వీక్షకులు
- 1,212,481 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
- గీత అందించే ప్రపంచ దృక్పథం(త్రివేణి)
- అజ్ఞాత సోదరిత్రివేణి)
- రామాయణంలో ధర్మ పాలన – 1(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,629)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: రచనలు
అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం
అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం ఆకాలం లోగ్రీకుల ఇళ్ళు చిన్నవి గా ఉండేవి .కాల్చని మట్టి ఇటుకలతో ఇల్లు నిర్మించే వారు .మధ్యధరా ప్రాంతపు ఎండ ప్రతి ఫలించటానికి వీలుగా తెల్ల రంగు వేసే వారు . కిటికీలు పైన ఎత్తులో ఉండేవి .పేదలకు ఒకటి లేక రెండు గదులున్న ఇల్లున్దేవి . ధనికుల ఇళ్లలోఆడ వారికి ,మగ వారికి వేరు వేరు గా గదులున్దేవి .ఇంటి మధ్య ఖ్ఖాలీ ప్రదేశానికి చుట్టూ గదులున్దేవి .భోజనం సాధారణ భోజనమే .చాలాతాజా గా ,రుచి కరమైన వాటినే తినే వారు . వేడి ప్రాంతం కనుక పళ్ళు ,కూరగాయలు బాగా పండేవి .గోధుమ ,బార్లీ చేపలు సమృద్ధి గాలభించేవి .మాంసం తినటం తక్కువే . మేక పాలు తాగే వారు .పెరుగు ,వెన్న అన్నిటికీ మేక పాలే .ఆలివ్ ,ఆలివ్ నూనె వాడకం బాగాఉండేది .భోజనం లో ద్రాక్ష సారా తప్పని సరి . బానిసలు ఎక్కువ .యుద్ధాలలో పట్టు బడ్డ వారు ,వారి తార తరాల సంతానం ,బానిసలే .ఆట ,పాటధనిక ,పేద భేదం నాలుగవశతాబ్దానికి పెరిగింది . అన్ని పనులు బానిసలే చేసే వారు .ప్రతి ఇంట్లో వాళ్ళు తప్పని సరి .ధనిక పేదల భేదం నాల్గవ శతాబ్దం నాటికిపెరరిగింది.ఆడ వాళ్ల కు హక్కులు తక్కువే .మగ వాళ్ళ అధీనం లోనే ఆడబ్రతుకు ఉండేది . ఆమె ఇంటికే పరిమితం .వీధి లో తిరగటం నేరం .స్పార్టా లో మాత్రంస్త్రీలకు స్వాతంత్రం ఉండేది . అందుకే ఇక్కడి మహిళలు బలాధ్యమైన ,ఆరోగ్య వంత మైన పిల్లల్ని కనే వారు .ఆడవారు క్రీడలలో పాల్గొనేవారు . బాక్సింగ్ కూడా చేసే వారు .మగ పిల్లలు బడి కి వెళ్ళే వారు . ఆడ పిల్ల లకు ఇంట్లోనే చదువు .స్పార్టా లో ఆడ పిల్లలు బడికి వెళ్లిచదివే వారు .మగ వాళ్ళ తో పాటు అన్నిటికీ వారికి సమాన ప్రాధాన్యత ఉండేది . గ్రీకు దేశం లో కళల పట్ల ఆరాధన ఎక్కువ . నాటక శాలల్లో బహిరంగ ప్రదర్శనలు ప్రత్యక్షం గా జరిగేవి .కామెడీల ప్రదర్సనలు ఎక్కువ.అరిస్తోఫీనాస్ రాసిన కామెడీలు ,యూరిపిదాస్,సోఫోక్లాస్ రాసిన ట్రాజెడీలు ప్రదర్శిస్తే జనం బాగా చూసి ఆనందించే వారు .. కవిత్వంఅంటే మాంచి సరదా .700b.c.కాలం వాడిన అంధ కవి హోమర్ గొప్ప కవి . ఆయన రాసిన ఇలియడ్ ,ఒడిస్సీ లు 1200b.c.నాటిట్రోజన్ వార్ ఆ తర్వాతి కధలు .ఆ కాలం లో చాలా మంది విద్యా వేత్త లకు హోమర్ కావ్యాలు కన్తస్తం . క్రీడలు గ్రీకులోనే పుట్టి పెరిగాయి .ఒలింపిక్ ఆటలకు కేంద్రం .ఆటల్లో మత భావాలను చొప్పించే వారు .దేవత లను ఆరాధించటం గ్రీకుసంప్ర దాయం .చాంపియన్ క్రీడా కారులకు ప్రత్యెక సత్కారం చేసే వారు .అదొక ”క్లాసికల్ పీరియడ్ ”గా గుర్తింపు పొందింది . ఇన్నీ ఉన్నా గ్రీకులకు ఆనందం కరువే .ఎప్పుడూ యుద్ధాలే .ఆ కాలం లో పర్షియా అనే ఆసియా రాజ్యం (ఇవాల్టి ఇరాన్ )అయోనియాభాగాన్ని ఆక్ర మించింది .ఇది ఏజియన్ సముద్ర తూర్పు తీరం . ఇదే ఇవాల్టి ట ర్కి .దీనిలో ఎన్నో గ్రీకు వలస దేశాలున్నాయి .ఇవిపర్షియా పై499 b.c.లో తిరుగు బాటు చేశాయి .ఏథెన్స్ లాంటి సిటి స్టేట్స్ సమర్ధించాయి .డేరియస్ 1 అనే పర్షియా రాజు వీటిని అణచివేశాడు . అంతటి తో ఆగ కుండా నావల మీద bay of marathan అనే ఏథెన్స్ దగ్గర ప్రాంతానికి దండెత్తి వచ్చాడు .ఎతియన్లకు,పర్శియన్లకు భీకర యుద్ధం జరిగింది .గ్రీకుల రణ కౌశలం పర్శియన్లను దెబ్బ తీసింది .ఓడియన్ ఒడి పోయి సముద్రం గుండాస్వదేశానికి పారి పోయాడు . . 480b.c. లో మళ్ళీ అతని కొడుకు xerxes వచ్చి ,మీద పడ్డాడు . తెర్మో పైల్ అనే ఇరుకు ప్రాంతం లో యుద్ధం జరిగింది .స్పార్తాన్సైనికులుమొదటి రోజు యుద్ధం లో పర్షియన్ల అంతు చూశారు . ఒక గ్రీసు మోస గాడు పర్శియన్లకు వేరే మార్గం చూపించాడు . పర్షియన్లుగెలిచారు అయినా ఎక్కువ మంది చచ్చారు .ఏథెన్స్ చేరి ఆ మహా నగరాన్ని కాల్చి బూడిద చేశారు .అప్పటికే ఏథెన్స్ వాసులు పారిపోయారు . కనుక జన నష్టం జరగ లేదు తర్వాత సాలమిస్ వద్ద నెల రోజులనౌకా యుద్ధం లో ఏ అనుభవం లేని పర్షియన్లు చావు దెబ్బతిన్నారు . ఈత రాక సముద్రం లో మునిగి పోయారు .వంద లాది పర్షియన్ సైన్యాన్ని ఊచ కోత కోసేశారు .మరుసటి ఏడాది యుద్ధం లోపర్శియన్లను పూర్తిగా ఓడించేశారు . … Continue reading
రేడియేషన్ పోయెమ్స్ వ్యాసం – విహంగ లో
రేడియేషన్ పోయెమ్స్ వ్యాసం Posted on July,2012 by విహంగ http://vihanga.com/?p=4440 సాధారణం గా కుటుంబం లో ఎవరి కైనా జబ్బు చేస్తే కాలూ ,చేయి ఆడక తన్ను కొంటాం .నానా కంగారు పడిపోతాం .మన కంగారుని ఇతరులకూ అంటించి ,వారినీ ఇబ్బంది పాలు చేస్తాం .మరి ఆ జబ్బు కుటుంబ పెద్ద ,భర్త అయితే ,అది కేన్సర్ … Continue reading
చరిత్ర –సాహిత్యం –5 (చివరి భాగం )
చరిత్ర –సాహిత్యం –5 (చివరి భాగం ) రవీంద్ర నాద టాగూర్ ‘’literature is really not reflections of social process ,but the essence ,the abrifgement and summary of history ‘’అన్నాడు .కనుకనే సంఘ సంస్కరణా పేక్ష తో స్త్రీ పునర్వివాహం ,కన్యా శుల్కం ,పాశ్చాత్య వ్యామోహం పై … Continue reading
చరిత్ర-సాహిత్యం — 4
చరిత్ర-సాహిత్యం — 4 పత్ర్రికలు ప్రజా బాహుళ్యానికి చేరువ గా ఉంటాయి .ఆంద్ర పత్రిక ,ప్రభ ,కృష్ణా పత్రికల సేవ నిరుప మానం .సంపాదకులైన కాశీ నాధుని ,ముట్నూరి ల సంపాదకీయాలను ప్రజల్ని చైతన్య పరచి కార్యోన్ముఖులను చేశాయి .బ్రిటీష వారికి అవి కొరడా దెబ్బలే .సినిమాలు జాతీయ ,రాష్ట్రీయ అభిమానాన్ని ప్రోది చేశాయి .సాంఘిక … Continue reading
చరిత్ర—సాహిత్యం –3
చరిత్ర—సాహిత్యం –3 అలాగే మహాభారత కాలం లో కురు పాండవుల మద్య దాయాది పోరు శిశుపాలుడు మొదలైన వారి దాష్టీకం ..సంఘం లో తగ్గి పోతున్న నైతిక విలువలు .జరిగిన ,జరుగుతున్నా ,జరుగ బోయే విషయాలను గ్రంధస్తం చేయాల్సిన అవసరం కల్గింది .వేదం లోని ధర్మ సూక్ష్మాలను అర్ధం చేసు కొ లేని సామాన్యులకు కధలుగా … Continue reading
చరిత్ర-సాహిత్యం –2
చరిత్ర-సాహిత్యం –2 ప్రకృతి మన ముందున్న సజీవ చరిత్ర .’’కళలన్ని ప్రక్రుతి కి అనుకరణలే ‘’అన్నాడు అరిస్టాటిల్ (art imitates nature ).ఏది చేస్తుందో అదే ప్రక్రుతి అన్నారు ..ఈ ప్రపంచం యేర్పడ టానికి మూల కారణం ప్రక్రుతి .అంటే నదులు ,పర్వతాలు ,సూర్యుడు సముద్రాలు ,చెట్లు ,అరణ్యాలు ,చంద్రుడు ,ఆకాశం ,పశువులు ,పక్షులు అనీ … Continue reading
చరిత్ర –సాహిత్యం –1
చరిత్ర –సాహిత్యం –1 భావి భారత పద నిర్దేశకులు ,శక్తి కణాలు ,ఉత్సాహ వంతులు ,ధైర్య సాహసో పెతులు ,విచక్షణా చతురులూ ,ఆవేశ అగ్ని కణాలు ,అయిన యువ విద్యార్ధినీ విద్యార్ధులకు –అభి నందనాలు .కాలేజికి వచ్చి లేజీ గా ఏదో వింటూ ,పరీక్షల ముందే చదివి పాస్ అవుదాం … Continue reading
నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు
నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు ఇటలి నియంత ముసోలిని రాజకీయం గా కర్కశం గా ఉన్నా ప్రజలకు ఎంతో మేలు చేశాడు .ఈ విషయాలు ఎవరి దృష్టీ నీ ఆకర్షించి నట్లు లేదు ..అధికారం లోకి వచ్చిన రెండు నెలల్లో ముప్ఫై రెండు కేబినేట్ సమా వేశాలు నిర్వహించాడు ..రైలు రోడ్ల నిర్మాణానికి గొప్ప అనువజ్నులను … Continue reading
ఆడదై పుట్టటమే నేరమైంది
ఆడదై పుట్టటమే నేరమైంది ఆమె గొప్ప గణిత శాత్ర వేత్త కుమార్తె .గణిత శాస్త్రం లో ప్రోఫెస్సర్ ,విజ్ఞాన శాస్త్ర వేత్త .ఆమె స్వయం వ్యక్తిత్వం మగవాళ్ళకు అసూయ పుట్టించింది .ఆమెను ఏమీ చేయ లేక నడి బజార్లో కిరాతం గా చంపే శారు .ఆమెయే హిపాటి యా అనే గ్రీకు మేధావి .శాస్త్ర్రేయ పరిశోధనలు చేసినందుకు హత్య … Continue reading
సంస్కృతి అంటే ?
సంస్కృతి అంటే ? సంస్కృతి అనేది మానవ జీవితాలకు మాత్రమే సంబంధించింది .అది ఉండబట్టే మనల్ని మానవులు అంటున్నారు .లేకుంటే జంతువులతో సమానమే .సంస్కృటతి అంటే సభ్యతా ,సంస్కారం అని అనుకొంటాం ..ఇతరుల పట్ల మర్యాదా ,మన్ననా ,గౌరవం చూపటమే ఈ రెండు పదాలకు అర్ధం .అవి లేక పోయినా ,చూపక పోయినా … Continue reading
ట్రాయ్ పై కొత్త కోణం
ట్రాయ్ పై కొత్త కోణం ట్రాయ్ ,ట్రోజన్ వార లను గురించి హోమేర్ మహాకవి ఇలియడ్ ,ఒడిస్సి గ్రీక్ పురాణ గాధలలో విపు లంగా వివరించాడని అందరికి తెలిసిన విషయమే .అందాల రాసి హెలెన్ వల్లనే గ్రీకులకు ,ట్రోజన్లకు పదేళ్లు యుద్ధాలు జరిగాయి .అప్పుడు హెలెన్ ధరించిన బంగారు ఆభరణాలు ,రాజు ధరించిన వజ్రాలు పొదిగిన … Continue reading
కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)
కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం) సీతా సాధ్వి – యుద్ధ కాండ లో ఇంద్రజిత్తు అందర్ని నాగ పాశం తో బంధించాడు .వీరందరూ చని పోయినట్లు రావణుడు ప్రచారం చేయిస్తాడు .సీతకు విషయం తెలిసింది .ఆమె నమ్మలేదు .కావాలంటే త్రిజట తో యుద్ధ రంగానికి వెళ్లి చూడమంటాడు పది తలల వాడు. … Continue reading
కల్ప వృక్షపు స్త్రీలు –3
కల్ప వృక్షపు స్త్రీలు –3 సీతా సాధ్వి రామాయణం అంటే రామ ఆయనమే కాదు ‘’రామా ‘’అయనం ,సీతా చరితము కూడా .వారి ప్రేమ అద్వైతం .నిరంతరం .అందుకే ఇప్పటికీ సీతా రాముల ఆదర్శ దాంపత్యాన్ని గురించి చెప్పు కోవటం .ఆధునిక సాహిత్యం లో సీతా దేవిని గురించిన పద్యాలలో రెండే రెండు చాలా … Continue reading
కల్ప వృక్షపు స్త్రీలు –2
కల్ప వృక్షపు స్త్రీలు –2 దశరధుని ముగ్గురు రాణుల గురించి చెప్తు ,విశ్వనాధ- వారి రూప వర్ణన చేయడు .లక్షణాలను మాత్రమే చెప్పి ,మనల్నే ఆలోచించు కో మంటాడు .సుమిత్ర ను కౌసల్య తో ఒక సారి ,కైకతో ఒక సారి కలిపి చెప్తాడు .రామ లక్ష్మణులు ఒక జంటగా ,భరత శత్రుఘ్నులు ఒక జంటగా ప్రవర్తిస్తారనే … Continue reading
కల్ప వృక్షపు స్త్రీలు –1
కల్ప వృక్షపు స్త్రీలు –1 అంటే శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారు రచించిన శ్రీ రామాయణ కల్ప వృక్షం లో స్త్రీ పాత్ర చిత్రణ . ‘’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యము ,అస్మాద్రుశుం –డలఘు స్వాదు రసావ తార దిషణా హంకార ,దో హల బ్రాహ్మీ మయ మూర్తి శిష్యుడయినాడ … Continue reading
సత్య కధా సుధ—10 (చివరి భాగం)
సత్య కధా సుధ—10 (చివరి భాగం) ఏ జన్మ లో మానవుడు న్నా ,దాని పై మొహాన్ని వదులు కోలేడు –దీన్ని వివ రించే ఒక కధ –ఒక గురువు గారికి చావు సమయం దగ్గర పడింది .శిష్యుడు చుట్టూ విచారిస్తు న్నాడు .ఆయన్ను ‘’మీరు సరాసరి మొక్షానికే పోతారా “?’’అని అడిగారు .దానికి ఆయన మోక్షానికి ఇంకో జన్మ అడ్డంగా ఉందని … Continue reading
సత్య కధా సుధ—9
సత్య కధా సుధ—9 పుట్టిన బిడ్డ ఏడుపు కు ,తల్లి పాడే జోల పాటకు ఒక పండితుడు అర్ధం చెప్పాడు –చంటి వాడు ‘’క్వా ,క్వా ,క్వా’’అని ఎడుస్తాడని మనకు తెలిసిన విషయమే .సంస్కృతం లో ‘’క్వా’’అంటే ఎక్కడ?అని అర్ధం .అంటే ఈ లోకం లో ఆనందం ఎక్కడా?అని ప్రశ్నిస్తున్నాడ ట వాడు .తల్లి వాణ్ణి … Continue reading
సత్య కధా సుధ – 8
సత్య కధా సుధ – 8 ఆశ కు అంతు లేదు అని చెప్పటానికి ఒక చిన్న కధ .ఒకడు రాజు ను ఆశ్రయించి ,అనుగ్రహం పొంది భూమిని అంతటిని దానం గా పొందాడు .రాజ లాంచనాలతో ఏనుగు మీద ఎక్కి ఊరేగుతూ ఇంటికి వచ్చాడు .అందరు ఎంతో సంతోషించారు .అమాంతం గా గది లోకి వెళ్లి ఎక్కి ఎక్కి … Continue reading
సత్య కధా సుధ –7
సత్య కధా సుధ –7 ఒక గృహస్తు ఇంటికి భోజన సమయానికి ఒక అతిధి వచ్చాడు .తనతో పాటు ఆయనకు వడ్డించమని భార్యకు చెప్పాడు .అలానే చేసింది .తినటానికి ముందు అతిధిని ‘’బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణా హృతం ‘’అని గీతా శ్లోకాన్ని తనతో పాటు అనమన్నాడు .నేను అననన్నాడు అతిధి .అనమని మళ్ళీ … Continue reading
సత్య కధా సుధ -6
భక్తుడు’’ రక్షించు మహా ప్రభో’’ అని ఆర్తిగా ప్రార్ధిస్తూ ఉంటె వీడు ఏమైనా పుణ్య కర్మ చేశాడా అని భగవంతుడు ఆలోచిస్తాడట .దీనికి సంబంధించిన కధ తెలుసు కొందాం . ఒక సారి పాండవులందరూ ద్రౌపది తో సహా సముద్ర స్నానానికి వెళ్లారట .దాదాపు అంతా గంటకు పైగా స్నానాలు చేసి పైకి వచ్చి కూర్చున్నారు … Continue reading
సత్య కధా సుధ -5
సత్య కధా సుధ దైవీ శక్తి ని గురించి ఒక ఆస్తికుడు ,నాస్తికుడు తీవ్రం గా వాదించు కొన్నారు .’’నేను అన్నం తినను ‘’అన్నాడు నాస్తికుడు ‘’నీతో దేవుడు తి ని పిస్తాడుగా ‘’అన్నాడు ఆస్తికుడు .దేవున్నితప్పించు కోవటానికి ఒక అడవి చేరి మర్రి చేట్టుమాటున దాక్కున్నాడు .అప్పుడు ఒక బాట సారి వచ్చి … Continue reading
సత్య కధా సుధ –3
సత్య కధా సుధ –3 భగ వంతుడు ఏమి చేస్తాడో మానవునికి తెలియని ఒక లీల ను గురించి తెలియ జేస్తాను .ఒక రాజు గారి ఆశ్రయం లో ఇద్దరు పురోహితులున్నారు .అందులో ఒకడు ‘’దైవా దీనం జగత్ సర్వం ‘’అని నమ్మిన వాడు .రెండో వాడు రాజు గారి పరిపాలన బాగా ఉందని … Continue reading
సత్య కధా సుధ—2
సత్య కధా సుధ—2 ‘’అదృష్ట వంతు లైన పుత్రుల్ని కని హాయిగా జీవించండి .బిడ్డలు విద్యా వంతులు ,శూరులు అయినంత మాత్రాన ఆనందం రాదు .నా కొడుకులు విద్యా వంతులు ,పరాక్రమ వంతులే ..వారి వల్ల నేను కాని వారు కాని ఏ సుఖమూ పొంద లేదు .అదృష్ట వంతులకు మాత్రమే సౌఖ్యాలు లభిస్తాయి … Continue reading
సత్య కధా సుధ—1
సత్య కధా సుధ—1 ఒక రాజు గారికి దైవ భక్తీ ఎక్కువ .దేశం లో ఉన్న తన ప్రజల్లో దైవం మీద విశ్వాసం ఎలా ఉందొ తెలుసు కోవాలనే వింత కోరిక కలిగింది .మూడు ప్రశ్న లను ఇచ్చి దండోరా వేయించాడు .మొదటి ప్రశ్న దేవుడున్నాడా ?.రెండోది ఉంటె ఎటు వైపు చూస్తుంటాడు ?మూడో ప్రశ్న … Continue reading
అన్నమాచార్య జయంతి
అన్నమాచార్య జయంతి క్రీ.శ.1424 లో జన్మించి 79 ఏళ్ళు జీవించి 1503 లో శ్రీ వెంకటేశ్వర సాయుజ్యాన్ని పొందిన మహా భక్త శిఖామణి అన్నమాచార్యుల వారు .కడప జిల్లా తాళ్ళ పాకలో జన్మించిన కారణ జన్ముడు. అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణమి నాడు దేశ వ్యాప్తం గా జరుపు కోవటం పరం పర గా వస్తోంది . … Continue reading
వైశాఖ పౌర్ణమి – బుద్ధుడు అంటే ఎవరు ?
వైశాఖ పౌర్ణమి ఆ.కా.,మా.,వై .పౌర్ణమి లలో పవిత్ర సముద్ర స్నానాలను చేస్తాం .ఆ వరుస లో చివరి పున్నమి వైశాఖ .దీన్నే మహా వైశాఖి గా భావిస్తారు .దీని తరువాత వచ్చేది జ్యేష్ట పౌర్ణమి ని ఏరువాక పౌర్నమని ,ఆ తర్వాతా వచ్చే ఆషాఢపున్నమిని గురు పూర్ణమి లేక వ్యాస పూర్ణిమ లేక … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం )
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం ) ఇవీ నూరేళ్ళ తెలుగు కధలో చూసిన అనేకానేక సామాజికాంశాలు .విస్తృత మైన వీటిని దాదాపు కధా రచయిత లంతా చిత్రీక రించారు .అనుభవైక వేద్యం గా రాశారు .సమస్యల లోతును తడి మారు .పరిష్కార మార్గాలూ చూపించారు .సంఘటిత పరచి ,సాధానా మార్గాలను … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –9
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం —౯ ఎస్.ఏం.ఎస్.ల పాప్యులారిటి పై మంచి కధ ”మాయాజాలం ”ను జీవన్ రాశాడు .తాను ప్రేమించిన అమ్మాయి ఐ లవ్ యు చెప్పక పోతే హత్య చేశాడు .అది నేరమా అని టి.వి.చానల్ ప్రశ్నిస్తుంది .కాదు అని తొంభై శాతం ,మంది ఎస్.ఏం.ఎస్.లు ఇచ్చారు .రైతు చావుకు ప్రభుత్వానిదే బాధ్యతా ? అని అడిగితే తొంభై మూడు శాతం మంది కాదన్నారట .ఇదంతా చానళ్ళ మాయా జాలం గా చిత్రించాడు కధకుడు .ఇదంతా పనికి రాని ప్రసారాలకు అద్దం పడుతుంది .ఊరి దగ్గరున్న ఏటిలో, నది లో ఇసుక దొంగ రవాణా చేసే సిండి కేట్లు ఎక్కువయ్యారు .ఎక్కువగా తవ్వితే పంట కాలువలు మెరకై నీరు ప్రవహించదు .భూమి లోకి నీరు ఇంకదు .నీరు ప్రవహించి పారి పోతుంది .బోర్లలో నీరు రాదు .ఊరదు కూడా .ఈ సామాజికాంశాన్ని ”ఏటి పర్ర”కధ లో చోడవరం రామ కృష్ణ హెచ్చరిక గా చిత్రీకరించాడు .తిన టానికి పిడికెడు మెతుకులు లేక ,తాగటానికి గుక్కెడు నీళ్ళు దొరక్క ,పసి వాళ్లకు పాలు లేక ,వైద్యం ,భద్రతా ,సంతోషం ,విద్యా ,వికాసం ,విజ్ఞానం లేక కునారిల్లి పోతున్న జీవుల కన్నీటి కధలే ”పాలమూరు జిల్లా కధలు ”.ఉదయమిత్ర అనే రచయిత రాసిన కధలే ,వ్యధలే ఇవన్నీ .వాస్తవికత ,ఆ ప్రాంతపు యాస తో గుండెల్ని పిండేశాడు .బహుళ జాతి సంస్థ లో మన సామాజిక ,ఆర్ధిక స్తితి గతులపై పట్టు సాధించి వేధిస్తున్న వివ రాలన్నీ ”కొండ చిలువ ”కధ చెబుతుంది .ఆ బడుగుల చైతన్యానికి దారి చూపిస్తాడు రచయిత . … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –8
వందేళ్ళ తెలుగు కధ –8 పెళ్లి సాంఘిక భద్రత నిస్తుంది .ప్రేమ తాత్కాలిక ఆనందమే .పెళ్లి అయితే ఇద్దరు ఒకటే నన్న భావన కలుగుతుంది .ప్రేమ ఒక్కటే ఉంటె విడి పోతామేమో నన్న భయం ఉంటుంది .అభద్రతా … Continue reading
వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7
వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7 కోస్తాంధ్ర అన్నీ ఉన్న విస్తరి లా అని పిస్తుంది .పెద్దగా జీవన పోరాటాలు లేవు .వనరులు పుష్కలం .వాటిని ఉపయోగించు కొనే మార్గాలూ అందు బాటు లో ఉన్నాయి .ధన బలమూ ఉంది .అధికారం ఉంటుంది .కనుక ఇక్కడి కధలు సవారి బండి లా హాయిగా ఉంటాయి .అయితే గుండె లోతుల్ని … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6 శాస్త్ర విజ్ఞానం ,సాంకేతిక పరిజ్ఞానం ,నాగరకత పెరిగే కొలదీ సమాజం లో సమస్యలు పెరుగుతూనే ఉంటాయి .పారిశ్రామిక ప్రగతి కూడా మనిషి జీవితం తో ఆటలాడు కొంటుంది .ఊర్ధ్వ స్థితికి కొని పోయే ఆలోచనలు పెరగవు .దిగ జారుడు ఎక్కువ అవుతుంది .మానవీయత దూరమై పోతుంది .ఆర్ధిక బంధాలేనిర్ణయాత్మక … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5 తెలుగు నేల నాలుగు ప్రాంతాల లోగిలి .ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ,రాయల సీమ ,తెలంగాణా .ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రజల జీవన సరళి ,ఆచార వ్యవ హారాలు ,కట్టుబాట్లు ,వేరు వేరుగా ఉంటాయి .నైసర్గిక స్వరూపం ,పంటలు ,భూగర్భ నిక్షేపాలు ,,జలాశయాలు ,తాగు నీరు ,సాగు నీరు అందు … Continue reading
వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4
వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4 శ్రీ శారద ,ఆలూరి భుజంగ రావు ,ధనికొండ హనుమంత రావు ,రావూరి భరద్వాజ –పేదరికం లోని వివిధ పార్శ్వాలను కధల్లో స్పృశించారు .స్వయం గా అనుభవించారు కనుక ,ఆ కధలు సజీవం గా ఉన్నాయి .మనుష్యులలో దాగొని ఉన్న మానవత్వాన్ని ,స్నేహ సౌరభాలను ,బాంధవ్యాలను ,మర్యాదలను ,ఆప్యాయతలను మల్లె పూల … Continue reading
శ్రీ శంకర స్మరణం
శ్రీ శంకర స్మరణం వైశాఖ శుద్ధ పంచమి అంటే ఈ నెల 26 వ తేదీ గురువారం ఆది శంకరా చార్యుల వారి జయంతి .కేరళ లోని కాలడి లో భూమిపై కాలిడిన అపర శంకర అవతార మూర్తి అయిన శంకర భగవత్పాదులు చిన్న తనం లోనే సన్యాసాశ్రమం స్వీకరించి ,పరమ గురు శుశ్రూష లో … Continue reading
వందేళ్ళ తెలుగు కధ -౩
వందేళ్ళ తెలుగు కధ -౩ ‘’గ్రామీణ జీవన విధానం శిధిల మై పోతున్న తీరును పులికంటి కృష్ణా రెడ్డి కధలు గా రాసి ‘’మరపు రాని ఊరు ‘’ను చేశారు .మాదిగల ఆత్మ గౌరవాన్ని ప్రతి బిమ్బించే కధ ‘’ఊర బావి ‘’ కొలకలూరి ఇనాక్ రాశారు .వారికి మనో ధైర్యం కల్పించారు .మహిళ సంసారం … Continue reading
వందేళ్ళ తెలుగు కధ–2
వందేళ్ళ తెలుగు కధ–2 రచయిత తన అవగాహన మేరకు ఆలోచించి ,ఆలోచిస్తూ రచనలు చేస్తాడు .చదివే వారు కూడా ఆలోచిస్తూ చదివి ,చదివిన తర్వాత కూడా ఆలోచిస్తారు .రచయిత రచనను నైతిక ఆయుధం గా భావిస్తాడు .సృష్టించే శక్తి పెరిగిన కొద్దీ ,వ్యక్తీ రచయిత అయినట్లే ,చదివే శక్తి పెరిగిన కొద్దీ చదువరే . విమర్శకుడు అవుతాడు .ఇదే … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1 కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 2009 మే లో నిర్వహింప బడిన”వందేళ్ళ తెలుగు కధ ”సదస్సులో నాకు ఇచ్చిన ఈ విషయం పై నేను రాసి సమర్పించిన వ్యాసం ఇది .దాదాపు మూడేళ్ళ తరువాత మీకోసం వెలుగు చూస్తోంది . కధ అనేది చెప్పటం ,వినటం తో ప్రారంభ మైంది .తర్వాత … Continue reading
సరస భారతి – దర్శనీయ దేవాలయాలు – జన వేమన – కొత్త పుస్తకాలు
pdf త్వరలో — అందిస్తాము
అందరి నేస్తం డికెన్స్ –7 చివరి భాగం
అందరి నేస్తం డికెన్స్ –7 లిటిల్ దొర్బిట్ నవల దాస్ కాపిటల్ ను మించిన తిరుగు బాటు నవల (seditious ) .అన్నాడు షా .సమాజం లోని దోపిడీ అణగ దోక్కటం ,జైలు ఈవితం ,స్తంభాన ,ఉక్కిరి బిక్కిరి ,రాజకీయం అన్నీ కలబోశాడు .చదువు తుంటే ఉక్కిరి బిక్కిరై … Continue reading
అందరి నేస్తం డికెన్స్ –6
అందరి నేస్తం డికెన్స్ –6 బ్లీక్ హౌస్ నవల భయానక గమ్భేర్క నవల .౧౯ శతాబ్దపు ఆంగ్ల సాహిత్య మకుటం లో కలికి తురాయి .ఇందులో యదార్ధం తో బాటు బోలెడంత ఆశ్చర్యము వుంది .నగర్ర్కరణ నేపధ్యం గా రాసినది .లండన్ నగర వాస్తవ స్తితి కనిపిస్తుంది .దీనితో పాటు … Continue reading
అందరి నేస్తం డికెన్స్ -5
అందరి నేస్తం డికెన్స్ -5 డికెన్స్ అద్భుత కామిక్ రచయిత .ప్రపంచ జ్ఞానాన్ని పెంచుతాడు .అతి నిజాలను జర్న లిస్టు దృక్పధం లో ఆవిష్కరిస్తాడు .లండన్ మహానగర మహా రచయిత .లండన్ ను పవిత్ర నాగరక దృక్పధం గల సిటీ గా మార్చాడు .చాలా ప్రామాదకర పరిస్తితితులకుఅన్వేషణకు కామెడీని చక్కగా … Continue reading
అందరి నేస్తం డికెన్స్-4
ఇతర నవలలు చార్లెస్ డికెన్స్ రాసిన ”ఆలివర్ ట్విస్ట్ ”నవల నెర చరిత్రకు సంబంధించింది . .లండన్ లోని అండర్ … Continue reading
అందరి నేస్తం డికెన్స్ –3
అందరి నేస్తం డికెన్స్ –3 డికెన్స్ కు పన్నెండు మంది పిల్లలు .౨౨ ఏళ్ళ తర్వాత భార్య కాతేరిన్ తన్ను అసలే ప్రేమించలేదని ,ఆమె లో ప్రేమ మృగ్యం అని సంచలనాత్మక ప్రకటన చేశాడు .ఆరోజుల్లో ఇంగ్లీష్ మధ్య తరగతి కుతుమాల వారు పుస్తకాలను కోని చదివే వారు కాదు … Continue reading






