Category Archives: రచనలు

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు )(డిం .టిం .ప్ర .జ)

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు  (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు  )(డిం .టిం .ప్ర .జ) డింగిరి –గురూ !చంద్ర బాబు ఎక్కిన దగ్గర్నుంచీ వర్షాలు వెనక్కి పోతున్నాయే? టింగిరి –బాబు ది ఐరన్ లెగ్ అని మళ్ళీ రుజువు అయింది .వరుణుడు భయపడి పారి పోతున్నాడేమో . డిం –ఏంతో నమ్మకం తో ప్రజలు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆంధ్రత్వం –ఆంద్ర తేజం

ఆంధ్రత్వం –ఆంద్ర తేజం కీ.శే.శ్రీ దిగవల్లి వెంకట శివ రావు బెజవాడలో గొప్ప న్యాయ వాది.అరండల్ పేట రామ మందిరం వీధిలో ఉండేవారు .వారింటికి ఎదురుగా నేను మా బుల్లిమామ్మ గారింట్లో ఉండి1956-58లో  ఎస్ ఆర్ ఆర్ కాలేజి లో ఇంటర్  చదివాను .అప్పుడు రోజూ శివరావు గారిని చూస్తూన్దేవాడిని .అప్పటికే ఆయన ప్రతిభగురించి కూడా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సాంఘిక సంక్షేమ సేవ లో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్ -విహంగ మహిళా వెబ్ మాస పత్రిక -మే లో ప్రచురితం

సాంఘిక సంక్షేమ సేవ లో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్ Posted on May , 2014 by గబ్బిట దుర్గాప్రసాద్ గిల్డ్ ఆఫ్ సర్వీస్ ,మద్రాస్ సేవా సదన్ అనే రెండు సేవా సంస్థలను నెలకొల్పి ఆదరణకు నోచుకోని మహిళలకు ,పిల్లలకు సేవలందించి విద్యాభివృద్ధికి విద్యాలయాలను నెలకొల్పి ,నైపుణ్య శిక్షణా సంస్థలేర్పరచి ,స్వయం సమృద్ధికి తోడ్పడిన మహిళా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1 ఎమర్సన్ పేరును నాకు ఊహ  తెలిసినప్పటి నుండి వింటూనే ఉన్నాను .ఆయన్ను ఉదాహరించని కవి, వేదాంతి లేడు .అందరికీ ఎమర్సన్ అంటే ఆరాధనా భావమే .ప్రాక్టికల్ మనిషి . పెద్దమనిషి గా సంఘం లో ,అమెరికాలో ప్రపంచం మొత్తమ్మీద పేరు పొందిన వాడు. కాలాతీతం గా ఆలోచించే మేధావి .అమెరికన్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికన్ నాటక రంగ నాలుగో స్థంభం –థారంటన్ వైల్డర్

అమెరికన్ నాటక రంగ నాలుగో స్థంభం –థారంటన్ వైల్డర్ అమెరికా నాటక రంగానినికి ఉన్న నాలుగు మూలస్థంభాలలో యూజీన్ ఒ నీల్ ,జాన్ మిల్లర్ ,టెన్నెసీ విలియమ్స్మూడు మూల  స్తంభాలు  అయితే నాలుగో మూల స్తంభమే థారంటన్ వైల్డర్.నాటక రచనా చతుస్టయం లో చివరివాడు వైల్దేర్ .పాఠాలు చెప్పటమే చిన్నప్పటి నుంచి హాబీ గా ఉండేది … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీరామాయణ పరమార్ధం

శ్రీరామాయణ పరమార్ధం ‘’భక్త మహాకవి తులసీ దాసు ‘’’సీతారామ మయంబీ జగతి ‘’అన్నా ,భువన మెల్ల నీవై ఉండగా బ్రోవ భారమా ?’’అని త్యాగరాజు ప్రశ్నించినా అందరి అనుభూతిలో ఒకే ఒక విభూతి వెలుగుతున్నట్లు గోచరిస్తుంది.అది లౌకికం గా  భవభూతి .,పారమార్ధికం గా ఆత్మ విభూతి ‘.అదే రామాయణ పరమార్ధం  బోధించే ఆత్మాను భూతి ‘’అన్నారు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీరామ చంద్రునికి ఇష్టమైన హేమంత ఋతువు

శ్రీరామ చంద్రునికి ఇష్టమైన హేమంత ఋతువు వాల్మీకి రామాయణం లో మహర్షి వాల్మీకి శ్రీరామునికి హేమంత ఋతువు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు .అరణ్య వాసం లో సీతా రామ లక్ష్మణులు పంచవటి లో ప్రశాంతం గా ఉంటున్నారు . శరదృతువు వెళ్లి హేమంతం ప్రవేశించింది .ఒక రోజు సీతా సమేతం గా రామ … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

గుజరాత్ మహిళా సాంఘిక సంస్కర్త విద్యాగౌరీ నీలకంఠ-విహంగ మహిళా వెబ్ మేగజైన్ -ఏప్రిల్

             అసాధారణ మేధ ఉన్న విద్యా వేత్త ,సంఘ సేవకురాలు, సాంఘిక సంస్కర్త ,వ్యక్తిత్వం తో ,సాధారణ మహిళగా సమాజ సేవ చేసిన విద్యా గౌరీ నీల కంఠ గుజరాత్ రాష్ట్ర మహిళా మాణిక్యం .గుజరాతీ ఆంగ్ల భాషల్లో విద్వద్మణి. స్త్రీ అన్నిటా అగ్రగామిగా ఎదాలని స్త్రీ శక్తి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2

   జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2                                పురాణాలలో ప్రభాస్ వామన ,కూర్మ ,గరుడ ,భవిష్య ,మత్స్య ,పద్మ ,విష్ణు పురాణాలలోను శ్రీ మద్ భాగవతం ,దేవీ భాగవతం లోను ప్రభాస తీర్ధ ప్రస్తావన ఉంది .స్కంద పురాణం లో ఒక అధ్యాయం దీనికే కేటాయించ  బడింది . వృక్ష శాస్త్ర విభాగం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1

     జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1 భారత దేశం లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ లోని సోమనాద్ క్షేత్రం అగ్రగామి .ఎన్నో దండయాత్రలకు తట్టుకొని నిలబడింది .దీనికే ‘’ప్రభాస తీర్ధం’’ అని పేరు .’’జై సోమనాద్’’ పేరిట నేను రాస్తున్న విషయాలన్నీ ఇతిహాస ,పురాణ , చారిత్రికఅంశాలకు చెందినవి .ఆ క్షేత్రం ఎలా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మహిళా రచనా సవ్య సాచి చంద్రికా బాలన్

మహిళా రచనా సవ్య సాచి చంద్రికా బాలన్ Posted on March , 2014 by విహంగ మహిళా పత్రిక      చంద్ర మతి అని పేరొందిన చంద్రికా బాలన్ మళయాళ ,ఇంగ్లీష్ భాషల్లో మంచి మహిళా  సాహితీ వేత్త .కల్పనా సాహిత్యాన్ని విమర్శను రెండు భాషలలోను రాసిన మహిళా సవ్య సాచి .మలయాళం లో ఇరవై  ఇంగ్లీష్ లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చు మీచ్చ్యూ ‘’-1

కార్టూనిస్ట్ జయదేవ్  స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చు మీచ్చ్యూ ‘’-1 పది రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం నన్ను ఆకర్షించింది తీసుకొచ్చి దాదాపు నాన్ స్టాప్ గా చది వేశాను .’’గ్లాడ్ టు మీట్ యు ‘’కు కార్టూనిస్ట్ పేరే పై శీర్షిక .దాన్ని తన’’ పర్సనల్ స్టోరీస్ ‘’అని ప్రముఖ కార్టూనిస్ట్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -13

    రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -13 1-తెలంగాణా లో వర్షం తో పడిన ‘’వడ గండ్లు ‘’    రాబోయే అస్తవ్యస్తాలకు సూచనా? భరింపరాని  ’’ కడగండ్లు? ‘. 2-’ఒద్దు చేరే దాకా ఓడ మల్లన్న –చేరాక బోడి ‘’మల్లన్న’’      టి.ఆర్.ఎస్.నోట చెప్పించిన కే.సి.ఆర్ ‘’.పెద్దన్న’’ . 3-గులాబీ హస్తమూ దొందూ దొందే   … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గోదే రాసిన ఫాస్ట్ నాటకం -2(చివరి భాగం )

   గోదే రాసిన ఫాస్ట్ నాటకం -2(చివరి భాగం ) గోదే కార్య కలాపాల లిస్టు చూస్తె ఆయన ప్రతిభ ఏమిటో యిట్టె తెలుస్తుంది .స్వతహాగా కవి ,నాటక రచయితా ,నాటక దర్శకుడు ,గొప్ప విమర్శకుడు ,విజ్ఞాన శాస్త్ర వేత్త ,మహా రాజకీయ వేత్త అంటే స్టేట్స్ మాన్ .ఇవన్నీ చూస్తె ఆయన ఉన్న కాలం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గోధే రాసిన ‘’ ఫాస్ట్ ‘’నాటకం

గోధే రాసిన  ‘’ ఫాస్ట్ ‘’నాటకం మహాకవి కాళిదాసు రచించిన ‘’అభిజ్ఞాన శాకుంతలం ‘’నాటకం చదివిన జర్మన్ నాటక కథ ,విమర్శకుడు దార్శనికుడు గోధే ఆనందం తో నృత్యం చేశాడని ‘’దివి ని భువి ని కలిపిన మహత్తర నాటకం ‘’అని శ్లాఘిన్చాడని చదివినప్పటి నుంచి ఆయనపై మహా క్రేజు ఏర్పడింది ఆయన రచనలు చదవాలనే కోరిక … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

విదేశాల్లో హారర్ సాహిత్యం

విదేశాల్లో హారర్ సాహిత్యం 1764లో హోరేస్ వాల్ పోల్ రాసిన’’ ది కాజిల్ ఆఫ్ ఆర్ త్రాంటో’’మొదటి గోతిక్ నవల గా వచ్చింది .1787లో ‘’విలియం బ్లాక్ ఫోర్డ్ ‘’రాసిన ‘’ వాతెక్’’విడుదల అయింది . ‘’ది మిస్టరీస్ ఆఫ్ ఉడాల్ ఫో ‘’హారర్ నవలను ‘’అన్నే రాడ్ క్లిఫ్ ‘’1794లో రాసి ప్రచురించాడు .1796 లో’’ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

జీన్ జాక్వెస్ రూసో

జీన్ జాక్వెస్ రూసో రూసో 1712 లో జెనీవా లో జన్మించాడు .పద్దెనిమిదేళ్ళ ప్రాయం లో 1730 లో సంగీత పాఠాలు చెప్పాడు .మరుసటి ఏడాది పారిస్ లో ఒపేరా లకు రాశాడు .ఎన్నో ప్రసంగాలు చేశాడు .ఎమిలీ ,పిగ్మాలియన్ రచనలు చేసి ప్రసిద్ధుడయ్యాడు .వివాదాస్పద రచయిత అని పించుకొన్నాడు . రీజన్ నుభూతద్దం లో చూసిన వారిపై తిరగ బడ్డాడు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్

            ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్ మోలియర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది భ.కా.రా .అంటే భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు .మోలియర్ రచనలు చదివి వంట బట్టించుకొని వాటిని ‘’తెలుగైజ్ ‘’చేసి ఆంద్ర దేశం మీద అచ్చోసి వదిలారు మేష్టారు .మోలియర్ పాత్రలనే తెలుగు దేశపు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

‘తెలుగు వెలుగు’ మార్చి 2014 సంచికలో లంకె బిందెలు గురించిన పుస్తక సమీక్ష కృష్ణ మోహన్

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా శివ రాత్రి –శత రుద్రీయం

         మహా శివ రాత్రి –శత రుద్రీయం    మాఘ మాసం శివునికి ప్రీతికరమైనది .అందులో మహా శివ రాత్రి మహా పవిత్రమైనది ,రుద్రుడికి అత్యంత ప్రీతికరమైనది .అలాంటి శివుడికి మహాన్యాసం తో కూడిన నమక చమకాతో అభిషేకం చేయాలి ,అభిషేక ప్రియుడు శివుడు .నమకం లో పదకొండు చమకం లో … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

పాశ్చాత్య దేశ బాల సాహిత్యం

   పాశ్చాత్య దేశ బాల సాహిత్యం 1848లో మొదటి సారిగా ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత’’ ఈసప్ నీతి కధ’’లనుబాలల కోసం  ఇంగ్లాండ్ దేశం లో ముద్రించారు .దీని రచయిత విలియం ‘’కాక్ స్టన్’’.1647లో ‘’ఆర్బిస్ పిక్చర్స్ (illustrated world )అనే మొదటి బొమ్మల పుస్తకాన్ని ‘’జోహాన్ ఆమోస్ కమినాస్’’ రాసి ప్రచురించాడు .1691లో నీతి కధలున్న … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మొదటి తరం ఆసియామహిళా డాక్టర్- కాదంబినీ గంగూలి

మొదటి తరం ఆసియామహిళా డాక్టర్- కాదంబినీ గంగూలి         బ్రిటిష్ ప్రభుత్వకాలం లో మొదటి తరం మహిళా పట్టభద్రురాలే కాక పాశ్చాత్య వైద్య శాస్త్రం లోశిక్షణ పొందిన  మొదటి తరం డాక్టర్ శ్రీమతి కాదంబినీ గంగూలీ .1861జులై 18న బీహార్ లోని భాగల్పూర్ లో బ్రహ్మ సమాజ మతస్తుడు వ్రజ కిషోర్ బాసుకు కుమార్తెగా జన్మించింది … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే పెద్ద బాల శిక్ష

                గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే  పెద్ద బాల శిక్ష గోవింద రాజు చక్రధర్ పేరు తెలియని పత్రికా పాఠకులే లేరు .జర్నలిస్తులకోసం కాలేజి నడుపుతూ తేర్చిదీద్దుతూ  అనేక ప్రముఖ పుస్తకాలను కరదీపికలు గా రాసిన సీనియర్ జర్నలిస్ట్  జర్నలిస్ట్ మార్తాండుడు ఆయన .పాత తరం జర్నలిస్టుల … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సినీ అస్టావధాని ‘’బహు ‘’మతి-భానుమతి

సినీ అస్టావధాని  ‘’బహు ‘’మతి-భానుమతి ఆ మాటలో వెటకారం మనసులో నిర్మలత్వం అభినయం లో శిఖరారోహణ హాస్యం లో అద్వితీయం సంగీతం లో సరస్వతీయం ,హాస్య సాహిత్యం లో సమర్ధత్వం, దర్శకత్వం లో అసామాన్యం ,ఆవకాయ పెట్టినా అత్తగార్ని ఝాడించినా  అన్నిటా ఆమెకు ఆమే  సాటి .జ్యోతిషం ,వేదాంతాల లోతులు తరచింది .బహుముఖీనప్రజ్నకు ‘’బహు’’ మతి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

గురువులకు గురువు -దేవీ స్వరూపిణి ఆనందమయీ మా

                               గురువులకు గురువు -దేవీ  స్వరూపిణి ఆనందమయీ మా ఆమె సన్నిధే దైవ సన్నిధి .ఆమె సమక్షం  ఆనంద రసప్లావితం .ఆమె వాక్కు పరావాక్కు . ఆమె గురువులకు గురువు అని పించు కొన్న దైవీ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

వాయుసేన లో మొదటి మహిళా మార్షల్ -పద్మావతి బందో పాధ్యాయ

 వాయుసేన లో మొదటి మహిళా మార్షల్  -పద్మావతి  బందో పాధ్యాయ తిరుపతిలో జన్మించి మెడిసిన్ లో డిప్లమా డిఫెన్స్ సైన్స్ లో ఉన్నత విద్యా పొందిన పద్మా గంగోపాధ్యాయ ఏం డి సాధించింది ఆర్మేడ్ ఫోర్స్ మెడికల్ సైన్స్ లో ఉద్యోగం ఆరంభించి,ఆర్కెటిక్ ఖండం పరిశోధనా బృందం లో పరిశోధన చేసింది .బెంగళూర్ యూని వర్సిటి లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అమ్మ కు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ

   అమ్మ కు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ ‘’నీ పిల్లలో ఏమి చూస్తున్నావో అందరిలో దానినే చూడటం బ్రహ్మస్తితి పొందటమే .తిధులు విధిని మార్చలేవు .పెట్టింది కాదు ,జరిగేదే ముహూర్తం .మానవుడి నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు ,రాగ ద్వేషాలు అనే రెండే రెండు గ్రహాలమీదే .జీవితం సమస్యల తోరణం , సమస్యలతో రణం  .వైకల్యం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

తొలితరం మహిలోద్యమ నాయకురాలు –భండారు అచ్చమాంబ

 తొలితరం మహిలోద్యమ నాయకురాలు –భండారు అచ్చమాంబ భారత దేశం లోనే మొదటి మహిళా చరిత్ర రచయితగా ,మన రాష్ట్రం లో తొలితరం మహిళోద్యమ సారధిగా శ్రీమతి భండారు అచ్చమాంబ గుర్తింపు పొందింది .కృష్ణా జిల్లా నందిగామదగ్గర పెనుగంచి ప్రోలు లో ఆమె 1874లో జన్మించింది తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య .కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు గారికి సోదరి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా తొలి మహిళా డాక్టర్ –ఎలిజబెత్ బ్లాక్ వెల్

అమెరికా తొలి మహిళా డాక్టర్ –ఎలిజబెత్ బ్లాక్ వెల్ Posted on January , 2014 by గబ్బిట దుర్గాప్రసాద్ 1821 ఫిబ్రవరి మూడున ఎలిజబెత్ బ్లాక్ వెల్ ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ లో సామ్యుల్ బ్లాక్ వెల్స్ కి, హన్నాకు జన్మించింది .తండ్రి ఉదారుడూ రిఫైనరీ నడిపే వాడు ,మత సంస్థలతో మంచి సంబంధాలున్న వాడు . తండ్రికి … Continue reading →

Posted in రచనలు | Tagged | 2 Comments

రాచకీయ’’ ద్విప్లేట్స్ ‘’-4

      రాచకీయ’’ ద్విప్లేట్స్ ‘’-4 1— ఆం ఆద్మీ చీపురు పట్టి రాచకీయ చెత్తను ఊడ్చి పారేశాడు       ఆ చేత్తనే నాయకుడు మళ్ళీ నెత్తి నెట్టుకొని సింహాసనం ఎక్కుతున్నాడు   2-.చేతిని ,కాషాయాన్ని పక్కకు ఊడ్చి పైకొచ్చాడు కేస్రీవాల్    మంచిపనే జరిగిందను కొంటె భస్మాసుర హస్తం నెత్తి నేంటి ప్యారేలాల్ ? … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పువ్వులాంటి ఆడ జీవితం –శ్రీమతి కరుణా నిధి

పువ్వులాంటి ఆడ జీవితం –శ్రీమతి కరుణా నిధి పువ్వు లాంటిది ఆడ దాని జీవితం –సాగిస్తుంది బతుకు పయనం పువ్వు లాగా వికసిస్తుంది –సంస్కార వంతుడైన భర్త సంరక్షణ తో వికసించి సువాసన లీనుతుంది . చదువు సంస్కారాలతో ,కీర్తి ప్రతిష్టలు పొందుతుంది కొందరు సంఘ సంరక్షణ లో ముందు నిలుస్తారు కొందరు మాత్రం సిగ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సఫల జీవి ‘’సేలేస్టీ’’-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -డిసెంబర్ -లో నా వ్యాసం

సఫల జీవి ‘’సేలేస్టీ’’ Posted on December , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్  ’చురుకైన యువతి గా సేలేస్టీ కి మంచి పేరుంది .1986లో స్కూల్ చదువు పూర్తీ చేసి స్కాలర్ షిప్  ల సాయం తో కాలేజి లోకి అడుగు పెట్టటానికి సిద్ధం గా ఉంది .తల్లికి గారాబు కూతురు గా,చేదోడు వాదోడు గా తెలివైన విద్యార్ధి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లేట్స్ మరియు వెండి తేర బంగారం

Posted in రచనలు | Tagged | Leave a comment

తమ అస్తిత్వం కోల్పోయి తెలుగై పోయిన ఇంగ్లీష్ ముక్కలు

తమ అస్తిత్వం కోల్పోయి తెలుగై పోయిన ఇంగ్లీష్ ముక్కలు మనం ఆంగ్లం అనటం మరిచి ఇన్గ్లేహ్ అనటం ప్రారంభించి చాలా కాలమై పోయింది .అలాగే ఎన్నో ఇన్గ్లేఎశ్ పదాలు ఉకారాన్తమై తెలుగు పడాలి విడదీయ రాణి బంధాన్ని పెన వేసుకు పోయాయి ఇవి ఆంగ్ల పదాలు అంటే అంటే ఇప్పుడు మనం ఆశ్చర్య పోయేంత పరిస్తితి … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -4(చివరి భాగం )

ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -4(చివరి భాగం ) ప్రభాకర ప్రతిభా బారతి ప్రభాకరులు రాసిన ‘’భారతీయ సంస్కృతీ ‘’లో భారతి అనే మాటకున్న అర్ధాన్ని విపులం గా వివరించారు .ఆత్మ ను ఉద్ధరించేదే భారతీయ సంస్కృతీ అని ,  భావం .రసం శరీరం చేత పవిత్రమై వేలుస్తోందని … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -3

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -3 ప్రభాకర సనాతన ధర్మ ప్రసంగ జైత్ర యాత్ర కృష్ణా ,గుంటూరు, గోదావరి జిల్లాలో సనాతన ధర్మ ప్రసంగ జైత్రయాత్రను పూర్తిగావించు కొన్న ప్రభాకరులు సామర్ల కోట కాకినాడ ,పిఠాపురం ,తుని ,అనకాపల్లి ,విశాఖ పట్నం ,విజయ నగరం ,శ్రీ కాకుళం ,బరంపురం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు -2

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు -2 ప్రభాకర వాక్ మహేంద్ర జాలం ఇరవై ఏళ్ళ వయస్సులో ఆర్ష విజ్ఞాన ప్రచారోద్యమానికి శ్రీ కారం చుట్టారు ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు .ఆయనది దైవ వాణి గా భావించారు .ప్రజల మనసులో అమృత ధారల్నివర్షించింది . ఆజాను బాహువులు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కిసుక్కు కిసుక్కు

కిసుక్కు కిసుక్కు 1-ఒక కూతురు తండ్రి అల్లుడితో ‘’అల్లుడూ !మా అమ్మాయిని గారాబం గా పెంచినీ  చేతిల్ పెడుతున్నాం .ఎలా ఎలుకొంటావో ?’’ గడసరి అల్లుడు ‘’అదేంటి మామగారూ !మీరు సంపాదిస్తున్నంత వరకు మీఅమ్మాయిని   నేను జాగాత్తగానే చూసుకొంటాను ‘’అన్నాడు 2-కూతుర్ని వియ్యపు రాలికి అప్పగిస్తూ ‘ఒదినా !మాపిల్లను అల్లారు ముద్దుగా పెంచి ఎక్కడికీ పంపకుండా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు -1

ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు -1 నాచిన్నతనం నుండే పండితుల వారి గురించి మా నాన్న గారు మామయ్యా ఎప్పుడూ మాట్లాడుకొనే వారు  నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత బెజవాడ లో రామకోటి ఉత్సవాలు ఇప్పుడున్న క్షేత్రయ్య కళా క్షేత్రం ఉన్న చోట శివ రామ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రభావ శాలి అమెరికా ప్రెసిడెంట్ తల్లి నాన్సీ -విహంగ మహిళా వెబ్ మేగజైన్ -నవంబర్

ప్రభావ శాలి అమెరికా ప్రెసిడెంట్ తల్లి నాన్సీ -విహంగ మహిళా వెబ్ మేగజైన్ -నవంబర్ అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ పై  చిన్నతనం లో నే ప్రభావం చూపి మార్గ దర్శకత్వం చేసింది  అతని తల్లి Nancy Lincoln నాన్సీ హాక్స్ లింకన్ .ఆమె1784 ఫిబ్రవరి 5న   వర్జీనియా లో నోబుల్ మాన్ అనిపించుకొన్నవ్యక్తి లూసీ హాంక్స్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అపర భగీరదీయం -5(చివరి భాగం ) ఆధునిక ద్రష్ట కాటన్ వ్యక్తిత్వం

               అపర భగీరదీయం -5(చివరి భాగం )                          ఆధునిక ద్రష్ట  కాటన్ వ్యక్తిత్వం             సర్వ సమర్ధుడైన మిలిటరీ ఇంజినీర్ మాత్రమే కాదు  ఉదాత్త వ్యక్తిత్వం మూర్తీభవించిన వాడు సర్ ఆర్ధర్ కాటన్ దొర  కేవలం ఒక్క ఏడాది మాత్రమె బర్మా యుద్ధం లో సైన్య విభాగానికి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అపర భగీరధీయం—4 డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’

అపర భగీరధీయం—4 డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’ గోదావరి సెంట్రల్ డెల్టా లో వసిష్ట గోదావరికి ,దాని పాయ అయిన వైనతేయ నదికి మధ్య’’ నగరం అనే సార వంత మైన భూఖండం’’ ఉంది .దీన్ని ‘’గోదావరి ఉద్యానం ‘’అని ముద్దుగా పిలుచుకొంటారు .1851నాటికి నగర ఖండం లో … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అపర భగీరధం -3 గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి

         అపర భగీరధం -3 గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి గోదావరి వరదలోచ్చినా  ,రాళ్ళు పగల కొట్టటం ,సున్నం కాల్చేపని ,ఇటుక తయారీ నిర్విఘ్నం గా జరుగుతూనే ఉన్నాయి .రెండో రైల్ మార్గం పనులూ అయిపోయాయి .ఆరున్నర మైళ్ళ పొడవు గల రైల్వే లైన్ కు కావాల్సిన కర్ర పట్టాలు అమర్చారు .పట్టాల పై భాగాన్ని … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

అపర భగీరధీయం –2 ఆనకట్ట నిర్మాణ పనులు షురూ

                             అపర భగీరధీయం –2 ఆనకట్ట నిర్మాణ పనులు షురూ రాజ మంద్రికి నాలుగు కిలో మీటర్ల దూరం లో ఉన్న ధవళేశ్వరం వద్ద ఆనకట్టనిర్మాణా నికి అనువైన స్థలం గా భావించారు .దీనికి ఎగువన నదిని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అపర భగీరధీయం-1

అపర భగీరధీయం-1 తన పూర్వీకులైన సగరుల భస్మ రాశులపై దివిజ గంగను భూమి మీదకు తెప్పించి వారి ప్రేతాత్మలకు విముక్తి కలిగించి  అమరత్వాన్ని కల్పించాడు భగీరధుడు .దీనికి ఆయనకు ఎన్నో అడ్డన్కులేర్పడ్డాయి గంగను భూమి మీదకు దిమ్పాలంటే సరాసరి అది పడితే భూమి బ్రద్దలై పోతుంది అందుకని ముందుశివుని జటాజూటం లోకి అక్కడినుండి  హిమాలయ పర్వతాలపై … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment