|
తెలుగు చిత్రనిర్మాణసంస్థల్లో భార్గవ్ ఆర్ట్స్ సంస్థకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఇది నందమూరి బాలకృష్ణకు మాతృసంస్థలాంటిది. భార్గవ్ ఆర్ ్ట్స సంస్థతో బాలకృష్ణ, ఆయన వల్ల భార్గవ్ ఆర్ట్స్.. ఇలా ఒకరికొకరు అన్నట్లుగా ఎదిగారు. ఈ సంస్థ నిర్మించిన మూడో చిత్రం ‘మంగమ్మగారి మనవడు’. అంతే కాదు బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ కాంబినేషన్‌కి శ్రీకారం చుట్టిన సినిమా కూడా ఇదే. భారతీరాజా తమిళంలో తీసిన ‘మన్ వాసనై’( మట్టి వాసన) చిత్రానికి ఇది రీమేక్. మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయడమే కాకుండా కమర్షియల్ అంశాలు జోడించిడంతో తెలుగు ప్రేక్షకులకు అమితంగా నచ్చేసింది. బాలకృష్ణకు ఇది 15వ సినిమా. సోలోగా ఆయన నటించిన నాలుగో సినిమా. ఆయనకు ఇదే తొలి శతదినోత్స చిత్రం. అత్యధిక స్థాయిలో 565 రోజులు ఈ చిత్రం ప్రదర్శితమవడం ఒక రికార్డ్. సినిమాలో పంచె కట్టుతో బాలకృష్ణ కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. అలాగే తొలిసారిగా ఒక పాటలో రాముడు, కృష్ణుడు గెటప్స్‌లో ఆయన కనిపిస్తారు. సుహాసిని కథానాయిక. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన భానుమతీరామకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 1984 సెప్టెంబర్ 7న ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం విడుదలైంది. నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ ‘చిత్రజ్యోతి’కి వివరించిన విశేషాలు ఆయన మాటల్లోనే…
మద్రాస్‌లో చూసిన ఓ చిన్న సినిమా ఈ కథకు స్పూర్తి.. ఓసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా గోపాల్‌రెడ్డిగారికి కథ చెప్పాను. ఆయనకు నచ్చి ప్రొసీడ్ అన్నారు. అప్పటి వరకు భార్గవ్ ఆర్ట్స్ సంస్థ రెండు చిన్న సినిమాలు తీసింది.. ఆ బ్యానర్ నుండి వచ్చిన తొలి పెద్ద చిత్రమిది. చిన్న సినిమాలతో హ్యాపీగానే ఉన్నారుగా పెద్ద బడ్జెట్ చిత్రాలవైపు వెళ్ళడం ఎందుకని చాలామంది గోపాలరెడ్డిగారిని నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ కథపై ఉన్న నమ్మకంతో ధైర్యంగా ముందడుగు వేశారాయన. బాలకృష్ణని హీరోగా తీసుకుందాం నేటివిటీ, సెంటిమెంట్ పాత్రలకు అతనే సూటవుతాడని చెప్పగానే అందుకు కూడా ఆయన అంగీకరించారు.
నిర్మాత భయపడ్డారు… |
వీక్షకులు
- 1,212,786 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు






