Category Archives: రచనలు

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు- అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సారి కంచి వరదస్వామి దర్శనానికి ఇద్దరు దేవేరులు తిరుమలదేవి చిన్నాదేవిలతో వచ్చాడు .అక్కడ ఉన్న ఒక ఆచార్యు దీక్షితుడు తిరుమల దేవి ని గురించి ఆశువుగా .’’కాన్చిత్కాంచనగౌరాంగీం –వీక్ష్య తన్వీం పురస్తితాం –వరద స్సంశయాపన్నో –వక్షస్థల మవైక్షత’’ అని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -4(చివరి భాగం )

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -4(చివరి భాగం )    సాల్వ రాయలు ఒక రోజు వెంకటేశ్వర స్వామిపై శృంగార కీర్తన చెప్పమని కోరాడు .మళ్ళీ పాత  శృంగార  వాసన గుబాళించి ‘’ఏమొకో !చిగురు టధరమున –యెడ నేడ కస్తూరి నిండెను ‘’అని లంకించుకొని ‘’ఉడుగని వేడుకతో బ్రియుదోట్టిన నఖ శశి రేఖలు –వెడలగా వేసవి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రీనె గునాన్ (అబ్దల్ వహీద్ యాహ్యా)

రీనె గునాన్ (అబ్దల్ వహీద్ యాహ్యా) నా అమెరికా హితులు  మిత్రులు ,ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు నేను తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం అంటూ ఆర్డర్ చేసి పంపిన  రీనె  గునాన్ అనే ఫ్రెంచ్ రచయిత రాసిన అనేక ఆధ్యాత్మిక వ్యాస సంపుటి ‘’ది ఎస్సేన్షియల్’’నాకు సెప్టెంబర్ ఒకటిన అందింది .చదవటం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -3

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -3 ‘’ఈతడు రామానుజుడు ఇహ పర దైవము –చలిమి నీతండే చూపే శరణాగతి –నిలిపినాడీతండేకా నిజ ముద్రా ధారణము –మలసి రామానుజు డే మాటలాడే దైవము ‘’అని పాడిన పదం లో అన్నమయ్య వైష్ణవ దీక్ష పొందాడని ,ఇక శ్రీనివాసుడే అన్నీ చక్క బరుస్తాడనే ధైర్యం నమ్మకం ఏర్పడింది .మనసంతా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని

ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని Posted on 01/09/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ Ada Aharoni          ఈజిప్ట్ లో పుట్టి ఇస్రాయిల్ లో జీవితం గడిపిన యూదు రచయిత్రి,శాంతి స్థాపనకోసం శ్రమించిన కవయిత్రి ఆదా ఆహరోని.ఈజిప్ట్ లోని కైరో లో ఆహరోని 1933లో ఫ్రెంచ్ జాతీయత కల యూదు కుటుంబం లో జన్మించింది .జమలేక్ దగ్గర … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -2

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -2 అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .’’లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు సోపానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్తసాగరాలు .కూర్మమే నీ లోతు.గంగాది తీర్దాలు నీ కడళ్లు.దేవతలు నీ జల జంతువులు .నీదగ్గరి మేడలు పుణ్యలోకాలు .గట్టుమీది చెట్లు పరమ మహర్షులు .  నీ ఆకారం వైకుంఠ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు– నాద త(ధ)నువు – త్యాగయ్య

పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు నాలుగైదు రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెడితే  సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వ్యాస సంపుటి ‘’త్రిపుటి ‘’కనిపిస్తే తీసుకొని వచ్చి చదవటం ప్రారంభించా .సంగీత సాహిత్య శాస్త్ర,, వేదాంతవిషయాలలో వారికున్న అపూర్వ పాండిత్య గరిమ, వారి శేముషీ విభవం   చదివిన నాలుగైదు వ్యాసాల్లోనే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

వడ్డెనల ఇడ్డేనలు

వడ్డెనల ఇడ్డేనలు 1-కొత్త అసెంబ్లీ లోనూ పాత హత్యల త్రవ్వుకోటాలేనా ?  బురద జిమ్ము కొటాలేనా ? బఫూన్ లలా ప్రవర్తించ టాలేనా? రాష్ట్రం దాని అభివృద్ధి మరచి ఇంకా గోతులు తవ్వుకోటాలేనా? 2-ఇంగిత జ్ఞానం తో ప్రవర్తించి  రాష్ట్ర రధాన్ని ముందుకు సాగ నివ్వండి. 3-వై .ఎస్ ,కాలం నుంచి రగిలిన పగ అర్పేయండి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గణపతి ముని చేసిన ఆధ్యాత్మిక సర్వోపచార పూజ

గణపతి ముని చేసిన ఆధ్యాత్మిక  సర్వోపచార పూజ కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’లో అష్టమ శతకం ,,ముప్ఫై వ స్తబకం లో ఉమా దేవిని ధ్యాన ,ఆవాహనలతో కూడిన  సర్వోప  చార పూజను ఆధ్యాత్మికం గా ‘’ప్రమాణిక వృత్త ‘’శ్లోకాల తో చేసి ప్రత్యేకతను చూపారు .ఆ పూజలో మనమూ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా ‘’ రాణి మంగై వేలునాచియార్

‘’జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా ‘’ రాణి మంగై వేలునాచియార్ పద్దెనిమిదవ శతాబ్దిలో బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగిన రాణి  మంగై వేలునాచియార్ 1730లో మంగై మల్లార్ సెల్ల ముత్తు సేతురామన్ ,రామ నాద పురం రాజ్యానికి రాణి   సాకంది ముతాల్ దంపతులకు జన్మించింది .రాజ వంశానికి ఏకైక గారాల పుత్రిక ఆమె .మగ సంతానం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అయో (య్యో )ధ్య

అయో (య్యో )ధ్య పురాణకాలం నుండి అయోధ్య ప్రసిద్ధి చెందింది. సరయూ నదీ తీరాన ఉన్న ఆ పట్టణం ఈ నాటి ఫైజా బాద్ కు దగ్గరలో ఉంది .సరయూ నది అత్యున్నత హిమాలయాలలోని కింద కైలాస పర్వతం వద్ద ఉన్న మానస సరోవరం నుండి జన్మించిందని కధనం .ఒకప్పుడు జన సంద్రం గా ఉన్న … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఒరిస్సా ‘’చిన్నారి మదర్ తెరిస్సా ‘’,స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు –పార్వతి గిరి

ఒరిస్సా ‘’చిన్నారి మదర్ తెరిస్సా ‘’,స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు –పార్వతి గిరి పశ్చిమ ఒరిస్సా కు చిన్నారి  మదర్ తెరిస్సా అని పించుకొన్న పార్వతి (పార్బతి)గిరి ప్రముఖ సాంఘిక సంస్కర్త ,స్వాతంత్ర్య సమర యోధురాలు .ఒరిస్సా లోని సంబల్ పూర్ జిల్లా  బీజాపూర్ దగ్గరున్న సమలైపాదర్ అనేగ్రామం లో 1926లో జన్మించింది .ఈమె జననానికి ముందే స్వాతంత్ర్యోద్యమ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మధ్య ప్రదేశ్ ఆది వాసి స్వాతంత్ర్య యోధుల్ని బందిపోట్లుగా రికార్డ్ చేసిన ప్రభుత్వం

మధ్య ప్రదేశ్ ఆది వాసి స్వాతంత్ర్య  యోధుల్ని బందిపోట్లుగా రికార్డ్ చేసిన ప్రభుత్వం 16-3-1943 న మధ్యప్రదేశ్ లోని సాత్పురా పర్వతాలలోని ఆఖ్రాని కోట దగ్గరున్న ఒక లోయ లో తల దాచుకొంటున్న వందలాది ఆదివాసీ స్త్రీలపైనా  మగవారి పైనా   బ్రిటిష్ సైన్యం , పోలీసులు  ఆకస్మికం గా దాడి చేసి ,చాలామందిని దారుణం గా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా మరియు అమరజీవి కుశాల్ కొన్వార్

అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా అస్సాం మహిళా సింహం ,అమర జీవి ,ప్రముఖ స్వాతంత్ర్య సమార యోద్దురాలు జాతీయ జెండా ఆవిష్కరిస్తూ ,బ్రిటిష్ వారి తుపాకి గుళ్ళకు అసువులుబాసి వీరమరణం చెందిన సాహసురాలు కనకలతా బారువా .ఈమె కూడా ప్రస్తుతం విస్మృత యోదురాలై పోయింది .ఆమె గురించి వివారాలు తెలుసు కొందాం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది

మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది నర్మదా నది అందమైన ,ఆహ్లాదమైన నది .నర్మదా మాత అని భక్తులంటారు .మధ్య భారతం లోని ‘’అమర కంట ‘’నర్మదకు జన్మస్థానం .ఇది మైకాల కొండల్లో ఉన్న అరణ్య ప్రాంతం .అక్కడి నుండి పడమటి వైపు ప్రవహించి అరేబియా సముద్రం లో ఉన్న గల్ఫ్ ఆఫ్ కాంబే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి

భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి ఎందరెందరో  త్యాగ ఫలం గానో మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభ విస్తున్నాం .వారి స్మరణ మనకు స్పూర్తిదాయకం కావాలి .కేరళ లో చర్మ కార వంశం లో పుట్టి దళిత విముక్తికి  దీక్షగా కృషి చేసిన ‘’అయ్యం కాలి ‘’గురించే మనం ఇప్పుడు తెలుసు కొంటున్నాం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్ -విహంగ ఆగస్ట్ మ హిళా వెబ్ మేగజైన్ లో నా వ్యాసం

ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్  Posted on 01/08/2014 by గబ్బిట దుర్గాప్రసాద్                   భర్త ,మామ గారు నిరంతరం యుద్దాలో మునిగి ఉండేవారు .ఆ సమయం లో ప్రజాపాలను సమర్ధ వంతం గా నిర్వహించి వారి మరణానంతరం రాజ్య పాలనను ప్రజా సంక్షేమంగా సాగించి చేతికి ఎముక లేని దాన గుణ శీలమున్న మాల్వా రాణి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’ లోని పంచమ శతకం ఇరవయ్యవ స్తబకం లో ఉమ్మవారి మహాత్మ్యాన్ని బహు భంగిమలలో ‘’నాయన’శ్రీ కావ్య కంఠ గణపతి ముని’’ మణి బంధ వృత్త శ్లోకాలలో తెలియ జేశారు .చదువు తూం టేనే  ఒళ్ళు గగుర్పొడిచే వృత్తం అది .రస చింతామణి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం )

భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం ) జుబైదా దావూది మౌలానా షఫీ దావూది భార్య అయిన జుబైదా దావూది బ్రిటిష్ వారి తో పోరాడిన దీర వనిత .సహాయ నిరాకరణ ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించింది .భర్త ,బంధువులకు చెందిన విదేశీ వస్త్రాలు సేకరించి బహిరంగం గా కాంగ్రెస్ ఆఫీస్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2

‘భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2 ఖిలాఫత్ ఉద్యమానికి ఊపిరులూదిన –   బి అమ్మా అనే ఆబాది బేగం ’బి అమ్మా ‘’అనే ఆబాది బేగం షౌకత్ ఆలి మొహమ్మదాలి సోదరుల తల్లి .అందరూ ఆప్యాయం గా బి అమ్మా(నాయనమ్మా) అని పిలిచేవారు .ఉత్తర ప్రదేశ్ లోని రాం పూర్ లో ఆబాది … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని

సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని కావ్య కంఠ గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’పంచమ శతకం ,సప్త దశ స్తబకం లో ఉమా దేవి మందహాస వర్ణనను చంపక మాలా వృత్తం లో వర్ణించారు .అందులో క్షీర సాగర మధనం ప్రస్తావన తెచ్చి దానికి యోగ శాస్త్రార్ధాన్ని జోడించి చక్కని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1 భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళలు గణ నీయమైన పాత్రనే పోషించారు .పరదా వెనక దాగి కూర్చోలేదు .మగవారితో సమానం గా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు .మొదటి సారిగా షా అబ్దుల్ అజీజ్ దేహివి  బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా ‘’జీ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబు (డిం .టిం.ప్ర.జ .)-2

  డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబు (డిం .టిం.ప్ర.జ .)-2 డింగిరి –జగన్ నరకాసుర వధ అని మూడు రోజుల ఉద్యమం చేశాడేమిటి గురూ ? టింగిరి –‘మూడు రొజుల ముచ్చటే అయింది కదరా శిష్యా .మూర్ఖులు తప్ప ఎవ్వరూ కదలలేదు .భస్మాసుర హస్తం అని చేస్తే బాగుండేది .వెర్రి తగ్గింది రోకలి తలకు చుట్టమన్నాట్ట … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అనుక్షణ శ్రీప్రియం కావ్య ‘’దృశ్యం ‘’,వెంకటేషీయం

అనుక్షణ శ్రీప్రియం  కావ్య ‘’దృశ్యం ‘’,వెంకటేషీయం అమ్మమ్మా ఎన్నేళ్ళ యింది ఒక మంచి సినిమాచూసి? పెద్ద హీరో తో కార్లు లేపకుండా గన్నులు  పేల్చకుండా  ,భీభత్సం సృస్టించకుండా తీసికూడా .నిన్న  మధ్యాహ్నం రెండు గంటలాటకు  ,మూడో వారం నడుస్తుండగా మా ముసలావిడా నేను మామనవరాలు రమ్య ఉయ్యూరుల్ దీపక్ మహల్ లో’’దృశ్యం ‘’ సినిమా చూశాం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి

ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి   ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి 1911జులై ఇరవైన జన్మించిన సోహేర్ అల్ కలమావి ప్రసిద్ధ రచయిత సాంఘిక సేవా దురందురాలు .ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ గా నిలిచిన రచయిత్రి .ఈజిప్ట్ సంస్కృతిక రంగాన్ని విద్యా వేత్తగా ,స్త్రీవాద రచయితగా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

’ఉమా సహస్రం ‘’లో ఉమా మహేశ్వర తత్వాన్ని ఆవిష్కరించిన వాశిస్ట గణపతి ముని

‘’ఉమా సహస్రం ‘’లో ఉమా మహేశ్వర తత్వాన్ని ఆవిష్కరించిన వాశిస్ట గణపతి ముని ఫిబ్రవరిలో శ్రీ రామనాశ్రమాన్ని సందర్శించినపుడు అక్కడి పుస్తక శాలలో కావ్య కంఠ గణపతి ముని సంస్కృతం లో రాసిన వెయ్యి శ్లోకాల ‘’ఉమా సహస్రం ‘’కొన్నాను .దానికి తెలుగు అర్ధ తాత్పర్య ,వివరణలను శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ తేలిక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం )

కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం ) తెలుగు కవులలో అవకాశం పొందిన ఆలిండియా రేడియో మాజీ స్టేషన్ డైరెక్టర్ డా.ఆర్ .అనంత పద్మనాభ రావు ‘’బీడు వారిన నేల’’కవిత .బీడు వారిన గుండెతో రైతు రోదిస్తున్నాడని ,యాత్రలన్నీ మానవ మనో మాలిన్యక్షాళన మానస సరోవరాలు కావాలని ,మానవ మస్తిష్కం లో ఆలోచనా శిఖరాలు చిగురించాలని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం )

పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం ) అలా కొండలు బండల వెంబటి తిరుగుతున్న మనకు మరో మోసగాడు ఎడురౌతాడు .చీటీలు కట్టమని పెద్దయ్యను అడిగితె చీదరించిపోమ్మంటే ,ఆయన అటు పోంగానేభార్య నారాయనమ్మను బుట్టలో వేసి డబ్బు దొబ్బి ‘’నీ యట్ల పెద్దమ్మల్ని దద్దమ్మలని ఇబుటికి ఎందర్ని సూసిం ట్ని’’అని  మనసులో అనుకోని ఉడాయిన్చాడొకడు ‘’నింగి నిజాము … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-5

పిబరే కృష్ణ .ర.సం.-5 ‘’ మోతుకు పూల వాన’’ లో తడిశాం కదా ఇప్పుడు’’ వెండి మబ్బుల్లో ‘’విహరించి  ‘’బండ బతుకులకు’’ చూసి సాను భూతి ప్రకటిద్దాం .డాక్టర్ శ్రీ   యెన్ .వసంత్ –‘’అగరం వసంత్ ‘’అనే మారు పేరుతో రాసిన 54కదల సమాహారమే పై శీర్షిక .వ్రుత్తి రీత్యా డాక్టర్ అయినా వసంత్ ప్రవ్రుత్తి రీత్యా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ. ర.సం -3

పిబరే కృష్ణ. ర.సం -3 పెంచిన గొడ్డు మీద మమకారం ,అది దూరమైతే వచ్చే విచారం మాటలకు అందనిది .మనకే కాదు మనకు మాలిమి అయిన ఆ గొడ్డు కూ అంతే ఆపేక్ష ఉంటుందని తెలియ జెప్పినశ్రీ  చిన్నయ్య గారి మల్లేష్ చెప్పిన ‘’పటం కట్టి పెట్టుకో నుండాము’’కధ.నల్లావును తెల్లావును సంతనుంచి తోలుకొచ్చాడు యజమాని. తెల్లావు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం -4.

పిబరే కృష్ణ .ర.సం -4. శ్రీ పూతల పట్టు రఘునాధ రెడ్డి పేరెన్నిక గన్న  రచయిత.ఆయన రాసిన ‘’ఆ నెత్తురూ ఆ చెమటే ‘’గుండెల్ని పిండిస్తుంది .తండ్రి పెద్దకుడుకును కానీ కానీ కూడ బెట్టి చదివించి పెళ్లి చేసి చేతికి ఆధారమవుతాడనుకుంటే మెదడు వాపోచ్చి చచ్చిపోయి తండ్రి దుఖాన్ని కష్టాన్ని మరింత  పెంచాడు .రెందోకొడుకు మీద   ఆశ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-2

పిబరే కృష్ణ .ర.సం.-2 కన్న పేగు విలువ తెలియ జెప్పే కద ను శ్రీ ఎద్దుల సత్యనారాయణ రెడ్డి రాశారు .తల్లికి షుగర్ ఎక్కువై ఇన్సులిన్ మీద బతుకుతోంది .దాన్ని తెమ్మంటే తాత్సారం చేస్తున్నాడు కొడుకు .వాడి పరిస్తితీ అస్తవ్యస్తం గానే ఉంది .చేతిలో డబ్బు ఆడటం లేదు .పెళ్ళాం పేరుకు ‘’వనిత’’ కాని ఆ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ.ర.సం

పిబరే కృష్ణ.ర.సం. మూడేళ్ళ క్రితం నేను హోసూరు వెళ్లి అక్కడి సాహితీమిత్రుల గురువు ,సారధి ,రచయిత కవి విమర్శకుడు అయిన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి గారిని ,యువ కవి రచయిత అవార్డు గ్రహీత డాక్టర్ వసంత గారిని ,కుర్ర కవి ఫోర్సుఫుల్ కదా రచయిత శ్రీ మునిరాజు మొదలైన వారిని కలిసి ,వారి కార్యక్రమాల … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్ గార్డిమేర్

మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్  గార్డిమేర్ తొంభై సంవత్సరాల సాఫల్య జీవితం గడిపి ,మహా కావ్యాలన దగిన గొప్ప రచనలు చేసి సాహిత్యం లో నోబెల్ పురస్కారాన్ని పొంది ,మానవ సేవా భాగ్యం లో తనవు ,మనసులను ధన్యం చేసుకొన్న దక్షిణాఫ్రికా మహిళా మాణిక్యం నదీన్ గార్డి మెర్ ఈ నెల పదమూడున పుట్టిన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రైలు ప్రయాణం లో తారసపడ్డ రాజనీతిజ్ఞులు – రీడేర్స్ డైజెస్ట్ -లీన శర్మ – తెలుగు అనువాదం -గబ్బిట కృష్ణమోహన్

Attached a copy of the article that appeared in Reader’sscan0001 Digest July 2014 and its Telugu translation for wide publicity రైలు ప్రయాణం  లో తారసపడ్డ రాజనీతిజ్ఞులు   – రీడేర్స్ డైజెస్ట్  -లీన శర్మ  – తెలుగు అనువాదం -గబ్బిట  కృష్ణమోహన్ RD

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్

ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్ ఆమె బ్రిటన్ దేశపు కవి విమర్శకురాలు ,విద్యావేత్త మీదు మిక్కిలి విలియం బ్లేక్, యేట్స్ ,కాల్ రిడ్జి కవి  త్రయాన్ని   అధ్యయనం చేసి అధారిటీ అనిపించుకొని ,ఆధ్యాత్మక భావనలకు ఆలవాలం గా నిలిచి ముఖ్యం గా ప్లాటోనిజం నియో ప్లాటోనిజం లపై సాధికారమైన అవగాహన కలిగిన మహిళ. … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

భరత నాట్య గురువు,జంతు ప్రేమి -రుక్మిణీ దేవి అరండే-జులై నెల” విహంగ”s లో నా వ్యాసం

భరత నాట్య గురువు,జంతు ప్రేమి -రుక్మిణీ దేవి అరండేల్ Posted on 01/07/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ (విహంగ కు ప్రత్యేకం )                 భారత నాట్య శిరోమణి ,సాంఘిక సేవా దీక్షితురాలు ,జంతు ప్రేమి ,థియాసఫిస్ట్ శ్రీమతి రుక్మిణీ దేవి అరండేల్ ఆదర్శ మహిళా మాణిక్యాన్ని గురించి తెలుసుకుందాం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

డిం .టిం.ప్ర.జ.-4

డిం .టిం.ప్ర.జ.-4 డిం –గురూ !ఎండలు పెరుగుతున్నాయేకాని తగ్గటం లేదు ? టిం –రెండో ఎండాకాలం అంటున్నారందుకనే .బాబు పేరు ఇంగ్లీష్ లో ‘’Chandra babu ‘’అని రాస్తారుకడా .అది ‘’ చండ్ర బాబు ‘’గా కూడా చదువుతాం .కనుక చండ్ర నిప్పులు కక్కుతున్నాడు సూర్యుడు .అందుకే వరుణుడు దగ్గరికొచ్చి కూడా భయం తో పారిపోతున్నాడు .ఇలా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

జటాయు రావణ యుద్ధం

జటాయు రావణ యుద్ధం తన మిత్రుడైన ఒక రాజు కోడల్ని ఎవడో రాక్షసుడు బలవంతం గా ఎత్తుకు పోతుంటే ,ఆమె ఆర్తనాదాలు విని ,ఆమె ప్రమాదం లో ఉందని గ్రహించి ఆమెను ఎలాగో అలాగా వాడి బారి నుండి  రక్షించి ,పాడాలని కృత నిశ్చయం తో ,ఆ కర్కోటక రాక్షసుడి తో తన శక్తి నంతా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

డిం .టిం.ప్ర.జ.-3

డిం .టిం.ప్ర.జ.-3 డింగిరి –గురూ !ఆయనెవరో ద్వారక పీఠాదిపతి షిర్డీ సాయిబాబా పై విరుచుకు పడ్డాడు ? టింగిరి –నిజమే .ఆయనే స్వరూపానంద స్వామి .సాయిబాబా దేవుడుకాదు ,అవతారమూకాడు గుళ్ళూ, గోపురాలు కట్ట వద్దు ,పూజించ వద్దు అన్నాడు . డిం –కారణం ఏమిటి స్వామీ? టిం –ఏమీలేదు నాయనా !ప్రజలు పట్టించుకోకపోతే తాను ఉన్నానని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

G.D.P.-2(చివరి భాగం )

.G.D.P.-2(చివరి భాగం )   పెద్దల మాట పేద చెవిన పెడితే జరిగే అనర్ధమేమితో తెలుసా?2050నాటికి ఇండియాలో కార్లు అమెరికాలో కంటే ఎక్కువై పోతాయి .రద్దీ పెరిగి పోతుంది .అమెరికాలో చదరపు కిలో మీటర్ కు 32మంది ఉంటె ఇండియా లో 840అవుతారు .కారు పార్కింగ్ సంగతి దేవుడిదకెరుక కారు నడపటానికే స్థలం చాలదు .కార్లసంఖ్యతో శక్తి వనరుల … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

వజ్రాల దీవి

యక్షులు, బ్రహ్మరాక్షసులు భూత ప్రేత పిశాచాలకు ఆలవాలమైన ఆ ద్వీపంలో ఎక్కడ చూసినా వజ్రాలు రాశులు పోసి వుంటాయి కానీ అక్కడికి వెళ్ళినవాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు పుత్రధర్మాన్ని నెరవేర్చడానికి జయశీలుడు అనే ఒక సాహసవీరుడు ఆ ద్వీపంలో అడుగుపెట్టాడు! అతడు క్షేమంగా తిరిగి వచ్చాడా? పాఠకులను వాయు మనోవేగాలతో పరుగులు తీయించే జయశీలుడి సాహసయాత్ర … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

G.D.P.-1

G.D.P.-1   జి డి పి. అంటే పొద్దున మా మైనేని గోపాల కృష్ణ గారు రాసినట్లు’’ గబ్బిట దుర్గా ప్రసాద్’’ కాదు ‘’గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ ‘ తెలుగులో ‘’స్థూల కుటుంబ ఉత్పత్తి ‘’.ఇప్పుడు దేనికైనా ఇదే ప్రాతి పదిక గా ఉంది .ఇది బాగా ఉంటె అంతా స్వర్గం అనే భావన వ్యాపించింది … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచీకరణ లో మన దారెటు ?

ప్రపంచీకరణ లో మన దారెటు ? ప్రపంచీకరణ అనగానే అదొక దేవలోకం అని సకల అభీష్టాలు తీర్చే వ్రతమని కొందరనుకొంటే ,అది భయంకర దెయ్యం అని అంటరానిదని ,దాని పేరెత్తితేనే మహా పాపమని కమ్యూనిస్ట్ లు  ఇంకా అనుకొంటూనే ఉన్నారు .ప్రపంచం ఒక కుగ్రామం అయి పోయింది కాని ఏదేశానికాదేశం కొన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాయి .అస్తిత్వం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

డిం .టిం .ప్ర.జ .-2

డిం .టిం .ప్ర.జ .-2 డింగరి –‘’గుర్రూజీ !లాల్చీ పైజామా ఆయనేక్కడా కని పించటం లేదే? టింగరి –ఏరో !వ్రోత్తి వ్రోత్తి గుర్రూ అంటున్నవేమిటి ?రెండో ఎపిసోడ్ కే నరం వాచిందా ? డిం –మీకు కోపం, గుర్రూ ఎవ్వువ కనుక అల్లా అన్నా .సారీ .నా ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదుగా ? టిం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment