Category Archives: పుస్తకాలు

కేరళపాణిని రాజరాజ వర్మ 4

కేరళ పాణిని -4ఉద్యోగం లో ఉన్నత దశ  రాజరాజ వర్మ అధ్యాపక వృత్తిలో శిఖరాగ్రం అందుకొన్న కాలం ఇది .పాశ్చాత్యులు మాత్రమే అధిష్టించాల్సిన ఉన్నత పదవులు వర్మకు దక్కటం ఆయన ప్రతిభా విశేషం .19 10 లో సంస్కృత ,ద్రావిడ భాషలకు ఆచార్యుడయ్యాడు .ఈ విషయం మేనమామ  కేరళ వర్మకు ముందు తెలిసి మేనల్లుని అభినందిస్తూ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేరళ పాణిని-రాజరాజ వర్మ 3

కేరళ పాణిని-రాజరాజ వర్మ -3 ఉపాధ్యాయుడు -పరిశోధకుడు రాజ వంశ సంబంధాలు రాజరాజ వర్మను సంపన్నుడిని చేయలేదుకానీ అవసరాలు తీరాయి .మేనమామ సహాయం ఎలానూ ఉండనే ఉంది .స్వంతకాళ్ళ మీద నిలబడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం లో చేరాలనుకొన్నాడు కానీ రాజ వంశాస్తులు ప్రభుత్వ ఉద్యోగం చేయటం ఆచారం కాదు.దీన్ని లక్ష్య పెట్టలేదు .తిరువనంతపురం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కేరళపాణిని రాజరాజ వర్మ -2

కేరళపాణిని రాజరాజ వర్మ -2 ఉన్నత విద్య మెట్రిక్ తేలిగ్గా పాసై రాజరాజ వర్మ విశ్వ విద్యాలయం లో చేరేసమయం లోతల్లి మరణం తో ఒక ఏడాదిపాటు క్షురకర్మ చేయిన్చుకోకుండా కర్మకాండలు పూర్తీ చేయాల్సి ఉన్నందున విద్య సాగలేదు .  చదవాలని ఉన్నా పెద్దలు అంగీకరించలేదు రాజు కి తెలిసి తనకుమారుడు నారాయణ తంపి మద్రాస్ యూని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కవిపండిత ,విమర్శకుడుకేరళపాణిని- రాజరాజ వర్మ

కవిపండిత ,విమర్శకుడుకేరళపాణిని- రాజరాజ వర్మ రాజరాజ వర్మ కోయిల్ తంపురాన్ అని అసలుపేరు .రాజ వర్మ తంపురాన్,కోయి తంపురాన్ వగైరా లన్నీ రాజవంశస్తుల్ని కేరళ రాజ బంధువుల్ని సూచించేవి .1863లో రాజవర్మ తిరువనంతపురానికి  ఉత్తరంగా  చెంగనా శేరిలోని లక్ష్మీపురం లోని రాజప్రాసాదం లో జన్మించాడు .హైదరాలీ దండయాత్రలనుంచి తప్పుకొవటానికి అనేక రాజకుటుంబాలు మలబారు ప్రాంతం నుంచి తిరువనంతపురం చేరాయి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )

     శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )   ముక్తీశ్వరం ,చంద్రవరం గోదావరి మండలం లో కమలాపురం రాజోలు తాలూకాలు రెండు ఉద్యానవనాలు .విద్యలకు ఆటపట్టు ,ప్రకృతి సంపదకు నిలయం .ద్రాక్షారామ తర్వాత క్షణ ముక్తీశ్వరం లో దాసుగారు ఒక సప్తాహం వైభవంగా జరిపారు .కవిపండితులంతా దాసుగారికి బ్రహ్మ రధం పట్టారు .ఒకసారి రాజమండ్రి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   శ్రీ దాసు లింగమూర్తి -5

   శ్రీ దాసు లింగమూర్తి -5  భార్య మరణం దాసుగారు భార్య ప్రసవం కోసం అత్తారింటికి తీసుకు వెళ్ళారు .కొద్దిరోజుల్లోనే ఉబ్బు వ్యాధి వచ్చింది .రాజమండ్రిలోని ఘోషా ఆస్పత్రికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు దాసుగారు సెలవు పెట్టి వచ్చేసరికి మామగారు ఆమెను సవారీ బండిలో రాజమండ్రి తీసుకు వెడుతుండగా భార్య కాస్త కాఫీ ఇమ్మని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -4

  శ్రీ దాసు లింగమూర్తి -4 గోదావరి జిల్లాలో సత్కార్యాలు అనేక సేవాకార్యక్రమాలలో మునిగి తేలుతున్న దాసుగారి ఆరోగ్యం దెబ్బతినటం వలన విశ్రాంతికోసం సెలవుపెట్టి అత్తగారింటికీ  వెళ్ళారు .దారిలో వారికొడుకు కృష్ణారావు చనిపోయాడు .మరదలి అత్తగారి ఊరు రాజానగరం వెళ్ళారు. అక్కడ తోడల్లుడు సుబ్బారావు గారు హెడ్ మాస్టర్ .ఒకరోజు ఒకకుమ్మరి జాతక రహస్యాలు దాసుగారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మట్టి పువ్వులు

మట్టి పువ్వులు గా ,హోసూరు బస్తీ యువక బృందం డా అగరం వసంత్ కూర్పరి గావివిధ ప్రాంతాలకు చెందిన 61మందికవులురాసిన  15వ ‘’కవితల పొత్తం’’ ఈ సంవత్సరం ప్రచురించి కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు కీ .శే .కలువకుంట నారాయణ పిళ్ళే కు అంకితమిచ్చి౦ది .ఈ పుస్తకాన్ని వసంత్ నాకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధూర్జటీ!

ధూర్జటీ! శృంగేరి కి చెందిన శ్రీ యరికలపూడి సుబ్రహ్మణ్య శర్మగారు ‘’ధూర్జటీ ‘’శతకం రాసి ,శృంగేరి 34వ పీఠఠాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతీ తీర్ధ మహా స్వామివారికి అంకితమిచ్చారు .శర్మగారితో నాకుఎలాంటి పరిచయమూలేదు .కానీ వారుఆత్మీయంగా ధూర్జటిని మా ఇంటికి పంపగా ,అందిందనిఫోన్ చేస్తే ‘’మీ అభిప్రాయం రాయండి ‘’అని కోరారు .అందుకే  … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 శ్రీ దాసు లింగమూర్తి -3

 శ్రీ దాసు లింగమూర్తి -3 దాసుగారు ముదిగల్లు ,కళ్యాణ దుర్గం ,గంగవరం ,సిర్పి ,అనంతపురం మొదలలైన చోట్ల నామభజన సప్తాహాలు చేశారు .పినాకిని పత్రిక కవరేజ్ ప్రకారం అనంతపురం లో శ్రీరామ నామ సప్తాహం చేశారు .ముదిగల్లులో శివాలయ ఉద్ధరణ చేసి రామనామ సప్తాహం ,ఈశ్వరుడికి లక్ష బిల్వార్చన చేశారు .ఒకయువకుడు ‘’అయ్యా రాత్రి ఏమి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -2 వివాహ ఉద్యోగాలు –దాసు గా అవతరించటం

శ్రీ దాసు లింగమూర్తి -2            వివాహ ఉద్యోగాలు –దాసు గా అవతరించటం గోదావరీ నదీ పాయ వశిష్ట గోదావరి ఒడ్డున విజ్జ్హేశ్వరం అనే  గ్రామం  లో నదికి ఆనకట్ట ,లాకులు ,నరసాపురం కాలువ ఉ౦డి,పరమ మనోహరం గా కనిపిస్తుంది .ఈ గ్రామ కరణం అల్లుడు  ఒంటిమిల్లి వాసి ఎర్రమిల్లి వెంకట చలమయ్య కరణీకం చేస్తాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంజీవరాయ కవి శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని 

సంజీవరాయ కవి శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -1  కవికధా కమామీషు       రావూరి సంజీవ రాయ కవి ప్రణీత ‘’శ్రీ రుక్మిణీ పరిణయము ‘’కావ్యం విశిష్ట మైంది .కారణాలు చాలా ఉన్నా ,అందులో ముఖ్య మైన కొన్నిటిని చూద్దాం .ఏ కావ్యాని కైనా కర్త ఒక్కడే ఉండటం సహజం .కాని ఈకవ్యకన్యక కు నిజం తండ్రి సంజీవ రాయ కవి అయినా ,తామూ ఆ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘సరసభారతి’ అందిస్తున్న కానుక అంకాత్మక (డిజిటల్)పుస్తకం సమస్త భక్త శిఖామణులు

భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘సరసభారతి’ అందిస్తున్న కానుక అంకాత్మక (డిజిటల్)పుస్తకం సమస్త భక్త శిఖామణులు

Posted in పుస్తకాలు | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి

  శ్రీ దాసు లింగమూర్తి శ్రీ దాసు లింగమూర్తి జీవితము  అనే పుస్తకాన్ని శ్రీ పాలపర్తి సూర్యనారాయణ రాశారు ఈయన అంతకుమునుపే ప్రియదర్శిని ,మేవాడపతనం లక్ష్మీ నరసింహ ,ముకుందమాల స్తోత్రాలు ,అహోబిల చరిత్రాదులు రాశారు .దీన్ని చాగలమర్రి వాసి డాక్టర్ గంగరాజు వెంకట రామయ్య గారు బెజవాడ ఆంద్ర గ్రంధాలయం లో 1931లో  ప్రచురించారు .ఖరీదు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాలిగ్రామ పుర వైభవం

సాలిగ్రామ పుర వైభవం యతి సార్వభౌమ శ్రీ రామానుజ పాదుకా తీర్ధ ప్రభావ ప్రపూరిత ‘’సాలిగ్రామ పుర వైభవం ‘’అనే స్తోత్రాన్ని శ్రీ మదస్టాక్షరీ మఠాధ్యక్షుడు స్వామి దయాసాగర భీష్మార్య శ్రీమన్నల్లార్య కులతిలక శ్రీ మద్వరద రామానుజపాదుకా సేవా ధురీణ ,దేశాభిమానీ మొదలైన బిరుదులున్నశ్రీ బి.పి .శ్రీనివాస శర్మ గారు రచించగా ,శ్రీమాన్ తూప్పిల్ గోపాలాచార్యకవి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సిద్ధ యోగుల సిద్ధ గుటిక

సిద్ధ యోగుల సిద్ధ గుటిక .  సరసభారతి ఆస్థానకవులు మాrపూర్తి  చేసి ,ఇప్పుడే ఆపుస్తకం చదివాను .నిజంగా సిద్ధ ఘుటిక అనిపించింది .ఆచార్యులవారి పాండిత్యానికి,వైదుష్యానికి  బహుకావ్యాను శీలానికి ,తానూ సిద్ధహస్తులైన పద్యకవిత్వానికి ,తన బహు శాస్త్ర పరిచయానికి ,అధ్యన శీలత్వానికి ,బహుకాల తెనుగు బోధనాపటిమకు  అద్దంపట్టిన రచన . 2019డిసెంబర్ లో మేముఒంటి మిట్ట యాత్ర చేసినప్పుడు తిరుగు ప్రయాణం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పారు వేట( పార్వేట )కథా సంగ్రహం

పారు వేట( పార్వేట )కథా సంగ్రహం పారు వేట( పార్వేట )కథా సంగ్రహం  అనే చిరుపోత్తాన్ని కర్నూలు జిల్లా వోర్వకల్లు  శ్రీ కేశవస్వామి ఉత్సవాన్ని గురించి ,కావ్యంగా నిజాం ఇలాకా ఇల్లూరు  గ్రామానికి చెందిన శ్రీ అప్పకవి గారు వ్రాయగా కర్నూలు కు చెందిన శ్రీ గుంతా సుబ్బన్న శ్రేష్టి గారు 1918లో కర్నూలు శ్రీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మాల్యాద్రి నృసింహ శతకం

మాల్యాద్రి నృసింహ శతకం మాల్యాద్రి నృసింహ శతకాన్ని నరసింహ భక్తాగ్రేసరుడు శ్రీ ముత్తరాజు నృసింహరావు గారు సర్వజిత్ నామ సంవత్సర పుష్య శుద్ధ తదియ స్థిరవాసరం అంటే 1887 డిసెంబర్ లో  రచించి,నృసింహా చార్య పండితుని చే పరిష్కరింప జేయించి ,నెల్లూరు శ్రీ రంగనాయక లీలా ముద్రాక్షర శాల యందు 1889నవంబర్ 5న  ముద్రించారు .మాల్యాద్రి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తత్వ వేత్త యడ్ల రామ దాసు గారు

తత్వ వేత్త యడ్ల రామ దాసు గారు 19వ శతాబ్దం చివరలో కాకినాడలో ఉన్న తత్వ వేత్తలలో యడ్ల రామదాసు ఒకరు .క్రీ.శ 1860లో జన్మించి 70ఏళ్ళు జీవించి 1910లో సిద్ధిపొందిన తత్వ వేత్త .బ్రహ్మం గారి తత్వాల తర్వాత ఈయన తత్వాలకే వ్యాప్తి ఎక్కువ .119కీర్తనలతో ‘’సాంఖ్య తారకామనస్క యోగంబనెడు సుజ్ఞాన చంద్రిక ‘ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత నిట్టల ప్రకాశం గారు

అవధూత నిట్టల ప్రకాశం గారు  అవధూత నిట్టల ప్రకాశం గారు యానాం కు ఆయన 50 వ ఏట వచ్చినప్పుడు తన చిన్నతనం లో చూశానని శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు రాశారు .అప్పటికి ప్రకాశం గారికి కవిగా గుర్తింపులేదు .ఆయనను ఎవరూ ఎరగరు కూడా .అలా ఒకరోజున ఆయన తనకు కొద్దిరోజుల్లో కవన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత నిట్టల ప్రకాశం గారు -2(చివరిభాగం )

అవధూత నిట్టల ప్రకాశం గారు -2(చివరిభాగం ) ‘’నిట్టల ప్రకాశంగారు భజన కత్తుగా పాడుకోదగిన వారే కానీ అంతకు మించిన పాటకులు కారు ‘’అన్నారు వెంకట శాస్త్రి గారు .ఆయన భామ వేషం కట్టేవారనీ ,దానిలోనుంచి వచ్చిన పదకవితలే ఇవి అని చెప్పగా విన్నారట .ఆ వేషానికీ ఆకవిత్వానికి సంబంధం ఉండదు .పూర్వ జన్మ లో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు చిలిపి’’ వరద ‘’ శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు చిన్నతనం విశాఖ పట్నం లో గడిచింది .అప్పుడు ఆయన తండ్రి శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు ఆంధ్రా యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా ఉండేవారు. ఆయనవల్లనే శ్రీ శ్రీ ,ఆరుద్రలు పాశ్చాత్య సాహిత్యపు పోకడలను గ్రహించారు .పుస్తకాలిచ్చి వారితో చదివి౦చేవారాయన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

21వ శతాబ్దం లో మతం -3(చివరి భాగం )

21వ శతాబ్దం లో మతం -3(చివరి భాగం )  21వ శతాబ్ది ఆశా జ్యోతి ధర్మ౦ ఒక్కటే 21వ శతాబ్దిలో రాబోయే దశకాలలో ధర్మం ఒక్కటే సరైన మార్గనిర్దేశం చేసే దివ్య జ్యోతి .పడమటి దేశాలలో మతం పూర్తిగా మతతత్వవాదానికీ ,సెక్యులరిజ వర్గాలమధ్య ఇరుక్కు పోయింది .కానీ మనకు మాత్ర౦ ధర్మమే  ఉత్కృష్ట  ధ్యేయం.వాళ్లకు ఆ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

21వశతాబ్దం లో మతం -2

21వశతాబ్దం లో మతం -2 సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆధునిక సైకాలజీ ప్రకారం   ‘’మతవిశ్వాసం విశ్వవ్యాపిత మనో వ్యాకులమైన ముట్టడి (యూని వర్సల్ అబ్సేషనల్ న్యూరోసిస్ ‘’).దేహెంద్రియప్రపంచం పై మతం పెత్తనం వహిస్తోందని సూచన చేశాడు .ఇది చిన్నపిల్లలమనో భ్రాంతి వంటిది అన్నాడు .మానవజాతి పరిణామానికి మతం కి౦చపరచేదిగా ఉ౦దన్నాడు.   21వ శతాబ్దిలో మతం పాత్ర … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

21వ శతాబ్దం లో మతం

21వ శతాబ్దం లో మతం మానవాళ జీవితం లో మతం ప్రముఖమైనది .వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది .దేశాలకు వర్గాలకు అస్తిత్వాన్ని ప్రసాదిస్తుంది .దీనివలన ఐక్యత ,స్వంత భావన ఏర్పడుతుంది .సైన్స్ ఫిలాసఫీ ,సాహిత్యాలను ప్రభావితం చేస్తాయి  .  పాశ్చాత్య దేశాలలో 19,20శతాబ్దాలలో సైన్స్ టెక్నాలజీ ,హేతువాద వ్యాప్తిపై మతంపై   యుద్ధాలే జరిగాయి .రాజకీయ ఆర్ధిక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం  వాగ్గేయ కారులుయడ్ల రామ దాసుగారి శిష్యుడు కంటా అప్పలదాసు గారు  శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం రాసి గురువుగారితో పరిష్కరింప జేసుకొని ,కాకినాడ శ్రీ సావిత్రీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించారు వెల. బేడ అంటే రెండు అణాలు.  పీఠిక లో కవిగారు ‘’విజయనగర వాసి శ్రీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రనరసింహ శతకం

