శివ సంహిత కర్త –మహా మహోపాధ్యాయ కాళీ ప్రసన్న విద్యారత్న –(1849-1924) సంస్కృత మహా విద్వాంసుడు మహాకవి అనేక గ్రంథ రచయిత కాళీ ప్రసన్న విద్యారత్న 1849లో బెంగాల్ లో జన్మించి 75వ ఏట 1924లో మరణించాడు .1908నుంచి 10వరకు సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు .భట్టా చార్య కుటుంబానికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 382-తత్వ ప్రదీపిక కర్త –త్రివిక్రమ పండితాచార్య (1238-1318)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 382-తత్వ ప్రదీపిక కర్త –త్రివిక్రమ పండితాచార్య (1238-1318) ద్వైతమతస్థాపకుడు మధ్వాచార్య శిష్యుడైన త్రివిక్రమ పండితాచార్య సుబ్రహ్మణ్య పండితా చార్య కుమారుడు . అరుదైన ‘’వాయుస్తుతి ‘’సంస్కృతం లో రాసి చాలా ప్రఖ్యాతుడయ్యాడు .ఈయన గురించి పూర్తివివరాలను కుమారుడు నారాయణ పండితాచార్య ‘’సుమద్వ విజయం ‘’లో రాశాడు .యవ్వనం లోనే త్రివ్క్రముడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 381-ఆసఫ్ విలాస సమీక్ష కర్త –డా . జయశ్రీ చట్టోపాధ్యాయ (1945)

 గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 381-ఆసఫ్ విలాస సమీక్ష కర్త –డా . జయశ్రీ చట్టోపాధ్యాయ (1945) 1945లో పశ్చిమ బెంగాల్ కలకత్తా లో జన్మించిన జయశ్రీ చట్టోపాధ్యాయ వాల్మీకి రామాయణం లో సంగీత మూలాలు అంశం పై పరిశోధన చేసి పిహెచ్ డి పొందింది .విశ్వకవి  రవీంద్రుని    నిపై ‘’బౌద్ధ అవదాన సాహిత్య ప్రభావం ‘’అనే అంశం పై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వామి అగేహానంద భారతి

స్వామి అగేహానంద భారతి : జర్మనీ నుండి ఇండియా వచ్చి సన్యాసిగా వివిధ జీవితానుభవాలు పొందిన విశిష్ట బ్రహ్మచారి లెపాల్క్ ఫిషర్final sanyasi satyempalikete మంచి పుస్తకం .ఇన్నయ్యగారి అనువాదం మిన్నంటింది .అందరు చదవాల్సిన పుస్తక .రచయితకు ,అనువాదకులు ధన్యవాదాలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-6

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-6 అయ్య చూసి (పి)న హంపి-4(చివరిభాగం ) కృష్ణ దేవరాయల కాలం నాటికే ‘’డైనమైట్ ‘’ల వాడకం ఉండేదట .వంద రోజుల్లో పండే వరి వంగడాలు౦డేవట .1522లో హంపీ విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ‘’డోమింగో ఫేస్ ‘’విజయనగర సామ్రాజ్య వైభవాన్ని పూర్తిగా దర్శించటానికి కనీసం సంవత్సరకాలమైనా కావాలని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-2

డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-2 ప్రాకృత సాహిత్యం లో ‘’మానవ ప్రకృతి’’ఎలా మొగ్గతొడిగి ,పుష్పించి ఫలించిందో రించోళి మొదటి వ్యాసం లో వివరించారు శ్రీమతి నాగపద్మిని . జయవల్లభ సంకలించిన ‘’వజ్జా లగ్గ’’లో 795గాధలున్నాయి. వజ్జ అంటే అధికారం లేక ప్రస్తావన .ఒకే  విషయానికి  చెందిన గాధలను ఓకే శీర్షిక౦దకు చేరిస్తే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 380-విక్రమాశ్వత్థామీయమ్‌ నాటక కర్త –మహా మహోపాధ్యాయ చిలుకూరి నారాయణరావు (1889-1951)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 380-విక్రమాశ్వత్థామీయమ్‌ నాటక కర్త –మహా మహోపాధ్యాయ చిలుకూరి నారాయణరావు (1889-1951) .జననం చిలుకూరి నారాయణరావు గారు విశాఖపట్నం జిల్లా, పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889, ఆగష్టు 9 న జన్మించారు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష కన్నడం. ఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అరుదైన కృష్ణా జిల్లా పండిత కవి శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి  

అరుదైన కృష్ణా జిల్లా పండిత కవి శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి —  తెలుగు సారస్వత రంగంలో ఎందఱోమహానుభావులు ,వారిలో ఒక అనర్ఘరత్నం బ్రహ్మశ్రీ విద్వాన్ శతావధాని భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి గారు .నాకు గురుతుల్యులు ,నా భార్య శ్రీ సుశీల కి ప్రపితామహులు అయిన అయ్యప్పశాస్త్రి వంటి మహానుభావులగురించి  గురించి ఇప్పటి తరం తెలుసుకోవాలనే  తాపత్రయం తో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment