గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54-

-గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54-

57-సాహిత్యాంబుధిని ఆపోశన పట్టిన –అగస్త్యుడు

ఉత్తర భారతం అంటా మహమ్మదీయ పాలన లో ఉండగా సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది .దక్షినాన్ధ్రలో తెలుగు కాకతి రాజులు రాజ్యం స్థాపించిన తర్వాతే సంస్కృతానికి ఆదరణ కలిగింది .రెండవ ప్రతాప రుద్రుడు గొప్ప పందితకవిపోషకుడు .విద్యానాధుడు ఆస్థానకవి .అగస్త్యుడు కూడా అప్పుడే అక్కడ ఉన్నాడు .కనుక కాలం1294-1325గా భావిస్తారు .కాకతి రాజులకాలం లో నాటకాలు అలంకార శాస్త్రాలు నాట్య శాస్త్రాలు ,చారిత్రిక కావ్యాలు ఎన్నో సంస్కృతభాషలో వెలువడ్డాయి .అగస్త్యకవి ఒక వ్యక్తీ కాదు ఒక సాహిత్య సంస్థ అని పించాడు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసన పట్టినట్లు ఈ అగస్త్యకవి సాహిత్య సముద్రాన్ని ఆపోసన పట్టి అపర అగస్త్యుదనిపించుకొన్నాడు అతని సమర్ధతకు నిదర్షం గా ఆయన రాసిన 74గ్రంధాలే సాక్ష్యం .

సాహితీ అగస్త్యం

అగస్త్యుడు సంస్కృతం లో సంక్షిప్తం గా భారతం రాసి బాల భారతం అని పేరుపెట్టాడు .ఇరావై సర్గ లున్న ఈకావ్యం వైదర్భీ రీతిలో రాయ బడింది .చక్కని ఆవ్య వర్ణనలు చేశాడు ఋతు వర్ణన అమోఘం గా చేశాడు .వసంత ఋతు వర్ణనలో ‘’పుష్ప పరాగం వసంత లక్ష్మి చల్లిన రంగుల్లాగా ఉన్నదట .క్లిష్టత లేక స్పష్ట సుందరం గా చెప్పటం అతని ప్రత్యేకత .కాళిదాసు ను జ్ఞప్తికి తెస్తాడు .భారత యుధం లో చంద్రుడు తన వంశం అంతరించిపోతోందని తెలిసి చూడలేక త్వరగా అస్తమించాడని వర్ణించాడు .-

‘’శీతాంశుర్నిజ ఉల జన్మనాం నృపాణాం సంగ్రామే నిధాన మపెక్షితుం –శృంగాణి క్షణ మవలంబ్య రశ్మి హస్తై రస్తాద్రేఃపయసాంనిధిం ప్రపేదే ‘’.ఈ ఆవ్యానికి విజయ నగర సామ్రాజ్య చక్ర వర్తి శ్రీకృష్ణ దేవరాయల ముఖ్యమంత్రి అప్పాజీ అనే తిమ్మరుసు ‘’మనోహర ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .దీని ఆధారం గా తమిళం లో ‘’విల్లి భారతం ‘’రాయబడిందట .

నల ఈర్తి కౌముది అనే రెండవ కావ్యాన్ని అగస్త్యుడు రాశాడు .ఇందులో రెండు ,నాలుగు సర్గలు మాత్రమె దొరికాయి శ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి దీని లిఖితప్రతి ని సంపాదించి తలుగు అకాడెమి జర్నలో లో ప్రచురించారని తెలుస్తోంది .రెండు సర్గల సరళిని చూస్తె ఇది మహా కావ్యం అనిపిస్తుంది .రెండవ సర్గలో నలుడు విదర్భలో దేవతలా దూతగా ప్రవేశించటం ఉంది నాలుగవ సర్గ లో నల దమయంతుల వివాహం తర్వాత నలుడు మామ గారింట్లో ఒక నెల గడిపి తన నిషాద నగరానికి వచ్చినట్లుంది .నలుడు దామయన్తితో నిషాద నగరానికి వస్తూఉంటె పురజనులు వేడుక తో చూసే వర్ణన ను రఘువంశం లో కాళిదాసు వర్ణించిన తీరుగా ఉంటుంది .తెలుగుకవులుకూడా ఈ విషయాన్ని అందం గా తమకావ్యాలలో వర్ణించారు అంతటి ప్రేరణ కల్గించి అగస్త్యుని రచన .ఈ సర్గాలోనే వసంత ,వర్శర్టు వర్ణన ,జలక్రీడలు వర్ణింప బడ్డాయి .ప్రతి సర్గ చివర ‘’శ్రీ ‘’శబ్దాన్ని భారవిలాగా ప్రయోగించాడు రెండవ సర్గలో డెబ్భై నాలుగవ శ్లోకాన్ని వాసు చరిత్రకారుడు రామ రాజ భూషణుడు అనువాదం చేసి పొందుపరచాడు ఆ పద్యమే ‘’నానా సూన వితాన వాసనలు –‘’.పన్నెండవ శతాబ్దం తర్వాత వచ్చిన కవుల్లో అగస్త్యుడే ప్రతిభా శాలి అంటారు .

58-వేదాంత దేశికులు

1268-1369కాలానికి సస్మ్బంధించిన వేదాంత దేశికుల వారు అపర రామానుజవతారం అంటారు .నూటపాతిక దాకా సంస్కృతం లో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన అపర సరస్వతీ స్వరూపులు .వైష్ణవ మాట వ్యాప్తికి ఇతోధికం గా తోడ్పడ్డారు .అసలు పేరు వెంకట నాధుడు .తమిళం లోను గొప్ప పండితులు .గొప్ప దార్శనిక్లుగా సుప్రసిద్ధులు .వేదాన్తాచార్య ,కవితార్కిక సింహ ,సర్వ తంత్ర స్వతంత్ర బిరుదాంకితులు దేశికులు .ఇరవై ఏడేళ్ళ వయసులోనే దేశిక ,ఆచార్య సర్వ తంత్ర స్వతంత్ర బిరుడులన్డుకొన్నారు .శ్రీరంగ స్వామి రంగనాధుడు దేవి రంగనాయకి స్వయం గా దేశికుల భక్తికి కవితా శక్తికి ,పాండిత్యానికి మెచ్చి వేదాన్తాచార్య బిరుదు ప్రదానం చేశారని అంటారు .తమిళనాడు లోని తిరువహిందిపురం లో గురువు ఆజ్ఞతో గడిపి గరుడాళ్వార్ ను సేవించి అనుగ్రహం పొంది హయగ్రీవ మంత్రాన్ను ఉపాసించి అనుగ్రహానికి పాత్రుడైనారు .అప్పటి నుంచి లక్ష్మీహయగ్రీవ భక్తులై జీవితాన్ని చరితార్ధం చేసుకొన్నారు .ఆసేతు హిమాచల పర్యంతం తీర్ధ యాత్రలు చేసి విశిష్టాద్వైత మత ప్రచారం చేశారు .యెంత ఎదిగినా ఒదిగి ఉన్నారు దేశికులు .’’వేదాంత దేశిక పధేవిని వేశ్య బాలాం’’’ అని అతి వినయం గా చెప్పుకొన్నారు .’’భగవానుడు ఒక బాలకుడికి ఆచార్య స్థాయిని కల్పించాడు .యెంత దయామయుడో’’అన్నారు .శ్రీరంగాన్ని మదురై సుల్తాన్ ఆక్రమించగా విజయనగర రాజ్య స్థాపకులు  దేశికుల సహా విద్యార్ధి అయిన విద్యారణ్య స్వామి శ్రీరంగం వచ్చి ఇక్కడి పరిస్తితులను అధ్యయనం చేసి గోపనార్యుడు అనే బ్రాహ్మణ సైన్యాధ్యక్షునికి దక్షిణ భారత దేశాన్ని ముస్లిం పాలన నుండి విముక్తి కలిగించమని ఆదేశించారు .ముందుగా జెంజిని జయించి స్వాధీనపరచుకొని ,తిరుపతి లోఉన్న శ్రీరంగాని విగ్రహాన్ని అక్కడికి తాత్కాలికం గా తెప్పించాడు .వెంటనే శ్రీరంగం లోని సుల్తాన్ సైన్యం పై విజ్రుమ్భించి ఓడించి ,శ్రీరంగానాదుడిని మరల శ్రీరంగం లో ప్రతిస్టించాడు గోపనార్యుడిని సాక్షాత్తు విష్ణు అవతారం అని భావిస్తారు .

దేశికీయ కవిత్వం

వేదాంత దేశికులు సర్వార్ధ సిద్ధి ,న్యాయ పరిశుద్ధి ,న్యాయ సిదాన్జన,మీమాంసా పాదుక ,అధికరణ సారావళి ,శాత దూషిణి,సచ్చరిత్ర రక్ష ,నిషేపరాక్ష ,పంచ రాత్ర రక్ష మొదలైన సంస్కృత గ్రంధాలను దార్శనిక సంబంధమైనవిగా లెక్కిస్తారు .రామానుజుల ‘’శ్రీ భాష్యం ‘’కు తత్వ టీకను ,తాత్పర్య చంద్రికలను ,యామునా చార్యుల గీతార్సరధ సంగ్రహ రక్షను ,రామానుజుల గద్య త్రయానికి రహస్య రక్షను ,ఈశావాస్యోపనిషత్ భాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు .ద్రావిడ ప్రబంధ మైన  ‘’తిరువాయి మొలి’’ని  సంస్కృతీకరించారు .

యాదవాభ్యుదయం అనే మహా కావ్యాన్ని ,సంకల్ప సూర్యోదయం అనే నాటకాన్ని ,హంస సందేశం అనే లఘు కావ్యాన్ని ,పాదుకా సహస్రం ,వరద రాజ పంచాశతి ,గరుడ దండకం అనే ముక్తక కావ్యాలను రాశారు దేశికులు రామాయణ కదా సారాన్ని ‘’రఘువీర గద్య ‘’గా సంస్కృతం లో రాశారు అచ్యుత శతకాన్ని ప్రాకృతం లో రాశారు వేదాంత దేశికులు దార్శనికులుగానేకాక మహా పండిత ప్రకాన్డులుగా ,మహా వ్యాఖ్యాతగా ,మహోన్నత కవిగా రాణ కెక్కారు .

దేశికుల యాదవాభ్యుదయం లో ఇరవై నాలుగు సర్గాలున్నాయి .శ్రీకృష్ణ చరిత్రకావ్యం ఇది .కృష్ణుని జీవితం లోని ప్రతి సంఘటన వెనుక ఉన్న దార్శనికార్ధాన్ని కమ్మని శైలిలో వర్ణించారు .ఈ కావ్యానికి అప్పయ్య దీక్షితులు వ్యాఖ్యానం రాయటం మరో విశేషం వర్ణనలలో వేదాన్తపర మైన ఉపమానాలను వాడటం దేశికుల ప్రత్యేకత .-

‘’వివిధ ముని గణోప జీవయా తీరదా విగామిత సర్ప గణా పరేణ పుంసా –అభిజిత యమునా విశుద్ధ ముగ్ర్యాం శమిత మహిర్మాట సంప్లవా త్రయీవ ‘’-అర్ధం –మూడు వేదాలని చదువుకొన్న వాడి చేత ఇతర మతాలూ ఏ విధం గా శమింప చేయ బడతాయో అదే విధం గా యమునా నది సర్పాల నన్నిటిని పార ద్రోలిన తర్వాత పరి శుద్ధమై విశుద్ధం గా ప్రకాశిస్తోంది .

 

దేశికులు సంకల్ప సూర్యోదయం అనే నాటకం రాశారు ఇందులో మోహ పరాజయం ,వివేకోదయం లను చెప్పారు .శాంతరసం వలన మనో వికారాలు శమించి ఆనందానుభూతి కలిగిస్తుందని వివరించారు .ఇది దార్శనికతకు ప్రతీకాత్మక నాటకం .

దేశికులు రహస్య గ్రంధాలైన ‘’తత్వ పదవి ,రహస్య పదవి తత్వ నవనీతం ,రహస్య నవనీతం ,తత్వ మాతృక ,రహస్య మాతృక ,తత్వ సందేశం ,రహస్య సందేశవివరణం ,తత్వ రత్నావళి ,తత్వ రత్నావళి ప్రతిపాద్య సంగ్రహం ,రహస్య రత్నావళి,రహస్య రత్నావళి హృదయం ,తత్వ త్రయ చూలకం ,రహస్య త్రయ చూలకం ,అభయ ప్రదాన సారం ,రహస్య శిఖామణి ,అంజలి వైభవం ,ప్రదాన శతకం ,ఉపహార సంగ్రహం ,సార సంగ్రహం ,మునివాహన భోగం ,మధుర కవి హృదయం ,పరమ పద సోపానం ,పరమత భంగం ,హస్తిగిరి మహాత్మ్యం ,శ్రీమత్ రహస్య త్రయ సారం ,సారసారం ,పరిహారం . ,

దేశికులు హంస సందేశం అనే కావ్యం రాశారు .రాముడు హంస ద్వారా సీతా దేవికి సందేశం పంపటం ఇందులోని వృత్తాంతం .దక్షిణ దేశం గుండా హంస పర్యటించి ,సముద్రం మీద రామ బాణం లాగా దూసుకు వెళ్లి యెగిరి లంక చేరి రామ సందేశాన్ని సీత కు సందేశం అందజేస్తుంది .దేశికుల ‘’పాదుకా సహస్రం ‘’ను ‘’మాగ్నం ఓపస్’’ గా భావిస్తారు .ఇది1008 శ్లోకాల భక్తిమాల .ఇందులో ముప్ఫై రెండు పదాదిలు ఉన్నాయి .రోజుకు ఒకటి చొప్పున ముప్ఫై రెండు రోజులలో దీన్ని భక్తితో పఠిస్తే కోరికలు తీరి మోక్షం లభిస్తుంది అని నమ్మం .చిత్ర పదాలతో లలిత సుందరం గా రాసిన భక్తీ కుసుమమాల ఇది .ముఖ్యం గా శ్రీరామ శ్రీకృష్ణ ,శ్రీ రంగనాధ స్వామి పాదపద్మా లపై రాసిన శ్లోక సముదాయం .ఇది చదివితే ఆత్మ జ్ఞానం లభించటం ఖాయం .వేదాంత దేశికులు ఎక్కని సోపానాలు లేవు .అందని పురస్కారాలు లేవు .కదిలించని రచనలు లేవు .అన్నిటా దేశికులు మహా మార్గ దర్శులే .

మరోకవితో కలుద్దాం

Swamy Desikan.jpg

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-10-14-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.