Category Archives: పుస్తకాలు

స్ట్రక్చరల్ ఇంజినీర్ –పట్నాయకుని ఇందు భూషణ్

స్ట్రక్చరల్ ఇంజినీర్ –పట్నాయకుని ఇందు భూషణ్ విజయనగరం జిల్లా పార్వతీపురానికి సమీప గ్రామం నిడుగల్లు లో పట్నాయకుని ఇందు భూషణ్ జన్మించారు .ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొంది ,కాన్పూర్ ఐ ఐ టి నుంచి ఎం .టెక్  అందుకున్న ఘనులు .1970లో ఆస్ట్రేలియా చేరి అక్కడే ఉండిపోయి మాతృభాష తెలుగుకు అవిరళ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాంకేతికశాస్త్ర వేత్త- చంద్రు పట్ల తిరుపతి రెడ్డి

సాంకేతికశాస్త్ర వేత్త- చంద్రు పట్ల తిరుపతి రెడ్డి శ్రీ చంద్రు పట్ల తిరుపతి రెడ్డి ఉస్మానియా యూని వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పొంది ,బొంబాయి లో ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  డిజైన్ అండ్ మాన్యు ఫాక్చరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించి ,మొదటగా హిందూస్థాన్ మెషిన్ టూల్స్ లో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

‘’సామాజిక సమస్యలు’’కు పద్యాలలో కన్నీరు కార్చిన టేకుమళ్ళ

‘’సామాజిక సమస్యలు’’కు పద్యాలలో కన్నీరు కార్చిన టేకుమళ్ళ శ్రీటేకుమళ్ళ వెంకటప్పయ్య ఖండకావ్యం  గా రాసిన ‘’ ’సామాజిక సమస్యలు’’ కవితా సంపుటి డిసెంబర్ 2017లో ప్రచురితమై, ఆయన దాన్ని నాకు ఎప్పుడిచ్చారో తెలీదుకాని, ఇవాళ ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే బయటపడింది .నాకు అభిమాన వ్యక్తీ, రచయితా, కవి వెంకటప్పయ్య .బేతవోలు ,శ్యామలానంద ,చక్రాల ,పూర్ణచంద్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం ) తమిళనాడు కుంభకోణం కు చెందిన నాట్య కళాకారిణి జ్ఞానసుందరి .కుప్పుస్వామి శాస్త్రి శిష్యురాలు .మైసూరు రాజాస్థానం ఆమెకు ‘’కవి రత్న ‘’బిరుదునిచ్చి సత్కరించింది .చాలారచనలు చేసినట్లు ఆమె స్వయంగా చెప్పింది .అందులో ఆరు స్తబకాలలో రాసిన ‘’హాలస్య చంపు ‘’ఉన్నది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం ) 1004-1016కాలం లో పాలించిన రాజేంద్ర చోలుడికి సమకాలికుడైన  రాజశేఖరుని ‘’రాజశేఖర చరిత్ర ‘’లో చోటు చేసుకొన్న 6గురు సంస్కృత కవయిత్రులపేర్లు మాత్రమే తెలిశాయికాని వారి గురించి వివరాలు  రచనలు లభించలేదు .వీరంతా 1004 కు పూర్వం వారై ఉండాలి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం ) పైన చెప్పినట్లు ఇద్ద్దరి ధోరణిలో విభేదాలున్నా ,కొట్టొచ్చినట్లు కనిపించే ఒక మంచి పోలిక కనిపిస్తుంది .బౌద్ధ సన్యాసినుల౦దరో ముక్త కంఠం తో మానవ ప్రేమను ఖండించినా  ,సంస్కృత కవయిత్రులలాగా మగవారిని చులకన చేసి ఎక్కడా చెప్పలేదు .మగవారు క్రూరంగా ప్రవర్తించినా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -3

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -1 సంస్కృత కవయిత్రుల ,బౌద్ధ  సన్యాసిని కవయిత్రుల కవిత్వం లో ఉన్న విశేషాలు తెలుసుకొందాం .71మంది బౌద్ధ సన్యాసినుల కవిత్వం ‘’ధేరి గాధ’’లో వేలాది శ్లోకాలున్నాయి .సంస్కృత కవయిత్రుల కవిత్వానికి ,వీరి కవిత్వానికి మధ్య చాలా భేదమే కనిపిస్తుంది .సంప్రదాయ సంస్కృత కవయిత్రులు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన -2

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన -2    సంస్కృత –వేద కవయిత్రులు-2 ‘’సాస్వతి ‘’కవయిత్రి అభిప్రాయం పైదానికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది .ఆమెలో సర్వసమర్పణ ,అంకితభావం భర్తపట్ల పూర్తీ విధేయత ,భర్త చేసిన పాపాలకు పరిహారంగా తాను వ్రతాలు నోములు చేసి పాపవిముక్తుడిని చేయటం ,అతడు పూర్తిగా మంచి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన సంస్కృత ప్రాకృత కవయిత్రులకు ప్రేమ అతిముఖ్యమైన అంశం .ఇద్దరికీ అగమ్య గోచరమైన విధి ,దేవుడు విషయాలపై ఉదాసీనంగా ఉన్నారు .వీటికోసం కవితా మేధస్సును వృధా చేసుకోరాదని భావించారు .అజ్ఞాతం అజ్ఞాతంగానే ఎప్పుడూ ఉండిపోతుందని , .దీనికోసం ఆరాటం వృధా అనుకొన్నారు .   … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 469-‘’ఆసేచనక ‘’రామాయణకర్త –బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి (1850)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 469–‘’ఆసేచనక ‘’రామాయణకర్త –బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి (1850) రామాయణార్య లేక ‘’అసేచనక రామాయణం;; రాసిన బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి 1850లో పుదుక్కొట వద్ద కడయక్కుడి గ్రామం లో జన్మించాడు .కౌశిక్ గోత్రానికి చెందిన సామవేది .రామభద్ర దీక్షితుని మామ చొక్కనాధ దీక్షిత వంశంవాడు .గొప్ప వ్యాకరణ వేత్త అయిన రామభద్ర దీక్షితులు జానకీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )-2

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )-2 ఇప్పుడు వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కావ్యం లోరాణీ దేవకుమారిక కవితా ప్రాభవం చూద్దాం మొదటి ప్రకరణ లోని వంశ వర్ణన – 1-‘’శివంసాంబ మహం వందే విద్యా విభవ సిద్ధయే-జగత్ సూతిహరం శంభు సురాసుర సమర్చితం ‘’ 2-గుజ్జద్ భ్రమద్భ్రమరరాజ విరాజితాస్యాం-స్తంబే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం ) వైద్యనాధ ప్రసాద ప్రశస్తి ని రాసింది దేవకుమారిక అని మహామహోపాధ్యాయ హరిప్రసాద శాస్త్రి ధృవీకరించాడు .ఈ శ్లోకాలు వైద్యనాథ దేవాలయం గోడలపై చెక్కబడి ఉన్నాయి .చిత్తూర్ రాణాఅమరసి౦హునిపట్టమహిషి రాజకుమారిక .జయసింహుని కోడలు .సంగ్రామ సి౦హ, చంద్రకుమారికల తల్లి  , శబలసి౦హుని  కూతురు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కవితా కాంతులు వెదజల్లే స్పాటిక ‘’ పటిక పువ్వులు ‘’

కవితా కాంతులు వెదజల్లే స్పాటిక ‘’ పటిక పువ్వులు ‘’ హోసూర్ బస్తీ యువక బృందం తరఫున డా అగరం వసంత్ కూర్పరిగా వెలువడిన 13వఉగాది కవితల’’పొత్తం’’నాకు ఈరోజే 8వతేదీ శనివారం ఉదయం అందింది .మధ్యాహ్నం చదివి సాయంత్రం స్పందిస్తున్నాను .ముఖచిత్రంగా ‘’పటికపువ్వులు ‘’తమఅందాన్ని , వైభవాన్ని తెలియ జేశాయి .పటిక ఒక స్పటికం కూడా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 466- మధ్వాచార్య’’ కాలమాధవ’’కు వ్యాఖ్య కర్త –లక్ష్మీ దేవి (18వ శతాబ్దం)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 466- మధ్వాచార్య’’ కాలమాధవ’’కు వ్యాఖ్య కర్త –లక్ష్మీ దేవి (18వ శతాబ్దం) మధ్వమత సంస్థాపనాచార్య శ్రీ మధ్వాచార్య రచించిన’’ కాలమాధవ’’ కు పాయగుండ వైద్యనాధ భార్య లక్ష్మీ దేవి వ్యాఖ్యానం రాసింది .  ఈయన తండ్రి మహాదేవ, తల్లి వేణి.ఆమె తండ్రి మహాదేవ దీక్షిత తల్లి ఉమా .దీక్షితుని తండ్రి కృష్ణ .తాత గణేశ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 465-తంత్రరాజ తంత్ర కు సుదర్శన వ్యాఖ్య కర్త –ప్రాణ మంజరి (18వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 465-తంత్రరాజ తంత్ర కు సుదర్శన వ్యాఖ్య కర్త –ప్రాణ మంజరి (18వ శతాబ్దం ) ప్రాణమంజరి తంత్ర రాజ తంత్ర అనే తంత్రశాస్త్రం లో మొదటి పటలం కు సుదర్శన అనే వ్యాఖ్యానం రాసింది .దీనిలో 101శ్లోకాలున్నాయి .ఈమె కూరమాచాల రాజు  హర్షదేవ -హర్షమతిల కుమార్తె   . ప్రాణమంజరి ‘’శారదా తిలక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 463-ద్వారకా పట్టాల కర్త –బీనాబాయ్ (12-15శతాబ్దాలమధ్య

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 463-ద్వారకా పట్టాల కర్త –బీనాబాయ్ (12-15శతాబ్దాలమధ్య ) ద్వారకా పట్టాల రచించిన బీనాబాయ్ 12నుంచి 15శతాబ్దాల మధ్యకాలం లో ఉన్న కవయిత్రి .తనతండ్రి యదువంశరాజు మండలీకుడని వీర సాహస సద్గుణ సమేతుడని చెప్పింది .ఈ రాజు కధియవార్ ను   పాలించిన గిర్నార్ చూదాసమ మండలీకరాజులలో ఒకడై ఉండవచ్చు .మొదటి మ౦డలిక 11వ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృ భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం ) you

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృ భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం ) 459-రేవా రేవా రాసిన రెండు శ్లోకాలు న్నాయి .ఒకటి ఖండిత నాయకి గురించి ,రెండవది కలహాంతరిత గురించి .గాథలుగా చెప్పబడే ఈ శ్లోకాలు కవయిత్రికవితా ప్రతిభకు జోహార్ అనాల్సిందే . ‘’కిం తావత్ కృతా అధవాకరోషికరిష్యసి సుభగేదానీం-అపరాధనా మలజ్జ శీల కధయ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృత భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృత భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం ) సంస్కృత కవయిత్రులగురించి తెలుసుకొన్నాం .ప్రాకృత కవయిత్రుల గురించి తెలుసుకోకపోతే అసమగ్రమే అవుతుంది .వీరిలో తొమ్మిదిమంది ఉన్నారు .ఒక్క’’ అవంతీ సుందరి’’ని తప్ప మిగిలినవారిగురించి  శాతవాహనరాజు అంటే హాలుడు రాశాడు .7వ శతాబ్ది బాణుడుకూడా వీరిని ఉదాహరించాడు .ప్రాకృత కవయిత్రులు 7వ శతాబ్దికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 451-విద్యావతి

