ప్రపంచ దేశాల సారస్వతం
183-గుడెలోప్ దేశ సాహిత్యం
- ఫ్రెంచ్ ఓవర్ సీస్ దేశమైన గుడెలోప్ దక్షిణ కరోబియన్ లో ఉంది .దీన్నిలోని రెండు పెద్ద ఐలాండులు సాలీ రివర్ చేత విభజింప బడినాయి .లాంగ్ బీచెస్ కు ,చెరుకు పొలాలకు ప్రసిద్ధి .వాటర్ ఫాల్స్ ఆకర్షణ .రాజధాని బస్సీ టెర్రె –కరెన్సీ –యూరో .జనాభా4లక్షలు .రోమన్ కేధలిక్ మతం .ఫ్రెంచ్ భాష .గుడేలోపియన్ కరోల్ భాషాజనమూ ఉన్నారు .96.5శాతం అక్షరాస్యత .ఫ్రెంచ్ విద్యా విధానం .చెరకు అరటి ఉత్పత్తులే ఆదాయ వనరులు .ఫిషింగ్ కూడా ఆదాయమే .ఎల్లేస్ డెస్ సైన్టీస్ ,లాగ్రాండే సోఫేరీ ,గుడేలోప్ జలపాతం నేషనల్ పార్క్ చూడదగినవి .ఆంక్షలున్నాయి .
- గుడెలోప్ సాహిత్యం –మేరియాసే కొండేఅనే నల్లజాతి కవయిత్రి 2018లో న్యు ఎకాడేమి అవార్డ్ పొందింది ఇది నోబెల్ ప్రైజ్ కు ప్రత్యామ్నాయంగా 2017లో స్వీడెన్ దేశం స్టాక్ హోం లో ఏర్పాటు చేయబడింది .1960లో సెయింట్ జాన్ పెర్సే గా ప్రసిద్ధి చెందిన అలెక్స్ లేగర్ కవికి నోబెల్ ప్రైజ్ దక్కింది .అతడు గౌరవనీయమైన వైట్ క్రియోల్ ‘’బెకేస్’’కులానికి చెందినవాడు .ఇప్పుడు ఈమెకు అంతటి గౌరవంఆమెరాసిన ‘’విండ్ వార్డ్ హైట్స్’’కు లభించింది .ఎంత తేడా ఉందొ ఆశ్చర్యమేస్తుంది .
- డానీ బేబెల్ గిస్లార్ –సోషియాలజిస్ట్ ,ఎత్నాలజిస్ట్ లింగ్విస్ట్ ,రచయిత్రి .సం ప్రిన్సిపిల్స్ ఫర్ రైటింగ్ ఇన్ క్రియోల్ ,దిక్రియోల్ లాంగ్వేజ్ ఫోర్సేడ్ సప్రేషన్ రాసింది .యునెస్కో లో ‘’స్లేవ్ రూట్ ప్రాజెక్ట్ ‘’తో అనుబంధం ఉంది .-నవలా రచయిత .రచనలు – Sapotille et le Serein d’argile (1960), Cajou (1961) and Demain Jab-Herma (1967).
- మానికం జాక్వేలిన్ –మిడ్వైఫ్.అబార్షను చట్టబద్ధం చేయటానికి ఉద్యమించింది .మై ఎక్సామ్స్ ఇన్ వైట్ నెస్,దిసీడ్,నవలలు దిడైరీ ఆఫ్ ఎ మిడ్వైఫ్ అనే స్వీయ చరిత్ర రాసింది .
- సిమోన్ స్క్వేవార్జ్ బార్ట్-నాటకాలు నవలలు రాసింది.బిట్వీన్ టు వరల్డ్స్ దిబ్రిడ్జ్ ఆఫ్ బియాండ్ ,విత్ ఆండ్రీ స్క్వువార్జ్ బార్ట్ నవలు ,యువర్ హాండ్సం కెప్టెన్ అనే దియేటర్ ప్లే ,ఇన్ ప్రైజ్ ఆఫ్ బ్లాక్ వుమెన్ అనే నాన్ ఫిక్షన్ రాసింది .గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ ను ,భర్తతో కలిసి ,ప్రిక్స్ కార్బెట్ అవార్డ్ పొందింది .
- కొండే మార్సీ –నవల విమర్శ నాటకం రాసింది ఆమె రాసిన ‘’సేగౌ ‘’నవల బానిసత్వం ,కాలనీ దౌష్ట్యం ను కళ్ళకు కట్టించింది .గుగ్గెన్ హీం ఫెలోషిప్ ,బుకర్ ప్రైజ్ పొందింది .
- 184-మార్టినిక్ దేశ సాహిత్యం
- ఉత్తర అమెరికాలో మార్టినిక్ దేశం కరెబియన్ ఐలాండ్ .ఫ్రెంచ్ –వెస్ట్ ఇండియన్ మిశ్రమ సంస్కృతి ఉన్న దేశం.నెపోలియన్ మొదటిభార్య జోసేఫిన్ శిలావిగ్రహం ఇక్కడ ఉండటం ప్రత్యేకత .రాజధాని –ఫోర్ట్ డీ ఫ్రాన్స్ . కరెన్సీ –యూరో .జనాభా -3.76లక్షలు .రోమన్ కేధలిక్ మతం .అధికార భాష ఫ్రెంచ్ .ఆ౦టేలియన్ క్రియోల్ ,మారిటినిషియన్ క్రియోల్ భాషా జనం ఉన్నారు .93శాతం అక్షరాస్యత .ఫ్రెంచ్ విద్యా విధానం .మౌంట్ పీలీ ,జార్డిన్ డీ బలాటా,హాబి టేషన్ క్లెమెంట్ దర్శనీయాలు .సేఫ్ దేశం .
- మార్టినిక్ సాహిత్యం –ఘనమైన కరేబియన్ సాహిత్యానికి ఈ దేశ సాహిత్యం చిహ్నం .ప్రేరణాత్మక రచయితలెందరో జన్మించిన దేశం .ఇంటలెక్ట్యువల్ కంట్రీ గా పేరు పొందింది .లఫ్కోడియో హీరెన్-కవి ,డిప్లోమాట్ .ఆండ్రే బ్రిటన్-సర్రియలిస్ట్ కవి .ఫ్రెంచ్ సాహిత్యాన్ని ఉత్తేజపరచిన రచయితలూ ఎందరో ఇక్కడ పుట్టారు .క్లేర్జిమన్ జీన్ బాప్టిస్ట్ లబట్ ఈ దేశ సౌభాగ్యాన్ని ముందు దర్శించాడు .పారిస్ లోపుట్టి ఇక్కడ ఉండి’’న్యుఎజ్ వాయెజ్ ఆక్స్ ‘’రాశాడు ఇది కాలనీ చరిత్రపై అభిరుచి ఉన్నవారికి బైబిల్ వంటిది .రెనే మరాన్ – వెస్ట్ ఇండీస్ లో పుట్టి ‘’బాతౌలా’’ నవలరాసి’’కాన్ కోర్ట్ ప్రైజ్ ‘’పొందాడు .ఆఫ్రికన్ బ్లాక్ ల అస్తిత్వానికి పునాది అయింది .యైమే సెసారే –కవిత్వం ‘’రిటర్న్ టు మై నేటివ్ లాండ్ ‘’-1993 ను క్లాసిక్ అంటారు .లేపోల్డ్ సెడార్ సేన్ఘార్ ‘’కేహిర్ డన్ రిటోర్ అ పస నటార్’’కవితతో ‘’పోయేట్ ఆఫ్ నేగ్రెట్యూడ్’’అన్నారు .చాలాకవితలు నాటకాలు రాశాడు .’’డిస్కోర్స్ ఆఫ్ కాలనైజేషన్’’అనే ప్రఖ్యాత గ్రంథం రాశాడు .ఎడౌర్డ్ గ్లిస్సార్డ్ రాసిన ‘’లా లిజార్డే ‘’కు రెనౌ డాట్ ప్రైజ్ 1958లో వచ్చింది .ఇతని నవలలు ఆఫ్రో-కరేబియన్ వారసత్వం పై రాసినవే .పాట్రిక్ చమసౌరచన ‘’ఎలిజి టు క్రియోల్టి’’లో క్రియోల్ సాంస్కృతిక వారసత్వం ను విశ్లేషించాడు .దీన్ని జీన్ బెర్నేబ్ ,రాఫెల్ కన్ఫిఎంట్ లతో కలిసిరాశాడు .రాఫెల్ కంకౌర్ట్
- ప్రైజ్ విన్నర్ కూడా .
- సశేషం
- వరలక్ష్మీ వ్రతం శుభా కాంక్షలతో
- మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-20-ఉయ్యూరు