1-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత
ఇక్కడికి రండి
పతిత ,అపవిత్ర ,బహిష్కరి౦పబడ్డ
వారంతా ఇక్కడికి రండి
అందరం కలిసి అమ్మవారి ని పూజిద్దాం
అన్నికులాల దేశాల వారు
‘ఆమె పాదాల చెంత
ప్రక్కప్రక్కన నిల్చి నిర్భయంగా చేరితే
దేవాలయం ,పూజారి మత గ్రంథాలకు
కట్టుబడకుండా చేరితేనే
ఆ దేవతను నిర్దిష్టంగా ఆరాధించగలం
అన్నదమ్ములు ప్రక్కప్రక్కన కూర్చుని అర్చిస్తే
స్వర్గ కిరీటం వదిలి దిగివచ్చి
ఆమెనామం పలికినవారిని అక్కున చేర్చుకొంటు౦ది
భూమిపై మన్నూధూళిలో మన చెంతనే కూర్చు౦టు౦ది
ఆమె పవిత్రజలం ఆమె మనల్ని స్పర్శించి ఆశీస్సులు పొందితేనే
దేవి పీఠం పవిత్ర మౌతుంది
కారణం మనం ఆమె సందేశాన్ని నిర్లక్ష్యం చేశా౦ కనుక
సోదరుడు సోదరుని వ్యతిరేకమై
ఇవాళ ఆమె సంపూర్ణ శోభ చూసి
మనమంతా ఒకే తల్లి పిల్లలమని తప్పక గ్రహించాలి
నిర్భయంగా మనం ఆలపించే ఐక్యగీతం
పవిత్ర మాతను మనం పిలిచే పిలుపుతో
దివి భువి సకల విశ్వం చేతనమౌతుంది
విస్మయ విస్ఫోటనం చెందుతుంది .
ఆధారం –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు ఉదయన్ చటోపాధ్యాయ ఆంగ్లాను వాదం .