ఉగ్రనరసింహ శతకం మార్కాపురం తాలూకా ఉమ్మడి వర ఉగ్ర నరసింహ స్వామి పై ఉగ్రనరసింహ శతకం ,దండకం ,పంచ రత్నాలు,సీసమాలికా  సభక్తికంగా శ్రీ భాస్కరుని వీర రాఘవరావు గారు రచించి నెల్లూరు ప్రభాత ముద్రణాలయం లో ముద్రించి ప్రచురించారు. వెల –కేవలం పావలా .ముద్రణ జరిగిన సంవత్సరం లేదు .   కందా శతకం ఇది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయపూర్ మహా రాజా విక్రమ దేవ వర్మ ‘’కథా మంజరి ‘’-2(చివరిభాగం )

జయపూర్ మహా రాజా విక్రమ దేవ వర్మ ‘’కథా మంజరి ‘’-2(చివరిభాగం )     ఈ కథా మంజరిని ‘’క థా తత్వావలోకనం ‘’పేరుతొ ఆచార్య సార్వ భౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చక్కగా విశ్లేషించి విషయ వివరణ చేశారు –‘’ఒరియా సాహిత్యం లో ఫకీర్ మోహన్ దాస్ రచించినవిఖ్యాతమైన అనుకరణకు అసాధ్యమైన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

జయపూర్ మహా రాజా విక్రమ దేవ వర్మ ‘’కదా మంజరి ‘’-1

జయపూర్ మహా రాజా విక్రమ దేవ వర్మ ‘’కదా మంజరి ‘’-1 ఆచార్య సార్వభౌమ బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారి సర్వవిధ అర్ధాంగి శ్రీమతి వేదుల ప్రభావతి గారు  ఒరిస్సా లోని జయపూర్ సంస్థానాదధీశ్వరుడు  విక్రమ దేవ వర్మ రాసిన 21 కధలను తెలుగులో అనువాదం చేసి ‘’కదామంజరి ‘’గా నామకరణం చేసి ఈ ఏడాది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కోటప్ప కొండ లో’’గబ్బిట వారి అన్నసత్రం

కోటప్ప కొండ లో’’గబ్బిట వారి అన్నసత్రం ‘’ కోటప్ప కొండపై వెలసిన శ్రీత్రికోటీశ్వరస్వామి దర్శనానికి వచ్చే యాత్రికులకు భోజన వసతి ఉండేదికాదు .యాత్రికుల బాధలు గుర్తించి బొప్పూడి గ్రామ వాస్తవ్యులు  శ్రీ గబ్బిటకోటయ్యగారు ,కొండ దిగువన అన్న సత్రం పెట్ట దలచి ,శాశ్వత చందాదారులను ఏర్పరచి ,ఆద్రవ్యం తో 1991లో ఖరనామ సంవత్సరం నుంచి అన్నదానం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాలబోధ’’గా సీతారామా౦జ నేయసంవాదం -2(చివరిభాగం )

బాలబోధ’’గా సీతారామా౦జ నేయసంవాదం -2(చివరిభాగం ) ద్వితీయాశ్వాసం లో వాసుదేవ తత్త్వం అంటే –అన్నిటినీ ప్రకాశి౦ప జేసేదీ ,దేనిచేతనూ ప్రకాశి౦ప బడనిది,అంతటా ని౦డిఉండేదీ , ,తనకంటే వేరుకానిది ,జ్ఞానరూపమైనది మంగళమై చలించనిది మొదలైన లక్షణాలున్నది .పరమాత్మ అంటే పంచభూతాలతో సూర్య చంద్రులతో ప్రకాశించేది అని చెప్పి ,భ్రమర కీటకన్యాయం అంటే వివరించింది సీతాదేవి హనుమకు .తర్వాత … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

‘’బాలబోధ’’గా సీతారామా౦జ నేయసంవాదం -1

‘’బాలబోధ’’గా సీతారామా౦జ నేయసంవాదం -1

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రజనీ ప్రియ -2(చివరిభాగం )

రజనీ ప్రియ -2(చివరిభాగం ) కించిత్ శీలభంగం ,తండ్రి మరణం తో దీనజన సేవ రాజభోగాలలో మర్చిపోయింది రజని .హూణ భటులు పెట్టె బాధలు ఓర్చుకోలేక విలపిస్తున్న పాణిజ ఏడ్పులు వినిపించి .ఆమె తన చిన్నతనం లో తన స్తన్యాన్ని ఇచ్చి ఓదార్చిన మాతృమూర్తిగా గుర్తించి,తాను  పొందిన పతనం అంతా గుర్తుకొచ్చి ,పశ్చాత్తాపం పొంది ,ఆమెను … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

రజనీ ప్రియ

రజనీ ప్రియ రజనీ ప్రియ అనే చిన్నకావ్యాన్ని కీ.శే. గుంటూరు సత్యనారాయణ ఎం.ఏ.రాసి ,’’చిత్ర కళా కవిత్వాలలో అసమాన ప్రతిభ చూపి పద్దెనిమిదేళ్ళు ఉజ్వలతారగా ప్రకాశించి తమల్ని వీడి ‘’దివ్య కళా’’ వైదుష్యాన్నిఅలవర్చుకోవటానికి దివికేగిన   తన చిన్ని  తమ్ముడు ‘’ వేణు’’కు అంకితమిచ్చి ,మద్రాస్  అడయార్ లోని వసంత ప్రెస్ లో1944లో  ముద్రించారు వెల.రూపాయిపావలా .ఈ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం అమ్మన బ్రోలు చెన్న కేశవ శతకాన్ని శ్రీ నాగినేని వెంకట కవి గారు 1914 మార్చి 10న రచించి 1914లో దుగ్గిరాలలోని ప్రబోదినీ ముద్రాక్షర శాలలో వ.నిరంజన శాస్త్రి గారి చే ముద్రింపబడింది .వెల కేవలం పావలా .’’అమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’అనేది శతకం మకుటం .కవి అమ్మనబ్రోలు వాస్తవ్యుడు ,కమ్మవారు .ప్రకాశం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉపమాక (ఉప్మాక)క్షేత్ర మహత్వము .

ఉపమాక (ఉప్మాక)క్షేత్ర మహత్వము .. ఉపమాక లేదా ఉప్మాక అగ్రహారం, విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి మండలానికి చెందిన గ్రామం.. ఇది మండల కేంద్రమైన నక్కపల్లి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ ఊరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం చాలా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పొడుపు కథల శ్రీ గానలోల శతకం

పొడుపు కథల శ్రీ గానలోల శతకం శ్రీ పుట్రేవువెంకట సుబ్బారాయ మంత్రి గారి ద్వితీయ పుత్రుడు శ్రీ నాగ భూషణ కవి రాసిన శ్రీ గానలోల శతకం ఏలూరు రామా అండ్ కో వారు 1914లో ప్రచురించారు .వెల ఒక అణా.   శతకాన్ని వినాయకుని స్తుతి తో ‘’తండ్రికంటే గొప్పతనమున మున్ముందు –పూజనముల నందు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -14(చివరిభాగం )

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -14(చివరిభాగం )   మహా సమాధి శేషాద్రిస్వామి 40ఏళ్ళు తిరువన్నామలై లో గడిపారు .మనసు కైవల్యం మీదకు మళ్ళింది ఈ విషయం చూచాయగా సుబ్బలక్ష్మమ్మకు చెప్పాలనుకొన్నారు .’’నిన్ను ఒకటి అడుగుతా ఖచ్చితంగా చెప్పు .నువ్వు చెప్పినట్లే చేస్తా .జనం తొందరపడుతున్నారు .ఇప్పుడున్నట్లే ఉండనా లేక కొత్త కుటీరం నిర్మించుకొని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -13

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -13   వెంకటాచలమొదలి ,సుబ్బలక్ష్మి దంపతులైన వారింటికి  శేషాద్రి స్వామి ఒక రోజు వెళ్లి ,ఇంటివెనక ఉన్న నాలుగైదు చెట్లను చూపించి సుబ్బలక్ష్మి తో ‘’ఒక వేడుక చూపిస్తా చూడు ‘’అన్నారు .క్షణం లో వందలాదిచిలకలుగోరువంకలు కాకులు నానా జాతిపక్షులు చెట్లపై వాలాయి ‘’ఇవి తమపిల్లల్ని చూసుకోవటానికి పోవా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -12

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -12   ఒకసారి నారాయణ శాస్త్రి భార్యతో శేషాద్రి స్వామిని దర్శించగా ‘’మీ ఇద్దర్నీ కలిసి చూడాలని నేను అనుకొంటే ,నన్ను తోసేస్తున్నారే ‘’?అనగా అర్ధం కాకపోతే ‘’నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బోతున్నావా ?””అని శాస్త్రిని అడిగారు. ఇది జరిగిన మూడు నెలలకే  శాస్త్రి భార్య చనిపోయింది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఎమ్మెలాడి’’తో మళ్ళీ పుట్టినట్లనిపించే కృష్ణశాస్త్రి –కాశి రాజుకవి

ఎమ్మెలాడి’’తో మళ్ళీ పుట్టినట్లనిపించే కృష్ణశాస్త్రి –కాశి రాజుకవి మరుగునపడిన మధురపదం’’ఎమ్మెలాడి’’కి మళ్ళీ ప్రాణం పోసి ,ఆమెనే తన  ఊహా ప్రేయసిగా భావించి అమలిన శృంగారాన్ని అద్భుతంగా చిలికించి ,భావకవిత్వ ప్రాభవాన్ని మరలా  చిగురి౦పజేసే కావ్య౦’’ ఎమ్మెలాడి’’రాసి కృష్ణశాస్త్రిగారు మళ్ళీ పుట్టారా అన్నంత అద్భుత రచన చేశారు వస్తుతం లెక్కల మేస్టారైన  శ్రీ  కాశీరాజు లక్ష్మీ నారాయణ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -11

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -11 శ్యామా రావు తల్లి వృద్దు .అనారోగ్యం కూడా .ఒకసారి శేషాద్రి స్వామిని ‘అమ్మ  వెళ్లి పోతుందా  ?అని ఆదుర్దాగా అడిగితె ‘’తిరువన్నామలై కి టికెట్ తీశావు ఇదే తిరువన్నామలై ‘’అంటే అర్ధం కాలేదనగా స్వామి మౌనం వహించారు ఆసాయంత్రమే ఆమె చనిపోయింది .ఇప్పుడు అర్ధమైందా అన్నారట స్వామి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -10

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -10 ఒక పశువులకాపరి కొండ చరియలలో పశువులు మేపుతుంటే చిరుతపులిని చూసి పారిపోతుంటే రాతిపైనుంచి దూకగా  మోకాలికి దెబ్బతగిలితే దారిలో శేషాద్రి స్వామి కనిపించి ‘’పశువులను మేపేటప్పుడు జాగ్రత్త ఉండాలి .పులులు వస్తాయి .అయినా నిన్నేమీ చేయ్యవులే ‘’అన్నారు .తనకుమార్తెకు వివాహం చేసిజి. నరసి౦హయ్యరు  దంపతులకు శేషాద్రి స్వామి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -9

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -9 చంగల్వ రాయుడు  వాత౦నొప్పుల తో బాధ పడుతు,నడవ లేకపోతుంటే ,స్వామి కాళ్ళను తడిమి తగ్గి పోతుంది అని అభయమివ్వగా తగ్గి పోయాయి .గ్రామ మునసబు కృష్ణ మూర్తి పదేళ్లుగా గజ్జితో బాధపడుతూ,స్వామిని దర్శించాలని వచ్చి హోటల్ లో కాఫీ   ఆర్డర్ ఇస్తే తెచ్చిటేబుల్ మీద పెడితే శేషాద్రిస్వామి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తేటగీతి వీరభద్రేశ్వర శతకం

తేటగీతి వీరభద్రేశ్వర శతకంపగోజి కొప్పర్రు పద్య శతకకవి ,కడిమెళ్ళ వారి పుష్కల ఆశీస్సులున్న మధురకవి ,పండితుడు ,సరసభారతికి ఆప్తుడు ,మిత్రుడు శ్రీ మంకు శ్రీను తాజాగా ‘’రాసిన వీర భద్ర శతకాన్నే నేను ‘’తేట గీతి వీరభద్ర శతకం’’ అన్నాను అంతే .శివ కుటుంబం లోని వారిపై ఇప్పటికే రామలింగేశ్వర శతకం , రాజరాజేశ్వరిత్రిశతి వినాయక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment