రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-5
16—కిరణ్ హెలికాప్టర్ పేలుస్తానన్న’’ పొన్నం ‘’
పార్ల మెంట్ మెంబర్ మాట్లాడే దిట్లానేనా ‘’ఎన్నం ?’’
17-జే.డి.నారాయణ ,పవన్ పడతారట ‘’చీపురు’’
పేరుకొన్న రాజకీయ కశ్మలం ఊడ్చి ఊడ్చి పారేస్తారు?
18-కాంగీ గంట వాయించి వాయించి విసుగెత్తిన గంటా
ఇప్పుడేమో కొత్తగా వాయించ బోతున్నాడట ‘’సైకిల్ గంట ?’’
19-ఇరవై ఆరు బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరి చేసిన’’ ఆండర్సన్’’
క్రికెట్ చరిత్ర తిరగ రాసిన కీవీ ప్లేబాయ్అయ్యాడు ‘’వండర్ సన్ ‘’.
20- సిబ్బందికి కిరణ్ ప్రకటించిన భారీ ‘’భ్రుతి ‘’
రాబోయే ఓట్ల పండగకు అందరికీ వీరే కదా ‘’గతి ?’’
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-1-2014-ఉయ్యూరు

“18-కాంగీ గంట వాయించి వాయించి విసుగెత్తిన గంటా
ఇప్పుడేమో కొత్తగా వాయించ బోతున్నాడట ‘’సైకిల్ గంట ?’’
“కొత్తగా” కాదండీ, “మళ్ళీ” అనాలి.
LikeLike