గుమ్మా సాంబశివరావు గారి సన్మాన సభ విజయవాడ

గుమ్మా కు సమ్మానం

నిన్న అంటే ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండింటికి మిత్రుడు పూర్ణ చంద్ ఫోన్ చేసి బెజ వాడలో సాయంత్రం ఆరింటికి ప్రెస్ క్లబ్ లో గుమ్మా సాంబశివరావు కు సన్మానం ఉందని ,ఏ మాత్రం వీలున్నా రమ్మని చెప్పారు సరే నన్నాను .నాలుగింటికి మా శ్రీమతి చేసిన వేడి వేడి బజ్జీలు తిని టీ తాగి బస్ ఎక్కి పావుతక్కువ ఆరింటికి లెనిన్ సెంటర్ కు వెళ్లాను అక్కడ పాత పుస్తకాలషాప్  అయిన ‘’ప్రాచీన గ్రంధ మాల ‘’కు వెళ్లి ఓనర్ జగన్మోహన రావు ను పలకరించి నాకు దొరికిన జరుక్ శాస్త్రి సాహిత్యం శ్రీ శ్రీ ఖడ్గ వృష్టి, సిప్రాలి,ఏలెక్స్ హేక్స్లీ రాసిన ఏడుతరాలు నవల –మొత్తం నాలుగు పుస్తకాలు నూట యాభై కి  కొని ప్రెస్ క్లబ్ కు చేరాను .అక్కడఇచ్చిన బిస్కట్లు , టీ పుచ్చుకొన్నాను .గుమ్మా కనీ పించి ‘’ఈ చలిలో మిమ్మల్ని శ్రమ పెట్టాము ‘’అన్నాడు ‘’అదేమీ లేదు .మీరు మా సమావేశాలకు రావటం లేదా ?నేను రావటం నా ధర్మం బాధ్యత ‘’అన్నాను అక్కడున్న వారికి నన్ను పరిచయం చేస్తూ గుమ్మా ‘’వీరు దుర్గా ప్రసాద్ గారు ఉయ్యూరులో సరసభారతి అనే సమస్త నిర్వహిస్తున్నారు ప్రతి ఉగాదికి కవి సమ్మేళనం నిర్వహిస్తారు జిల్లాలో మొత్తం కవులు వంద మంది దాకా వస్తారు ‘’అని చెప్పారు ఆప్యాయం గా హత్తుకోన్నాడు .పూర్ణచంద్ కూడా కలిసి కస్టపెట్టానేమో అంటే ‘’నొ ‘’అన్నాను .అక్కడ కదా రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ ,శోభనాద్రి గారు ,సోమయాజి గారు కవి కదారచయిత్రులు పుష్పాదేవి ఉమా మహేశ్వరి ,వక్త పద్మావతి శర్మ ,విమలాదేవి మొదలైన వారంతా ఆప్యాయం గా పలక రించారు .బెజ వాడ లో ఉన్న అనేక సాహితీ సంస్తలు గుమ్మా కు చేస్తున్న సమ్మానం ఇది .

సభాధ్యక్షుడిగా శ్రీ గోళ్ళ నారాయణ రావు ముఖ్య అతిధిగా రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీమతి మున్జలూరి కృష్ణ కుమారి ,ఆత్మీయ అతిధులుగా ‘’నది ‘’మాసపత్రిక సంపాదకులు శ్రీ జలదంకిప్రభాకర్, చిన్నయ సూరి కల పీఠం అధ్యక్షులు శ్రీ టి శోభనాద్రి ,లయోలా కాలేజి హిందీ హెడ్ శ్రీ వెన్నా వల్లభ రావు ,లయోలా విశ్రాంత హిందీ శాఖాధ్యక్షులు శ్రీ కొచ్చెర్ల కోట వెంకట సుబ్బారావు, సరసభారతి అధ్యక్షుని గా నన్ను వేదిక పైకి ఆహ్వానించారు పూర్ణ చంద్ .అప్పుటి దాకా నేను ఒక ప్రేక్షకుడి నే అనుకున్నాను .కాని సీన్ మారింది .అప్పుడు అర్ధం అయింది గుమ్మాకు ఎందుకు సమ్మానం చేస్తున్నారో .

వల్లభ రావు మాట్లాడుతూ మన రాష్ట్ర మాజీ  సెక్రటరి శ్రీ కాకి మాధవరావు గారి కుమార్తె ఇప్పుడు ఉన్నత విద్యా డైరెక్టర్ అనీ ,ఆమె ఈ సంవత్సరం కొత్త విధానం లో ప్రతిభ గల ప్రైవేట్ కాలేజి లేక్చర ర్లను ఒక్కో సబ్జెక్ట్ లో ఒకర్ని రాష్ట్ర వ్యాపితం గా ఎంపిక చేసి సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకొన్నారని ఇలా చేయటం ఇదే మొదటి సారి అని తెలిపారు .ప్రతి కాలేజికి పది పేజీల ఇవాల్యుఏషను ప్రతి పంపారని ప్రతి లెక్చరర్ అందులోని విషయాలను పూర్తీ చేసి ప్రిన్సిపాల్ కు ఇవ్వాలని ఆయన చూసి తన రిమార్కులు జోడించి స్తానికప్రభుత్వ ఎస్.ఆర్ ఆర్ కాలేజి ప్రిన్సిపాల్ కు పంపితే ఆయన రీజినల్ సేక్రేటరీలకు, ఆయన డైరెక్టర్ కు పంపెట్లు చేశారని చెప్పారు ఇందులో సెల్ఫ్ ఇవాల్యుఎషను తో బాటు ,2012-13-సంవత్సరానికి ఆ లెక్చరర్ చేబట్టిన రిసెర్చ్ వర్క్ ,పత్రికా వ్యాసాలూ ప్రచురించిన పుస్తకాలు రిసెర్చ్ చేసే విద్యార్ధులకు ఇచ్చిన గైడెన్స్ ,అందులో ఉత్తీర్ణతా శాతం సభల్లో పాల్గొన్న విశేషాలు ,రేడియో లో వివిధ సంస్తాలలో తన చొరవ ప్రాతి నిధ్యం మొదలైన వన్నీ పరిగణలోకి తీసుకొన్నారని ,రాష్ట్రం మొత్తం మీద ప్రైవేట్  డిగ్రీ కాలేజీలలో తెలుగు హెడ్ ఆఫ్  దిడిపార్ట్ మెంట్ ,రిసెర్చ్ కు గైడ్ అయిన  డాక్టర్ గుమ్మా సాంబశివ రావు అత్యధిక మార్కులు సాధించి ప్రధమం గా నిలిచారని వారికి సమీపం గా ఎవరూ రాలేక పోయారని అందుకు వారిని డైరెక్టర్ అభి నందినందిన్చారని ఈ మొదటి సారి ఏర్పాటు చేసిన ఈ పురస్కారం

మొదటి సారిగా గుమ్మా కు దక్కటం విజయ వాడ వాసులకు ఏంతో ఆనందాన్ని కల్గించిందని అందుకే సంస్తాలన్నీ కలిసి ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసి తమ్ము తాము గౌరవిన్చుకోన్నాయని అన్నారు .

కృష్ణ కుమారి మాట్లాడుతూ ఇలాంటి అరుదైన వ్యక్తీ మన విజయ వాడలో ఉన్నందుకు గర్వ పడాలని మరిన్ని గుర్తింపులు ఆయనకు రావాలని కోరారు .శోభనాద్రి గారు గుమ్మా విశిష్టతను వివరిస్తే ,జలదంకి ఆయన తో తనకున్న పరిచయాన్ని తెలిపారు కొచ్చెర్ల కోట తన అనుభవాన్ని వివరిచారు .

నేను మాట్లాడుతూ ‘’గుమ్మ పాలు యెంత జీవం ,జవం కలవో అలానే  గుమ్మా మాటకు రచన కు అంతటి జవం జీవం ఉన్నాయి ఆయన లేని సాహిత్య కార్య క్రమం లేదు .ఆయన రాయని పత్రిక లేదు సమీక్షించని పుస్తకం లేదు ప్రాచీన సాహిత్యం నుంచి అత్యాధునిక సాహిత్యం వరకు ఆయన స్పృశించని విషయం లేదు .అందరికి మిత్రుడు .’’సాహిత్యం లో అజాత శత్రువు గుమ్మా’’ .నాకు మరీ దగ్గర వాడు .ఉయ్యూరు లో మేము నిర్వహించే సభలన్నిటికి హాజరైనాడు .మాట్లాడాడు మార్గ దర్శకం చేశాడు కవి సమ్మేళనాలు నిర్వహించాడు .కృష్ణా జిల్లా రచయితల సంఘానికి వెన్నెముక గా నిలిచి పని చేస్తున్నాడు ఎన్నో సభలను చాక చక్యం గా నిర్వహించాడు .జాతీయ సభలు ప్రపంచ సభల్లో తనదైన ముద్ర వేశాడు .ఆ కవి సమ్మేళనాలను న భూతో గా జరిపాడు .భువన విజయాలలో విజయ బావుటా ఎగరేశాడు. చిక్కని చక్కని పద్యాలు చెప్పగలడు .వచన కవిత్వం లోను తన ప్రతిభ ను చూపాడు ఆశుకవిత్వం లోనూ దిట్ట..ఎన్నో సెమినార్లలో పేపర్లు రాసి చదివాడు ఉత్తేజం చేసే స్వభావం గంగప్ప గారి అల్లుడు గుమ్మా.  నేను సరదాకి ‘’మామను మించిన అల్లుడు ‘’అంటాను ఇద్దర్నీ .అలాగే వెన్నా వల్లభ రావు గుమ్మా జంట మిత్రులు .వదలి ఉండలేరు .జీవికా జీవుల్లా కలిసి మెలగుతారు .అందుకే నేను వారిలో ఒకరేవరైనా కనిపించనప్పుడు రెండో వారిని ‘’మీ బెటర్ హాఫ్ రాలేదా ?’’అని అడుగుతాను. నవ్వుతూ సమాధానం చెబుతారు ‘’ఆదిత్య ప్రసాద్ గారు ఇక్కడ రేడియో స్టేషన్ డైరెక్టర్ గా ఉండగా నాతొ ‘’బెజ వాడలో ‘’క్రీం  ఆఫ్ ఇంటలి జేన్స్స్’’ ఎక్కువ .అందులో గుమ్మా ,పూర్ణచంద్ సోమయాజి లాంటి వారు మరీ సాహితీ మూర్తులు ‘’అనే వారు అలాంటి గుమ్మా కు సన్మానం అని పూర్ణ చెబితే యెగిరి వచ్చాను. ఆదిత్య ప్రసాద్ గారి పై మేము ‘’ఆదిత్య హృదయం ‘’అనే పద్య కవి సమ్మేళనాన్ని నిర్వహించినప్పుడు గుమ్మా మాకు  మార్గ దర్శనం  చేశాడు .ఆ పుస్తకాన్ని ఆదిత్య ప్రసాద్ గారి సమక్షం లో ఆవిష్కరించినపుడు దాన్ని చక్కగా సమీక్ష చేశాడు .మేము ఉయ్యూరు లో విశ్వనాధ సాహిత్యం పై సభ జరిపినప్పుడు కల్ప వృక్ష రామాయణం పై అరగంట లో అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు .డాక్టర్ శ్రీ మడక సత్య నారాయణ వేయి పడగల మీద,శ్రీమతి బెల్లం కొండ శివ కుమారి ఏక వీర మీదా గొప్పగా ప్రసంగించిన సభ అది .

సాధారణం గా ప్రభుత్వం ఏదైనా అవార్డు ఇస్తే అది అర్హులకు దక్కదు అనే విమర్శ ఉంది కాని రాష్ట్ర ప్రాభుత్వం ఈ అవార్డును గుమ్మా కు ఇచ్చి ఆ అప ప్రదను తొలగించు కొంది అందుకు ప్రభుత్వాన్ని కూడా అభి నందిస్తూ ఈ విధానాన్ని ప్రవేశ పెట్టి ‘’పూల్ ప్రూఫ్ ‘’గా ఎంపిక చేసిన డైరెక్టర్ కూడా అభినంద నీయు రాలే ‘’.మరిన్ని ఇలాంటి గుర్తింపులు రావాలని కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కూడా త్వరలోనే లభించాలని కోరుతున్నాను ‘’అని ముగించాను .

ఆ తర్వాత అందరు కలిసి డాక్టర్ గుమ్మా సాంబ శివ రావు కు ఆత్మీయ సమ్మానం చేసి మనసారా అభినందించి తామ సాహితీ

మిత్రత్వాన్ని చాటుకొన్నారు ఏంతో సహృదయం గా ఆత్మీయం గా జరిగిన సభ ఇది గుమ్మా అంటే అందరికీ అభిమానమే .ఎందరో రిసెర్చ్ విద్యార్ధులకు గైడ్ గా ఉన్నారు .అలాంటి గుమ్మాసమ్మానానికి   రావటం నాకు మహదానందం గా ఉంది

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-12-13- ఉయ్యూరుgummaa ku sammaanam 001

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
గ్యాలరీ | This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.