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 451-విద్యావతి సుమీనాక్షి దేవతపై విద్యావతి అనుష్టుప్ లో రాసిన 12శ్లోకాల స్తోత్రం ఆమె భక్తీ తాత్పర్యాలకు ఉదాహరణగా నిలిచిపోయింది .ఇంతకంటే ఆమెవివరాలు తెలియవు స్తుతి-‘’యా దేవీ జగత౦త్రీ శంకర శంకరస్యాపి శంకరో –నమస్తస్యై సుమీనాక్షై దేవ్యేమంగళ మూర్తయే ‘’ ‘’సకృరారాధ్యయాం సర్వమభీస్టంలభతే జనః-నమస్తస్యై సుమీనాక్షై దేవ్యే మంగళమూర్తయే ‘’ ‘’లక్ష్మీ సరస్వతీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 441-పద్మావతి (17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 441-పద్మావతి (17వ శతాబ్దికి పూర్వం ) హరిభాస్కరుని ‘’పద్యామృత తరంగిణి ‘’లో పద్మావతి రాసిన రెండు శ్లోకాలున్నాయి .హరిభాస్కర  తండ్రి అప్పాజీ. తాత హరి .ముత్తాత 1676లో వృత్త రత్నాకరం వ్యాఖ్యరాసిన పురుషోత్తమ .1730లో పద్యామృతం వచ్చింది .వేణీదత్తుడు పద్యవేణిలో పద్మావతి వి 11శ్లోకాలు ఉదాహరించాడు .ఈమె గుజరాత్ కు చెందిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 436-మధురవాణి (17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 436-మధురవాణి (17వ శతాబ్దికి పూర్వం ) 17వ శతాబ్ది హరికవి రాసిన ‘’సుభాషిత హారావళి ‘’లో మధురవాణి శ్లోకం ఉదాహరి౦ప బడింది .కనుక ఆమెకాలం 17 వ శతాబ్దం పూర్వం అయిఉండాలి .1614లో త౦జావూరుపాలకుడు రఘునాధనాయకుని ఆస్థానకవి ,ఆయన రాసిన ‘’ఆంద్ర రామాయణం ‘’ను సంస్క్రుతీకరించిన  మధురవాణి ఈమె అవునో కాదో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 429-ఇందులేఖ (14వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 429-ఇందులేఖ (14వ శతాబ్దం ) 15వ శతాబ్దికి చెందిన వల్లభ దేవుడు తన ‘’శుభాషితావలి ‘’లో ఇందులేఖ రాసిన ఒకే ఒక్క శ్లోకాన్నిమాత్రమే ఉదాహరించాడు .మంచికళాత్మకంగా ఉన్న శ్లోకం ఇది .విభావన అలంకారాన్ని తగినట్లుగా వాడింది .సూర్యాస్తమయాన్ని చూసి సూర్యుడురాత్రివేళ  ఎక్కడ దాక్కుంటాడు అనే సమస్య  వస్తుంది .దీనికి చాలామంది చాలారకాలుగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 426-చిన్నమ్మ (10వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 426-చిన్నమ్మ (10వ శతాబ్దికి పూర్వం ) భోజుని ‘’సరస్వతీ కంఠా భరణం ‘’లో చిన్నమ్మ  శార్దూల విక్రీడితం లో రాసిన ఒక్క శ్లోకం ఉదాహరి౦ప బడింది .10వ శతాబ్దికి ముందున్న కవయిత్రి ఆమె  .సారంగధర పద్ధతిలోనూ ఇదే శ్లోకం ఉంది .శివుడు తన మనోభావాన్ని దేబ్బతీశాడని నింద చేసే శ్లోకం .ఆయన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 422-అజ్ఞాత కవయిత్రి –(17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 422-అజ్ఞాత కవయిత్రి –(17వ శతాబ్దికి పూర్వం ) పేరు ఊరు తెలియని 17వ శతాబ్దికి ముందున్నట్లుగా భావింపబడే ఒక అజ్ఞాత కవయిత్రి ఒకే ఒక్క శ్లోకం ఒకటి ‘’శుభాషిత హారావళి ‘’లో బయటపడింది .ఇది ప్రేమ సందేశం .కాని చాలకవితాపరంగా అల్లింది .క్షోభించిన హృదయం పడే వేదనకు ఈ శ్లోకం ప్రతిబింబం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 421-చమత్కార తరంగిణి వ్యాఖ్యాన కర్తలు -సుందరి ,కమల (1705)

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 421-చమత్కార తరంగిణి  వ్యాఖ్యాన కర్తలు -సుందరి ,కమల (1705) ఉత్తర రామ చరిత వ్యాఖ్యానకర్త ఘనశ్యామ క్రీ.శ. 1700 లలో జన్మించి, తంజావూర్ పాలకుడు మొదటి తుక్కోజి వద్ద మంత్రిగా ఉన్నాడు .నీలకంఠ చంపు సంజీవనికూడా రాశాడు .18వ ఏటనుంచే రచనావ్యాసంగం సాగించాడు .మహారాష్ట్రకు చెందినవడైనా తంజావూర్ లోనే ఉండిపోయాడు .తండ్రి మహాదేవ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 420-రాజేశ్వర విలాస మహాకావ్యకర్త –పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి (16వశతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 420-రాజేశ్వర విలాస మహాకావ్యకర్త –పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి (16వశతాబ్దం ) పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి రచించిన రాజేశ్వర విలాస మహాకావ్యం లో ఆచార్య బిరుదురాజు రామరాజుగారికి కేవలం 12తాళపత్రాలు మాత్రమె లభించాయని ,అందులో రెండువందల శ్లోకాలున్నాయని ,ఇది సాహిత్య శాస్త్ర గ్రంథంఅని ,ప్రతాపరుద్రీయం లాగా పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరికవి రాజేశ్వర భూపాలుని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 419-ఏక దిన ప్రబంధకర్త –ఆలూరి సూర్యనారాయణ వాజపేయ యాజీ

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 419-ఏక దిన ప్రబంధకర్త –ఆలూరి సూర్యనారాయణ వాజపేయ యాజీ విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ వేంకటపతి రాయలు పాలిస్తున్నకాలం (1586-1614)లో రాయవేలూరుకు సామంతరాజు లింగమనాయకుడు .తండ్రి చిన్నబొమ్మ నృపాలుడు (1549-1579)గొప్పకవి, గాయకుడు, కవిపండిత పోషకుడు .జయదేవుని గీత గోవిందం లాగా ఆరు కాండల రామాయణాన్నివివిధరాగ ,తాళాలతో, గేయాలతో, శ్లోకాలతో ‘’సంగీత రాఘవం ‘’కృతి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 418-‘’బాలసరస్వతి ‘’తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసా చార్యులు(1869)

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 418-‘’బాలసరస్వతి ‘’తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసా చార్యులు(1869) వీరి వంశ మూలపురుషుడు శ్రీశైలపూర్ణులు .ఇందులో బుచ్చి వెంకటాచార్యులకుమారుడే మన బాలసరస్వతి బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు .వీరిది కడప మండలం  లోని బుక్కపట్టణం .సురపుర సంస్థానాధీశుడైన స్వామి నాయకుని (1752-1773)ఆహ్వానం మేరకు అణ్ణయాచార్యుల మూడవ కుమారుడు శ్రీనివాసాచార్యులు బుక్కపట్టణం వదలి సురవరం లోరాజగురువులై  స్థిర నివాసమున్నారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 417-భద్రగిరి చంపు కర్త –భారద్వాజ రామా చార్య (17-18శతాబ్ది )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 417-భద్రగిరి చంపు కర్త –భారద్వాజ రామా చార్య (17-18శతాబ్ది ) భద్రాచల క్షేత్రమహిమను, అక్కడ జరిగే చైత్రోత్సవాన్నీ విపులంగా ‘’భద్రగిరి చంపు ‘’కావ్యం లో  వర్ణించిన కవి భారద్వాజ రామాచార్య ..ఇతని ఇంటిపేరు ఊరు కాలమూ తెలియదు .కాని బిరుదురాజు వారు ఈ కవి 17-18శతాబ్దుల కాలం వాడై ఉంటాడని ,పాల్వంచ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 416-పార్వతీ పరిణయ చంపూ కావ్యకర్త –చంద్ర భట్ట ఈశ్వరప్ప (16వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 416-పార్వతీ పరిణయ చంపూ కావ్యకర్త –చంద్ర భట్ట ఈశ్వరప్ప (16వ శతాబ్దం ) 16వ శతాబ్దికి చెందినాచంద్రభట్ట ఈశ్వరప్ప ‘’పార్వతీపరిణయం ‘’అనే చంపూకావ్యం రాశాడు .దీని వ్రాయసకాడు కూడా చంద్ర భట్ట వంశం వాడే .గురు స్తుతి – ‘’సదా శివగురుం భజే సకల ధీర నిత్యస్తుతం –ద్విజాధిపతి సేవితం వివిధ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 415-హనుమద్రామాయణ కావ్యకర్త –దిట్టకవి లక్ష్మణ కవి (16వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 415-హనుమద్రామాయణ కావ్యకర్త –దిట్టకవి లక్ష్మణ కవి (16వ శతాబ్దం ) ఏక సర్గ హనుమద్రామాయణ కావ్యం రాసిన దిట్టకవి లక్ష్మణ 16వ శతాబ్దికవి .18వ శతాబ్దికి చెందిన ఇంకొక దిట్టకవి ఇంటిపేరున్న నారాయణకవి తెలుగులో రంగరాయ చరిత్ర రాశాడు .వీరిద్దరికీ బంధుత్వం ఉందొ లేదో తెలీదు .వీరికి దిట్టకవి అనేది ఇంటిపేరు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 414-సీతా విజయ చంపు కర్త –పరశురామపంతుల అనంత రామ పండితుడు (19వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 414-సీతా విజయ చంపు కర్త –పరశురామపంతుల అనంత రామ పండితుడు (19వ శతాబ్దం ) 19వ శతాబ్ది మధ్యకాలంవాడు పరశురామ పంతుల లింగమూర్తిగారికి అయిదవతరం వాడు సీతావిజయ చంపూ కావ్యకర్త పరశురామపంతుల అనంతమూర్తి పండితుడు .తండ్రి రామకృష్ణ సోమయాజులు .తల్లి వేణా౦బిక .ఈ అముద్రిత కావ్యం కాకినాడ ఆంద్ర సాహిత్యపరిషత్ కార్యాలయం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 413-హరి భక్తి సుదోదయ వ్యాఖ్య కర్త –సారంగు తమ్మయ (1580)

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 413-హరి భక్తి సుదోదయ వ్యాఖ్య కర్త –సారంగు తమ్మయ (1580) తెలుగులో ‘’వైజయంతీ విలాసం ‘’కావ్యం రాసిన సారంగు తమ్మయ విశిస్టాద్వైత మతస్తుడు .’’వరిచిత భగవద్భాగావత కైంకర్య విధానుడు ‘’అని పించుకొన్నాడు .సంస్కృతం లో’’ హరి భక్తి సుధోదయ వ్యాఖ్య’’రాశాడు .దీనికే’’ భక్తిసంజీవని ‘’పేరున్నది .20 అధ్యాయాల గ్రంథం. ’’ఇతి సారంగ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

22-శివరామ లింగరాజు (చివరిభాగం )

22-శివరామ లింగరాజు (చివరిభాగం ) మూడు ఆశ్వాసాల ‘’శైవాచార సంగ్రహం ‘’రాసిన శివరామలింగరాజు భారద్వాజ గోత్రీకుడైన క్షత్రియకవి .తండ్ర్రి హరిరాజు తల్లిసీతమ్మ  .గురువు గోకర్ణ మటాధిపతి సోమశేఖరుడు ..కాకతి ,చాళుక్య సీమలలో క్షత్రియ వీర శైవులులేరని,తెలంగాణా లేక  రాయలసీమవాడు అయి ఉంటాడని రాజుగారన్నారు .వంశక్రమంలో బర్బర దేశాదీశ్వరుడు శంఖాన్వయుడు మూలపురుషుడు అతడికి అయిదవతర౦ వాడు మనకవి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

-21 కుందావఝల గోపాలసూరి

21-కుందావఝల గోపాలసూరి కరీం నగర్ జిల్లా ములకనూరుకి చెందిన కుందావఝల గోపాలసూరి ‘’సంవరణ చరిత్రము ‘’రాశాడు .సుమారు 1850కాలం .బ్రహ్మ వైవర్తపురాణ౦ లోని ‘’శ్రీక్రష్ణజన్మఖండం ‘’కావ్యం కూడారాశాడు కాని  అముద్రితం  .ములకనూరు హనుమకొండకు దగ్గర .అక్కడ మోతుకూరివారి౦టశ్రీక్రష్ణజన్మఖండం కావ్యాన్ని తానూ చూశానని బిరుదురాజువారువాచ .గోపాలసూరి పండరినాధుడు అనేకవికి సమకాలికుడు . సంవరణ చరిత్ర అంటే తపతీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

20-వేముల రామభట్టు

0-వేముల రామభట్టు మహబూబ్ నగర్ మండలం ‘’మానవతీపురం ‘’అనే మానాజీ పేట ను ‘’తూము ‘’వంశపు రెడ్లు పాలించారు .వీరు స్వయంగా కవులు కావ్యకర్తలేకాక కవి పండితులకు ఆశ్రయమిచ్చారు తూము రామ చంద్రా రెడ్డి  మహీపాలుడు ‘’అలమేలు మంగా పరిణయం ‘’కావ్యం రాశాడు .ఇతనికొడుకు పరాశురామ రెడ్ది ‘ఆస్థానంలోని వేముల రామభట్టు ’గౌరీ విలాస ‘’కావ్యం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’

19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’ పాల్కురికి సోమనాధుడు ‘’ఉదాహరణ యుగ్మం ‘’రచించాడని పిడుపర్తి సోమనాథుడు చెప్పాడు .సోమన ఉదాహరణ కావ్యం అంటే ‘’బసవ ఉదాహరణ కావ్యమే’’ అని అందరికి తెలుసు .కానీ బిరుదురాజు వారికి కరీం నగర మండలం లో ఒక తాళపత్ర గ్రంథం లభించిందని ,దానిలో సోమనాథ భాష్యం తోపాటు చాలా లఘు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

18-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు

8-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు రెండు అముద్రిత శతకాలు రాసిన పరశురామపంతుల లింగమూర్తి ‘’ శ్రీ సీతారామాంజ నేయం ‘’అనే అద్భుత ఆధ్యాత్మిక గ్రంధం రాసిన తెలంగాణా కవి .శేషాద్రి రమణకవులు కూడా పై రెండు శతకాలను ప్రస్తావించలేదు .వంగూరి సుబ్బారాగారు ‘’మనశ్శతకం ‘’గురించి చెప్పారు .బిరుదురాజు రామరాజుగారు మాత్రం అముద్రితాలైన లింగమూర్తి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

17-నేబతి కృష్ణయామాత్యుడు

17-నేబతి కృష్ణయామాత్యుడు అమాత్యుడు, కవీశ్వరుడు అయిన నేబతి కృష్ణయామాత్యుడు కవిపోషకుడు ,మహమ్మదీయ సుల్తానుల సభకు అల౦కార మైనవాడు .కాని చరిత్ర మరుగునపడటం విధి వైపరీత్యం .కౌండిన్య గోత్రీకుడు .తండ్రి కమలయామాత్యుడు తల్లి కొండాంబ .గోల్కొందదగ్గర సిద్ధలూరు పుట్టినవూరు .దీనికి దగ్గరున్న అనంతగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పు .మహమ్మద్ ఖులీ కుతుబ్ షా అనే మహమ్మద్ షాహి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

16 -గోపతి లింగకవి

16-గోపతి లింగకవి తెలంగాణలో వీర శైవాన్ని వ్యాప్తి చేసిన వారిలో మధ్యయుగానికి చెందిన గోపతి లింగకవి కూడా ఒకడు .కృతిభర్త మెదకు మండలం వాడు కనుక కవి కూడా ఆ ప్రాంతం వాడే అయి ఉంటాడని బిరుదరాజువారూహించారు .అనేక రచనలు చేసినా రెండు మాత్రమే లభ్యం 1-చెన్నబసవపురాణ౦ 2-అసమగ్రంగా ఉన్న’’అఖండజ్ఞాన మనఃప్రబోధ వచన కావ్యం .ఈ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

15-త్రిలోక భేది

15-త్రిలోక భేది ‘’సకల ధర్మ సారం ‘’కర్త త్రిలోక భేది .ఇది అసలుపపేరో బిరుదో తెలీదు .పీఠిక లేని 4ఆశ్వాసాల గ్రంధం .మధ్యలో కృతిపేరు ‘’సకలధర్మ సారాయ౦ ‘’అయింది .ఆశ్వాసాంత గద్య లో కవి తనను గురించి చెప్పాడు –‘’నవరసానుబంధ బంధుర ప్రబంధ నిబంధ చాతురీ ధురీణ ,సకల విద్యా ప్రవీణ గౌతమగోత్ర పవిత్ర గౌరనామాత్య … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

14-పొత్తపి వెంకటామాత్యుడు

14-పొత్తపి వెంకటామాత్యుడు ‘’నూట ఎనిమిది దివ్య తిరుపతుల సుబ్బరాయ శతకం ‘’రాసిన పొత్తపి వెంకటామాత్యుడు రాయలసీమకవి .అన్నీ సీసాలే .మొదటిపద్యం చివర –మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ ‘’అని ఉంది .ప్రారంభం లో అశ్వత్ధ నారాయణుడు .పెన్న జూటురి చేన్నరాయలను ,వజగిరి నృసిమ్హుని ,కోన రంగేశుని ,హోన్నూరి రాయని స్తుతించటం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

13-ఏదుట్ల శేషాచలుడు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

12-సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు

12-సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు అత్తాను రామానుజా చార్యుని ;;శ్రీ రుక్మిణి కురవంజి ‘’తాళపత్ర గ్రంధం లోనే సర్వజ్ఞ పద్మనాయక భూపాలుని ‘’సారంగధర చరిత్ర –యక్షగానం ‘’కూడా ఉందట .కులం ,పదవులు , బిరుదాలు మాత్రమె కావ్యం లో ఉన్నాయి.సర్వజ్న బిరుదు ఇద్దరు ముగ్గురులకు ఉంది .చాలాశిధిలంగా ఉన్న గ్రంధం చదవటానికి ఇబ్బంది గా ఉందని బిరుదరాజు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

11-అత్తాను రామానుజా చార్యులు

1-అత్తాను రామానుజా చార్యులు 24శిధిల తాళపత్రాలలో ‘’రుక్మిణి కొర వంజిని’’ ద్విపదకావ్యం రచించిన అత్తాను రామానుజాచార్యులకాలాదులు తెలియవు .ఇది ప్రాచీన యక్షగానానికి చెందిన ప్రాచీన కొరవంజి .ఇస్ట దైవతాప్రార్ధన చేసి తర్వాత తనగురించి కవి చెప్పుకొన్నాడు . ‘’మునిగ్రామ వాసుడగు మూర్తిగలయట్టి – వనధి యగు పా౦డ్రాజు వంశపావనుడ అత్తాను సంబంధమైనట్టి వాడ –అత్తాను రామానుజాచార్య … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment