Category Archives: పుస్తకాలు

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25(శ్రీ శశికుమార్ పంపిన సవరణలతో ) శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారు కపిలవాయి సోదరులు ఏడవ ఏటనుంచి 12 వ ఏట వరకు తండ్రితో ,మేనమామలతో కలిసి శ్రౌతకార్యాలకు వెళ్ళేవారు. 1953లొ పుట్టిన వెంకటేశ్వర శాస్త్రి   తైత్తిరీయ సంహిత అపస్తంభం తో పాటు నేర్చి12నుంచి 15వ ఏడు వరకు ‘’ఆధ్వర్యవ ‘’,’’హోత్రీయ ‘’,’’ఔద్గాత్రీయ కాండలను0అంగుళాల మ౦ద౦  ఉన్న … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24 బ్రహ్మశ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్ని హోత్ర శాస్త్రి గారు (1909-1983) కాకినాడకు చెందిన కాశ్యప గోత్రీకులు  బ్రహ్మశ్రీ  కపిలవాయి వెంకట సోమ యాజులు ,సుబ్బలక్ష్మీ సోమి దేవమ్మ దంపతులకు అయిగురు పుత్రులు ,ముగ్గురు పుత్రికలు .వీరి పెద్దకుమారుడు పెద్ద రామ శాస్త్రి (1889-1987)గారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4  331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4  331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007) డా||జి.ఎం.రామశర్మ అసంఖ్యాక కవులకు, అవధాని పుంగవులకు పుట్టినిల్లయిన ఉమ్మడి మెదకు జిల్లాకు చెందిన సమ్మత సాహితీ కిరణం గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి. తెలంగాణ మాగాణంలో 20వ శతాబ్దికి చెందిన తొలి ద్వ్యర్థి కావ్యకర్త ఆయన భవ్యకీర్తి అజరామరం. కమనీయ శ్లేష … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు జీవితం చక్రపాణి రంగనాథుడు తొలి జీవితంలో వైష్ణవుడు. ఇతను మత విషయంలో పాల్కురికి సోమనాథునితో వాదన పడుతుంది. శివుడు కాని వాడిని కంటితో కూడా చూడను అనే నియమం ఉండటం వల్ల తెరచాటున ఉండి సోమనాథుడు, తన కుమారుడయిన చతుర్ముఖ బసవేశ్వరుణ్ణి ముందు ఉంచుకోని వాదనలో పాల్గొంటాడు. ఇద్దరికీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి 

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి       తెలుగు సాహిత్యంలో విశేష పరిశ్రమ చేసి అజ్ఞాతంగా పరుగునపడిపోయిన కవులెందరో వున్నారు. వారిలో అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి ఒకరు. వీరికి తెలుగు సాహిత్య క్షేత్రంలో రావలసినంత పేరు ప్రతిష్టలు రాలేదు సరికదా చరిత్రకారులు ఆయనను పూర్తిగా విస్మరించడం గమనార్హం. ఆధునిక యుగాంధ్ర సారస్వత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సత్యదుర్గేశ్వర కవులు

సత్యదుర్గేశ్వర కవులు సత్యదుర్గేశ్వర కవులు అనే పేరుతో జంటగా రచనలు, శతావధానాలు చేసినవారు వేదుల (ద్వివేది) సత్యనారాయణశాస్త్రి మరియు చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి. వీరు 1935-1940 మధ్యకాలంలో జంటగా అనేక అవధానాలు చేశారు[1]. వేదుల(ద్వివేది) సత్యనారాయణశాస్త్రి ఇతడు 1915, జూలై 11వ తేదీన ఫ్రెంచి పాలనలో ఉన్న యానాంలో జన్మించాడు. ఇతని తండ్రి ద్వివేది నారాయణశాస్త్రి పండితకవి. … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు -3(చివరిభాగం పట్టి సీమ శ్రీ వీర భద్ర స్వామి దేవాలయం లో ఒక శివరాత్రి రోజు సుమారు రెండు వ౦దలమంది వేదపండితులు వేద పఠన సమావేశం లో మిత్రనారాయణగారు పాల్గొని ,వారి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు -2 తన’’ సర్వతో ముఖ యాగం ‘’గురించి మిత్రనారాయణ గారు ‘’సర్వతో ముఖ౦ అయ్యాక నాకు శ్రౌతం అంటే విరక్తి కలిగింది .’’అన్నారు .అందుకనే చాలా ఏళ్ళు శ్రౌతాలకు ,,రుత్విక్కులపై  పర్య … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21 ఇప్పుడు కాకినాడ లోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొందాం 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు కాకినాడకు చెందిన  బ్రహ్మ శ్రీ భమిడిపాటి మిత్రనారాయణ సర్వ తోముఖ సోమయాజిగారు శాండిల్య గోత్రీకులు .తండ్రిగారు బ్రహ్మశ్రీ భమిడిపాటి శేషాద్రి సోమయాజులుగారు ఆహితాగ్ని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943)

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943) ఆభిరాజ్ రాజేంద్ర మిశ్ర 1943లో ఉత్తరప్రదేశ్ జాన్ పూర్ జిల్లా ద్రోణిపూర్ లో పండిట్ దుర్గా ప్రసాద్ మిశ్ర ,అభిరాజ్ దేవి దంపతులకు జన్మించాడు .ఈయన  దీక్షా గురువు జగద్గురు  రామ భాద్రాచార్య .సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్  యూనివర్సిటి సంస్కృత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20 1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి -2    సౌమ్యులైన శ్రీ కామేశ్వర సోమయాజి గారి దంపతులు సంభాషించేటప్పుడు కళ్ళల్లో కాంతులు పెదవులపై చిరునవ్వు దర్శనమిస్తాయి .అందరు ఆహితాగ్నుల భార్యలకంటే సోమయాజిగారి భార్య సావిత్రిగారు శ్రౌత ధర్మం పాటించే వారి జీవితాలలో ఉన్న సూక్ష్మ విషయాలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 329-యతి గీతి శతక కావ్య కర్త  –మన్మోహన ఆచార్య (1967-2013)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 329-యతి గీతి శతక కావ్య కర్త  –మన్మోహన ఆచార్య (1967-2013) ఒరిస్సా జహత్సింగ్ పూర్ జిల్లా లతంగ గ్రామం లో 1967 అక్టోబర్ 20మన్మోహన ఆచార్య జన్మించాడు .మాయాధర ఆచార్య తండ్రి .పార్వతి దేవి తల్లి .అతని కవిత లు –గీతామోహనం ,గీతా భారతం ,గీతా మిలి౦ద౦ ,పాలిపంచాసిక ,సుభాస చరితం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికాలో ”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి రామయ్య ”పుస్తకావిష్కరణ

అమెరికాలో సరసభారతి ఆధ్వర్యంలో గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన” అణు శాస్త్రవేత్త డా శ్రీ ఆకునూరు వెంకట రామయ్య ”గ్రంథాన్ని   15-10-18 సోమవారం సాయంత్రం టేనస్సీ రాష్ట్రం నాష్ విల్ లోని  డా రామయ్యగారి స్వగృహం లో  మన శాసన మండలి సభ్యులు వైవిబి రాజేంద్ర ప్రసాద్,ఆవిష్కరించారు .  శాస్త్రవేత్తశ్రీ  వేంకట రామయ్య, దంపతులు, స్పాన్సర్  శ్రీమైనేని గోపాలకృష్ణ  … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -19

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -19 ఇప్పటి వరకు సీతారామ పుర ,కామేశ్వరీ అగ్రహారాలోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం .ఇప్పుడు వ్యాఘ్రేశ్వర అగ్రహారం లోని వారి గురించి తెలుసుకొందాం . 1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి శ్రీరామపురం లోశ్రీ  బులుసు  చయనులు గారి గూర్చి ముందే ముచ్చటించుకొన్నాం .ఇప్పుడు ఈ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అణు  శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ఆవిష్కరణ 

అణు  శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ఆవిష్కరణ సరస భారతి  సాహితీ బంధువులకు దసరా శుభా కాంక్షలు – నేను రాసి, శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల ప్రాయోజకత్వం లో ,,సరస భారతి చేత  శ్రీ కర్రీ శివ ప్రసాద్, డా  ద్రోణవల్లి రామమోహన రావు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2

 శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2 76-‘’క్షేత్ర స్వరూపా ,క్షేత్రేశీ.క్షేత్ర క్షేత్రజ్న పాలినీ –క్షయ వృద్ధి  వినిర్ముక్తా క్షేత్ర పాల సమర్చితా ‘’‘’   సమయానుకూలంగా  క్షీణించటం శరీర ధర్మం .కాని ఉన్నంతవరకు తను నశిస్తూ ,తనలోని ఆత్మకు అక్షయమైన రక్షణ కల్పి౦చటమే శరీరం పని ..అందుకే దాన్ని’’ క్షేత్రం ‘’అంటారు .నిజానికి ఈ క్షేత్రం … Continue reading →

Posted in సమీక్ష, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 329-పవన దూత కావ్య  కర్త –పవన దోయి –(12వ శతాబ్దం ) 12 వ శతాబ్ద బెంగాల్ సంస్కృత  కవి పవన దోయి .సేనవంశ రాజు లక్ష్మణ సేన  ఆస్థానకవి .ఈనాడు పిలువబడుతున్న బెంగాల్ కు ఆనాడు గౌడ దేశం అనిపేరు కనుక అతడు గౌడరాజు  లక్ష్మణసేనుని ఆస్థానకవి. పవన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యాలు -1

లలితా పరాభట్టారిక సచ్చిదాన౦ద స్వరూపం లో విశ్వమంతా ఉండే పరమేశ్వరి .విశ్వం లో విశ్వం బయటా ఉంటుంది .సర్వత్రా ఉన్నా అందరికీ కనిపించదు .మనం మనకళ్ళతో ప్రపంచమంతా చూడగలం కాని అమ్మవారి కళ్ళను చూడలేము .మనవిధాత్రి ,నేత్రి ,సంధాత్రి పాదాల చప్పుడు వింటాం.కాని ఆనవాళ్ళను గుర్తించలేం .చూడాలన్న తపన, దీక్ష  ఉంటే ఆ అడుగుల చప్పుడే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 326-ప్రేమ ముక్తక కవయిత్రి –భావకా దేవి (12 వ శతాబ్దం )

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 326-ప్రేమ ముక్తక కవయిత్రి –భావకా దేవి (12 వ శతాబ్దం ) భావకాదేవి లేక  భావా దేవి అని పిలువబడిన ఈ సంస్కృత కవయిత్రి 12వ శతాబ్దం లేక అంతకు పూర్వం ఉండేదని భావిస్తారు .మధ్యకాలపు సంస్కృత కవులు తమ గ్రంథాలలో ఈమెను ఉదాహరించారు .విద్యాకారుని సుభాషిత రత్న కోశం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 324-శుభాషిత రత్నకోశకర్త –విద్యాకరుడు (1050-1130)

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 324-శుభాషిత రత్నకోశకర్త –విద్యాకరుడు (1050-1130) ప్రసిద్ధ బౌద్ధ వేదాంతి .సంస్కృతపండితుడు ,కవి  ,సాహిత్య చరిత్రకారుడు   విద్యాకరుడు 1050-1130కాలం వాడు .’’శుభాషిత రత్న కోశ’’కర్తగా బహు ప్రసిద్ధుడు .ఇది గొప్ప ఆంథాలజి గా ప్రసిద్ధి చెందింది .ఉత్తర బెంగాల్ లోని జగద్దాల విహార బౌద్ధ సన్యాసి అని కోశాంబి తెలిపాడు .రచన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -18

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -18 ‘’సారీ ‘’తో ఆధార౦ వివరాలు – ‘’ కోన సీమ ఆహితాగ్నులు ‘’ గురించి 17 ఎపిసోడ్ లు రాశాక ,ఇప్పటిదాకా సస్పెన్స్ లో ఉంచి , దీనికి ఆధారం విషయం ఇక భరించలేక ‘’అతి రహస్యం బట్ట బయలు చందం ‘’ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -17

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -17 1—పద్మ భూషణ్ శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు -3( చివరి భాగం ) బాబళ్ళ శాస్త్రి గారి లాగానే, లంకా శాస్త్రి గారు కూడా వేద విక్రయాన్ని సమర్ధించలేదు .భర్త మరణానతరం అనసూయ గారిని తమ దంపతులు అగ్ని స్టోమం చేసిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -16

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -16 1–శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు -2 శ్రీ వెంకట రామ శాస్త్రి శాస్త్రి గారి భార్య అనసూయగారు ‘’మా అమ్మాయిని ఆదర్శంగా అగ్రహారం లో ఆహి తాగ్ని భార్యగా పెంచాను ‘’.అది బాగా పని చేసింది .మావారు మా ఇద్దరబ్బాయిలకు వేదం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 314-గురు వంశ కావ్య నిధి కర్త –శిరిశినగల్ కృష్ణమాచార్యులు (1905-1992)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 314-గురు వంశ కావ్య నిధి కర్త –శిరిశినగల్ కృష్ణమాచార్యులు (1905-1992) శిరశినగల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లాకుచెందిన కవి. వీరికి అభినవ కాళిదాసు అని బిరుదు కలదు.నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని గా ప్రసిద్ధిని పొందారు[1]. కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 313 –భైరవ తంత్ర కవి –మ౦థాన భైరవుడు (10 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 313 –భైరవ తంత్ర కవి –మ౦థాన భైరవుడు (10 వ శతాబ్దం ) తెలంగాణాలోని మహబూబ్ నగరం జిల్లా అలంపురం కు చెందినకవి మ౦థాన భైరవుడు10 వ శతాబ్దం వాడు .పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర ఈయనను ‘’తొలి సంస్కృత కవి’’గా పేర్కొన్నది .జైనకవి .తంత్ర గ్రంథాలు ఎక్కువగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే –భగదత్తుడు

ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే –భగదత్తుడు ఎవరీ భగదత్తుడు? ఎవరిమీద అతని ప్రతీకారం ? నరకాసురుని కొడుకు భగదత్తుడు. గొప్ప పరాక్రమ శాలి అర్జునునితో సరి జోడైన యుద్ధ వీరుడు .తండ్రి నరకాసురుడు శ్రీ కృష్ణ సత్యభామ లతో చేసిన యుద్ధం లో చనిపోయాడు. తల్లి భూదేవి రూపమైన సత్యభామ కొడుకు నరకుడు .నరకంటకుడయ్యాడని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 312- సంస్కృత కీర్తనలు రాసిన -భద్రాచల రామదాసు (1620-1680)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 312- సంస్కృత కీర్తనలు రాసిన -భద్రాచల రామదాసు (1620-1680) భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోలింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు[1]. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము – ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -3 (చివరిభాగం )

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -3 (చివరిభాగం ) గాంధీ గారి అహింసా సిద్ధాంతం ఇండియాకే కాదు ప్రపంచ దేశాన్నిటికీ వర్తి౦ చేదే . మానవాళికి విపరీత శత్రువులైన అసూయ ,భయాలను జయించిన శాంతి వీరుడు గాంధీ .అసూయ పిరికితనం అన్నాడు .బ్రిటిష్ దౌర్జన్యరాజ్యమంటే,కాలనీ దౌస్ట్య మంటే ఉన్న భయాన్నికూకటి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -2

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -2 చరిత్ర విశ్వ మానవ గురువు .సామాన్యుని విషయాలు ,అతని జయాపజయాలు సాధనాలు అన్నీ రికార్డ్ చేస్తుంది చరిత్ర .పైన చెప్పుకున్నట్లుగా సామాన్య తెలివితేటలున్నప్పటికీ ,గాంధీ మాన్యుడయ్యాడు. మహాత్ముడయ్యాడు .,కారణం ఆయన రాజకీయ,నైతిక ,అహింసా సిద్ధాంతాలే .బాధిత ప్రజలకాయన ‘’ మెస్సయ్యా ‘’అయ్యాడు .కనుకనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు 

సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు  మెట్రిక్ పరీక్షలో గాంధీ గారి మార్కు లెన్నో తెలిస్తే నోరెళ్ళ బెడతాం .అయ్యగారికి వచ్చిన మార్కులు 625 కు 247 1/4 .మాత్రమే .అంటే 39.6 శాతమే .అంటే గురూగారు అత్తెసరు మార్కులతోనే 18 87 బాంబే యూని వర్సిటీ పరీక్ష పాసయ్యాడు .ఆయన ఉత్తీర్నత భావనగర్ లోని శ్యామలదాస్ కాలేజి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-4

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-4 మహాత్మా గాంధీ  ‘’స్త్రీవాద వ్యూహం ‘’చెప్పాడు .అదే సత్యాగ్రహం .మహిళలకు వారి మేధకు  సరిగ్గా సరిపోయే స్ట్రాటజి ఇది .పురుషులకంటే స్త్రీలే అహింసా సిద్ధాంతాన్ని అర్ధం చేసుకొని బాగా వివరించి ప్రచారం చేయగల సత్తా ఉన్నవారని  నమ్మాడు..స్త్రీలు బలహీనులవటం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -15

ఇప్పటి వరకు మనం కోనసీమ లోని రామేశ్వర అగ్రహార ఆహితాగ్నులు వేద పండితుల గురించి తెలుసుకొన్నాం .ఇకనుంచి నేదునూరు దగ్గరున్న కామేశ్వరి అగ్రహారం లోని వారి గురించి తెలియజేస్తాను . 1-శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు రెండు చెవులకు బంగారు రింగులు ,కనులలో వేద ప్రకాశం ,కుడి చేతి నాలుగు  వేళ్ళకూ బంగారు ఉంగరాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

అణు శాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకట రామయ్య పుస్తకావిష్కరణ

అణు శాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకట రామయ్య సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఇప్పటికి 30 సుప్రసిద్ధ గ్రంథాలను ప్రచురించింది .అందులో నేను రాసినవి 18 ఉన్నాయి .వీటిలో ‘’కేమోటాలజి పిత కొలచల సీతారామయ్య ‘’మన ఆంద్ర శాస్త్రవేత్త గురించి రాసినది .ఇప్పుడు అణుశాస్త్ర వేత్త  డా .ఆకునూరి వెంకట రామయ్య గారి  పై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

   ధనికొండ హనుమంతరావు

   ధనికొండ హనుమంతరావు ఒకప్పుడు’’ రేరాణి ‘’పత్రిక చదవని వారంటూ ఉ౦డేవారుకాదు ..చదవక పొతే గిల్టీగా ఫీలయ్యేవారుకూడా .అంతటి ప్రభంజనం సృష్టించి౦ది  ఆ’’ రాత్రి రాణి ‘’..ఈ పత్రిక సంపాదకుడే ధనికొండ హనుమంతరావు .గుంటూరు జిల్లా తెనాలి దగ్గర అమృతలూరు మండలం లో ఇంటూరు గ్రామం లో హనుమంతరావు 1919 లో జన్మించాడు .బి ఏ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -7

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -7 మిథిలానగరానికి దగ్గరలో ఒక ఆశ్రమం లో ‘’కతుడు ‘’అనే ఆయన ఉండేవాడు . .ఆయన కుమార్తె కాత్యాయని .అందం తో పాటు బుద్ధి శాలిని .యుక్తవయసురాగానే  కతుడు భార్యతో కూతురు వివాహ విషయం చర్చించాడు .శుభ లక్షణాలున్న తమ కూతురు  సాక్షాత్తు లక్షీస్వరూపమని భావించారు .గంగాతీరం లో ఒక మహాత్ముడు ఆశ్రమం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -6

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -6 బృహదారణ్యకం లోనే సన్యాస విషయం సమగ్రంగా చెప్పబడింది .శుక్ల యజుర్వేదానికి చెందిన ‘’జాబాలోపనిషత్ ‘’కూడా సన్యాసం గురించి చెప్పింది .శంకర భగవత్పాదుల వంటి వారలకు  బ్రహ్మ చర్యం నుండే  సన్య సించవచ్చు అని దారికూడా చూపింది .యాజ్ఞావల్క్యుడే మొదట సన్యాసం స్వీకరించాడు అన్నమాట యదార్ధం .పరివ్రాజక ధర్మం గురించి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి ఉషాకుమారి  దిన చర్య ఉదయం 7 గంటలకే కేరళ తిరువనంతపురానికి దక్షిణాణ ఉన్న.’’ అ౦బూరి ‘’గ్రామం ఇంకా నిద్ర మత్తులో ఉండగానే ప్రారంభమౌతుంది .ఆమె అగస్త్యవనం పరిధిలోని  ‘’కున్న తుమల ‘’అగస్త్య ఏకోపాధ్యాయ పాఠశాల టీచర్ .రోజూ రెండుగంటలు కొండ దారిలో అరణ్యం లో నడుచుకుంటూ  బడికి చేరుకోవాలి. ఇక్కడ’’ కాని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీదక్షిణా మూర్తి నుతించిన శ్రీ విష్ణు శతకం

శ్రీదక్షిణా మూర్తి నుతించిన శ్రీ విష్ణు శతకం సరసభారతికి అత్యంత ఆప్తులు ,నాపై అపార కరుణా దృక్కున్నవారు ,చుళుకీకృత సర్వ గీర్వాణ వాజ్మయ పాదోది పయస్కులైన అపర ఆగస్య ముని వరేణ్యులు ,  శ్రీ లలితా పరాభట్టారిక పరమోపాసకులైన  బ్రహ్మశ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి బ్రాహ్మీ మూర్తుల అనుంగు అంతేవాసులు ,వారి దౌహిత్రులు  … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13 4-బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ అవధానిగారు, కుమారులు  శ్రీరామ పురాగ్రహారానికి చెందిన నాలుగవ వారు   బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ  అవధాని   గారు హరితస గోత్రీకులు .తాతగారు  ముక్కామల కు చెందిన ఆహితాగ్ని ‘తండ్రి తెలుగు పండితుడు .తండ్రీ కొడుకులు అగ్నిహోత్రంకాని శ్రౌతం కాని చేయలేదు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హాస్యం జాలువారు రావూరు వెంకట సత్యనారాయణ రావు

హాస్యం జాలువారు రావూరు వెంకట సత్యనారాయణ రావు సెప్టెంబర్ 9 ఆదివారం సాయంత్రం విజయవాడలో శ్రీ పంతుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యం లో నిర్వహింప బడుతున్న శారదాస్రవ౦తి కార్యక్రమం లో ముఖ్య అతిధిగా వెళ్లి ,అందరూ మరచిపోయిన కమ్మని తెలుగు హాస్య రచయిత శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ రావు గారి గురించి మాట్లాడాను .ఆ విషయాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అరణ్యాలలో మహర్షులు దర్శించిన -ఆరణ్యకాలు

అరణ్యాలలో మహర్షులు దర్శించిన -ఆరణ్యకాలు ఏకాంత వాసం లో దీర్ఘ తపస్సులో అరణ్యవాసం లో మహర్షులు దర్శించినవి లేక ఆరాటంలో పుట్టినవి ఆరణ్యకాలు .ఇవి కర్మకాండలగురించి, వ్రతాలు ,ప్రవర్గ్యలు గురించి తెలియ జేస్తాయి .ఆరణ్యకాలు కర్మకాండ కు సంబంధించినవైతే ఉపనిషత్ లుజ్ఞానకాండకు సంబంధినవి .వేద మంత్ర భాగాలను సంహితాలని, వాటి వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలని ,,వాటిలోని  కర్మకాండను తెలియజేసేవి ఆరణ్యకాలని, వేదాలలోని జ్ఞానభాగాన్ని చెప్పేవి ఉపనిషత్లు లేక  వేదాంగాలని అంటారు. ఆరణ్యకాలు కూడా వివిధ ఋషుల పేర్లతో పిలువ బడుతున్నాయి .ఋగ్వేదానికి ఐతరేయ ఆరణ్యకం, కౌశిక ఆరణ్యకాలు -యజుర్వేదానికి తైత్తిరీయ ఆరణ్యకం, మైత్రాయణీయ ఆరణ్యకం,కేదారణ్యకం ,బృహదారణ్యకం  సామవేదానికి తలవకారఆరణ్యకం ,ఆరణ్యక సంహిత ,అధర్వ వేదానికి ఆరణ్యకం ఆలభ్యం ఐతరేయాఅరణ్యకం 5 అధ్యాయాలు మొదటి రెండిటిలోప్రాణ విద్య ఉంటుంది 3 లో సంహితోపనిషత్ లో స్వర చర్చ  4 ,5 ల లో మంత్రాల సాంకేతిక వివరణ ఉంటుంది దీన్ని మహానామ్ని  అంటారు తైత్తిరీయ ఆరణ్యకం లో 10 భాగాలు .మొదటి దానిని  ‘కథాకాని ‘’అంటారు .అగ్ని ఛయన కాండ ఉంటుంది  2వది మహాయజ్ఞ నిర్వహణ విధానం మిగిలినవి మంత్రం తంత్ర సాంకేతిక వివరాలు. కథారణ్యకం -తైత్తిరీయమే .సాంఖ్యాయన ఆరణ్యకం లో 15 అధ్యాయాలు . ,2 అధ్యాయాలు మహా వ్రతాన్ని 3నుంచి 6 కౌశిక ఉపనిషత్ ను ,7,8 సంహితోపనిషత్ ,9 ప్రాణ విశిష్టత ,10 అగ్నిహోత్ర విధి 11 అంత్య సంస్కారం 12 ప్రార్ధన ఫలితాలు13 శ్రవణ మనన నిధి ధ్యాస వివరణ 14 అహం బ్రహ్మాస్మి వివరణ 15 బ్రహ్మ నుంచి గుణ సాంఖ్యాన వరకు గురు స్తుతి ఉంటాయి .బృహదారణ్యకం బృహదారణ్యక ఉపనిషత్ ను ,ముఖ్యంగా ‘’పర్వాగ్య ‘’కర్మ కాండను గురించి వివరిస్తుంది.ఆరణ్యకాలను ‘’రహస్య బ్రాహ్మణాలు ‘’అన్నారని నిరుక్తానికి వ్యాఖ్యానం రాసిన దుర్గా చార్య అన్నాడు. ప్రాచీన కాలంలో వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకోవాలంటే ఒకే ఒక వేదరాశిగా ఉన్న వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిపి నేర్చుకునేవారు. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి మొత్తం వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టముగా ఉండేది. … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -5

శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -5 28 నుంచి 31 వరకు ఉన్న 4 అధ్యాయాలలో యజుర్గణనం మొదట్లో చూపిన అధ్యావస్థ విషయాలకే సంబంధించింది .కనుక తగిన చోట్ల ఉపయోగిస్తారు .32 నుంచి 39 వరకు 8 అధ్యాయాలలో పురుష మేధం ,సర్వ మేధం, పితృ మేధం ,ప్రవర్గ్యం మొదలైన వి కొత్తవి అని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -4

శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -4 తాను పొందిన శుక్ల యజుర్వేద వ్యాప్తి కోసం యాజ్నవల్క్య మహర్షి గంగాతీరాన ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉన్నాడు .ఒక రోజు కణ్వుడు అనే ఋషి పుత్రుడు వచ్చి పాదాలపై వ్రాలి ‘’మహాత్మా !శాకల్యుడి వంటి వాళ్ళు తప్ప మిమ్మల్ని పొగడని వారుండరు లోకం లో .మీకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనకు తెలియని శ్రీ కృష్ణ సంతాన లీలలు  

మనకు తెలియని శ్రీ కృష్ణ సంతాన లీలలు — శ్రీ కృష్ణుడికి పదహారు వేల ఎనిమిది మంది భార్యలున్నారని లోకం లో ప్రచారంగా ఉంది.వీరిలో అసలు భార్యలు ఎంతమంది?వాళ్ళే అష్టభార్యలు –రుక్మిణి ,సత్యభామ ,జాంబవతి ,కాళింది ,మిత్రవింద ,నాగ్నజితి ,భద్ర ,లక్ష్మణ అని భాగవత పురాణం పేర్కొన్నది .మరి వీరి సంతానం  సంగతేమిటి ?ఈ ఎనిమిది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -3

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -3 యాజ్ఞవల్క్యుడు దివాకరుని అనుగ్రహం తో పొందిన వేదాన్ని శుద్ధ యాజుషం అని , ,ఏకాయనం అని ,అయాత యామ అనిపిలువబడింది .పూర్వ మీమాంస శాస్త్రం పుట్టటానికి కర్మకాండ ,ఉత్తర మీమాంసకు కారణం అయిన బ్రహ్మకాండ ,తర్వాత మంత్ర బ్రాహ్మణం వేర్వేరుగా ఉండటం చేత శుద్ధ లేక శుక్ల యజుర్వేదం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments