![]() |
|
ఇప్పటి వరకు గొప్ప పనులు చేసిన వాళ్లు, సాహసవంతులే మనకు కనిపించే హీరోలు. కాని కొందరు ఎవరూ చేయలేని గొప్పకార్యాన్ని భుజం మీద వేసుకున్నా… అంతగా ప్రాచుర్యానికి నోచుకోరు. అలాంటి వాళ్లలో నిజమైన హీరో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయురాలు యాదేశ్వరి. ఈమె చేస్తున్న నిశ్శబ్ధ యజ్ఞ ఫలితం – బ్రెయిలీలో అయిదు వందల ఆధ్యాత్మిక గ్రంథాలను రాయడం. ఈ మధ్యనే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠ్యపుస్తకాలను సైతం అదే లిపిలో రాసి అంధులపాలిట దైవమైపోయింది.
‘‘పుట్టుకతో కనుచూపు పోవడం ఆడపిల్లలు చేసుకున్న పాపం అని నిందిస్తుంటారు. అదే కనక మగపిల్లలు అంధులైనా సరే, వారికి పెళ్లిళ్లు అవుతున్నాయి. ఆడపిల్లలకేమిటీ శిక్ష! తల్చుకుంటేనే గుండె బరువెక్కుతుంది. కొందరు చాదస్తపు స్వాములైతే అంధత్వంతో బాధపడే ఆడపిల్లలు పూజలకు కూడా పనికిరారు అంటున్నారు. ఇదంతా లోకం పోకడే కావొచ్చు. నేను స్వయంగా విన్నప్పుడు.. చూసినప్పుడు.. మనిషికి అంధత్వం అనేది ఎంత శాపం అనిపిస్తుండేది. చిన్నప్పుడు మా ఇంట్లో జరిగిన ఒక సంఘటనతో.. ఈ బాధ రెట్టింపైంది. కరెంట్ సరిగా లేని రోజుల్లో కిరోసిన్ దీపాలను వాడేవాళ్లం. పొరపాటున ఆ దీపం మీద నేను పడిపోవడంతో ఒక కన్ను కమిలిపోయింది. భరించలేని నొప్పితో డాక్టర్ వద్దకు వెళితే.. ఆయన వైద్యం చేసి ‘‘భవిష్యత్తులో మీకు చూపు తగ్గొచ్చు. అంధత్వమొచ్చే ప్రమాదమూ ఉంది. జాగ్రత్త!’’ అని చెప్పి పంపించారు. ఆస్పత్రి నుంచి ఇంటికొస్తున్నప్పుడే నాలో ఆందోళన మొదలైంది. ఇక నాకు చూపు పోతోందనగానే భరించలేకపోయాను. శరీరంలో ఏ అవయవం దెబ్బతిన్నా మనుగడకు ముప్పు ఉండదు కాని కంటిచూపు పోతే – ప్రపంచమంతా అంధకారమే! ఒకరు తోడుంటే తప్ప ఏ పనీ స్వయంగా చేసుకోలేని పరిస్థితి. ఆ దిగులే కొన్నాళ్ల పాటు వేధించింది నన్ను. అయితే నేను ఏ పుణ్యం చేసుకున్నానో ఏమో కాని ఆ వైద్యుడు చెప్పినట్లు నా కన్ను దెబ్బతినలేదు. ఒక అంధురాలు భరించే బాధను గుర్తుండిపోయేలా చేసిందా సంఘటన. ఆ తర్వాత – అంధులను చూసినప్పుడల్లా వారి కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆరాటం మొదలైంది.
అదే పెద్ద మలుపు.. |
వీక్షకులు
- 1,194,574 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- నోబెల్ లారియట్ హెమింగ్వే జీవిత చరిత్ర -5
- అమెరికా జాతీయకవి వాల్ట్ విట్మన్ జీవిత చరిత్ర -5(చివరిభాగం )
- నోబెల్ లారియట్ హెమింగ్వే జీవిత చరిత్ర-4
- అమెరికా జాతీయకవి వాల్ట్ విట్మన్ జీవిత చరిత్ర-4
- శ్రీ జోల ద రాశి కె. దొ డ్డ న్న గౌడ అనుభవాలు- జ్ఞాపకాలు.1 వ భాగం.20.9.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం. విశ్వనాథ వేయిపడగలు.34 వ భాగం.20.9.26।
- నోబెల్ లారియట్ హెమింగ్వే జీవిత చరిత్ర-3
- అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ జీవిత చరిత్ర-3
- శ్రీ నాయని సుబ్బారావు గారి జీవిత చరిత్ర.10 వ చివరి భాగం.19.9.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.33 వ భాగం.19.9.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,467)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


